సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష నిర్వహించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పనిచేయని పీఎస్‌ఏ ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా మందులను సాంకేతికపరమైన యంత్రాలను రెడీ చేయాలని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ ల్యాబ్‌లలో 16,500 శాంపిల్స్ టెస్ట్ చేసే సామర్థ్యం ఉందని మంత్రికి ఉన్నతాధికారులు తెలియజేశారు. ప్రభుత్వంతోపాటు 84 ప్రైవేట్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గత రెండు వారాల నుంచి 6 వేలకు పైగా నమూనాలను సేకరించామని చెప్పారు.
కోవిడ్ టెస్టుల సామర్థ్యం పెంచాలని కనీసం రోజుకు 4000 టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. కోవిడ్ 19 రోజువారీ నివేదికను ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలలోపు పత్రికా ప్రకటన కోసం సమర్పించాలని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాల సీఎస్‌ఆర్ విరాళాల జాబితాను సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని తెలిపారు.
చదవండి: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 78 మంది సస్పెండ్
Comments
Please login to add a commentAdd a comment