
సాక్షి, అమరావతి: భారతీయ యువతలో కొనుగోలు ట్రెండ్ మారుతోంది. సరదా షాపింగ్ విధానం పెరిగిపోతోంది. ఇదేదో దుకాణాలకు వెళ్లి కాదండోయ్.. ఆన్‌లైన్‌లోనే.. అదీ ఇంట్లోనే.. మరీ చెప్పాలంటే వీడియో రీల్స్ (షార్ట్ వీడియో) చూస్తూ వస్తువుల కొనుగోలును ఎంజాయ్ చేస్తున్నారు.
దాదాపు దేశంలో 60 శాతం మంది యువత కొనుగోళ్లను చిన్న వీడియోల్లోని కంటెంట్ ప్రభావితం చేస్తోంది. ప్రముఖ షార్ట్ వీడియోస్ యాప్ సంస్థ ఎమోజీ ‘గెటింగ్ యంగ్ ఇండియా రైట్’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో 18–34 ఏళ్ల మధ్య యువతను ఆన్‌లైన్‌లో సర్వే చేసింది. దీని ప్రకారం దేశంలో ఏకంగా 77 శాతం యువత ఎక్కువ సమయం షార్ట్ వీడియోలు చూస్తున్నట్టు పేర్కొంది. మరో 16 శాతం మంది వార్తలు, ఇతర వినోద కార్యక్రమాలు, 7 శాతం మంది టీవీ, ఓటీటీ ఆధారిత కంటెంట్‌లో మునిగిపోతున్నట్టు గుర్తించింది.
ఆఫర్లు.. డిస్కౌంట్లదే పైచేయి
కాగా, చిన్న వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ దేశంలోని యువత కొనుగోలు నిర్ణయాలను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రభావితం చేస్తున్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది. ఆఫర్లు, డిస్కౌంట్లు సగానికి పైగా యువత కొనుగోలు ఆలోచనలను ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానంగా ఉన్నట్టు వివరించింది. ఉచిత రవాణా, వేగంగా సరుకు అందించడం కూడా కొనుగోళ్లను పెంచుతోంది.
అత్యధిక ఖర్చు ఆ రెండింటిపైనే..
దేశంలోని 77 శాతం యువత మొబైల్ ఫోన్లు, దుస్తులపై అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్టు సర్వే చెబుతోంది. వీటి కొనుగోలు కోసం 65 శాతం మంది తమ వ్యక్తిగత నిధులను వినియోగిస్తుంటే.. 26 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆ«దారç³డుతున్నారు. మరో 7 శాతం మంది బయట అప్పులు చేస్తున్నట్టు సర్వే వెల్లడిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment