భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం అడుగు పెట్టింది. లిస్బన్ కేంద్రంగా నడిచే జూమ్(Joom) భారత్‌లోని ఎనిమిది నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. ముంబై, న్యూఢిల్లీ, ఇండోర్, జైపూర్, సూరత్, రూర్కీ, లుథియానాలలో స్థానిక వ్యాపారులు, ఎగుమతిదారుల కోసం ఒక వేదికను ప్రారంభించింది. ఇందులో ఇప్పటికే 350 మందికిపైగా వ్యాపారులు నమోదు చేసుకున్నారు. వీరిలో సగం మంది డైరెక్ట్ టు కస్టమర్ వ్యాపారాల్లో ఇంతకు ముందు ఎప్పుడూ తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌లో విక్రయించలేదు. వారంతా ఇప్పుడు జూమ్ ద్వారా మొదటిసారి అంతర్జాతీయ మార్కెట్‌లను చేరుకోగలిగారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఫ్యాషన్, జువెలరీ, క్రిస్టల్ హీలింగ్, హెల్త్ అండ్ బ్యూటీ, హెల్త్ సప్లిమెంట్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఉమెన్స్ ఫ్యాషన్, యాక్సెసరీస్ వంటి విభాగాల్లో ఉత్పత్తులను అందిస్తోన్న ఈ జూమ్ కంపెనీ భారత్‌లో హెల్మెట్‌లు, కవచాలు, తేనెటీగల పెంపకందారుల ఉత్పత్తులు, గుర్రాలకు జీనులు, వివిధ రకాల రత్నాలు, తివాచీలు, సాంప్రదాయ వస్త్రాల వంటి ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించింది. తాము 2022 ప్రారంభం నుంచే భారత్‌లోని ప్యాపారులతో అనుసంధానం కోసం ప్రయత్నిస్తున్నామని, ఇందులో పూర్తిగా విజయవంతం కాకపోయినప్పటికీ టాప్-5 కొత్త కంపెనీలలో ఒకటిగా నిలిచామని కంపెనీ ఆసియా-పసిఫిక్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ మాగ్జిమ్ బెలోవ్ తెలిపారు.
జూమ్ ఈ-కామర్స్ కంపెనీని 2016లో లాట్వియాలో స్థాపించారు. 2023 నాటికి భారత్ ఈ సంస్థకు టాప్-2 గ్లోబల్ మార్కట్‌గా నిలుస్తుందని, దీని బీటూసీ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 2023 నాటికి 25.8 శాతం వృద్ధితో 5.57 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని గ్రాండ్‌వ్యూ రీసర్చ్ అంచనా వేసింది. ఈ కంపెనీకి ఫార్మా, ఫిన్‌టెక్ , లాజిస్టిక్ వంటి ఈ-కామర్స్ వ్యాపారాలు ఉన్నాయి. 2022 నాటికి ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment