నగరాల్లో నయా ట్రెండ్
వంటగది నుంచి నేరుగా ఇంటికే ఆహారం ∙పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ
సామాన్యులకు అందుబాటు ధరలోనే లభ్యం
సోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయం
ఆన్‌లైన్ ద్వారా నిరంతరం డెలివరీ సౌకర్యం
దేశవ్యాప్తంగా 3,500లకు పైగా క్లౌడ్ కిచెన్లు
ఒకరి వద్ద ఉద్యోగిగా పనిచేయడం కన్నా.. ఏదైనా చిన్న వ్యాపారం చేసి తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటోంది ప్రస్తుత తరం. అలాంటి వారే ‘స్టార్టప్ కంపెనీ’ అనే పేరుతో వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఇందులోంచి పుట్టిందే క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్ట. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ట్రెండింగ్, సక్సెస్‌ఫుల్ బిజినెస్ అంటే ఇదే. 2015లో మొదటి క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభమైంది. 2016లో ఇది ఓ వ్యాపారంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,500కి పైగా క్లౌడ్ కిచెన్ స్టార్టప్‌లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని మార్కెట్‌లోకి రానున్నాయి. జాతీయ క్లౌడ్ కిచెన్ బిజినెస్ మార్కెట్ విలువ ఈ ఏడాది చివరి నాటికి రూ.25వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.
క్లౌడ్ కిచెన్ అంటే..
సాధారణంగా ఒక పెద్ద రెస్టారెంట్‌గానీ, హోటల్‌గానీ పెట్టాలనుకుంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. రెస్టారెంట్ డిజైన్ చేయించుకోవాలి. అది వాణిజ్య ప్రదేశంలో ఉండాలి. అందువల్ల అద్దె కూడా ఎక్కువగా చెల్లించాలి. కానీ, ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్టలో కేవలం ఒక మంచి వంటగది ఏర్పాటుచేసుకుంటే సరిపోతుంది. రెస్టారెంట్‌లో ఏ విధంగా కిచెన్ ఏర్పాటుచేస్తారో అలాగే ఇంటి వద్ద కూడా కిచెన్ ఏర్పాటుచేసుకోవచ్చు. ఫుడ్ ఆర్డర్లను మీరు ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం స్విగ్గి, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు.. కిచెన్ సమీపంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని సొంత డెలివరీ బాయ్స్ ద్వారా ఫుడ్ చేరవేస్తే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.
రెస్టారెంట్ పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. డైన్–ఇన్ కంటే డోర్‌స్టెప్ ఫుడ్ డెలివరీని కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో క్లౌడ్ కిచెన్ల హవా పెరిగింది. వీటిని డార్క్ కిచెన్‌లు, గోస్ట్ కిచెన్‌లు, వర్చువల్ రెస్టారెంట్‌లు, శాటిలైట్ రెస్టారెంట్‌లు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇవి జనాదరణ పొందుతుండడంతో చాలా రెస్టారెంట్లు ఇప్పుడు డైన్–ఇన్ రెస్టారెంట్ కల్చర్ నుంచి డోర్ డెలివరీ సెటప్ వైపు మొగ్గుచూపుతున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులతో ఎక్కువ లాభాలు
పొందడమే ఈ క్లౌడ్ కిచెన్‌ల ప్రత్యేకత. –సాక్షి, అమరావతి
అనుమతులు తప్పనిసరి..
⇒ క్లౌడ్ కిచెన్ నిర్వహణ కోసం స్థానికంగా మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోవాలి.
⇒ అలాగే, సంస్థను రిజిస్టర్ చేయించుకోవడంతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ లైసెన్స్, జీఎస్టీ రిజి్రస్టేషన్, హెల్త్ లైసెన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అవసరం.
⇒ ఇలా కేవలం రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు పెట్టుబడితో క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించవచ్చు.
⇒కాస్త భారీస్థాయిలో అయితే రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాలి.
అధ్యయనం ముఖ్యం..
క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైంది అధ్యయనం. కిచెన్ పెట్టాలనుకుంటున్న ప్రాంతంలో ఎలాంటి ఫుడ్‌కు డిమాండ్ ఉంది? ప్రజల ఇష్టాయిష్టాలు, ఆహారపు అలవాట్లు, ఇప్పటికే ఎలాంటి ఫుడ్ ఎంత ధరలో అందుబాటులో ఉంది.. దాని ధరలు ఎలా ఉన్నాయి.. వంటి వివరాలను తెలుసుకుని దానిబట్టి ప్రజలు ఎక్కవగా ఇష్టపడే ఆహారాన్నే రుచికరంగా, నాణ్యతతో, తక్కువ ఖర్చులో అందించాలి. క్లౌడ్ కిచెన్‌కు లొకేషన్‌తో సంబంధంలేదు. కానీ, రోడ్డుకు కొంచెం దగ్గరగా ఉంటే మంచిది. 500 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. డెలివరీ చేసే వాహనాల పార్కింగ్‌కు స్థలం ఉండేలా చూసుకోవాలి.
సోషల్ మీడియాయే ప్రచారాస్త్రం..
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. వ్యాపారం ఏదైనాసరే సోషల్ మీడియా పేజీ ఉండాల్సిందే. ఎందుకంటే దీనిద్వారా మరింత మంది కస్టమర్లు రావచ్చు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ట్విట్టర్‌లలో అకౌంట్లు ఓపెన్ చేయాలి. రెగ్యులర్‌గా అప్‌డేట్స్ ఇస్తుంటే. ఆటోమెటిగ్గా ఈ బిజినెస్ గురించి జనాలకు తెలుస్తుంది.
ఖర్చు తక్కువ..
క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్టతో వ్యాపారాన్ని తొలుత హైదరాబాద్‌లో మొదలుపెట్టాలనుకున్నాం. కానీ, విజయవాడ వాసులు ఆహార ప్రియులు కావడంతో ఇక్కడే ఏర్పాటుచేసుకున్నాం. మా దగ్గర నాణ్యత ఉన్న ఆహారాన్ని బాక్స్‌లో ప్యాక్‌చేసి ఇస్చ్తాం. ఉ.11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఆహారాన్ని ఆన్‌లైన్ ద్వారా డెలివరీ ఇస్తున్నాం. సాధారణ రెస్టారెంట్‌తో పోలి్చతే దాదాపు 30–50 శాతం ఖర్చులు తక్కువ. అందువల్లే ధరలు తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. – ప్రసాద్, క్లౌడ్ కిచెన్ నిర్వాహకుడు, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment