హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగుల వ్యయ నియంత్రణ, నిర్వహణ సేవలందిస్తున్న అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎస్‌ఎంఈ)లపై దృష్టిసారించింది. ఉద్యోగుల వేతనాలు, ప్రయోజనాల తర్వాత నియంత్రించగలిగేవి వినోద, ప్రయాణ వ్యయాలేనని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ గ్లోబల్ కమర్షియల్ సర్వీసెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ శారు కౌశల్ తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేట్ కార్డ్ ప్రోగ్రామ్ ద్వారా కంపెనీల వ్యయ భారం తగ్గుతుందని, సుమారు 10 శాతం వరకు వ్యయం ఆదా అవుతుందని తెలిపారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో 60 శాతం కంటే ఎక్కువ కంపెనీలకు మా కస్టమర్లుగా ఉన్నాయని.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల వ్యాపార సంస్థల తమ సేవలు వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు.
మన దేశంలో రూ.75 కోట్ల నుంచి రూ.600 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న ఎస్‌ఎంఈ కంపెనీలు తమ సేవలు వినియోగించుకుంటూ ఆయా కంపెనీల్లోని ఉద్యోగుల వినోద, ప్రయాణ ఖర్చులను తగ్గించుకుంటున్నాయని తెలిపారు. సుమారు దేశంలో 13 వేల కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నారని.. ఎంఎంఈ విభాగం వృద్ధి చెందుతుందని తెలిపారు. నగరంలో అంతర్జాతీయ ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ కంపెనీలతో పాటూ స్టార్టప్స్, ఎస్‌ఎంఈలూ ఉన్నాయి. వీటన్నింటికీ మా వాణిజ్య చెల్లింపుల వ్యాపారం బాగా సెట్ అవుతాయి. అందుకే నగరంపై ఫోకస్ చేశామని పేర్కొన్నారు.
ఎస్‌ఎంఈలపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దృష్టి
Published Thu, Sep 6 2018 1:51 AM | Last Updated on Thu, Sep 6 2018 1:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment