ఇంటి వద్దకే కూరగాయాలు | Vegetable door delivery in corona crisis | Sakshi
Sakshi News home page

ఇంటి వద్దకే కూరగాయాలు

Published Tue, Aug 4 2020 2:27 AM | Last Updated on Tue, Aug 4 2020 4:39 AM

Vegetable door delivery in corona crisis - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో గడప దాటాలన్నా, బహిరంగ మార్కెట్లకు వెళ్లి కూరగాయలు కొనాలన్నా జనం జంకుతున్నారు. దీంతో ఇంటి ముందుకే సరుకు తెచ్చి విక్రయించే పాత ట్రెండ్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. వ్యాపారులు, రైతులు వినియోగదారుల ఇంటి ముంగిటే తాజా కూరగాయల్ని అందుబాటులో ఉంచుతున్నారు. ప్రయాణ భారం తగ్గడం, తాజా కూరగాయలు తక్కువ ధరకే దొరకడం, నాణ్యత దృష్ట్యా ఈ తరహా కొనుగోళ్లకు వినియోగదారుల నుంచి స్పందన లభిస్తోంది.

రద్దీగా ఉండే బహిరంగ మార్కెట్లలో వైరస్‌ వ్యాప్తి ఎక్కు వగా ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ సహా ఇతర నగరాల్లో రైతుబజార్లు, బహిరంగ మార్కెట్లను వికేంద్రీ కరించారు. విశాల మైదానాలు స్టాండ్లు, ఆట స్థలాల్లోకి మార్కెట్లను తరలించి విక్రయాలు జరిపారు. హైదరాబాద్‌ నగరంలో 12 రైతుబజార్లు ఉండగా, ప్రతి రైతుబజార్‌ నుంచి 20 మొబైల్‌ వాహనాల ద్వారా కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో విక్రయాలు జరిపించారు. మొత్తంగా హైదరాబాద్‌ పరిధిలోనే 250 వరకు మొబైల్‌ రైతుబజార్ల ద్వారా 800 ప్రాంతాల్లో విక్రయాలు సాగాయి. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యాక మళ్లీ మార్కెట్లను పాత ప్రాంతాలకే తరలించారు. మొబైల్‌ వాహనాలను తగ్గించారు. దీంతో మార్కెట్లలో రద్దీ పెరిగింది. భౌతికదూరం సాధ్యంకాక, మాస్క్‌లు ధరించక మార్కెట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. సూపర్‌ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి.. దీనికి తోడు పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్ర అవసరాలకు కావాల్సినంత కూరగాయలు దిగుమతి కాక ధరలు అమాంతం పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి వద్దకే కూరగాయల అమ్మకాల ప్రక్రియను వ్యాపారులు ప్రారంభించారు. హోల్‌సేల్‌ వ్యాపారులు రైతుల నుంచి కూరగాయలు సేకరించి వాటిని ఆటోలు, ట్రాలీల్లో కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంచి తొలుత విక్రయాలు జరిపారు. ధరలు తక్కువగా ఉండటం, రోజూ నిర్ణీత వేళల్లో విక్రయాలు జరపడంతో ఆ ప్రాంత ప్రజలంతా ఈ కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

ఈ తరహా అమ్మకాలకు డిమాండ్‌ పెరగడంతో ప్రస్తుతం రైతులే నేరుగా విక్రయాల్లోకి దిగారు. తమ పంట ఉత్పత్తులను సైకిళ్లు, ద్విచక్ర వాహనాల ద్వారా ఇంటింటికీ తిరిగి విక్రయిస్తున్నారు. ఇలా రోజూ 20 – 30 కిలోల కూరగాయలను విక్రయిస్తున్నారు. దళారుల బెడద తప్పడం, తాము అనుకున్న ధరకే విక్రయాలు చేస్తుండటం వారికీ కలిసొస్తోంది. సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, వికారాబాద్‌ వంటి పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు కూరగాయల జాబితాను వాట్సాప్‌ మెసేజ్‌గా పంపిస్తే.. ఇంటికే డోర్‌ డెలివరీ అవుతున్నాయి. కాగా, ఇంటింటి విక్రయాలతో కూరగాయల ధరలు దిగివస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు రైతుబజార్లలో టమాటా కిలో రూ.35–40కి విక్రయించగా, బహిరంగ మార్కెట్లలో కిలో రూ.50 వరకు విక్రయించారు. ప్రస్తుతం కొత్త పంట కోతకు రావడం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగడంతో.. బహిరంగ రైతుబజార్లలో కిలో రూ.18–20, బహిరంగ మార్కెట్లో రూ.30 పలుకుతోంది.  రద్దీగా ఉండే బహిరంగ మార్కెట్లలో వైరస్‌ వ్యాప్తి ఎక్కు వగా ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే లాక్‌డౌన్‌ సమ యంలో హైదరాబాద్‌ సహా ఇతర నగరాల్లో రైతుబజార్లు, బహిరంగ మార్కెట్లను వికేంద్రీ కరించారు. విశాల మైదానాలు,» స్టాండ్లు, ఆట స్థలాల్లోకి మార్కెట్లను తరలించి విక్రయాలు జరిపారు. హైదరాబాద్‌ నగరంలో 12 రైతుబజార్లు ఉండగా, ప్రతి రైతుబజార్‌ నుంచి 20 మొబైల్‌ వాహనాల ద్వారా కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో విక్రయాలు జరిపించారు. మొత్తంగా హైదరాబాద్‌ పరిధిలోనే 250 వరకు మొబైల్‌ రైతుబజార్ల ద్వారా 800 ప్రాంతాల్లో విక్రయాలు సాగాయి. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యాక మళ్లీ మార్కెట్లను పాత ప్రాంతాలకే తరలించారు. మొబైల్‌ వాహనాలను తగ్గించారు. దీంతో మార్కెట్లలో రద్దీ పెరిగింది.

భౌతికదూరం సాధ్యంకాక, మాస్క్‌లు ధరించక మార్కెట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. సూపర్‌ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి.. దీనికి తోడు పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్ర అవసరాలకు కావాల్సినంత కూరగాయలు దిగుమతి కాక ధరలు అమాంతం పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి వద్దకే కూరగాయల అమ్మకాల ప్రక్రియను వ్యాపారులు ప్రారంభించారు. హోల్‌సేల్‌ వ్యాపారులు రైతుల నుంచి కూరగాయలు సేకరించి వాటిని ఆటోలు, ట్రాలీల్లో కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంచి తొలుత విక్రయాలు జరిపారు. ధరలు తక్కువగా ఉండటం, రోజూ నిర్ణీత వేళల్లో విక్రయాలు జరపడంతో ఆ ప్రాంత ప్రజలంతా ఈ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ తరహా అమ్మకాలకు డిమాండ్‌ పెరగడంతో ప్రస్తుతం రైతులే నేరుగా విక్రయాల్లోకి దిగారు. తమ పంట ఉత్పత్తులను సైకిళ్లు, ద్విచక్ర వాహనాల ద్వారా ఇంటింటికీ తిరిగి విక్రయిస్తున్నారు. ఇలా రోజూ 20 – 30 కిలోల కూరగాయలను విక్రయిస్తున్నారు. దళారుల బెడద తప్పడం, తాము అనుకున్న ధరకే విక్రయాలు చేస్తుండటం వారికీ కలిసొస్తోంది. సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, వికారాబాద్‌ వంటి పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు కూరగాయల జాబితాను వాట్సాప్‌ మెసేజ్‌గా పంపిస్తే.. ఇంటికే డోర్‌ డెలివరీ అవుతున్నాయి. కాగా, ఇంటింటి విక్రయాలతో కూరగాయల ధరలు దిగివస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు రైతుబజార్లలో టమాటా కిలో రూ.35–40కి విక్రయించగా, బహిరంగ మార్కెట్లలో కిలో రూ.50 వరకు విక్రయించారు. ప్రస్తుతం కొత్త పంట కోతకు రావడం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగడంతో.. బహిరంగ రైతుబజార్లలో కిలో రూ.18–20, బహిరంగ మార్కెట్లో రూ.30 పలుకుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement