door delivery
-
నాడు సురక్ష.. నేడు శిక్ష
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన జె.అప్పలనాయుడు గుండె జబ్బుతో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రక్తనాళాల్లో కొవ్వు స్థాయిలను తగ్గించడానికి, గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్‌లను నివారించడంతో పాటు.. అధిక రక్తపోటు సమస్యకు సంబంధించిన మందులను రోజూ వాడాల్సి ఉంటుంది. ఖరీదైన ఈ మందులను బయట కొనుగోలు చేయడం ఆ కుటుంబానికి స్తోమతకు మించిన వ్యవహారం. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా అమలులోకి తెచ్చిన మందుల డోర్ డెలివరీ ఈ కుటుంబానికి వరంగా మారింది. విలేజ్ క్లినిక్‌లోని సీహెచ్‌వో నెలనెలా ఆన్లైన్లో ఇండెంట్ పెడితే మందులు పోస్టల్లో గ్రామానికి వచ్చేవి.ఆ మందులను సీహెచ్‌వో/ఏఎన్ఎం ఇంటి వరకూ తీసుకెళ్లి అందజేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నట్టుండి మందుల డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ఆపేసింది. దీంతో మందుల కోసం అప్పలనాయుడు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ఇలాఅప్పలనాయుడు తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది గుండె, కిడ్నీ, క్యాన్సర్, న్యూరో సంబంధిత దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడుతున్న వారి పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ముందు వరకు క్రమం తప్పకుండా ఇంటి గుమ్మం వద్దకే సజావుగా సాగిన మందుల డోర్ డెలివరీ.. ఇప్పుడు నిలిచి పోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేచి నడిచే సత్తా ఉన్న వారు ప్రయాణ చార్జీలు పెట్టుకుని, ఆపసోపాలు పడి పెద్దాస్పత్రులకు వెళుతుంటే అక్కడ కూడా కొన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదని, బయట కొనుక్కోమని చీటీలు రాసిస్తున్నారని పేదలు లబోదిబోమంటున్నారు. పక్షవాతం బారినపడి.. కాళ్లు, చేతులు పని చేయని, కదల్లేని స్థితిలో ఉండే వికలాంగులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేదేమీ లేక స్థానికంగా ప్రైవేట్ మెడికల్ స్టోర్స్‌లో ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి బాధిత కుటుంబాలు తీవ్ర అగచాట్లు పడుతున్నాయి.బాధితులకు భరోసా కరువు⇒ గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను సచివాలయాల వారీగా వైద్య శాఖ ఆన్లైన్లో పొందు పరిచింది. ఈ సమాచారం ఆధారంగా విలేజ్ క్లినిక్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లు ప్రతి నెలా మందులను ఆన్లైన్లో ఇండెంట్ పెట్టేవారు. ఆ మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఏపీఎంఎస్ఐడీసీ పోస్టల్ ద్వారా గ్రామాలకు చేరవేసేది. అనంతరం సీహెచ్‌వో/ఏఎన్ఎంలు ఆ మందుల పార్సిల్‌ను బాధితుల ఇంటి వద్దకు చేరవేసి, వాటిని ఎలా వాడాలో వివరించే వారు. ⇒ అయితే జూన్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఆన్లైన్లో ఇండెంట్ పెడుతున్నప్పటికీ, ఏపీఎంఎస్ఐడీసీ మందులను గ్రామాలకు పంపడం లేదు. మందులు రావడం లేదని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులను ప్రశ్నిస్తున్నా ఎవరూ స్పందించక పోవడంతో సీహెచ్‌వోలు ఇండెంట్ పెట్టడం కూడా మానేశారు. దీంతో వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. ⇒ బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్, దీర్ఘకాలిక కిడ్నీ, క్యాన్సర్ జబ్బుల బాధితులు జీవిత కాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి నెలకు రూ.వేలల్లో కూడా ఖర్చు అవుతుంది. వ్యవసాయ, రోజు వారీ కూలి పనులపై ఆధారపడే పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన బాధితులు ఖరీదైన మందులు నెలనెలా కొనుగోలు చేయడానికి ఆర్థిక స్తోమత సహకరించదు. దీంతో చాలా మంది మందుల వాడకాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా జబ్బులు ముదిరి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతుంటాయి.⇒ ఈ పరిస్థితిని నివారించి బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మందుల డోర్ డెలివరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దయలేని చంద్రబాబు ప్రభుత్వం ఆపేయడం పట్ల బాధిత కుటుంబాలు మండి పడుతున్నాయి.ఆత్మస్థైర్యం కోల్పోయినట్లైందిగతంలో ప్రభుత్వమే నేరుగా ఇంటి దగ్గరకు మందులు పంపేది. నర్సమ్మ ఇంటి వద్దకే వచ్చి మందులు అందజేసి, నా ఆరోగ్యం గురించి వాకబు చేసి, మందులు ఎలా వాడాలో వివరించేది. నాకు ఎంతో ఆత్మస్థైర్యం నింపింది. ఇప్పుడు ఆ ఆత్మస్థైర్యం కోల్పోయాను. పై నుంచి వచ్చే మందులు కొద్ది నెలలుగా రావడం లేదని ఏఎన్ఎం, నర్సమ్మ చెప్పారు. – అప్పలకొండ, అనకాపల్లి జిల్లారోగాలు ముదిరిపోతాయిదీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ, కదల్లేని పరిస్థితుల్లో గ్రామాల్లో చాలా మంది ఉంటారు. క్రమం తప్పకుండా మందుల వాడకంతో బాధితుల్లో జబ్బులు నియంత్రణలో ఉంటాయి. మందులు ఆపేస్తే జబ్బులు ముదిరి, మరిన్ని అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి. – డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్, విజయవాడ -
తాగు.. ఊగు.. జోగు... బాబు మార్కు ప్రగతి!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విచ్చలవిడి వ్యాపారం సమాజానికి చేటు తెచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌షాపులు కనిపిస్తున్నాయని సమాచారం. ఇవి చాలవన్నట్టు వ్యాపారులు మద్యం డోర్ డెలివరీ కూడా మొదలుపెట్టారు. విజయవాడ పటమట ప్రాంతంలో ఒక షాపు యజమాని ఈ మేరకు కరపత్రాలు కూడా పంచారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంగతి ఏమోకానీ మద్యం ప్రోగ్రెస్ మాత్రం బాగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం ప్రభుత్వం డబ్బులు దండుకోవడానికి ఉపయోగపడుతూంటే.. సామాన్యుడి జేబు, ఒళ్లూ రెండూ హూనమైపోతున్నాయి. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మద్యం విధానం ప్రజలకు మేలు చేసేదా? కీడు చేసేదా అన్న చర్చ సాగుతోంది. ప్రజలు తమకు అధికారమిస్తే మద్యం సరఫరా చేస్తామన్న ఎన్నికల హామీ ఇచ్చిన పార్టీ దేశం మొత్తమ్మీద ఒక్క తెలుగుదేశం మాత్రమే కావచ్చు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తీవ్రంగా తప్పు పడుతూండేవారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని, నాణ్యత లేని బ్రాండ్ల అమ్మకాలు జరుగుతున్నాయని అనేవారు. కూలీనాలీ చేసుకునే సామాన్యుడు సాయంకాలం ఒక పెగ్గు మందేసుకుంటామంటే ధరలు ఆకాశాన్ని అంటేలా చేశారని ధ్వజమెత్తేవారు. ఈ మాటలు, విమర్శలు అన్నీ ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమించిన తెలుగుదేశం పార్టీ నుంచి వస్తూండటం ఒక వైచిత్రి. ఏదైతేనేం.. బాబు గారి మాటలకు మందుబాబులు పడిపోయారు. ఎన్నికల్లో సుమారు పాతిక లక్షల మంది మందురాయుళ్లు టీడీపీ కూటమివైపు మొగ్గారని ఒక అంచనా. సామాన్యుడిని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసే, సామాజికంగానూ అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టే మద్యం జనానికి దూరంగా ఉంచాలని గత ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకు తగ్గట్టుగానే జనావాసాలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ దుకాణాల వారు లాభాపేక్షతో పేదలను పిండుకుంటారన్న ఆలోచనతో సొంతంగా దుకాణాలు నడిపింది. నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంచేలా చేయడంతోపాటు ధరలు పెంచింది. బెల్ట్ షాపులు దాదాపుగా లేకుండా చేసింది. సామాజిక హితం కోసం చేపట్టిన ఈ చర్యలేవీ ఎల్లోమీడియాకు నచ్చలేదు. ఎప్పటికప్పుడు మద్యం విధానాన్ని విమర్శిస్తూ కథనాలు వండి వార్చేది. కానీ బెల్ట్‌షాపులున్నట్లు మాత్రం ప్రచారం చేయలేకపోయింది. ఈ వ్యతిరేక ప్రచారం ప్రభావంలో పడ్డ జనాలు జగన్‌పై వ్యతిరేకత పెంచుకుంటే.. చంద్రబాబు, పవన్, లోకేశ్ వంటివారు దానికి ఆజ్యం పోశారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే.. అధికారం వచ్చిన వెంటనే కూటమి నేతల వైఖరి పూర్తిగా మారిపోయింది. మద్యం ప్రియులకు ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ పరమయ్యాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.రెండు లక్షలు వసూలు చేసి, లాటరీ వేసి మరీ కేటాయింపులు జరిపారు. ఈ లాటరీల ద్వారానే ప్రభుత్వానికి రూ.రెండు వేల కోట్లు వచ్చింది. కొంతమంది దుకాణాల కోసం ఎగబడి.. యాభై నుంచి వంద వరకూ దరఖాస్తులు వేసినట్లు సమాచారం. ఇలా రూ.కోటి వరకూ ఖర్చు పెట్టినా వారికి ఒకట్రెండు షాపులూ దక్కలేదు. లాటరీలో దుకాణం కేటాయింపు జరిగిన తరువాత లైసెన్స్ ఫీజు కింద కూటమి ప్రభుత్వం మళ్లీ బాదుడు మొదలుపెట్టింది. దీనికింద రూ.60 లక్షల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఇవి చాలవన్నట్లు కూటమి ఎమ్మెల్యేలకు షాపులలో వాటా లేదంటే ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. విశేషం ఏమిటంటే టీడీపీ వారే ఎక్కువ దుకాణాలు పొందినా సొంతపార్టీ వారికే లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి. పోనీ ఇక్కడితో ఆగిందా? లేదు. ప్రభుత్వం ఎకాఎకిన మార్జిన్‌ను 20 నుంచి పది శాతానికి తగ్గించింది. షాపుల ఏర్పాటు, నిర్వహణలు అదనం. వీటన్నింటి కారణంగా మద్యం దుకాణాల ద్వారా నష్టాలే ఎక్కువ అవుతున్నాయని ఇప్పుడు దుకాణదారులు లబోదిబోమంటున్నారు. ఇది ఒక కోణం. టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటైన లిక్కర్ సిండికేట్లు మందుబాబులను పిండేస్తున్న వైనం ఇంకోటి. రాష్ట్రం నలుమూలల ఈ సిండికేట్ విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు తెరిచేసింది. కొన్నిచోట్ల ఆయా గ్రామాల నేతలే కొందరు వేలం ద్వారా బెల్ట్‌షాపులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం డి.కొత్తూరు గ్రామంలో జరిగిన బహిరంగ వేలంలో ఒక బెల్ట్ షాపు రూ.లక్ష ధర పలికిందని తెలిసింది. వైసీపీ వారు, మద్యం వ్యతిరేకులు బెల్ట్ షాపులను వ్యతిరేకించినా, టీడీపీ నేతల ఆధ్వర్యంలో వేలం పాటలు యధేచ్చగా సాగినట్లు సోషల్ మీడియా వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. తణుకు వద్ద మద్యం సీసాలు సంతలో బల్ల మీద పెట్టుకుని తండ్రులు అమ్ముతుంటే వారి పిల్లలు అక్కడే కూర్చున్న వీడియో తీవ్ర కలకలం రేపింది. పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర హోం శాఖ మంత్రి మాత్రం బెల్ట్‌షాపులు అస్సలు లేనేలేవని అంటున్నారు. ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం ధరలు పెంచి అమ్మినా, బెల్ట్ షాపులు పెట్టినా రూ.5 లక్షల వరకూ జరిమానా అంటూ బెదరగొడుతున్నారు కానీ.. ఆచరణలో ఇది ఏమాత్రం అమలు కావడం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజులు, లైసెన్స్ ఫీజులు, మామూళ్లు, దుకాణాల ఏర్పాటు, నిర్వహణ వంటి అనేక ఖర్చులు ఉండటంతో తాము నష్టాలను పూడ్చుకునేందుకు అధిక ధరలకు మద్యం అమ్మాల్సి వస్తోందని దుకాణందారులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రూ.99కే క్వార్టర్ మద్యం అందిస్తానని హామీ ఇచ్చినప్పటికీ వాస్తవానికి రూ.120 నుంచి రూ.130 వరకూ పెట్టాల్సి వస్తోందని మద్యం ప్రియులే చెబుతూండటం గమనార్హం. పైగా గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని అదనంగా కొన్ని వచ్చి చేరాయని నాణ్యతలో ఏమీ తేడా లేదని వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని మందు తాగి మరీ చెబుతున్నారు.మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరుపై ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతోంది. జనావాసాల మధ్య దుకాణాల ఏర్పాటును ప్రజలు పలుచోట్ల నిరసించారు. కానీ వారి గోడు పట్టించుకున్న వారు లేకపోయారు. గత ఏడాది మద్యం ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం రాగా దాన్ని ఈ ఏడాది రూ.25 వేల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం తన బడ్జెట్లోనే పేర్కొంది. మద్యం ధరలు తగ్గించామని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం ఆదాయం ఎలా పెరుగుతోందంటే మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. 201419 మధ్య కూడా చంద్రబాబు బెల్ట్ షాపులు రద్దు చేస్తున్నామని, చర్య తీసుకుంటామని పలుమార్లు చెప్పేవారు. కానీ 45 వేలకు పైగా బెల్ట్ షాపులు నడిచాయని ఒక అంచనా. అంతేకాదు. గోరుచుట్టపై రోకటిపోటు చందంగా ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటోంది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి తోటల పెంపకం విస్తారంగా సాగిపోతోంది. ఈ మధ్య జరిగిన పోలీసుల దాడిలో 15 ఎకరాలలో గంజాయి పెంచుతున్నట్లు గుర్తించారు. నగర ప్రాంతాలలో కూడా గంజాయి విక్రయాలు పెరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కూటమి నేతలు చెప్పినదానికి, ఇప్పుడు జరుగుతున్నదానికి పూర్తిగా విరుద్దంగా పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారన్న ఆరోపణలు విరివిగా వినిపిస్తున్నాయి. ఏపీ సమాజం ఇదే కోరుకుంటోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
క్లౌడ్ కిచెన్
ఒకరి వద్ద ఉద్యోగిగా పనిచేయడం కన్నా.. ఏదైనా చిన్న వ్యాపారం చేసి తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటోంది ప్రస్తుత తరం. అలాంటి వారే ‘స్టార్టప్ కంపెనీ’ అనే పేరుతో వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఇందులోంచి పుట్టిందే క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్ట. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ట్రెండింగ్, సక్సెస్ఫుల్ బిజినెస్ అంటే ఇదే. 2015లో మొదటి క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభమైంది. 2016లో ఇది ఓ వ్యాపారంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,500కి పైగా క్లౌడ్ కిచెన్ స్టార్టప్‌లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని మార్కెట్లోకి రానున్నాయి. జాతీయ క్లౌడ్ కిచెన్ బిజినెస్ మార్కెట్ విలువ ఈ ఏడాది చివరి నాటికి రూ.25వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.క్లౌడ్ కిచెన్ అంటే..సాధారణంగా ఒక పెద్ద రెస్టారెంట్గానీ, హోటల్గానీ పెట్టాలనుకుంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. రెస్టారెంట్ డిజైన్ చేయించుకోవాలి. అది వాణిజ్య ప్రదేశంలో ఉండాలి. అందువల్ల అద్దె కూడా ఎక్కువగా చెల్లించాలి. కానీ, ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్్టలో కేవలం ఒక మంచి వంటగది ఏర్పాటుచేసుకుంటే సరిపోతుంది. రెస్టారెంట్లో ఏ విధంగా కిచెన్ ఏర్పాటుచేస్తారో అలాగే ఇంటి వద్ద కూడా కిచెన్ ఏర్పాటుచేసుకోవచ్చు. ఫుడ్ ఆర్డర్లను మీరు ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం స్విగ్గి, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు.. కిచెన్ సమీపంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని సొంత డెలివరీ బాయ్స్ ద్వారా ఫుడ్ చేరవేస్తే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.రెస్టారెంట్ పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. డైన్–ఇన్ కంటే డోర్‌స్టెప్ ఫుడ్ డెలివరీని కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో క్లౌడ్ కిచెన్ల హవా పెరిగింది. వీటిని డార్క్ కిచెన్లు, గోస్ట్ కిచెన్లు, వర్చువల్ రెస్టారెంట్లు, శాటిలైట్ రెస్టారెంట్లు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇవి జనాదరణ పొందుతుండడంతో చాలా రెస్టారెంట్లు ఇప్పుడు డైన్–ఇన్ రెస్టారెంట్ కల్చర్ నుంచి డోర్ డెలివరీ సెటప్ వైపు మొగ్గుచూపుతున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులతో ఎక్కువ లాభాలు పొందడమే ఈ క్లౌడ్ కిచెన్ల ప్రత్యేకత. –సాక్షి, అమరావతిఅనుమతులు తప్పనిసరి..⇒ క్లౌడ్ కిచెన్ నిర్వహణ కోసం స్థానికంగా మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. ⇒ అలాగే, సంస్థను రిజిస్టర్ చేయించుకోవడంతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ లైసెన్స్, జీఎస్టీ రిజి్రస్టేషన్, హెల్త్ లైసెన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అవసరం. ⇒ ఇలా కేవలం రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు పెట్టుబడితో క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించవచ్చు. ⇒కాస్త భారీస్థాయిలో అయితే రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అధ్యయనం ముఖ్యం.. క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైంది అధ్యయనం. కిచెన్ పెట్టాలనుకుంటున్న ప్రాంతంలో ఎలాంటి ఫుడ్‌కు డిమాండ్ ఉంది? ప్రజల ఇష్టాయిష్టాలు, ఆహారపు అలవాట్లు, ఇప్పటికే ఎలాంటి ఫుడ్ ఎంత ధరలో అందుబాటులో ఉంది.. దాని ధరలు ఎలా ఉన్నాయి.. వంటి వివరాలను తెలుసుకుని దానిబట్టి ప్రజలు ఎక్కవగా ఇష్టపడే ఆహారాన్నే రుచికరంగా, నాణ్యతతో, తక్కువ ఖర్చులో అందించాలి. క్లౌడ్ కిచెన్‌కు లొకేషన్‌తో సంబంధంలేదు. కానీ, రోడ్డుకు కొంచెం దగ్గరగా ఉంటే మంచిది. 500 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. డెలివరీ చేసే వాహనాల పార్కింగ్‌కు స్థలం ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాయే ప్రచారాస్త్రం.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. వ్యాపారం ఏదైనాసరే సోషల్ మీడియా పేజీ ఉండాల్సిందే. ఎందుకంటే దీనిద్వారా మరింత మంది కస్టమర్లు రావచ్చు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ట్విట్టర్లలో అకౌంట్లు ఓపెన్ చేయాలి. రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తుంటే. ఆటోమెటిగ్గా ఈ బిజినెస్ గురించి జనాలకు తెలుస్తుంది.ఖర్చు తక్కువ.. క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్టతో వ్యాపారాన్ని తొలుత హైదరాబాద్‌లో మొదలుపెట్టాలనుకున్నాం. కానీ, విజయవాడ వాసులు ఆహార ప్రియులు కావడంతో ఇక్కడే ఏర్పాటుచేసుకున్నాం. మా దగ్గర నాణ్యత ఉన్న ఆహారాన్ని బాక్స్‌లో ప్యాక్‌చేసి ఇస్చ్తాం. ఉ.11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఆహారాన్ని ఆన్లైన్ ద్వారా డెలివరీ ఇస్తున్నాం. సాధారణ రెస్టారెంట్‌తో పోలి్చతే దాదాపు 30–50 శాతం ఖర్చులు తక్కువ. అందువల్లే ధరలు తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. – ప్రసాద్, క్లౌడ్ కిచెన్ నిర్వాహకుడు, విజయవాడ -
స్టిచ్ ఆన్లైన్.. ఒక క్లిక్‌తో వండర్ఫుల్ స్టిచ్చింగ్!
సాక్షి, సిటీబ్యూరో: స్టిచ్ ఆన్లైన్.. ఇప్పుడు ఇదే నగరంలో నడుస్తున్న నయా ట్రెండ్.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిదీ ఆన్లైన్ మయమైంది. కరోనా తర్వాత ఈ ట్రెండ్ మరింతగా పెరిగిపోయింది. ఫుడ్‌తో పాటు మనకు కావాల్సిన వస్తువు ఏదైనా.. ఒక్క క్లిక్‌తో ఇంటికే డెలివరీ ఇస్తున్నారు. నిత్యావసర సరుకులు మొదలుకుని.. ఎలక్ట్రానిక్స్ వరకూ.. టూవీలర్స్ మొదలుకుని.. ఫోర్ వీలర్స్ వరకూ.. ఆఖరికి మెడికల్ సపోర్ట్ కూడా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేసింది.. దీంతో బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే అన్ని పనులూ చక్కబెట్టేసుకుంటున్నారు. ఇది బిజీబిజీగా ఉండేవారికి ఎంతో వెసులుబాటుగా మారింది. బట్టలు కూడా దాదాపు ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. అయితే మనకు నచ్చిన, మన శరీరానికి నప్పే బట్టలు, కొలతల విషయంలో ఇబ్బంది తలెత్తుతోంది. దీనికి పరిష్కారంగానే స్టిచ్ ఆన్లైన్ ట్రెండ్ అవుతోంది. దీంతో మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న సమయానికి ఇంటికి వచ్చి కొలతలు తీసుకుని, నచ్చిన మెటీరియల్‌తో నచ్చిన మోడల్‌తో స్టిచ్చింగ్ చేసి, ఇంటికే డెలివరీ ఇస్తున్నారు. దీని గురించిన మరిన్ని విశేషాలు..కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అనే సామెత టైలరింగ్‌కు సరిగ్గా నప్పుతుంది. ఒకప్పుడు బట్టలు కుట్టించుకోవాలంటే.. టైలరింగ్ షాపుకు వెళ్లి కొలతలు ఇచ్చి కుట్టించుకునేవారు. ఆ తర్వాత రెడీమేడ్స్ రాకతో టైలరింగ్ మరుగునపడిపోయింది.. ఆ తర్వాత ఆన్లైన్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే సరిగ్గా ఇదే కాన్సెప్్టని ఉపయోగించి ఆన్లైన్ స్టిచ్చింగ్ పేరుతో టైలరింగ్‌కి నూతన హంగులు అద్దారు. అంతేకాదు.. ఇదే ప్రస్తుతం నగరంలో ట్రెండ్‌గా నడుస్తోంది.. అసలేంటీ ఆన్లైన్ స్టిచ్చింగ్? అనుకుంటున్నారా.. అదేనండి.. మనకు వెసులుబాటు ఉన్న సమయంలో మనం బుక్ చేసుకున్న ప్రాంతానికే వచ్చి కొలతలు తీసుకుని నచ్చిన మోడల్స్‌లో స్టిచ్ చేసి ఇంటికే డెలివరీ ఇస్తారన్నమాట!కరోనా తర్వాత..మన అవసరాలే ఆవిష్కరణలకు మూలం అన్నట్లు.. కరోనా సమయంలో ఎంతోమందికి కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో అవసరాల ద్వారా కలిగిన.. అవకాశాలను పలువురు అందిపుచ్చుకున్నారు. ఆ ఆలోచనలను స్టార్టప్స్‌గా మలచి వ్యాపారంలో రాణిస్తున్నారు. చాలామందికి టైలరింగ్ అనగానే ఓ కుట్టు మెషీన్ పెట్టుకుని వచ్చిన వారికి బట్టలు కుట్టడం. కానీ కొందరు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు రాలేని వారు, గర్భిణులకు బట్టలు కుట్టించుకోవడం కష్టం అవుతుంది. అందుకే వారి కోసం ఆన్లైన్ టైలరింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కమాటలో సింపుల్‌గా చెప్పాలంటే క్లౌడ్ టైలరింగ్ అన్నమాట. దీనికే రకరకాల పేర్లు కూడా ఉన్నాయి.. ఆన్లైన్ స్టిచ్, కాల్ దర్జీ, మై టైలర్ ఇలా చాలా వరకూ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్స్ వినియోగదారులకు తమ సేవలను అందిస్తున్నాయి. అభిరుచికి అనుగుణంగా..మోడ్రన్, ట్రెండీ ఫ్యాషన్ డిజైన్స్‌ను ఈ తరం యువత ఎంతగానో ఇష్టపడుతోంది. సోషల్ మీడియాలో నిత్యం వైరల్‌గా మారే వినూత్న డిజైన్లను సైతం వ్యక్తిగతంగా రూపొందించుకోవడానికి ఈ క్లౌడ్ టైలరింగ్ వారధిగా మారింది. తమకు నచ్చిన డిజైన్ల ఫొటోలు లేదా సోషల్ మీడియా లింక్స్ ఈ ఆన్లైన్ టైలర్లకు షేర్ చేస్తే చాలు.. వారి సైజులకు తగినట్టుగా వారు కోరుకున్న ఫ్యాషన్ వేర్ ఇంటికొచ్చేస్తున్నాయి. అంతేకాకుండా అభిమాన సెలబ్రిటీలు ధరించినటువంటి ఫ్యాషన్ హంగులను అనుకరించాలనుకునే ఔత్సాహికులకు కూడా ఈ ఆన్లైన్ వేదిక స్వర్గధామంలా మారింది. ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ లాయర్ మాదిరిగా.. సెలబ్రిటీలకు పర్సనల్ డిజైనర్ మాదిరిగా.. మనకూ ఓ పర్సనల్ టైలర్ అనే చెప్పొచ్చు. అందుకే ఈ ఆన్లైన్ టైలరింగ్ ట్రెండ్‌గా మారుతోంది.సెలబ్రిటీలకు సౌలభ్యంగా..సినీతారలు, బుల్లితెర సెలబ్రిటీలు మొదలు ఈ మధ్య ఫేమస్ అవుతున్న సోషల్‌మీడియా సెలబ్రిటీలు ఎందరో. వీరు షాపింగ్ వెళ్లాలన్నా, బొటిక్స్లో స్టిచ్చింగ్ కోసం వెళ్లాలన్నా అక్కడి పరిస్థితులు సందడిగా మారతాయి. అంతేకాకుండా వారికి కూడా అభిమానుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదురౌతోంది. ఇలాంటి తరుణంలో ఈ ఆన్లైన్ స్టిచ్చింగ్ సెలబ్రిటీలకు సౌలభ్యంగా మారిందని పలువురు తారలు అభిప్రాయపడుతున్నారు. పేజ్ త్రీ పీపుల్ సైతం ఈ ఒరవడికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.డిజైనర్ డ్రెస్సులు సైతం..సోషల్ మీడియాలోనో లేదా సినిమాలోనో ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫాంలోనో.. లేదా నచ్చిన హీరో, హీరోయిన్ వేసుకున్న డ్రెస్ కావాలనిపిస్తే.. ఆ క్లిప్ తీసి ఆన్లైన్ టైలరింగ్‌కి పంపిస్తే.. సరిగ్గా అదే తరహాలో డెలివరీ ఇస్తారు. అయితే.. అలాంటి డ్రెస్ కావాలని దగ్గర్లోని టైలర్ దగ్గరికి వెళ్తే.. వారికి ఆ తరహా స్టిచ్చింగ్ రాకపోవచ్చు.. మరీ పెద్ద పెద్ద బొటిక్‌లకు వెళ్తే కాస్త డబ్బులు ఎక్కువ చెల్లించుకోవాల్సి రావచ్చు.. అసలు అలాంటివి ఎక్కడ ఉంటాయో కూడా తెలియకపోవచ్చు.. తెలిసినా దూరాభారం అవ్వొచ్చు.. అందుకే వీటన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం ఆన్లైన్ టైలరింగ్. మనకు నచ్చిన డిజైన్.. మనకు నప్పేలా.. మనకు ఫిట్ అయ్యేలా కుట్టిస్తారు. ఆన్లైన్లో ఎలా సాధ్యం?టైలరింగ్ అంటే మన శరీర కొలతలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆన్లైన్ ద్వారా ఎలా సాధ్యం అనే కదా డౌటు. ఆన్లైన్లో మనకు కావాల్సిన డిజైన్ డ్రెస్, జాకెట్, కుర్తా ఇలా ఇంకేదైనా సరే.. ఆర్డర్ పెడితే చాలు. మన ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ల స్టోర్ నుంచి ఓ వ్యక్తి వచ్చి కొలతలు తీసుకుంటారు. ఆ తర్వాత అన్ని పనులు చకచకా చేసేస్తారు. మనకు నచ్చిన డ్రెస్.. చెప్పిన టైంలో మన ఇంటికి వచ్చేస్తుంది. ఇందు కోసం కొలతలు తీసుకునేందుకు లోకల్ టైలర్స్‌తో ఒప్పందం చేసుకోవడం.. లేదా సిబ్బందిని నియమించుకోవడం చేస్తారు. లేని పక్షంలో కస్టమర్లు అందించిన సైజులకు అనుగుణంగా వారు కోరుకున్న డిజైన్లను రూపొందించి పంపిస్తారు. -
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ బంద్!
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి మంగళం పాడాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ దిశగా స్పష్టమైన వ్యాఖ్యలతో సంకేతాలిచ్చారు.రేషన్ డోర్ డెలివరీ కోసం కొన్న వాహనాల వల్ల కార్పొరేషన్‌పై రూ.1,500 కోట్ల భారం పడింది. అన్ని వర్గాలతో చర్చించి ఒక నివేదిక సిద్ధం చేస్తాం. కేబినెట్లో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.కాగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. జనవరి 21, 2021 పౌరసరఫరాల శాఖ పరిధిలో రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారాయన. -
అమ్మకాల్లో ఆన్‌లైన్‌దే హవా..
కోల్‌కతా: కొద్దిరోజులపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను నిలువరించిన కోవిడ్–19 శకం ముగిసినప్పటికీ ఆన్లైన్ సర్విసులకు డిమాండ్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం నిలిచిపోవడంతో ఊపందుకున్న ఆన్లైన్ ట్రెండ్ తదుపరి దశలో మరింత ఊపందుకుంది. ప్రజలు తమ అవసరాల కోసం ఆఫ్‌లైన్ స్టోర్లకంటే ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. దీంతో ఆన్లైన్ అమ్మకాలు ఆఫ్‌లైన్ స్టోర్లను మించి నమోదవుతున్నట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థల తాజా నివేదిక పేర్కొంది. నీల్సన్ఐక్యూ, జీఎఫ్కే ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక వివరాలు చూద్దాం.. డోర్ డెలివరీ ఎఫెక్ట్ కరోనా తదుపరి లాక్డౌన్లు ఎత్తివేయడంతోపాటు.. అన్ని రకాల ఆంక్షలనూ ప్రభుత్వం తొలగించింది. అయినప్పటికీ వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు ఇటీవల జనంలోకి చొచ్చుకుపోయిన సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. దీంతో ఫిజికల్‌గా స్టోర్ల సందర్శనకంటే ఈకామర్స్వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కాలంలో జోరందుకున్న డోర్ డెలివరీ వ్యవస్థ రానురాను బహుముఖాలుగా విస్తరించింది. ఫలితంగా నిత్యావసరాలు మొదలు విచక్షణ ప్రకారం కొనుగోళ్లు చేపట్టే వస్తువుల విషయంలోనూ ఆన్‌లైన్‌కే ఓటు వేస్తున్నారు. భారీ వృద్ధి బాటలో లాక్డౌన్ రోజుల్లో కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్ తదితర నిత్యావసరాల కోసం కాంటాక్ట్‌లెస్ డోర్ డెలివరీలకు అలవాటుపడిన ప్రజలు తదుపరి కాలంలో టీవీ సెట్ల దగ్గర్నుంచి ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు తదితర వినిమయ వస్తువులను సైతం ఈ కామర్స్ సైట్ల ద్వారా కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ లాక్డౌన్ రోజులకుమించి కనిపిస్తోంది. ప్రధానంగా మెట్రో నగర ప్రాంతాలలో ఈకామర్స్ ద్వారా కొనుగోళ్లు భారీగా ఎగశాయి. ఇంటినుంచే కొనుగోలు చేయగలగడం, డోర్‌డెలివరీ సౌకర్యం, విభిన్న ప్రొడక్టుల అందుబాటు తదితర సానుకూలతలు కీలకపాత్రను పోషిస్తున్నాయి. ఫ్రాస్ట్ఫ్రీ ఫ్రిజ్‌లు, 55 అంగుళాలకుమించిన టీవీలు వంటి ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు 2023లో రెట్టింపయ్యాయి. కాగా, గతేడాదిలో ఎఫ్ఎంసీజీ విభాగ అమ్మకాలు అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే ఊపందుకున్నాయి. -
రొయ్యలు డోర్ డెలివరీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రొయ్యల వినియోగం పెంచేందుకు ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఎగుమతులకే పరిమితమైన ఎక్స్పోర్ట్ క్వాలిటీ రొయ్యలను ఇక నేరుగా వినియోగదారుల చెంతకు చేర్చాలని సంకల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ ప్రక్రియను అమలుచేసేందుకు ఏపీ రొయ్య రైతుల ఫెడరేషన్ సైతం ముందుకొచ్చింది. సాధారణంగా.. స్థానికంగా సాగై మార్కెట్లోకి వచ్చే 80–120 కౌంట్ రొయ్యలు కాకుండా మిగిలిన కౌంట్ రొయ్యలు వివిధ రూపాల్లో ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ హైకౌంట్ రొయ్యలను కూడా వివిధ రూపాల్లో డోర్ డెలివరీ చేయనున్నారు. ఇందులో భాగంగా.. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలుచేస్తున్నారు. ఆ తర్వాత డిమాండ్ ఆధారంగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, పట్టణ ప్రాంతాలకు ఈ విధానాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో సగటు వినియోగం 1.5 కిలోలే.. రొయ్యల వినియోగంలో ప్రపంచంలో చైనా నంబర్–1 అని చెప్పాలి. ఇక్కడ సగటున ప్రతిఒక్కరూ ఏటా 10–12 కిలోల రొయ్యలు తింటారు. అమెరికాలో 8–10 కిలోలు.. యూరోపియన్ దేశాల్లో 8 కిలోలకు పైగా తీసుకుంటారు. కానీ, రొయ్యల ఉత్పత్తిలో రారాజుగా ఉన్న మనదేశంలో మాత్రం వీటి వినియోగం సగటున 800 గ్రాములకు మించడంలేదు. అలాగే, రొయ్యల సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో నెం.1గా ఉన్న మన రాష్ట్రంలో ఇది 1.5 కిలోలు మాత్రమే. ఈ నేపథ్యంలో.. రొయ్యల తలసరి వినియోగం పెంచడమే లక్ష్యంగా ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రాన్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ వాటిలో ఉండే పోషకాలపై విస్తృత ప్రచారం చేస్తూనే మరోవైపు ఎక్స్పోర్ట్ క్వాలిటీ రొయ్యలను సామాన్య వినియోగదారులకూ అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ కౌంట్ రొయ్యలకు విదేశాల్లో గిరాకీ.. సాధారణంగా.. 20–60 కౌంట్ రొయ్యలు స్థానిక మార్కెట్లలో పెద్దగా అందుబాటులో ఉండవు. ఇవన్నీ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రధానంగా హోల్ష్రింప్స్ (ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండా తల, తోక భాగాలతో సహా), హెడ్‌లెస్ షెల్ఆన్ (తలభాగం తీసినవి), పీల్డ్ టేల్ఆన్ (పూర్తిగా వలిచిన రొయ్యపప్పు), పీల్డ్ డీవియండ్ టేల్ఆన్ (తల, షెల్, శరీరంలోని భాగాలను తీసివేసి), బటర్‌ఫ్లై టేల్ఆన్ (తల, ఇతర వ్యర్థపదార్థాలను తీసేసి తోకతో సహా బటర్‌ఫ్లై ఆకారంలో కట్ చేస్తారు), బటర్‌ఫ్లై టేల్ఆఫ్ (తల, తోక, ఇతర వ్యర్థపదార్థాలను తీసేసి బటర్‌ఫ్లై ఆకారంలో కట్ చేస్తారు) రూపాల్లో విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. నెలరోజులకు పైగా నిల్వ ఉండేలా.. రొయ్యల దేశీయ వినియోగం పెంచేందుకు వండుకోవడానికి సిద్ధంగా ఉన్న వనామీ రొయ్య పప్పును విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఎగుమతి చేసేందుకు ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో అదే రీతిలో పూర్తిస్థాయిలో ప్రాసెస్ చేసిన రొయ్యలను కనీసం నెలరోజులకు పైగా నిల్వ ఉండేటట్లుగా వివిధ రూపాల్లో ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో సరఫరా చేయనున్నారు. సాధారణంగా ప్రాసెస్ చేసిన కిలో రొయ్య పప్పు అంటే 800 గ్రా. పప్పు, 200 గ్రా. ఐస్‌తో ఉంటుంది. కానీ, ఐస్‌తో సంబంధం లేకుండా రొయ్యపప్పు నికర బరువు ఆధారంగానే ధర చెల్లించే ఏర్పాటుచేశారు. పైగా ఏరోజుకారోజు వలిచిన పప్పునే డోర్ డెలివరీ చేస్తారు. ముందుగా వీటిని ప్రయోగాత్మకంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉచితంగా డోర్ డెలివరీ చేస్తారు. ఆ తర్వాత ఇతర నగరాలు, పట్టణాలతో పాటు రవాణా సౌకర్యం ఉన్న అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఇలా ఆర్డర్‌పై సప్లైచేసే రొయ్యపప్పు ధరలను కౌంట్, క్వాంటిటీ, వెరైటీ, దూరాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఆర్డర్‌పై రెండ్రోజుల వ్యవధిలో ఎంత పరిమాణం కావాలన్నా సరఫరా చేస్తారు. మరోవైపు.. రొయ్యలతో పాటు అందుబాటులో ఉండే అన్ని రకాల చేపలను కూడా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యం.. రొయ్య కౌంట్‌ను బట్టి కిలో రూ.600 నుంచి రూ.850 ధరగా నిర్ణయించారు. మార్కెట్ రేటు హెచ్చుతగ్గులను బట్టి ధరల్లో మార్పులుంటాయి. అదే 20 కిలోలకు పైబడి ఆర్డర్లకు కిలోకు రూ.50 నుంచి రూ.100 వరకు డిస్కౌంట్ ఇస్తాం. ఆర్డర్ ఇవ్వాలనుకునే వారు ఫెడరేషన్‌కు చెందిన: 9661664779లో ఆర్డర్ ఇవ్వొచ్చు. ముఖ్యంగా.. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేస్తున్నాం. – జీవీ సుబ్బరాజు, ప్రధాన కార్యదర్శి, ఏపీ రొయ్య రైతుల సమాఖ్య -
ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్!
ఆధునిక కాలంలో ఫుడ్, కూరగాయలు వంటి వస్తువులను డోర్ డెలివరీ పొందుతున్నారు. వీటి కోసం ప్రస్తుతం అనేక సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఫ్యూయెల్ (పెట్రోల్ అండ్ డీజిల్) కూడా డోర్ డెలివరీ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ప్రస్తుతం దేశంలో స్టార్టప్ కల్చర్ పెరిగిపోతోంది. కొత్త ఆలోచనలతో సరికొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. స్విగ్గి, జొమాటో తరహాలోనే వాహన వినియోగదారులకు అవసరమైన పెట్రోల్ డోర్ డెలివరీ చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఒక భార్యాభర్తల జంట (చేతన్ వాలుంజ్ & అదితి భోసలే) రెపోస్ ఎనర్జీ (Repos Energy) ప్రారంభించారు. రెపోస్ ఎనర్జీ పెళ్లి తరువాత ఎలాగైనా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనతో అదితి, చేతన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అనుకున్నట్లుగానే సంస్థను పూణేలో ప్రారంభించారు. ప్రస్తుతం ఇది భారతదేశం మొత్తం మీదే సుమారు 65 నగరాల్లో విస్తరించి ఉంది. డోర్ టు డోర్ పెట్రోల్ డెలివరీ చేసి బాగా ఆర్జిస్తున్నారు. రెపోస్ ఎనర్జీ ద్వారా వినియోగదారులకు, కంపెనీలకు పెట్రోల్ సరఫరా చేసి నెలకు రూ. 2.2 కోట్లు వరకు సంపాదిస్తున్నారు. ప్రారంభంలో వీరి ఆదాయం నెలకు రూ. 70,000 మాత్రమే. ఈ జంట చేస్తున్న బిజినెస్ చాలామంది పెద్ద పారిశ్రామిక వేత్తలను కూడా ఆకర్శించింది. వీరి కొత్త ఆలోచనకు ముగ్దుడైన రతన్ టాటా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు. దీంతో వారి బిజినెస్ మరింత వేగంగా ముందుకు వెళ్లడం ప్రారంభించింది. గతేడాది వీరి ఆదాయం రూ. 65 కోట్లకు చేరింది. ప్రస్తుతం కంపెనీ విలువ రూ. 200 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. రెపోస్ ఎనర్జీ ప్రస్తుతం టాటా గ్రూప్‌తో మాత్రమే కాకుండా.. మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ ఎలక్ట్రికల్, లార్సెన్ & టబ్రో, షిండ్లర్, జేడబ్ల్యు మారియట్ హోటల్, ఫీనిక్స్ మాల్, ది వెస్టిన్ హోటల్ వంటి సంస్థలతో కూడా ఒప్పందాలను కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి.. మరింత లాభాలు పొందటానికి సంస్థ సన్నద్ధమవుతోంది. -
హైదరాబాద్‌లో ఇక ఇంటి వద్దకే ఇంధనం!
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరి జ్ఞానం అందు బాటులోకి రావడంతో వినియోగ దారులకు కావాల్సిన ఆహా రం, కూరగాయలు, గృహోపకరణాలు తదితర వస్తువులన్నీ ఇంటి ముంగిటే వాలిపోతున్నాయి. ఇదేవిధంగా హైదరాబాద్‌లో డీజిల్, పెట్రోల్ కూడా ఇంటి వద్దకే రానున్నాయి. మొబైల్ యాప్ సహా యంతో గోఫ్యూయెల్ ఇండియా అనే సంస్థ ఇంటి వద్దకే డీజిల్, పెట్రోల్‌ను సరఫరా చేయనున్నాయి. శుక్రవారం గోఫ్యూయెల్ ఆధ్వర్యంలో ఫ్రాంచైజీ భాగస్వాములైన హెచ్‌పీసీఎల్ సీజీఎం హరిప్రసాద్ సింగు పల్లి, సుస్మిత ఎంటర్‌ప్రైజెస్‌తో కలిసి తమ కార్యకలాపాలను ఆవిష్కరించారు. సంస్థ కోఫౌండర్ ఆదిత్య మీసాల మాట్లా డుతూ.. ఇప్పటికే ఈ సేవలు చెన్నైలో అందుబాటులోకి వచ్చాయన్నారు. విని యోగదారులు యాప్‌లో ఆర్డర్ చేస్తే ఇంధనాన్ని వారు కోరుకున్న చోటుకు అందిస్తామని తెలి పారు. జూలై–సెప్టెంబర్‌లో గువాహటి, సేలంలో కార్యకలా పాలను ప్రారంభిస్తామని, 2024 నాటికి దేశమంతటా 1,000 వాహనాలతో విస్తరించడానికి ప్రణాళికలు రూపొం దించామని చెప్పారు. అపార్ట్మెంట్లు, పరిశ్రమలు, ఆసు పత్రులు, మాల్స్, బ్యాంకులు, గిడ్డంగులు తదితర స్థలా లకూ సరఫరా చేస్తామన్నారు. -
సంక్షేమ స్ఫూర్తి.. పంజాబ్‌లోనూ ఏపీ తరహా పథకం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇంటి వద్దకే రేషన్ పంపిణి చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి వేచి చూసే ఇబ్బందులు ఉండవని, ఒక్క ఫోన్ కాల్‌తో రేషన్ సరుకులు లబ్దిదారుల ఇంటి ముందు ఉంటాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు. చదవండి: స్టీల్‌ప్లాంట్‌పై విజయసాయిరెడ్డి కీలక ప్రసంగం -
సచివాలయాల్లోనూ ఇసుక బుకింగ్
సాక్షి, అమరావతి: ఇసుక రవాణాను మరింత సులభతరం చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇసుక డోర్ డెలివరీకి ఇది బాగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు ఈ బుకింగ్ బాధ్యతను అప్పగించారు. వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో డబ్బు కడితే అక్కడి నుంచే చలానా వస్తుంది. ఆ తర్వాత ఇచ్చిన అడ్రస్‌కు ఇసుకను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే అమ్మకాలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఆంధ్రా శ్యాండ్ పేరుతో వెబ్ పోర్టల్ www. andhrasand.com మొబైల్ యాప్ andhrasand app ద్వారా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆఫ్‌లైన్ విధానంలో రవాణా చేసే వ్యక్తులు మధ్యవర్తులుగా మారి ఎక్కువ రేటుకు ఇసుక విక్రయిస్తుండడంతో ఆన్లైన్ డోర్ డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు (ఆదివారం, సెలవులు మినహా) మ.12 గంటల నుండి సా.6 గంటల వరకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. రీచ్, డిపో నుండి 20 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం ఉన్న బుకింగ్‌కు డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే, రాష్ట్రంలో ఎక్కడి ఇసుకనైనా ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానాన్ని తీసుకువచ్చారు. బుకింగ్ ఇలా.. ► సాధారణ వినియోగదారుడు మొబైల్ నెంబర్‌తో, బల్క్ వినియోగదారుడు మొబైల్, ఈ–మెయిల్, పాన్, జీఎస్టీ నెంబర్‌తో ఇసుకను బుక్ చేసుకోవాల్సి వుంటుంది. ► డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ విధానంలో ఆన్లైన్లోనే డబ్బు చెల్లించే ఏర్పాటుచేశారు. ► డిపోలో ఇసుక లోడ్ చేసిన తర్వాత వినియోగదారునికి జీపీఎస్ నావిగేషన్ ప్రారంభమవుతుంది. బుక్ చేసినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు రవాణా చేసే వాహనాన్ని ట్రాక్ చేస్తారు. వెబ్ పోర్టల్, యాప్, కస్టమర్ కేర్ కాల్ సెంటర్ ద్వారా కూడా వినియోగదారులు బుకింగ్ ఆర్డర్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. ► ఏమైనా ఇబ్బందులు వస్తే కస్టమర్ కేర్ కాల్ సెంటర్ 9700009944కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. బుక్ చేసుకున్న రోజే డెలివరీ ప్రస్తుతం 147 డిపోలు, 215 రీచ్‌లలో ఇసుక విక్రయాలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలు జరుగుతాయి. పీక్ స్టేజ్‌లో ఇది కోటిన్నర క్యూబిక్ మీటర్లు ఉంటుంది. గతంలో బుక్ చేసుకున్న రెండు, మూడు రోజులకు ఇసుక వచ్చేది. కానీ, ఇప్పుడు బుక్ చేసుకున్న రోజే డెలివరీ చేస్తున్నారు. అలాగే, నియోజకవర్గాల వారీగా ఇసుక రేట్లను ఇప్పటికే ప్రకటించారు. రీచ్‌లు, డిపోల వద్ద ధరల పట్టిక, హోర్డింగ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. మధ్యవర్తులు ఎక్కువ రేటుకి అమ్మకుండా ఈ చర్యలు చేపట్టారు. బ్లాక్ మార్కెటింగ్‌ను సహించం వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరసమైన రేటుకు, నాణ్యమైన ఇసుకను సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండూ విధానాలు పెట్టాం. మధ్యవర్తులు ఎక్కువ రేటుకు అమ్మకుండా చూసేందుకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఇసుక బ్లాక్ మార్కెటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోను సహించం. ఫలానా రీచ్‌లోనే బుక్ చేసుకోవాలనేది లేదు. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎటువంటి ఆంక్షల్లేవు. వినియోగారులకు ఇంకా సులభంగా ఇసుకను అందించేందుకు ప్రయత్నిస్తాం. – వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ -
ఏపీ: ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు రేపటి నుంచే..
-
ఏపీ: ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు రేపటి నుంచే..
సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్ కారణంగా ఆర్టీసీకి ప్రజారవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే భాగంగా కార్గో సేవలు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వీటిని ప్రజలు ఎక్కువగా వినియోగించుకోవడంతో మంచి లాభాలు వస్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే గుంటూరు జిల్లా పరిధిలో కొరియర్ సర్వీసు ద్వారా వచ్చే ఆదాయం 75 శాతం పెరిగింది. మరింత ఆదాయం పొందడంలో భాగంగా కార్గో రవాణాను డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కార్గో డోర్ డెలివరీ అందిస్తున్న ప్రైవేటు కొరియర్ సంస్థలకు భిన్నంగా మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో రోజుకు రూ.3 లక్షల ఆదాయం సాధించడం లక్ష్యంగా సెప్టెంబర్ 1 నుంచి కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. రేపటి నుంచి.. ఆర్టీసీ కొరియర్ సేవలను ఇళ్లకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తొలుత పైలెట్ ప్రాజె క్టుగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరంలో డోర్ డెలివరీ సేవలు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తేవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ పార్శిళ్లను ఇతర ప్రాంతాలకు పంపాలన్నా.. వచ్చిన వాటిని తీసుకెళ్లాలన్నా బస్టాండ్‌లోని కొరియర్ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. ఇకపై వినియోగదారులు అందరూ తమ ఇళ్ల వద్దే సేవలు పొందడానికి అవకాశం ఏర్పడింది. డోర్ డెలివరీని ప్రస్తుతానికి బుకింగ్ ఏజెంట్ కాంట్రాక్టర్లే చేయనున్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్లలోని స్టోరేజీ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. తద్వారా జవాబుదారీతనం పెరగనుంది. ఇక పార్శిళ్లకు ట్రాకింగ్ సదుపాయం ఏర్పాటు చేయనుంది. దాంతో బుక్ చేసిన పార్సిల్ ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. బీమా సదుపాయం కల్పిస్తోంది. పొరపాటున పార్శిల్ కనిపించకుండా పోతే ఖాతాదారులకు ఈ మేరకు పరిహారం లభిస్తుంది. పెరుగుతున్న ఆదాయం... జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు హైదరాబాద్, బెంగళూరుకు ప్రస్తుతం కొరియర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రసిద్ధి చెందిన చేనేత, వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు, ఆటో మొబైల్ పరికరాలు, చిన్నతరహా పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులు తదితరాలు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకుంటున్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతోంది. గతేడాది ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో రూ.98.28 లక్షల ఆదాయం వస్తే ఈ ఏడాది అదే సమయంలో రూ.172.17 లక్షలకు పైగా సమకూరింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా కార్గో కొంత వరకుఆ నష్టాన్ని భర్తీ చేస్తోంది. అందుకే సేవలను మరింత విస్తృతం చేయాలన్న లక్ష్యంతో డోర్ డెలివరీని కూడా అందుబాటులోకి తేవడానికి సిద్ధమయ్యారు. రోజుకు రూ.3 లక్షల ఆదాయమే లక్ష్యం సెప్టెంబర్ 1 నుంచి ఇంటింటికీ కార్గో సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తొలుత నగరం నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో 10 కేజీల వరకు డోర్ డెలివరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. విడతల వారీగా చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకూ అందించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. డోర్‌డెలివరీ సేవలను కూడా వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఆర్టీసీకి కార్గో ద్వారా ప్రస్తుతం సరాసరి రోజుకు రూ.2 లక్షల ఆదాయం వస్తోంది, దీన్ని రూ.3 లక్షలకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – ఎస్టీపీ రాఘవ కుమార్, ఆర్ఎం, గుంటూరు -
ఇక ఇంటికే ఆర్టీసీ పార్సిళ్లు!
సాక్షి, అమరావతి: ఆర్టీసీ తమ సేవల పరిధిని మరింత విస్తృతం చేస్తోంది. లాజిస్టిక్స్ సేవల ద్వారా ఆదాయ పెంపుదలపై దృష్టి సారించింది. అందులో భాగంగా కార్గో రవాణాను డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం కార్గో డోర్ డెలివరీ అందిస్తున్న ప్రైవేటు కొరియర్ సంస్థలకు భిన్నంగా మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. రోజుకు రూ.50 లక్షల ఆదాయం సాధించడం లక్ష్యంగా సెప్టెంబర్ 1 నుంచి కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. వ్యవస్థాగత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ... 2017 నుంచి ఆర్టీసీ అందిస్తోన్న కార్గో రవాణా సేవల విధానం ప్రకారం ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు వచ్చి పార్సిల్ బుక్ చేసుకుంటే గమ్య స్థానానికి చేరుస్తుంది. అక్కడ సంబంధిత వ్యక్తులు వచ్చి ఆ పార్సిళ్లను తీసుకువెళ్లాలి. కాగా కార్గో రవాణా పార్సిళ్లను గమ్యస్థానంలో డోర్ డెలివరీ చేసే విధానాన్ని ప్రవేశపెడితే మార్కెట్‌ను మరింత విస్తృతం చేసుకోవచ్చని ఆర్టీసీ భావించింది. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా బస్ స్టేషన్లు, డిపోలు, ఇతర వ్యవస్థాగత సామర్థ్యం ఉంది. ప్రస్తుతం కార్గో రవాణా కోసం ఆర్టీసీ 10 టన్నుల బరువు సామర్థ్యం ఉన్న కంటైనర్లను ఉపయోగిస్తోంది. ఈ వ్యవస్థాగత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలు అందించాలని నిర్ణయించింది. ప్రైవేటు సంస్థల కంటే ఆర్టీసీ తక్కువ చార్జీలతో మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. అందుకే కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలపై మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసి ఓ ప్రాజెక్టు నివేదిక రూపొందించింది. ప్రైవేటు సంస్థల కంటే మెరుగ్గా... కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలు మెరుగ్గా అందించేందుకు ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆర్టీసీ బస్ స్టేషన్లలోని స్టోరేజీ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. తద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందిస్తోంది. ఇక పార్సిళ్లకు ట్రాకింగ్ సదుపాయం ఏర్పాటు చేయనుంది. దాంతో బుక్ చేసిన పార్సిల్ ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. బీమా సదుపాయం కల్పిస్తోంది. పొరపాటున పార్సిల్ కనిపించకుండా పోతే ఖాతాదారులకు ఈ మేరకు పరిహారం లభిస్తుంది. నగరాలు, పట్టణాలతోపాటు మారుమూల పల్లెలకు కూడా ఏజంట్ల ద్వారా డోర్ డెలివరీ సేవలు అందించేందుకు కార్యాచరణ చేపట్టింది. రోజుకు రూ.50 లక్షల రాబడి లక్ష్యం లాజిస్టిక్ సేవల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే దిశగా ఆర్టీసీ కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. కార్గో రవాణా ద్వారా ఆర్టీసీకి 2019–20లో రూ.97.44 కోట్ల రాబడి వచ్చింది. లాక్డౌన్, ఇతర ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ 2020–21లో లాజిస్టిక్ సేవల ద్వారా రూ.87.24 కోట్లు రాబడి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాటిలో పార్సిల్ సర్వీసుల ద్వారా రూ.46.42 కోట్లు, కొరియర్ సేవల ద్వారా రూ.1.78 కోట్లు, బల్క్ బుకింగ్‌ల ద్వారా రూ.0.53 కోట్లు, కాంట్రాక్టు వాహనాల ద్వారా రూ.17.31 కోట్లు, ఏజెన్సీ సేవల ద్వారా రూ.21.20 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం రోజుకు సగటున 18 వేల పార్సిల్ బుకింగుల ద్వారా ఆర్టీసీకి రోజుకు రూ.32 లక్షల రాబడి వస్తోంది. కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలు ప్రవేశపెట్టడం ద్వారా పార్సిల్ బుకింగులను రోజుకు 32 వేలకు పెంచుకోవాలని...తద్వారా రోజుకు రూ.50 లక్షల రాబడి సాధించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఇంటి వద్దకు డీజిల్ బల్క్ డెలివరీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) తాజాగా ముంబై, పరిసర ప్రాంతాల్లో ఇంటి వద్దకే బల్క్‌గా డీజిల్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఇందుకోసం యాప్ ఆధారిత డీజిల్ డోర్ డెలివరీ సేవల సంస్థ హమ్‌సఫర్ ఇండియా, ఒకారా ఫ్యూయెలాజిక్స్తో చేతులు కలిపింది. త్వరలో మహారాష్ట్రలోని పుణె, నాగ్‌పూర్, నాసిక్ తదితర నగరాలకు ఈ సర్వీసులు విస్తరించనున్నట్లు ఐవోసీ చీఫ్ జనరల్ మేనేజర్ (మహారాష్ట్ర ఆఫీస్) రాజేశ్ సింగ్ తెలిపారు. డీజిల్ పంపిణీలో ఇదొక వినూత్న విధానమని ఆయన వివరించారు. వ్యవసాయ రంగం, ఆస్పత్రులు, హౌసింగ్ సొసైటీలు, భారీ యంత్రాల కేంద్రాలు, మొబైల్ టవర్లు మొదలైన వాటికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇప్పటిదాకా భారీ మొత్తంలో డీజిల్ కొనుక్కునే (బల్క్) వినియోగదారులు బ్యారెళ్లలో రిటైల్ అవుట్లెట్ల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేదని సింగ్ తెలిపారు. దీని వల్ల గమ్యస్థానానికి చేరేలోగా డీజిల్‌లో కొంత భాగం కారిపోవడం తదితర సమస్యల వల్ల నష్టపోవాల్సి వచ్చేదని ఆయన వివరించారు. డీజిల్ డోర్ డెలివరీతో ఇలాంటి సమస్యలను పరిష్కరించవచ్చని, బల్క్ కస్టమర్లకు చట్టబద్ధంగా డీజిల్ సరఫరా సాధ్యపడుతుందని సింగ్ పేర్కొన్నారు. -
డీజిల్ డోర్ డెలివరీ... ఎప్పుడు? ఎక్కడ?
ఢిల్లీ: వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డీజిల్ డోర్ డెలవరీ స్కీంని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అమల్లోకి తెచ్చింది. ఢిల్లీకి చెందిన స్టార్టప్ సంస్థతో కలిసి సేఫ్20 పేరుతో డీజిల్ డోర్ డెలివరీ చేస్తోంది. 20 లీటర్ల క్యాన్ ఢిల్లీ కేంద్రంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో 20 లీటర్ల జెర్రీ క్యాన్లను ఢోర్ డెలివరీగా బీపీసీఎల్ అందిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న హమ్ సఫర్ సంస్థతో బీపీసీఎల్ టై అప్ అయ్యింది. 20 లీటర్ల సామర్థ్యం కల జెర్రీ క్యాన్లలో డీజిల్‌ని డోర్ డెలివరీ చేస్తోంది. డోర్ డెలివరీ కావాలంటే కనీసం 20 లీటర్లు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఉపయోగకరం డోర్ డెలివరీ పథకం వల్ల అపార్ట్మెంట్లు, సెల్‌ఫోన్ టవర్లు, షాపింగ్ కాంప్లెక్సులు, హాస్పటిల్స్, బ్యాంకులు, కన్స్ట్రక్షన్ సైట్లు, హోటళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బీపీసీఎల్ అంటోంది. గతంలో డీజిల్ కావాలంటే పెట్రోల్ పంప్‌కు రాక తప్పని పరిస్థితి నెలకొని ఉండేది. పైగా ఫ్యూయల్ స్టేషన్ నుంచి డీజిల్ రవాణా చేయడం ప్రయాసతో కూడిన వ్యవహరం. మార్గమధ్యంలో డీజిల్ ఒలకడం సర్వ సాధారణంగా జరిగేది. అయితే తాజా డోర్ డెలివరీతో ఈ కష్టాలు తీరనున్నాయి. ఇంటి వద్దకే డీజిల్ తెప్పించుకుని జనరేటర్, లిఫ్టు, క్రేన్లు, భారీ యంత్రాలు తదితర అవసరాలకు సులభంగా ఉపయోగించవచ్చు. మొదట అక్కడే గతంలో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేవ్, ఉత్తరఖండ్ ప్రాంతాల్లో ఈ డోర్ డెలివరీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టగా మంచి ఫలితాలు వచ్చాయి. ఊరికి దూరంగా కొండ ప్రాంతాల్లో ఉండే హోటళ్లు, రిసార్టులకు ఈ స్కీం చాలా ప్రయోజనకారిగా మారింది. ఆ తర్వాత వ్యవసాయ అవసరాలు ఎక్కువగా ఉండే పంజాబ్, హర్యానాల్లోనూ అమలు చేశారు. దేశమంతటా డీజిల్ డోర్ డెలివరీని మొదటగా అమలు చేసిన నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని ఈ సారి డిమాండ్ ఎక్కువగా ఉండే ఢిల్లీలో డీజిల్ డోర్ డెలివరీని అమల్లోకి తెచ్చారు. ఇక్కడ సానుకూల ఫలితాలు వస్తే క్రమంగా దేశమంతటా విస్తరించనున్నారు. -
కొంపముంచిన ఆన్లైన్ లిక్కర్.. దెబ్బకు రూ. 70,000
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో మద్యం ఆర్డర్ పెట్టి రూ. 70,000 మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. అనురాగ్ ప్రశాంత్ వ్యాపారం నిమిత్తం జూన్ 14న హైదరాబాద్‌కు వచ్చి, బంజారా హిల్స్‌లోని రోడ్ నెం.1 లో స్టార్ హోటల్లో దిగాడు. అయితే మద్యం డోర్ డెలివరీ కోసం జూన్ 20న ఆన్లైన్లో వెతికాడు. ఈ క్రమంలో గూగుల్‌లో కనిపించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నెంబర్‌కి ఫోన్ చేసి మందు కావాలని అడిగాడు. అనురాగ్ చెప్పన వివరాల ప్రకారం.. అతడు ఉండే హోటల్‌కు మద్యం తీసుకువస్తానని మోసగాడు నమ్మించాడు. దీని కోసం ముందుగానే డబ్బులు చెల్లించాల్సిందిగా కోరాడు. ఈ క్రమంలో అనురాగ్ తన బ్యాంక్ ఖాతా, క్రెడిడ్ కార్డు, ఫోన్‌కి వచ్చిన ఓటీపీ వివరాలను మోసగాడితో పంచుకున్నాడు. అంతే అతని ఖాతా నుంచి రెండు విడతలుగా రూ.70,000 డెబిట్ అయ్యింది. వెంటనే అదే నెంబర్‌కు ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన అనురాగ్ ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: దేశంలో 50 వేల దిగువన కరోనా కేసులు -
పిజ్జా డెలివరీ ఓకే.. రేషన్ నాట్ ఓకేనా?
న్యూఢిల్లీ: ఇంటింటికి రేషన్ డెలివరీ పథకానికి కేంద్రం మోకాళ్లు అడ్డుపెడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఢిల్లీ అంటే ఎందుకంత ద్వేషం’’ అంటూ శనివారం ఆయన ఘాటుగానే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాజాగా ఈ ఉదయం ఆయన మరోసారి ఆరోపణలకు దిగారు. రేషన్ మాఫియా కోసమే కేంద్రం తమ ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుపడుతుందని కామెంట్లు చేశారాయన. ‘‘ఇదొక విప్లవాత్మకమైన పథకం. డెబ్భై రెండు లక్షల మంది రేషన్‌దారులకు లబ్ధి చేకూర్చే విధానం. కానీ, సరిగ్గా రెండు రోజుల అమలుకు ముందే కేంద్రం అడ్డుతగిలింది. కరోనా టైంలో ఇంటింటికి పిజ్జా డెలివరీకి అనుమతులు ఉన్నప్పుడు.. రేషన్‌ను ఎందుకు డెలివరీ చేయనివ్వరు?’’ అని ఆయన కేంద్రానికి ప్రశ్న సంధించారు. దీనిని బట్టే రేషన్ మాఫియా ఎంత బలంగా ఉందో, అది కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం డిజిటల్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ప్రసగించిన ఆయన.. ఈ పథకం అమలుకు తమ దగ్గర అనుమతులు తీసుకోలేదని కేంద్రం చెబుతోందని, కానీ, చట్టపరంగా ఆ అవసరం లేకున్నా.. ఐదుసార్లు అననుమతులు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ‘‘కరోనా టైంలో సాయం అందించకుండా రాష్ట్రాలతో కేంద్రం రాజకీయాలుచేస్తోంది. రేషన్ అనేది ఓ పార్టీకో, ఏ నేతకో చెందింది కాదు. సాధారణ ప్రజానీకానికి ఉన్న హక్కు అది. చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి ఈ పథకాన్ని ప్రారంభించనివ్వండి. కావాలంటే క్రెడిట్ మొత్తం మీకే ఇస్తా’’ అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి కేజ్రీవాల్ కామెంట్లు చేశారు. కేసు ఉందనేనా? కాగా, ప్రైవేట్ డీలర్లలతో ఇంటింటికి రేషన్ సరఫరా పథకం అమలు చేయడం వద్దంటూ శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫైల్‌ను తిరిగి పంపించాడని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. అయితే ఈ విషయంలో ఆప్ సర్కార్ ఆరోపణలను కేంద్రం నిరాధారమైనవని చెబుతోంది. ఆ ఫైల్‌ను కేంద్రం ఆమోదించకపోవడం ఒక్కటే కారణం కాదని, కోర్టులో కేసు నడుస్తుండడం కూడా మరో కారణమని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ ఆ పథకానికి సంబంధించిన ఫైల్‌ను పున:పరిశీలన కోసమే ఢిల్లీ సీఎంకు పంపారని తెలుస్తోంది. ఎన్నికల హామీలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటిక ఇంటికి రేషన్ సరఫరా పథకాన్ని అమలు చేయాలనుకుంటోంది. మరోవైపు బీజేపీ మాత్రం కేజ్రీవాల్ సానుభూతి నాటకాలు ఆడుతున్నాడని ఆరోపిస్తోంది. చదవండి: ఇంటికి రేషన్.. ఇక్కడ తొలగిన అడ్డంకి -
YS Jagan: ధాన్యం సేకరణకు 'భరోసా'
ఏ విత్తనం వేస్తే బాగుంటుంది? ఏది సాగు చేస్తే పంట కొనుగోలు చేస్తారన్నది రైతులకు వ్యవసాయ సలహా కమిటీలు ముందే చెప్పాలి. అలాగే రైతులకు ధాన్యం ద్వారా తగిన ఆదాయం రాకపోతే (ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గడం లాంటి కారణాల వల్ల) ఏ పంట వేస్తే తగిన ఆదాయం వస్తుందన్న విషయాన్ని రైతులకు తెలియచేయాలి. ఆ మేరకు వారికి ప్రత్యామ్నాయం చూపాలి. అంతేకానీ రైతన్నల ఆదాయం మాత్రం తగ్గకూడదు. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ పక్కాగా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. ధాన్యం ఏ మిల్లుకు పంపాలన్నది అధికారులే నిర్ణయించాలని, రైతులకు ఎక్కడా ఏ విధంగానూ నష్టం కలగకూడదన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలను చైతన్యం చేసి అన్ని అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు ఎలాంటి పంటలు సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుందో సూచిస్తూ ఆర్బీకేలు, ప్రభుత్వంతో అనుసంధానమై వ్యవసాయ కమిటీలు పనిచేస్తాయన్నారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదని సీఎం పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా కళ్లాల (ఫామ్ గేట్) వద్దే ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. మిల్లర్ల ప్రమేయం వద్దు.. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు. ఏ ఊరి పంట ఏ మిల్లర్ దగ్గరకు వెళుతుందనే విషయం అధికారులకు మాత్రమే తెలియాలి. అవసరమైతే జిల్లాల కలెక్టర్లు గోనె సంచులు సమీకరించుకోవాలి. ధాన్యం కొనుగోళ్ల సమయంలో తేమ పరిశీలించేందుకు ఆర్బీకేల వద్ద ఆ మీటర్లు కూడా ఉన్నాయి. మిల్లుల వద్దకు ధాన్యం రవాణాలో వ్యయ నియంత్రణ కోసం ఊరికి దగ్గరలోని మిల్లర్ వద్దకు పంపించవద్దు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలి. చెప్పిన సమయానికి మనమే కొనుగోలు చేయాలి. మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టాలి. రెండు శాఖలు కలసి పనిచేయాలి... ఆర్బీకేలకు సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో పౌర సరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి రైతులు కోరిన విత్తనాలను పౌర సరఫరాల శాఖ ఇవ్వాలి. అందుకోసం పౌర సరఫరాల శాఖ ఆర్బీకేలను ఓన్ చేసుకోవాలి. రైతులు బయట విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి అవసరమైన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలి. ఈ – క్రాపింగ్ నుంచి మార్కెటింగ్ వరకూ రెండూ శాఖలు సమన్వయంతో కలసి పనిచేయాలి. చురుగ్గా వ్యవసాయ సలహా కమిటీలు.. వ్యవసాయ సలహా కమిటీలు చురుకైన పాత్ర పోషించాలి. క్రాప్ ప్లానింగ్ మొదలు ఆ కమిటీలు రైతులకు అండగా నిలవాలి. ఈ కమిటీలు గ్రామాల్లో ఆర్బీకేలతో కలిసి పని చేయాలి. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం కూడా ఉండాలి. కమిటీల బాధ్యతలు, పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షిస్తారు. ఎక్కడా రైతులు ఇబ్బంది పడకూడదు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ.. రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా లోపం లేకుండా చూడాలి. బియ్యం తీసుకోవడంలో ఎవరూ మిస్ కాకుండా చూడాలి. ఆ మేరకు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్)లు పని చేయాలి. ప్రతి నెలా నిర్ణీత వ్యవ«ధిలోగా తప్పనిసరిగా బియ్యం పంపిణీ జరగాలి. కావాల్సినన్ని వేయింగ్ స్కేల్స్ (తూకం యంత్రాలు) కొనుగోలు చేయండి. బియ్యం నాణ్యతలో రాజీ పడవద్దు. ఎవరైనా ఇంటి వద్ద రేషన్ మిస్ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. దీనికి కార్యాచరణ సిద్ధం చేయండి. రబీ లక్ష్యం 45.20 లక్షల టన్నులు ► ఈ రబీ (2020–21) సీజన్లో 45.20 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే ఇది 15 శాతం ఎక్కువని, ఈసారి ఉత్పత్తి 65.23 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు రోజుకు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తుండగా త్వరలో ఇది 70 వేల మెట్రిక్ టన్నులకు చేరుతుందని తెలిపారు. ► కళ్లాల (ఫామ్‌గేట్) వద్దే ధాన్యం సేకరించేలా ఆర్బీకేల స్థాయిలో అవసరమైన అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ధాన్యం విక్రయించాలనుకునే రైతులు ఆర్బీకేల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకుంటే కూపన్ ఇచ్చి సేకరణ తేదీని తెలియచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం నిర్దేశించిన రోజు పీపీసీ సిబ్బంది స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి ధాన్యం సేకరిస్తున్నారని అధికారులు వివరించారు. ► సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్, పౌర సరఫరాల సంస్థ వీసీ ఎండీ ఎ.సూర్యకుమారి, వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
మరింత పటిష్టంగా.. ‘ఇంటింటికీ రేషన్’
సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్ సరఫరా’ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా రెండు రోజుల వ్యవధిలోనే బియ్యం కార్డు లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర రేషన్ సరుకుల పంపిణీని పూర్తిచేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో ప్రతి నెలా మొదటి వారంలో సామాజిక పింఛన్ల పంపిణీకి ఆటంకం కలగకుండా రేషన్ పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యతలు చూస్తున్న జాయింట్ కలెక్టర్లకు గురువారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. పంపిణీ సమయంలో వలంటీర్లు ఉండాల్సిందే.. సంబంధిత క్లస్టర్లకు రేషన్ పంపిణీ చేసే సంచార వాహనాలు ఏ తేదీన, ఏ సమయానికి వస్తాయో తెలియజేస్తూ.. ఒకరోజు ముందే లబ్ధిదారులకు కూపన్లు ఇవ్వాలని వలంటీర్లకు సూచించింది. రేషన్ పంపిణీ సమయంలో గ్రామ, వార్డు వలంటీర్లు ఉం డి లబ్ధిదారుల బయోమెట్రిక్‌ను తీసుకోవాలని ఆదేశించింది. ఎవరివైనా వేలిముద్రలు పడకపోతే వ లంటీర్లే వేయాలని స్పష్టం చేసింది. ఏదైనా సమస్య తలెత్తితే గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శులను సంప్రదించి పరిష్కరించాలని వలంటీర్లకు సూచిం చింది. ఎవరైనా లబ్ధిదారులు రేషన్ తీసుకోకపోతే.. ఆ వివరాలను వలంటీర్లు ఏరోజుకారోజు సచివాల యాల్లో సాయంత్రం 6 నుంచి 7 గంటల్లోగా తెలి యజేయాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులు ఎక్కడ ఉంటే.. అక్కడే రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంద నే విషయంపై వారికి అవగాహన కల్పించాలని ఆదే శించింది. క్లస్టర్లో మ్యాపింగ్‌కాని లబ్ధిదారులు.. వారు నివాసం ఉంటున్న క్లస్టర్‌లోనే రేషన్ తీసుకోవ చ్చనే విషయాన్నీ వారికి తెలపాలని కోరింది. రేషన్ పంపిణీ పూర్తయ్యే వరకు వలంటీర్లు సంచార వాహ నాలతో అందుబాటులో ఉండాలని పేర్కొంది. లోడింగ్, అన్‌లోడింగ్‌తో సంబంధం లేదు.. వలంటీర్ల సేవలను లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. సరుకుల లోడింగ్, అన్ లోడింగ్, తదితర కార్యకలాపాలతో వలంటీర్లకు సంబంధం ఉండదని స్పష్టం చేసింది. వీటిని పర్యవేక్షించాలని జేసీలను ఆదేశించింది. చదవండి: బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్చల్ పరిషత్ ఎన్నికలు: రెచ్చిపోయిన టీడీపీ నేతలు -
కస్టమర్ కోరిన చోటుకే లగేజీ డెలివరీ...!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఇండిగో.. డోర్ టు డోర్ బ్యాగేజ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ప్రయాణికుల లగేజీని ఇంటి నుంచి విమానాశ్రయానికి, అలాగే విమానాశ్రయం నుంచి కస్టమర్ కోరిన చోటకు చేరుస్తారు. 6ఈబ్యాగ్పోర్ట్ పేరుతో ఈ సేవలను కార్టర్‌పోర్టర్ అనే కంపెనీ సహాయంతో ఢిల్లీ, హైదరాబాద్‌లో ఇండిగో అందుబాటులోకి తెచ్చింది. ముంబై, బెంగళూరుకూ ఈ సేవలను విస్తరించనున్నారు. ఒకవైపుకు చార్జీ రూ.630తో మొదలు. కస్టమర్‌కు చెందిన లగేజీని పూర్తిగా ట్రాక్ చేస్తారు. విమానం బయల్దేరడానికి 24 గంటల ముందు బుక్ చేయాల్సి ఉంటుంది. విమానం దిగిన ప్రయాణికులకు వెంటనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరుకు చెందిన కార్టర్‌పోర్టర్ ఆన్ డిమాండ్ బ్యాగేజ్ డెలివరీ సేవలను విస్తారా, ఎయిర్ ఏషియాకు సైతం అందిస్తోంది. చదవండి: కర్నూలు ‘ఉయ్యాలవాడ’ ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమానాల రాకపోకలు -
డోర్ డెలివరీ సిబ్బందిపై టీడీపీ కార్యకర్తల దాడి
తడ (నెల్లూరు జిల్లా): రేషన్ సరుకులు సరఫరా చేసేందుకు వెళ్లిన డోర్ డెలివరీ వాహన సిబ్బందిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. అడ్డుపడిన ఇద్దరు వలంటీర్లపై సైతం దాడి చేశారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం వేనాడు పంచాయతీ మట్టిగుంటలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు శనివారం మట్టిగుంట సెంటర్లో బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలో నెట్వర్క్ సమస్య తలెత్తింది. ఎన్నికల వివాదాన్ని దృష్టిలో ఉంచుకున్న కొందరు టీడీపీకి చెందిన వ్యక్తులు దీనిని ఆసరాగా చేసుకుని డోర్ డెలివరీ వాహనం డ్రైవర్ ఆర్ముగం, సహాయకుడు తోట ప్రసాద్‌లపై దాడికి దిగారు. ఈ దాడిలో ప్రసాద్‌కు రక్త గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వలంటీర్లు దేవి, సురేష్‌లపై కూడా దాడి చేసి బీభత్సం సృష్టించారు. స్థానికులు కలగజేసుకుని అడ్డుపడ్డారు. దీనిపై బాధితులు తడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వైఎస్సార్సీపీ శ్రేణులపై జనసేన రాళ్ల దాడి ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర -
ఇంటింటికి రేషన్.. వారి కళ్ళలో ఆనందం ఫోటోలు
-
విజయవంతమైన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం
సాక్షి, ఏలూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యింది. ఉదయాన్నే రేషన్ పంపిణీ వాహనాల్లో బియ్యాన్ని నింపుకున్న వాలంటీర్లు, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఇప్పటి వరకు లబ్ధిదారులు రేషన్ షాప్‌కి వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి రేషన్ తీసుకోవాల్సి వచ్చేది. దీని కోసం వారు ఒక రోజు పనిని కూడా కోల్పోవాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వమే ఇంటింటికి వాహనాల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో రేషన్ తీసుకోవడం చాలా సులభతరమైందని లబ్ధిదారులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కేటాయించిన సమయానికి రేషన్ నేరుగా ఇంటికే రావడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. లబ్ధిదారుల కళ్లెదుటే బియ్యాన్ని కాటా వేసి, ప్రత్యేక సంచుల్లో వారికి అందిస్తున్నారు. నాణ్యమైన బియ్యం ఇంటికే రావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. -
ప్రజా పంపిణీ వ్యవస్ధలో నూతన విధానం
అమరావతి : నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతీ మాటను అక్షరాలా చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేక సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలుచేస్తూ తనదైన పాలన అందిస్తున్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన ఆయన.. ముఖ్యమంత్రి అవగానే వాటిని పరిష్కరిస్తూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. నాడు పాదయాత్రలో ప్రజాపంపిణీ వ్యవస్ధలో కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్దులు, రోగులు పడుతున్న కష్టాలను గమనించి సమూలంగా మార్పులు తీసుకువస్తానని హమీ ఇచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడు ఆ హమీని కూడా నెరవేరుస్తున్నారు. ఇంటివద్దకే రేషన్ సరుకులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా మెరుగుపరిచిన నాణ్యమైన స్వర్ణ రకం బియ్యాన్ని కార్డు దారుని ఇంటి వద్దే మొబైల్ వాహనం ద్వారా పంపిణీ చేయడమే లక్ష్యంగా సంవత్సరానికి రూ. 830 కోట్లు అదనంగా వెచ్చించి ఈ పధకం రూపొందించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా గురువారం నాడు (21.01.2021) కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 డోర్ డెలివరీ వాహనాలను వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. నాణ్యమైన బియ్యం.. ఇప్పటివరకూ ప్రజా పంపిణీ వ్యవస్ధలో కార్డుదారులకు పంపిణీ చేయబడుతున్న బియ్యంలో నూకల శాతం, రంగుమారిన శాతం అధికంగా ఉండడం వల్ల కార్డుదారులు తినని బియ్యం రకాలు ఉండడం వల్ల ఎక్కువశాతం మంది వినియోగించడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా కార్డుదారులు ఇష్టంగా తినగలిగే మెరుగపరిచిన నాణ్యమైన స్వర్ణ రకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా నాణ్యతపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తిని తొలగించి ఎక్కువ శాతం ప్రజలు ఇష్టంగా తినే స్వర్ణ రకం బియ్యాన్ని పంపిణీ చేయుటకు పౌరసరఫరాల శాఖ మొట్టమొదటి సారిగా బియ్యం సేకరణ సమయంలోనే సమూలమైన మార్పులు చేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే స్వర్ణ రకం బియ్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాటిని మిల్లింగ్ సమయంలోనే నూకలు 15 శాతం, దెబ్బతిన్న బియ్యం 1.5 శాతంకు తగ్గించి మెరుగుపరిచిన స్వర్ణ మధ్యస్ధ రకం సార్టెక్స్ బియ్యాన్ని సేకరించి కార్డుదారులకు అందించడం జరుగుతుంది. నాణ్యత వివరాలు... సార్టెక్స్ బియ్యం – గతంలో ఇవ్వలేదు – ఇప్పుడు 100 శాతం నూకలు – గతం 25 శాతం – ఇప్పుడు 15 శాతం ఇసుక, మట్టి, రాళ్ళు – గతం 0.5 శాతం – ఇప్పుడు 0 శాతం చెడిపోయిన బియ్యం గింజలు – గతం 3 శాతం, ఇప్పుడు 0.75 శాతం రంగుమారిన బియ్యం గింజలు – గతం 3 శాతం, ఇప్పుడు 0.75 శాతం పరిపక్వం కాని బియ్యం గింజలు – గతం 5 శాతం, ఇప్పుడు 1 శాతం పట్టు తక్కువ బియ్యం – గతం 13 శాతం, ఇప్పుడు 10 శాతం ఇంటి వద్దనే రేషన్ డెలివరీ... ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్ధలో చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడంలో కొంతమంది దుకాణదారులు సరైన సమయపాలన చేయకపోవడం, సరుకులను సక్రమంగా పంపిణీ చేయకపోవడం, సరుకులను నల్లబజారుకు తరలించడం వంటి వాటి వల్ల కార్డుదారులకు కలుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా వారి సౌకర్యం కోసం ముఖ్యంగా వృద్దులు, రోగులు, వేతనాలు కోల్సోతున్న రోజువారీ కూలీల కోసం ప్రభుత్వం నిత్యావసర సరుకులను మొబైల్ వాహనం ద్వారా ఇంటివద్దకే అందించే విధానం ప్రవేశపెట్టడం జరుగుతుంది.పాత విధానంలో నిత్యావసర సరుకులు పొందాలంటే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండడం వల్ల రోజువారీ కూలీలు వేతనాలు కోల్పోయేవారు. కానీ కొత్త విధానంలో కార్డుదారులకు ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ జరగడం వల్ల కూలీ పనులకు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో చౌకదుకాణం ద్వారా పంపిణీ చేయడం వల్ల సరుకుల పరిణామంలో తగ్గుదలపై అనేక ఫిర్యాదులు వచ్చేవి. కానీ కొత్త విధానం ద్వారా కార్డుదారుల సమక్షంలోనే సంచులు తెరిచి, ఖశ్చితమైన తూకంతో సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది వలంటీర్ వ్యవస్ధను ఉపయోగించి కార్డుదారుల ఇంటి వద్దనే ప్రజల సమక్షంలో కార్డుదారుల వేలిముద్రల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని, ఖశ్చితమైన తూకంతో తిరిగి ఉపయోగించగలిగే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతీ బియ్యం బస్తాకూ సీల్ వేయబడి ఉంటుంది, ప్రతీ సంచికీ కూడా యూనిక్ కోడ్ ఉండడం వల్ల ఆన్లైన్ ట్రాకింగ్ చేయబడుతుంది. అన్ని మొబైల్ వాహనాలకూ జిపిఎస్ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్యాప్ ద్వారా పంపిణీ వివరాలు రియల్‌టైంలో తెలుసుకోవచ్చు. అంతేకాదు మొబైల్ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతీ రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీనిపై నిరంతరం సోషల్ ఆడిట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ తూకం ద్వారా ఖశ్చితమైన తూకంతో సరుకుల పంపిణీ చేయనున్నారు. మొబైల్ వాహనం... బియ్యం, నిత్యావసర సరుకులు కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్ వాహనాలను రూ. 539 కోట్లతో కొనుగోలు చేయడం జరిగింది. ఈ వాహనాలను నిరుద్యోగ యువకులకు ఉపాధిహమీ కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన లబ్దిదారులకు సంబంధిత సంస్ధల నుంచి 60 శాతం సబ్సిడీ ధరకు ప్రభుత్వం అందించింది. ఒక్కో వాహనం విలువ రూ. 5,81,000, ఇందులో 60 శాతం అనగా ప్రతీ వాహనం మీద రూ. 3,48, 600 సబ్సిడీగా వివిధ వెల్ఫేర్ కార్పొరేషన్ల నుంచి అందించడం జరిగింది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతీ నెలా అద్దె చెల్లిస్తూ ఆరు సంవత్సరాల పాటు వినియోగించుకోనున్నది. ఎస్టీ కార్పొరేషన్ – 700 ఎస్సీ కార్పొరేషన్ – 2,300 బీసీ కార్పొరేషన్ – 3,800 మైనారిటీస్ కార్పొరేషన్ – 660 ఈడబ్యూ, ఈబీ కార్పొరేషన్ – 1,800 మొత్తం మొబైల్ వాహనాలు – 9,260 బియ్యం కార్డులు... ఇప్పటివరకూ ప్రజలకు రేషన్ కార్డులు పొందడానికి సరైన విధానం అందుబాటులో లేక కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం సంక్షేమ పధకాలు పొందడానికి ప్రధానమైన బియ్యం కార్డును అర్హులైన ప్రజలకు అందించేందుకు సీఎం శ్రీ వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాల్లో 5 రకాల బియ్యం కార్డు సంబంధిత సేవలను అందిస్తూ కేవలం 10 రోజుల లోపు బియ్యం కార్డును అందించడం జరుగుతుంది. 5 రకాల బియ్యం కార్డు సంబంధిత సేవలు... 1. కొత్త రైస్ కార్డు 2. రైస్ కార్డు విభజన 3. రైస్ కార్డులో సభ్యుల చేరిక 4. రైస్ కార్డులో సభ్యుల తొలగింపు 5. రైస్ కార్డు అప్పగించుట జూన్, 2020 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన రేషన్ కార్డ్‌ల వివరాలు కొత్త బియ్యం కార్డ్‌లు – 4,93, 422 కొత్త బియ్యం కార్డ్‌లలో సభ్యులను చేర్చుట – 17,07,928 కొత్త బియ్యం కార్డ్‌ను విభజించుట – 4,38,013 మొత్తం – 26,39,363