స్నాప్‌డీల్, పేపాల్‌తో ఎస్‌బీఐ జట్టు
కోల్‌కతా: చిన్న, మధ్య తరహా సంస్థలకు(ఎస్‌ఎంఈ) తోడ్పాటు కోసం ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్, డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేపాల్‌తో ఎస్‌బీఐ చేతు లు కలిపింది. స్నాప్‌డీల్‌తో అవగాహన ఒప్పం దం(ఎంవోయూ) ప్రకారం సదరు సైట్ ద్వారా లావాదేవీలు జరిపే విక్రేతలు లేదా తయారీ సంస్థలకు ఎస్‌బీఐ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తుంది. మహిళా వ్యాపారవేత్తలకు వడ్డీ రేటుపై మరో 0.25% తగ్గింపు ఉంటుంది. రూ. కోటి దాకా రుణాలకు తనఖా అవసరం ఉండదు.
నిధుల సమస్యల వల్ల వ్యాపారాలను విస్తరించలేకపోతున్న ఎస్‌ఎంఈలకు ఈ డీల్‌తో ప్రయోజనం లభిస్తుందని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. తమ ఎస్‌ఎంఈ కస్టమర్లు సీమాంతర ఆర్థిక లావాదేవీలు సురక్షితంగా, సులభతరంగా నిర్వహించుకునేలా పేపాల్‌తో ఎస్‌బీఐ ఎంవోయూ కుదుర్చుకుంది.