online shoping
-
పండుగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్: ఇవి గుర్తుంచుకోండి
దసరా, దీపావళి ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తున్నాయ్. ఈ పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందించడం మొదలుపెట్టేస్తాయి. ఇదే అదనుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు కూడా తమదైన రీతిలో దోచుకోవడానికి సిద్దమైపోతారు. కాబట్టి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..వెబ్సైట్లను మాత్రమే సందర్శించాలి.. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు తప్పకుండా.. అధికారిక వెబ్సైట్లలోనే సెర్చ్ చేయాలి. తక్కువ రేటుకు లభిస్తున్నాయి కదా.. అనుకుని అనధికార వెబ్సైట్లలో బుక్ చేయడం వంటివి చేయకపోవడం ఉత్తమం. ఎందుకంటే డబ్బు చెల్లించిన తరువాత బహుశా డెలివరీ రాకపోవచ్చు. ఒకవేళా వచ్చిన నాణ్యమైనవి వస్తాయనే గ్యారంటీ ఉండదు. కాబట్టి మీరు ఎంచుకునే వెబ్సైట్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి.మెసేజ్ అలర్ట్ లేదా ఈ-మెయిల్ అలర్ట్.. ఈ పండుగ సీజన్లో గుర్తు తెలియని నెంబర్స్ నుంచి భారీ ఆఫర్స్ అనే విధంగా మెసేజిలు లేదా ఈ మెయిల్ అలర్ట్ వంటివి వస్తుంటాయి. ఇలాంటి వాటికి స్పందించకపోవడమే ఉత్తమం. తెలియని నెంబర్ల నుంచి వచ్చే సందేశాలను క్లిక్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.పిన్ నెంబర్ ఉపయోగించడంలో జాగ్రత్త వహించడం.. మీరు ఆన్లైన్ షాపించి చేసేటప్పుడు ఒక్కో పోర్టల్‌కు ఒక్కో పాస్వర్డ్ ఉపయోగించడం ఉత్తమం. అన్ని పోర్టల్‌లకు ఒకటే పాస్వర్డ్ ఉపయోగిస్తే.. ఎవరైనా హ్యాక్ చేసే సమయంలో అన్ని అకౌంట్స్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.సాఫ్ట్వేర్ అప్డేట్స్.. ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్లలో మీ డేటాను రక్షించడానికి సులభమైన మార్గాలలో ఒకటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం. ఇది మీ డేటా భద్రతకు సహాయపడతాయి. ఇది సైబర్ దాడుల నుంచి కూడా రక్షిస్తుంది. పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్ అవసరం ఉంటే తప్ప ఇవ్వకూడదు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!ఫ్రీ హాట్స్పాట్ల వాడకం.. పబ్లిక్ ప్రదేశాల్లో.. ఉచితంగా అందుబాటులో ఉండే హాట్స్పాట్లను ఉపయోగించే షాపింగ్ చేయడం వంటివి చేయకుండా ఉండటం మంచిది. ఇలాంటి సమయంలోనే హ్యాకర్స్ ఎక్కువగా డేటాను హ్యాక్ చేసే అవకాశం ఉంది.యాప్స్ డౌన్లోడ్.. మీకు అవసరమైన లేదా డౌన్లోడ్ చేయాలనుకునే యాప్స్ గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ వంటి వాటిలో ఉన్నాయా? లేదా? అని నిర్థారించుకోండి. ఎందుకంటే.. కొంతమంది ఫేక్ యాప్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అలాంటివి డౌన్లోడ్ చేస్తే అనుకోని నష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. -
ఫెస్టివల్ సీజన్‌కూ క్యూ–కామర్స్ కిక్కు
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో పండుగల సీజన్ మొదలైంది. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా గణేశుని నిమజ్జనంతో వినాయకచవితి ఉత్సవాలు ముగియగా...ఇక దసరా, దీపావళి వరుస పండుగల సందడి ప్రారంభం కానుంది. వచ్చే జనవరి మధ్యలో జరగనున్న సంక్రాంతి దాకా రాబోయే ఫెస్టివల్ సీజన్‌కు ఈసారి క్విక్–కామర్స్ అనేది కీలకంగా మారనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి ముగిసే దాకా సుదీర్ఘకాలం పాటు పండుగ ఉత్సవాలు కొనసాగుతాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వస్తువులు, ఆయా ఉత్పత్తులు వేగంగా ఇళ్లు, కస్టమర్లకు చేరవేయడం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.దేశంలోని సంప్రదాయ ఎల్రక్టానిక్ (ఈ)–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే వివిధ వర్గాల వినియోగదారులపై తమ ముద్రను బలంగానే చూపాయి. దీంతో రిటైల్ రంగంలోని వ్యాపార సంస్థలు, వ్యాపారులను ఈ–కామర్స్ దిగ్గజాలు కొంతమేరకు దెబ్బకొట్టాయి. అయితే మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ–కామర్స్‌ను తలదన్నేలా క్విక్ (క్యూ)–కామర్స్ అనేది ఓ కొత్త కేటగిరీగా ముందుకొచి్చంది. అమెరికాతో సహా వివిధ దేశాల్లో నిత్యావసరాలు మొదలు వివిధ రకాల వస్తువులను ఆ¯Œన్లైన్లో ఆర్డర్ చేశాక మరుసటి రోజుకు చేరవేయడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి అవసరమైన వస్తువులను తెచ్చుకున్నంత సులువుగా వివిధ వినియోగ వస్తువులు, ఉత్పత్తులను పది నిమిషాల్లోనే కస్టమర్లకు చేరవేసే డెలివరీ మోడళ్లు మనదేశంలో హైదరాబాద్‌తో సహా పలు ప్రముఖనగరాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దీంతో సంప్రదాయ ఈ–కామర్స్ సంస్థలకు పోటీగా క్యూ–కామర్స్ ఎదుగుతోంది. ఇదిలా ఉంటే...డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్ కూడా వేగంగా తమ వినియోగదారులను చేరుకోవడం ద్వారా తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుత పండుగల సీజన్లో దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ పరిశ్రమ ద్వారా 35 శాతం అమ్మకాలు పెరుగుతాయని ‘టీమ్ లీజ్’తాజా నివేదిక వెల్లడించింది. డిమాండ్‌ను తట్టుకొని ‘ఆన్ టైమ్ డెలివరీ’చేసేందుకు వీలుగా ఆయా సంస్థలు ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. ⇒ క్విక్–కామర్స్ సెగ్మెంట్లో.. వచ్చే అక్టోబర్‌లో నిర్వహించనున్న వార్షిక ఉత్సవం ‘బిగ్ బిలియన్ డేస్–2024’కోసం ఫ్లిప్‌కార్ట్ ‘మినిట్స్’ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాననగరాల్లో వంద దాకా ‘డార్క్ స్టోర్స్’ను తెరవనుంది ⇒ ప్రస్తుతమున్న 639 డార్క్ స్టోర్ల నుంచి 2026 ఆఖరుకల్లా రెండువేల స్టోర్లకు (ఈ ఆర్థిక సంవత్సరంలోనే 113 స్టోర్ల ఏర్పాటు) బ్లింకిట్ ప్రణాళికలు సిద్ధం చేసింది ⇒ వచ్చే మార్చికల్లా దేశవ్యాప్తంగా 700 డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాలని (ఇప్పుడున్న 350 స్టోర్ల నుంచి) జెప్టో నిర్ణయించింది. ⇒ డెలివరీ పార్ట్నర్స్, లాజిస్టిక్స్ సపోర్ట్‌ను అందించే ‘షిప్ రాకెట్, ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బీస్ వంటివి కస్టమర్లకు వేగంగా డెలివరీలు చేసేందుకు వీలుగా తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటున్నాయి ⇒ హైదరాబాద్‌తో సహా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కొచ్చి, పణే వంటి నగరాల్లో షిప్ రాకెట్ ఇప్పటికే ‘షిప్ రాకెట్క్విక్’లను ప్రారంభించింది. పలు నగరాల్లో మరో నెలలో ఈ సరీ్వసులు మొదలుకానున్నాయి ⇒ కస్టమర్లకు వారి ఆర్డర్లను వేగంగా చేరవేసేందుకు వీలుగా షిప్‌రాకెట్ కంపెనీ స్థానిక లాజిస్టిక్ ప్లాట్‌ఫామ్స్ పోర్టర్, ఓలా, బోర్జె, ర్యాపిడో, షాడో ఫాక్స్‌తో భాగస్వామ్యాన్ని తయారు చేసుకుంది ⇒ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే దేశంలోని పది మెట్రో నగరాల్లో ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్ అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది ⇒ గిఫ్టింగ్ ఫ్లాట్‌ఫామ్స్ ’ఫెర్న్స్ ఏన్పెటల్స్’క్విక్ కామర్స్ ద్వారా పంపిణీకి సిద్ధం చేసిన ప్రత్యేక ఉత్పత్తుల రేంజ్‌లు సిద్ధం చేసింది. ఇందుకు ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దేశంలో క్యూ–కామర్స్‌కు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఈ పండుగల సీజన్లో తమ అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని విశ్వసిస్తోంది ⇒ లాజిస్టిక్స్ మేజర్ డెలివరీ సంస్థ ఇప్పటికే ఈ–కామర్స్ కంపెనీలకు డార్క్ స్టోర్స్ నెట్‌వర్క్‌ను అందించేందుకు ‘సేమ్‌డే డెలివరీ’అనే కొత్త సర్వీస్‌ను ప్రకటించింది‘డార్క్ స్టోర్స్’అంటే... ఇలాంటి స్టోర్ట్స్ కస్టమర్లు ప్రత్యక్షంగా వెళ్లి షాపింగ్ చేసేందుకు ఉద్దేశించినవి కాదు. వినియోగదారుల నుంచి వచ్చే ఆన్లైన్ ఆర్డర్లకు వీలైనంత ఎక్కువ వేగంగా వారి ఇళ్లకు డెలివరీ చేసేందుకు ఉద్దేశించి... విభిన్న రకాల వస్తువులు, ఉత్పత్తులను భద్రపరుచుకునేందుకు నగరంలోని బిజీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే స్టోర్లు ఇవి. పలురకాల వస్తువులను స్టోర్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి, అక్కడి నుంచి కస్టమర్ల ఇళ్లకు తరలించడానికి ఉద్దేశించినవి. ఇవి డి్రస్టిబ్యూషన్న్ఔట్లెట్లుగా పనిచేస్తాయి. ప్రధానంగా మెరుగైన పంపిణీ, వేగంగా డెలివరీ, విభిన్నరకాల ఉత్పత్తులను స్టోర్ చేసే అవకాశం, తదితరాలకు సంబంధించినవి. -
ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను బెంబేలెత్తిస్తోంది. ప్రత్యేక సేల్ పేరుతో భారీ తగ్గింపులు ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో అత్యధికంగా ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. అయితే తమకు లోపాలతోకూడిన ఉత్పత్తులు డెలివరీ అవుతున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేయగా అది నకిలీ బ్యాటరీతో వచ్చింది. ఈ మేరకు తనకు వచ్చిన లోపభూయిష్టమైన ఐఫోన్ 15కు సంబంధించిన ఫోటోలు, వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశాడు. నలికీ బ్యాటరీతో వచ్చిన ఈ ఐఫోన్ 15ను రీప్లేస్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ నిరాకరించిందని వాపోయాడు. “నేను జనవరి 13న ఫ్లిప్‌కార్ట్ నుంచి iPhone 15ని ఆర్డర్ చేశాను. జనవరి 15న డెలివరీ వచ్చింది. కానీ Flipkart మోసం చేసింది. లోపభూయిష్టమైన ఐఫోన్ 15ని పంపించింది. బాక్స్ ప్యాకేజింగ్ కూడా నకిలీదే. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయడం లేదు” అని అజయ్ రాజావత్ అనే యూజర్ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. దీనిపై యూజర్లు మిశ్రమంగా స్పందించారు. I ordered iPhone 15 from Flipkart on 13th Jan and I got it on 15th Jan but Flipkart has done fraud they have delivered defective iPhone15 and box packaging was also fake. Now they are not replacing OrderID-OD330202240897143100@flipkartsupport @jagograhakjago @stufflistings pic.twitter.com/dfLEh3FSnk — Ajay Rajawat (@1234ajaysmart) January 18, 2024 -
‘ఆన్లైన్ షాపింగ్ చేయొద్దనేది ఇందుకే’..కళ్లు బైర్లు కమ్మేలా
ఆన్లైన్లో ల్యాప్‌ట్యాప్ కొనుగోలు చేసిన ఓ వినియోగదారుడికి ఫ్లిప్‌కార్ట్ ఝలక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యూజర్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.1.13 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేశాడు. బదులుగా ఫ్లిప్‌కార్ట్ తనకు పాత, డొక్కు ల్యాప్‌ట్యాప్‌ను పంపిందని వాపోయాడు. ఇలాంటి చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నప్పుడే ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే బయపడాల్సి వస్తుందని అంటున్నాడు. ‘రిపబ్లిక్ డే సేల్‌లో లక్షకు పై ధరలో ఫ్లిప్‌కార్ట్‌లో ఆసుస్ ల్యాప్‌టాప్‌ని ఆర్డర్ చేశాను. కానీ ఫ్లిప్‌కార్ట్ నాకు పాత ల్యాప్‌ట్యాప్‌ను పంపింది. అందుకే ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ నుండి ఆర్డర్ చేసిన ప్రొడక్ట్‌లను నమ్మకండి అంటూ బాధితుడు సౌరో ముఖర్జీ వీడియోను ఎక్స్.కామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌరౌ ముఖర్జీ జనవరి 13న రూ.1.13లక్షలు విలువ చేసే ల్యాప్‌ట్యాప్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. మరుసటి రోజే ల్యాప్‌ట్యాప్ చేతికి వచ్చింది. వెంటనే సౌరౌ తాను పార్శిల్‌ను ఓపెన్ చేస్తానని, వీడియో తీయాలని సదరు డెలివరీ బాయ్‌ను కోరాడు. చెప్పినట్లుగానే డెలివరీ బాయ్ పార్శిల్‌ను వీడియో తీస్తుంటే ముఖర్జీ దానిని ఓపెన్ చేసి చూస్తాడు. పార్శిల్ ఓపెన్ చేసిన అతనికి కళ్లు బైర్లు కమ్మేలా.. తాను ఖరీదైన ల్యాప్‌ట్యాప్ బుక్ చేస్తే..మట్టికొట్టుకుపోయిన పాత ల్యాప్‌ట్యాప్ వచ్చినట్లు గుర్తిస్తాడు. ల్యాప్‌ట్యాప్ ఓపెన్ చేసి నేను బ్లాక్ ల్యాప్‌టాప్‌ని ఆర్డర్ పెట్టాను’ అని ముఖర్జీ వీడియోలో చెబుతుంటే పక్కనే ఉన్న డెలివరీ ఏజెంట్ మాటకలుపుతూ ఇది ఉపయోగించిన ల్యాప్ట్యాప్లా ఉందని అని అంటున్న సంభాషణలు స్పష్టంగా వినపడుతున్నాయి. I ordered a brand new Asus Laptop from Flipkart in this Republic Day sale and I received some old discarded laptop. Never trust products ordered from online platforms. @flipkartsupport @Flipkart #flipkartscam pic.twitter.com/EMEBBhnh2V — Souro Mukherjee (Gutenberg) (@souro9737) January 14, 2024 ఇక ల్యాప్‌ట్యాప్ పార్శిల్ ఓపెన్ చేసిన అనంతరం ఆన్లైన్లో మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే ఇలా వీడియోలు తీసుకోవడం మంచిదని, నకిలి పార్శిళ్ల నుంచి సురక్షితంగా ఉంచేలా అవి మనల్ని కాపాడుతాయని అని అన్నాడు. ఇక తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులకు ఎక్స్.కామ్‌లో ట్యాగ్ చేశాడు. కొత్త ల్యాప్‌ట్యాప్‌ను కొనుగోలు చేసే పాత ల్యాప్‌ట్యాప్‌ను పంపారని మెసేజ్ చేయగా.. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. సంబంధిత వివరాల్ని పంపమని మెసేజ్ చేసింది. -
వర్చువల్ మీటింగ్.. స్క్రీన్‌పై చెడ్డీలు..
కొన్ని ఐటీ సంస్థల్లో ఇప్పటికీ వర్క్ ఫ్రం హొమ్ నడుస్తోంది. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే హాయిగా పనిచేసుకుంటున్నారు. అయితే పని వేళల్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ సంఘటన గురించి తెలుసుకుంటే అర్థమౌతుంది. ఢిల్లీకి చెందిన అమన్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇంటి నుంచి పని చేస్తున్న అతను వర్క్ టైమ్‌లో బాక్సర్ల కోసం ఆన్లైన్ షాపింగ్ చేశాడు. ఇందు కోసం తన బ్రౌజర్లోని ఒక ట్యాబ్‌లో ఈ-కామర్స్ సైట్‌ను ఓపెన్ చేశాడు. అయితే వర్చువల్ ఆఫీస్ మీటింగ్ సమయంలో తన స్క్రీన్‌ను షేర్ చేయమని అడిగినప్పుడు, అతను అనుకోకుండా షాపింగ్ పేజీకి సంబంధించిన ట్యాబ్‌ను షేర్ చేశాడు. ఇంతలో దురదృష్టవశాత్తూ స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది. ఇంకేముంది అతని ఆన్లైన్ చెడ్డీల షాపింగ్ పేజీని అందరూ చూసేశారు. అతను ఆ స్క్రీన్ మార్చడానికి వీలు లేకుండా పోయింది. ఆ వర్చువల్ ఆఫీస్ మీటింగ్‌లో పాల్గొన్న అతని సహోద్యోగులు స్క్రీన్ మార్చరా నాయనా అంటూ ఎన్ని ఇన్కాల్ మెసేజ్‌లు పెట్టినా లాభం లేకోపోయింది పాపం. వర్క్ టైమ్‌లో జరిగిన ఈ పొరపాటు గురించి అమన్ సరదాగా ట్విటర్లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన సహోద్యోగుల నుంచి వచ్చిన సందేశాల స్క్రీన్షాట్లను షేర్ చేశాడు. వర్క్టైమ్లో ఆన్లైన్ షాపింగ్ వంటి ఇతర వ్యాపకాలు పెట్టుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పాడు. guys pls pray for me 😭 pic.twitter.com/da5md2O4FC — Aman (@AmanHasNoName_2) June 1, 2023 ఇదీ చదవండి: హెచ్‌సీఎల్‌కు షాక్! కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే.. -
కొనుగోళ్లపై రీల్స్, సోషల్ మీడియా ఎఫెక్ట్.. 60 శాతం యువతది ఇదే తీరు!
సాక్షి, అమరావతి: భారతీయ యువతలో కొనుగోలు ట్రెండ్ మారుతోంది. సరదా షాపింగ్ విధానం పెరిగిపోతోంది. ఇదేదో దుకాణాలకు వెళ్లి కాదండోయ్.. ఆన్లైన్లోనే.. అదీ ఇంట్లోనే.. మరీ చెప్పాలంటే వీడియో రీల్స్ (షార్ట్ వీడియో) చూస్తూ వస్తువుల కొనుగోలును ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు దేశంలో 60 శాతం మంది యువత కొనుగోళ్లను చిన్న వీడియోల్లోని కంటెంట్ ప్రభావితం చేస్తోంది. ప్రముఖ షార్ట్ వీడియోస్ యాప్ సంస్థ ఎమోజీ ‘గెటింగ్ యంగ్ ఇండియా రైట్’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో 18–34 ఏళ్ల మధ్య యువతను ఆన్లైన్లో సర్వే చేసింది. దీని ప్రకారం దేశంలో ఏకంగా 77 శాతం యువత ఎక్కువ సమయం షార్ట్ వీడియోలు చూస్తున్నట్టు పేర్కొంది. మరో 16 శాతం మంది వార్తలు, ఇతర వినోద కార్యక్రమాలు, 7 శాతం మంది టీవీ, ఓటీటీ ఆధారిత కంటెంట్‌లో మునిగిపోతున్నట్టు గుర్తించింది. ఆఫర్లు.. డిస్కౌంట్లదే పైచేయి కాగా, చిన్న వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ దేశంలోని యువత కొనుగోలు నిర్ణయాలను ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రభావితం చేస్తున్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది. ఆఫర్లు, డిస్కౌంట్లు సగానికి పైగా యువత కొనుగోలు ఆలోచనలను ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానంగా ఉన్నట్టు వివరించింది. ఉచిత రవాణా, వేగంగా సరుకు అందించడం కూడా కొనుగోళ్లను పెంచుతోంది. అత్యధిక ఖర్చు ఆ రెండింటిపైనే.. దేశంలోని 77 శాతం యువత మొబైల్ ఫోన్లు, దుస్తులపై అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్టు సర్వే చెబుతోంది. వీటి కొనుగోలు కోసం 65 శాతం మంది తమ వ్యక్తిగత నిధులను వినియోగిస్తుంటే.. 26 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆ«దారç³డుతున్నారు. మరో 7 శాతం మంది బయట అప్పులు చేస్తున్నట్టు సర్వే వెల్లడిస్తోంది. -
Joom: భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం.. ఎస్ఎంఈలకు సరికొత్త వేదిక
భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం అడుగు పెట్టింది. లిస్బన్ కేంద్రంగా నడిచే జూమ్(Joom) భారత్‌లోని ఎనిమిది నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. ముంబై, న్యూఢిల్లీ, ఇండోర్, జైపూర్, సూరత్, రూర్కీ, లుథియానాలలో స్థానిక వ్యాపారులు, ఎగుమతిదారుల కోసం ఒక వేదికను ప్రారంభించింది. ఇందులో ఇప్పటికే 350 మందికిపైగా వ్యాపారులు నమోదు చేసుకున్నారు. వీరిలో సగం మంది డైరెక్ట్ టు కస్టమర్ వ్యాపారాల్లో ఇంతకు ముందు ఎప్పుడూ తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్లో విక్రయించలేదు. వారంతా ఇప్పుడు జూమ్ ద్వారా మొదటిసారి అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోగలిగారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్యాషన్, జువెలరీ, క్రిస్టల్ హీలింగ్, హెల్త్ అండ్ బ్యూటీ, హెల్త్ సప్లిమెంట్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఉమెన్స్ ఫ్యాషన్, యాక్సెసరీస్ వంటి విభాగాల్లో ఉత్పత్తులను అందిస్తోన్న ఈ జూమ్ కంపెనీ భారత్‌లో హెల్మెట్లు, కవచాలు, తేనెటీగల పెంపకందారుల ఉత్పత్తులు, గుర్రాలకు జీనులు, వివిధ రకాల రత్నాలు, తివాచీలు, సాంప్రదాయ వస్త్రాల వంటి ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించింది. తాము 2022 ప్రారంభం నుంచే భారత్‌లోని ప్యాపారులతో అనుసంధానం కోసం ప్రయత్నిస్తున్నామని, ఇందులో పూర్తిగా విజయవంతం కాకపోయినప్పటికీ టాప్-5 కొత్త కంపెనీలలో ఒకటిగా నిలిచామని కంపెనీ ఆసియా-పసిఫిక్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ మాగ్జిమ్ బెలోవ్ తెలిపారు. జూమ్ ఈ-కామర్స్ కంపెనీని 2016లో లాట్వియాలో స్థాపించారు. 2023 నాటికి భారత్ ఈ సంస్థకు టాప్-2 గ్లోబల్ మార్కట్‌గా నిలుస్తుందని, దీని బీటూసీ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 2023 నాటికి 25.8 శాతం వృద్ధితో 5.57 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని గ్రాండ్‌వ్యూ రీసర్చ్ అంచనా వేసింది. ఈ కంపెనీకి ఫార్మా, ఫిన్‌టెక్ , లాజిస్టిక్ వంటి ఈ-కామర్స్ వ్యాపారాలు ఉన్నాయి. 2022 నాటికి ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. -
జియోమార్ట్ ఫెస్టివల్ ఆఫర్.. అన్ని కేటగిరీల ప్రొడక్టులపై ఊహించని డిస్కౌంట్లు!
నవరాత్రి, దసరా, దీపావళి ఇలా వరుసగా పండుగల నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి ఫేవరేట్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్– జియోమార్ట్ ప్రత్యేక ఆఫర్లను అందించనుంది. ‘‘ఫెస్టివ్ రెడీ సేల్’ పేరుతో ఈ నెల 27వ తేదీ వరకూ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అన్ని కేటగిరీల ప్రొడక్టులపై విస్తృత శ్రేణిలో పొదుపు ఆఫర్లు లభిస్తాయని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది. స్మార్ట్ బజార్, స్మార్ట్ సూపర్‌స్టోర్, స్మార్ట్ పాయింట్, రిలయన్స్ ఫ్రెష్సహా దేశ వ్యాప్తంగా 2,700 విస్తృతస్థాయి స్మార్ట్ స్టోర్స్ నెట్వర్క్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని వివరించింది. చదవండి: యూట్యూబ్ యూజర్లకు పండగే..45 శాతం ఆదాయం -
రూ. 3000 ఖరీదైన చీర రూ.300 కే!!
సుమతి (పేరు మార్చడమైనది) ఆన్లైన్లో పండగ ఆఫర్ల కింద వచ్చిన అప్లికేషన్స్ చూస్తూ ఉంటే మంచి కలర్ కాంబినేషన్ ఉన్న పట్టు చీర కనపడింది. ‘మూడు వేల రూపాయల చీర, మూడు వందలకే’ అని ఉండటంతో క్లిక్ చేసింది. ఆ చీర బుక్ అవ్వాలంటే అందులో ఇచ్చిన అకౌంట్లో డబ్బులు జమ చేయడంతోపాటు వివరాలన్నీ పొందుపరిచిన ఒక ఫారాన్ని నింపాలి. డబ్బు కట్టడంతోపాటు వివరాలన్నీ ఇచ్చింది. కానీ, ఎన్ని రోజులైనా ఆ చీర మాత్రం రాలేదు. ‘మా లక్కీ స్కీమ్‌లో పాల్గొనండి, ఐ ఫోన్ గెల్చుకోండి’ అని ఉన్న అప్లికేషన్‌ను శేఖర్ (పేరు మార్చడమైనది) క్లిక్ చేశాడు. ఆ లక్కీ డిప్లో పాల్గొనాలంటే రెండు వేల రూపాయలు చెల్లించి, స్కీమ్‌లో చేరాలని ఉంది. తన వివరాలతో పాటు, రెండు వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించి, ఆ స్కీమ్‌లో చేరాడు. కానీ, శేఖర్‌కి ఫోన్ రాలేదు. ఆ డబ్బులూ తిరిగి రాలేదు. సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవడానికి ఆఫర్లు లైక్స్, కామెంట్స్, సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడానికి కొందరు ‘ఉచితం లేదా డిస్కౌంట్’ అనే పదాలను ఎరగా వేస్తుంటారు. ‘50,000 రూపాయల ధర పలికే గడియారాన్ని 5,000కే అమ్ముతున్నాను’ అనే ఆఫర్లు వస్తుంటాయి. మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం.. ‘ఆఫర్’ని ఎరగా వేసి వివరాలన్నీ సేకరించి, ఆ తర్వాత మోసానికి పాల్పడే వారుంటారు. వివరాలన్ని ‘డార్క్’వెబ్సైట్లలో పెడుతూ, మరో ఆన్లైన్ మోసాలకు ఉపయోగించడానికి ఆ డేటాను వాడుతుంటారు. ఒరిజినల్ అని చెప్పి, అమ్మడం ఇది మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం. బ్రాండెడ్ వస్తువులా అనిపించే రెప్లికా ఐటమ్ చూపించి అసలైనదే అని చూపుతారు. మీతో పాటు మరికొంతమందిని తమ స్కీమ్‌లో చేర్చితే ‘50,000 రూపాయల వస్తువు 5000 కు సొంతం చేసుకోవచ్చు అనే ఆశను చూపెడతారు. నాణ్యతలేని వస్తువులతో ఎర రెప్లికా వస్తువుల్లోనూ గ్రేడ్స్ ఉంటాయి. అవి చూడటానికే బాగుంటాయి కానీ, ఏ మాత్రం పనిచేయవు. అలాంటి వస్తువులను చూపి, డబ్బులు రాబట్టి మోసం చేస్తారు. ఆఫర్ల వర్షం దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ముఖ్యమైన పండగల సమయంలో జనాల బలహీనతను దృష్టిలో పెట్టుకొని, బంపర్ ఆఫర్, వీల్ తిప్పడం, స్క్రాచ్ కార్డ్‌లు.. వంటి వాటితో ఆన్లైన్ మోసానికి దిగుతుంటారు. ఈ షాపింగ్ మోసాలు ఢిల్లీ చుట్టుపక్కల నుంచి అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీటిల్లో ఎక్కువగా ఫోన్లు, వాచీలు, చీరలు, డ్రెస్సుల విషయాల్లో జరుగుతుంటాయి. ఆన్లైన్ షాపింగ్ మోసానికి ముందే హెచ్చరికలు ► ఒక వస్తువులు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరతో ప్రచారం చేయబడుతుంది అంటే ఆలోచించాలి. మోసానికి ముందు ఇదొక హెచ్చరిక అనుకోవాలి. ► ఆన్లైన్ చెల్లింపులు కాకుండా వస్తువు ఇంటికి వద్దకు వచ్చాకే చెల్లింపు అనే ఎంపిక మంచిది. ► డిస్కౌంట్ ఆఫర్‌ని పొందడానికి తమ వోచర్ కోసం ముందే చెల్లించాలనే ఎంపికలు ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ► నకిలీ సోషల్ మీడియా ఆధారిత కథనాలు కొత్తగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆన్ లైన్ లో చాలా తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి, అనేది నిజం కాదు. ► విక్రేత విదేశాల్లో ఉన్నప్పుడు పే మనీ లేదా క్రెడిట్/ డెబిట్ కార్డ్ లావాదేవీ వంటి సురక్షిత చెల్లింపు సేవ ద్వారా చెల్లింపును అనుమతించరు. వారు మిమ్మల్ని ౖఖ్కీ ని చెప్పమని లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్స్ లేదా చిన్న లింక్‌లను పూరించమని అడుగుతారు. ► కొత్తగా పుట్టుకు వచ్చిన వెబ్సైట్లలో నిర్ధారణకు రాకుండా కొనుగోళ్లు చేయకూడదు. వాటి తాలూకు ఫౌండర్స్ ఎవరనేది కూడా చూసుకోవాలి. బ్రాండ్ పేరుతో ఉన్న వెబ్‌సైట్స్ కూడా నకిలీ పేరుతో వస్తాయి. పండగల సమయాల్లో ఈ– తరహా మోసాలు ఎక్కువ. కాబట్టి, వాటి వాడుక, హెచ్టిటిపిఎస్, యుఆర్ఎల్ చెక్ చేసుకొని కొనాలి. షాపింగ్ మోసాల నుండి రక్షణ ► మీరు తీసుకోవాలనుకున్న వస్తువు ‘సమీక్ష (రివ్యూ)లు చదవండి. వాటి నాణ్యత, రిటర్న్ పాలసీల వంటివి ఉన్నాయేమో చూడండి. ► ఎప్పుడైనా (యాప్) అప్లికేషన్ అంతర్నిర్మిత సాధనాలతోనే కమ్యూనికేట్ చేయండి. అప్లికేషన్ వెలుపల కమ్యూనికేట్ చేయవద్దు. ► సురక్షిత నగదు చెల్లింపు కోసం https://URL చూడండి. ► అమ్మకం దారుకి మీ బ్యాంక్ OTP / PIN నంబర్లను ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. ► మీరు ఫోన్ మాట్లాడే సమయంలో చెల్లింపు లావాదేవులను ఎప్పుడూ చేయవద్దు. ► అమ్మకం దారు అందించిన ఏవైనా షార్ట్ లింక్‌లను క్లిక్ చేసి, వాటిని పూరించవద్దు. గూగుల్ లింక్ ద్వారా వచ్చిన ఫామ్‌లను పూరించవద్దు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుంది. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
అమెజాన్‌లో లక్ష ఉద్యోగాలు..
సాక్షి, బెంగళూరు: కరోనా సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయింది. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీల నుంచి దిగ్గజాల వరకు ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం త్వరలో లక్ష ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. కాగా కరోనా నేపథ్యంలో ఆన్లైన్ ఆర్డర్లకు విపిరీతమైన డిమాండ్ పెరిగిందని, మెజారిటీ నియామకాలను ఆన్లైన్ డిమాండ్ మేరకు వినియోగించుకుంటామని తెలిపింది. మరోవైపు పార్ట్ టైమ్, ఫుల్‌టైమ్ నిమాయకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. నిత్యావసరాలకు అధిక డిమాండ్ వల్ల 100కొత్త గిడ్డంగులు(వేర్‌హౌస్) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అయితే గిడ్డంగులలో ప్యాకింగ్ కోసం కొత్తగా నియమించుకునే వారిని ఉపయోగించుకుంటామని పేర్కొంది. సంస్థకు విపరీతమైన సిబ్బంది కొరత వేదిస్తోందని అమెజాన్ వేర్‌హౌస్ ఉన్నతాధికారి బోలర్ డెవిస్ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్, డెట్రాయిట్ తదితర నగరాలలో తీవ్ర కార్మికలు కొరత ఉందని, గంటకు 15డాలర్లు వేతనాలు, అదనంగా 100 డాలర్లు బోనస్‌లు ఇస్తామని ప్రకటించిన కార్మికులు మొగ్గు చూపడం లేదని డెవిస్ పేర్కొన్నారు. మరోవైపు నియామకాలలో ఆన్లైన్ షాపింగ్‌కు అధిక సిబ్బందిని వినియోగించుకుంటామని అమెజాన్ పేర్కొంది. (చదవండి: పండుగ సీజన్ : అమెజాన్ కీలక అడుగు) -
వాట్సాప్‌లోనే వ్యాపారమంతా..
రాజమహేంద్రవరం రూరల్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గడపదాటడానికి జనం జంకుతున్నారు. దీంతో నిత్యవసరాలు, కూరగాయలు, పండ్లు ఇతర వస్తువులు కొనుగోలుకు నగర, పట్టణాల్లో మెజారిటీ శాతం ప్రజలు డోర్ డెలివరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రయాణ భారం తగ్గడం, ప్రయాస లేకుండా నిత్యవసరాలు ఇంటి వద్దకే రావడంతో ఆన్లైన్ గ్లోసరీ డెలివరీ సరీ్వసులు, సూపర్మార్కెట్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో డోర్‌డెలివరీ రూపంలో వినియోగదారులను వ్యాపారులు ఆకర్షిస్తున్నారు. ఆన్లైన్లో గ్లోసరీ డెలివరీ సరీ్వస్‌లకు సంబంధించిన ప్లే స్టోర్ ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తద్వారా నిత్యవసరాలు ఆర్డరు చేసిన వెంటనే డోర్ డెలివరీ చేస్తున్నారు. సూపర్మార్కెట్లలో వాట్సాప్‌లలో నిత్యావసరాల జాబితాను పంపిస్తే నిర్వాహకులు డోర్ డెలివరీ చేపడుతున్నారు. జిల్లాలో ఆన్లైన్ గ్లోసరీ డెలివరీ సరీ్వసులు పదుల సంఖ్యలో ఉండగా, సూపర్మార్కెట్లు వందల సంఖ్యలో నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేస్తున్నాయి. నిత్యావసర వస్తువులను నామమాత్రంగా డెలివరీ చార్జీలు తీసుకుని సరుకులు అందజేస్తున్నారు. కొన్ని మార్ట్లు, సూపర్మార్కెట్లు కూరగాయలు, పండ్లు సైతం డోర్ డెలివరీ చేస్తున్నారు. కొంతమంది మంచినీటి టిన్లను సైతం సరఫరా చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో రాజమహేంద్రవరం, కాకినాడ ఇతర మున్సిపాలిటీల్లో రైతుబజార్లు, బహిరంగ మార్కెట్లను విశాల మైదనాలు, క్రీడా మైదానాల్లోకి తరలించి విక్రయాలు చేపడుతున్నారు. అయితే అక్కడ భౌతికదూరం, మాస్‌్కలు ధరించడం కొందరు సరిగా పాటించడం లేదు. దీంతో తోపుడు బండ్లపై ఇళ్ల దగ్గరకు వచ్చే కూరగాయలు సైకిళ్లు, బండ్లపై వచ్చే కూరగాయలు కొనుగోలుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో లభించే ధరలకన్నా రూ.2, 3 తేడాతో తాజా కూరగాయలు, పండ్లు ఇంటి వద్దకే వస్తుండడంతో ఇక్కడ కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. శానిటైజేషన్ చేశాకే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో రోజురోజుకు జాగ్రత్త చర్యలపై అవగాహన పెరుగుతోంది. దీంతో డోర్ డెలివరీ ద్వారా సరఫరా చేసే ప్యాక్, నిత్యవసర సరుకులను శానిటైజ్ చేశాకే ఇంట్లోకి తీసుకుంటున్నారు. డోర్ డెలివరీపై వచ్చే వస్తువుల బాక్స్‌లను శానిటైజేషన్ చేసిన తర్వాతే తాకాలని వైద్యులు సూచిస్తుండడంతో ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు.. ఆన్లైన్లో తమ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని నిత్యవసరాలు ఆర్డర్ చేసిన వెంటనే వినియోగదారులకు నిరీ్ణత సమయంలో డోర్ డెలివరీ చేస్తున్నారు. నిత్యవసరాలతో పాటు మంచినీటి టిన్లను సైతం సరఫరా చేస్తున్నాం. రాజమహేంద్రవరం నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు నిత్యవసరాలు డోర్ డెలివరీ సేవలు అందిస్తున్నాం. కరోనా నేపథ్యంలో శానిటైజేషన్ చేసిన తరువాతే సరుకులు బాయ్స్ వినియోగదారులకు ఇస్తున్నాం. –డి.వెంకన్నబాబు, ఆన్లైన్ గ్లోసరీ డెలివరీ సరీ్వస్ నిర్వాహకుడు, రాజమహేంద్రవరం -
ఇక అమెజాన్‌లో బాడీ త్రీడీ స్కానింగ్
ముంబై : ఆన్లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీది ఆన్లైన్లోనే కొనడం అలవాటైంది. అయితే ఆన్లైన్లో ఎక్కువ మంది ఎలాక్ట్రానిక్, కాస్మోటిక్ ఉత్పత్తులనే కొనడానికి మొగ్గు చూపుతారు. బట్టలు, చెప్పులు వంటివి కొనాలంటే మాత్రం కాస్త ఆలోచిస్తారు. కారణం... సరైన సైజు దొరకదని, రంగు వంటి వాటి విషయాల్లోను తేడాలు ఉంటాయని. అయితే ఇక మీదట ఈ ఇబ్బందులు ఉండవంటోంది ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్. ఈ ఇబ్బందులకు పరిష్కారాన్ని కనుక్కోవడం కోసం అమెజాన్ ఒక నూతన సాంకేతికతను అందుబాటులోకి తేనుంది. త్వరలో అమెజాన్ త్రీడీ బాడీ స్కానింగ్ ఆప్షన్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. అమెజాన్ రూపొందిస్తున్న ఈ నూతన టెక్నాలజీ ద్వారా వినియోగదారుల శరీరాన్ని త్రీడీ స్కానింగ్ చేసి వారికి సరిగ్గా సరిపోయే దుస్తులు, చెప్పులు వంటి వాటిని సూచిస్తుంది. దీనిని పరీక్షించడం కోసం స్వచ్చంద సహాయకులను ఆహ్వానించింది. వీరంతా నెలకు రెండు సార్లు న్యూయార్క్‌లో ఉన్న అమెజాన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. వీరిని ఇలా స్కాన్ చేయడం ద్వారా తాము రూపొందిచబోయే నూతన సాంకేతికతకు మానవ శరీరంలో జరిగే మార్పులును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఇలా వచ్చే సహాయకులకు 250 డాలర్ల విలువ చేసే గిఫ్ట్ కార్డులను ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇక ఆన్లైన్లోనే వినియోగదారులు తమకు నప్పే దుస్తులు, చెప్పులను ఎంచుకోవచ్చని, ఫలితంగా రిటర్న్ వచ్చే ఆర్డర్ల సంఖ్య బాగా తగ్గుతుందని తెలిపారు. -
ఒక్క అరటిపండు ధర రూ.87000..!
నాటింగ్‌హోమ్ : అరటి పండు.. దాదాపు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తినదగిన అత్యంత చౌకైన ధర కలిగినది. దీనిని పేదవాడి ఆపిల్ అని కూడా అంటారు. మాములుగా అయితే ఒక్క అరటి పండు ధర నాలుగు లేదా ఐదు రూపాయలు ఉంటుంది. మహా అయితే గరిష్టంగా ఓ పది రూపాయలు ఉంటుంది. కానీ యునైటెడ్ కింగ్డమ్లో ఓ మహిళ ఒక అరటిపండును ఏకంగా రూ. 87,000 పెట్టి కొన్నారు. ఎంటీ షాకయ్యారా..? మీలాగే ఆమె కూడా బిల్లు చూసి షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే... యూకేలోని నాటింగ్‌హోమ్ నగరానికి చెందిన బాబీ గోర్డాన్ ఓ సూపర్ మార్కెట్లో ఆన్లైన్ షాపింగ్ చేశారు. మొత్తం బిల్లు 100 పౌండ్లు అయింది. అయితే సూపర్ మార్కెట్ వర్కర్లు పొరపాటున బిల్లును 1000 పౌండ్లుగా వేశారు. దాంట్లో ఒక్క అరటిపండుకే 930.11 పౌండ్లు( రూ. 87,000) బిల్లు వేశారు. బిల్లు చూసి ఆశ్యర్యానికి గురైన బాబీ ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే బిల్లు వర్కర్ల పొరపాటు వల్ల అలా జరిగిందని, క్షమించాలని సూపర్ మార్కెట్ యజమాని బాబీని కోరారు. అలాగే తమ మార్కెట్లోని అరటి పండ్లు శుభ్రంగా, తాజాగా ఉంటాయి. మా అరటిపండ్లకు రూ.87,000 ధర పెట్టొచ్చని చమత్కరించారు. -
60 నిమిషాల్లోనే ఇంటికి సరుకులు
- బిగ్‌బాస్కెట్ ఎక్స్‌ప్రెస్ డెలివరీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ సూపర్‌మార్కెట్ బిగ్‌బాస్కెట్ తాజాగా బీబీ ఎక్స్‌ప్రెస్ పేరుతో కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 60 నిమిషాల్లోనే డెలివరీ చేస్తారు. బిగ్‌బాస్కెట్ తొలిసారిగా ఈ సర్వీసులను హైదరాబాద్‌లో ప్రారంభించింది. కంపెనీ ఈ సర్వీసుల కోసం ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసింది. సాధారణంగా గ్యారంటీడ్ డెలివరీ కింద నిర్దేశించిన సమయం దాటితే ఆర్డరు విలువలో 10 శాతం మొత్తాన్ని కస్టమర్ ఖాతాకు (వాలెట్) జమచేస్తోంది. అలాగే ఏదైనా ఉత్పత్తి అందించలేకపోతే దాని విలువలో 50 శాతం మొత్తాన్ని వాలెట్లో జమచేస్తారు. వినియోగదార్ల సౌకర్యార్థం బీబీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించామని కంపెనీ సహ వ్యవస్థాపకులు అభినయ్ చౌదరి బుధవారమిక్కడ తెలిపారు. కంపెనీ బిజినెస్ హెడ్ వి.హరి కృష్ణారెడ్డి, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ రాగలీనా శ్రీపాదతో కలసి మీడియాతో మాట్లాడారు. పరిచయ ఆఫర్లో భాగంగా ఫస్ట్ టైం యూజర్లకు పేటీఎం ద్వారా 20 శాతం క్యాష్ బ్యాక్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఆఫర్ జనవరి 3 వరకు ఉంటుంది. ఆన్లైన్ రిటైల్ విభాగంలో కంపెనీ వృద్ధికి కొత్త సర్వీసులు దోహదం చేస్తాయని అభినయ్ అభిప్రాయపడ్డారు. ‘ఇతర నగరాలకూ బీబీ ఎక్స్‌ప్రెస్‌ను పరిచయం చేయనున్నాం. రోజుకు 30,000 డెలివరీలను చేస్తున్నాం. 2014-15లో రూ.210 కోట్ల టర్నోవర్ ఆర్జించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లకు చేరుకుంటాం’ అని వెల్లడించారు. -
ఆన్లైన్ షాపింగ్‌తో మోసం
ఎస్బీఐ ఖాతాలోంచి రూ.58 వేలు డ్రా.. నివ్వెరపోయిన ఖాతాదారులు ఆలస్యంగా వెలుగుచూసిన వైనం సాంకేతిక పరిజ్ఞానంతో మోసం కొడంగల్ పోలీసులకు ఫిర్యాదు కొడంగల్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరుగుతున్న కొద్ది మోసాలు ఆ స్థాయిలోనే పెరుగుతున్నాయి. కొందరు దుండగులు అమాయకుల ఖాతా నంబర్లను తెలుసుకొని, వారిని నిలువునా మోసం చేస్తున్నారు. వారు ఖాతాలోంచి డబ్బులు డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం కొడంగల్ ఎస్బీఐ ఖాతాలో చోటుచేసుకున్న సంఘటన. ఈ సంఘటన జరిగి మూడు రోజులైంది. ఖాతాదారుల అమాయత్వంవల్ల మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొడంగల్, బొంరాస్‌పేట మండలాలకు చెందిన ఇద్దరు ఖాతాదారుల ఖాతాలోంచి మూడురోజుల క్రితం గుర్తుతెలియని మోసగాళ్లు రూ.58వేలు డ్రా చేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితులు, బ్యాంకు మేనేజర్ కథనం ప్రకారం వివరాలు.. కొడంగల్‌కు చెందిన ఆరీఫ్, బొంరాస్‌పేట మండలం లింగన్‌పల్లి గ్రామానికి చెందిన నర్సిములుకు కొడంగల్ ఎస్బీఐలో ఖాతాలు ఉన్నాయి. మూడురోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు వీరికి ఫోన్ చేసి సైబర్ నేరానికి పాల్పడ్డారు. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్పి మొదటగా ఏటీఎమ్ కార్డు నంబర్, తర్వాత పిన్ నంబర్ అడిగారు. కొన్ని నిమిషాల వ్యవధిలో సెల్ నంబర్‌కు వచ్చిన మెసేజ్ (వన్ టైమ్ పాస్వర్డ్) ఓటీపీ నంబర్‌ను అడిగారు. దీంతో వెంటనే ఆరీఫ్ ఖాతా నుంచి రూ.11వేలు, నర్సిములు ఖాతా నుంచి రూ.47,333 డ్రా చేసుకున్నారు. నిందితులు డబ్బులు డ్రా చేసే విషయంలో జాగ్రత్తపడ్డారు. డబ్బులను నేరుగా డ్రా చేయకుండా ఆన్లైన్ షాపింగ్ ద్వారా డబ్బులు దండుకున్నట్లు మేనేజర్ హరికృష్ణ తెలిపారు. డబ్బులు కోల్పోయిన బాధితులు కొడంగల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. -
లక్ష ఈ-కామర్స్ కొలువులు!
ముంబై: ఆన్లైన్ షాపింగ్ పరిశ్రమలో కొలువుల జోరు పెరగనుంది. ఈ-కామర్స్ మార్కెట్‌కు వచ్చే ఆరు నెలల్లో లక్ష కొత్త ఉద్యోగాల అవసరం ఉందనేది పరిశ్రమ వర్గాల అంచనా. నియామకాలకు సంబంధించిన కన్సల్టెంగ్ సంస్థలకు ఈ-కామర్స్ నుంచి హైరింగ్ విజ్ఞప్తులు భారీగా పెరుగుతున్నాయని గ్లోబల్ హెర్ఆర్ దిగ్గజం ఇన్హెల్మ్ లీడర్షిప్ సొల్యూషన్స్ కంట్రీ హెడ్ ప్రశాంత్ నాయర్ చెప్పారు. రానున్న ఆరు నెలల వ్యవధిలో కనీసం లక్ష కొత్త ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉందన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. 2009లో దేశీ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 3.8 బిలియన్ డాలర్లు ఉండగా... 2013లో ఇది 12.6 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. చక్రీయగతిన(సీఏజీఆర్) 30% వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి 8-10 శాతం స్థాయిలో ఉంది. అయితే, కీలక స్థానాల్లో నిపుణులను అట్టిపెట్టుకోవడం దేశీ ఈ-కామర్స్ రంగానికి అతిపెద్ద సవాలు. కంపెనీలు భారీ స్థాయిలో విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తుండటంతో.. సిబ్బంది అవసరం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో నియామకాల కోసం ఈ రంగంలో నైపుణ్యంగల కన్సల్టెన్సీలపై అధికంగా ఆధారపడుతున్నాయి. -
బిజినెస్ ట్రెండ్స్ 1st Sep 2013
-
బిజినెస్ ట్రెండ్స్