
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 6,42,875 మందికి పరీక్షలు నిర్వహించగా.. 82,647 మందికి కరోనా పాజిటివ్ నిర్థ్దారణ అయినట్లు వైద్య , ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. సోమవారం ఒక్కరోజు 18,035 పరీక్షలు నిర్వహించగా.. 1,896 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 8 మంది చనిపోయారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 59,374 మంది కోలుకోగా.. 22,628 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 15,554 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వివరించారు.
వ్యాధి బారినపడి ఇప్పటి వరకు మొత్తం 645 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక సోమవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 338 ఉండగా.. మేడ్చల్ జిల్లాలో 119, రంగారెడ్డిలో 147, కరీంనగర్‌లో 121, వరంగల్ అర్బన్‌లో 95, గద్వాలలో 85, కామారెడ్డిలో 71, ఖమ్మంలో 65, పెద్దపల్లిలో 66 ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,629 మంది రోగులు చికిత్స పొందుతుండగా.. 5,807 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో 3,336 మంది రోగులు చికిత్స పొందుతుండగా.. 2,149 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment