భారతీయలు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ గ్రూప్ నివేదిక ప్రకారం.. మన దేశంలో విక్రయించే లగ్జరీ గృహాల వాటా గత ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగింది.
శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం విలాసవంతమైన గృహాల విలువ కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్నట్లు తెలింది. భారత్‌లోని తొలి ప్రధాన ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి- మార్చి (మొదటి త్రైమాసికం)లో విక్రయించిన రెసిడెన్షియల్ యూనిట్లు 21 శాతంగా ఉన్నాయి. 2019లో ఇదే కాలానికి 7శాతం మాత్రమే విక్రయించినట్లు నివేదిక హైలెట్ చేసింది.
బలమైన ఆర్థిక వృద్ధి, ప్రవాస భారతీయుల నుండి డిమాండ్ కారణంగా భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. వెరసి ఈ ఏడాది ప్రారంభంలో డీఎల్‌ఎఫ్ కంపెనీ న్యూఢిల్లీకి సమీపంలో 1,100 కంటే ఎక్కువ గృహాలు నిర్మాణాన్ని ప్రారంభించక ముందే మూడు రోజుల్లో అమ్ముడయ్యాయి. వీటిలో అధిక భాగం ఎన్‌ఆర్‌ఐలు కొనుగోలు చేశారు.
బడ్జెట్ ధరలో లభ్యమయ్యే ఇళ్లు అదే కాలంలో అమ్మకాల వాటా 37శాతం నుండి 18శాతానికి క్షీణించాయి. మధ్య శ్రేణి, ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్‌లో 4 మిలియన్ నుంచి 15 మిలియన్ మధ్య ధర కలిగిన గృహాలు దాదాపు 59 శాతం వాటాతో అత్యధికంగా అమ్ముడు పోయినట్లు అనరాక్ నివేదిక హైలెట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment