అతి తక్కువ ప్రీమియంతో అదిరిపోయే హెల్త్ బీమా పథకాన్ని ఉద్యోగుల ఆరోగ్య బీమా ప్లాట్‌ఫాం ప్లమ్ ప్రారంభించింది. కేవలం నెలకు రూ. 85 ప్రీమియం చెల్లిస్తే రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను పొందవచ్చును. డిసెంబర్ 21 న ఈ కొత్త పాలసీను ప్లమ్ ప్రకటించింది.
ఎవరికీ వర్తిస్తుందంటే..!
చిన్న తరహా స్టార్టప్స్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే కార్మికులు, సూక్ష్మ-చిన్న తరహా పరిశ్రమలలో పనిచేసే వారు ఈ ఆరోగ్య బీమాను పొందవచ్చును. ఈ బీమాతో ఆయా పాలసీదారులు అపరిమితంగా వైద్యుల అపాయింట్‌మెంట్స్, వారానికోసారి వెల్‌నెస్ సెషన్స్, డెంటల్, కళ్ల పరీక్షలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్ కన్సల్టేషన్స్, కోవిడ్-19 చికిత్స మొదలైన వాటికి క్లెయిమ్ చేసుకోనే వీలు ఉంటుంది.
అప్పుడే మొదలైన స్టార్టప్స్‌కు చేయూత..!
దేశవ్యాప్తంగా సుమారు 6.3 కోట్ల స్మాల్‌మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి. వీటితో పాటుగా భారత్‌లో 1 కోటి 15 లక్షలకు పైగా గిగ్ వర్కర్స్ (కాంట్రాక్టు పద్దతిలో పనిచేసేవారు) ఉన్నారు. వీరికి ఎటువంటి బీమా సౌకర్యాలు లేనట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా ప్రారంభ దశలో మొదలైన స్టార్టప్స్‌కు ప్లమ్ బీమా పాలసీ ఎంతగానో ఉపయోగపడనుంది. ఆయా స్టార్టప్స్‌లో ఇద్దరు సభ్యుల కంటే తక్కువ టీమ్‌లను కలిగి ఉన్న కంపెనీలకు, స్టార్టప్స్‌లోని ఉద్యోగులను బీమా కవర్ అందివచ్చును.
హెల్త్ బెనిఫిట్స్ అందరికీ ఇవ్వడమే మా లక్ష్యం..!
అప్పుడే మొదలైన చిన్న స్టార్టప్స్‌కు, గిగ్ వర్కర్స్‌కు హెల్త్ బీమాను అందించడమే మా ముఖ్య లక్ష్యమని ప్లమ్ కో-ఫౌండర్, సీఈవో అభిషేక్ పొద్దార్ అన్నారు. ఆయా కార్యాలయాల్లో వెల్‌నెస్ ప్రవర్తనను సృష్టించాలనే లక్ష్యంతో ఈ బీమాను ప్రారంభించినట్లు తెలిపారు. 2024 నాటికి సుమారు ఒక కోటి మందికి బీమా చేయాలనే ప్లమ్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
చదవండి: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ అమెజాన్.. కోర్టుకు చేరిన పంచాయితీ
Comments
Please login to add a commentAdd a comment