
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. ప్రతిరోజు కేసులతో పాటు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో మంగళవారం ఒక్కరోజే 3,60,960 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,97,267 కు చేరింది. అదే విధంగా మహమ్మారి బారినపడి నిన్న ఒక్కరోజే 3,293 మంది బాధితులు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 29,78,709 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 1,48,17,371 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. దేశంలో కోవిడ్ రికవరి రేటు 82.33 శాతంగా ఉంది. కేంద్రం లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఇప్పటి వరకు 14.78 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తెలంగాణలో 8,601 కేసులు
తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం బులెటిన్ విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం రాష్ట్రంలో, గత 24 గంటలలో కొత్తగా 8,061 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి 56 మంది చనిపోయారు. కాగా తెలంగాణలో ఇప్పటివరకు మొత్తంగా 4,19,966 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,45,683 మంది దీని బారి నుంచి కోలుకున్నారు.
ఇప్పటివరకు దాదాపు 2,150 మంది కరోనాతో మరణించారు. ఇక 72,133 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,508, మేడ్చల్‌లో 673, రంగారెడ్డిలో 514, నిజామాబాద్‌లో 291, వరంగల్ అర్బన్‌లో 203 , మహబూబ్‌నగర్‌లో 328, ఖమ్మంలో 277 కేసులు వెలుగుచూశాయి.
Comments
Please login to add a commentAdd a comment