![Amazon Signals Entry Into Alcohol Delivery In India - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/20/wine.jpg.webp?itok=f3ozwpaH)
కోల్‌కతా: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇకపై మద్యం కూడా డోర్ డెలివరీ చెయ్యనుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా మద్యం హోం డెలివరీకి అమెజాన్ డాట్ కామ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అమెజాన్‌కు అనుమతులు మంజూరు చేసింది.
రాష్ట్రంలో అమెజాన్ తో పాటు అలీబాబా వెంచర్ బిగ్ బాస్కెట్ కూడా మద్యం పంపిణీ చేయడానికి అనుమతి తీసుకుంది. కాగా.. అనేక సంవత్సరాలుగా భారతదేశంలో అమెజాన్ వివిధ కార్యకలాపాలను విస్తరించింది. కిరాణా వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి వస్తువును ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో అమెజాన్ సంస్థ దేశంలో తన సేవలు విస్తరింపజేసేందుకు గాను 6.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులుగా పెట్టింది. చదవండి: '50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి'
Comments
Please login to add a commentAdd a comment