రాజమహేంద్రవరం రూరల్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గడపదాటడానికి జనం జంకుతున్నారు. దీంతో నిత్యవసరాలు, కూరగాయలు, పండ్లు ఇతర వస్తువులు కొనుగోలుకు నగర, పట్టణాల్లో మెజారిటీ శాతం ప్రజలు డోర్ డెలివరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రయాణ భారం తగ్గడం, ప్రయాస లేకుండా నిత్యవసరాలు ఇంటి వద్దకే రావడంతో ఆన్‌లైన్ గ్లోసరీ డెలివరీ సరీ్వసులు, సూపర్‌మార్కెట్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది.
రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో డోర్‌డెలివరీ రూపంలో వినియోగదారులను వ్యాపారులు ఆకర్షిస్తున్నారు. ఆన్‌లైన్‌లో గ్లోసరీ డెలివరీ సరీ్వస్‌లకు సంబంధించిన ప్లే స్టోర్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తద్వారా నిత్యవసరాలు ఆర్డరు చేసిన వెంటనే డోర్ డెలివరీ చేస్తున్నారు. సూపర్‌మార్కెట్లలో వాట్సాప్‌లలో నిత్యావసరాల జాబితాను పంపిస్తే నిర్వాహకులు డోర్ డెలివరీ చేపడుతున్నారు.
జిల్లాలో ఆన్‌లైన్ గ్లోసరీ డెలివరీ సరీ్వసులు పదుల సంఖ్యలో ఉండగా, సూపర్‌మార్కెట్లు వందల సంఖ్యలో నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేస్తున్నాయి. నిత్యావసర వస్తువులను నామమాత్రంగా డెలివరీ చార్జీలు తీసుకుని సరుకులు అందజేస్తున్నారు. కొన్ని మార్ట్‌లు, సూపర్‌మార్కెట్లు కూరగాయలు, పండ్లు సైతం డోర్ డెలివరీ చేస్తున్నారు. కొంతమంది మంచినీటి టిన్‌లను సైతం సరఫరా చేస్తున్నారు.
లాక్‌డౌన్ సమయంలో రాజమహేంద్రవరం, కాకినాడ ఇతర మున్సిపాలిటీల్లో రైతుబజార్లు, బహిరంగ మార్కెట్లను విశాల మైదనాలు, క్రీడా మైదానాల్లోకి తరలించి విక్రయాలు చేపడుతున్నారు. అయితే అక్కడ భౌతికదూరం, మాస్‌్కలు ధరించడం కొందరు సరిగా పాటించడం లేదు. దీంతో తోపుడు బండ్లపై ఇళ్ల దగ్గరకు వచ్చే కూరగాయలు సైకిళ్లు, బండ్లపై వచ్చే కూరగాయలు కొనుగోలుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో లభించే ధరలకన్నా రూ.2, 3 తేడాతో తాజా కూరగాయలు, పండ్లు ఇంటి వద్దకే వస్తుండడంతో ఇక్కడ కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
శానిటైజేషన్ చేశాకే..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో రోజురోజుకు జాగ్రత్త చర్యలపై అవగాహన పెరుగుతోంది. దీంతో డోర్ డెలివరీ ద్వారా సరఫరా చేసే ప్యాక్, నిత్యవసర సరుకులను శానిటైజ్ చేశాకే ఇంట్లోకి తీసుకుంటున్నారు. డోర్ డెలివరీపై వచ్చే వస్తువుల బాక్స్‌లను శానిటైజేషన్ చేసిన తర్వాతే తాకాలని వైద్యులు సూచిస్తుండడంతో ప్రజలు జాగ్రత్త పడుతున్నారు.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే చాలు..
ఆన్‌లైన్‌లో తమ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నిత్యవసరాలు ఆర్డర్ చేసిన వెంటనే వినియోగదారులకు నిరీ్ణత సమయంలో డోర్ డెలివరీ చేస్తున్నారు. నిత్యవసరాలతో పాటు మంచినీటి టిన్‌లను సైతం సరఫరా చేస్తున్నాం. రాజమహేంద్రవరం నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు నిత్యవసరాలు డోర్ డెలివరీ సేవలు అందిస్తున్నాం. కరోనా నేపథ్యంలో శానిటైజేషన్ చేసిన తరువాతే సరుకులు బాయ్స్ వినియోగదారులకు ఇస్తున్నాం.
–డి.వెంకన్నబాబు, ఆన్‌లైన్ గ్లోసరీ డెలివరీ సరీ్వస్ నిర్వాహకుడు, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment