న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ నేడు(6న) ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకి రూ. 371–390 ఆఫర్ ధరలో వస్తున్న ఇష్యూ శుక్రవారం(8న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 4,499 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 6,828 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. తద్వారా రూ. 11,327 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. వెరసి 11.3 బిలియన్ డాలర్ల(రూ. 95,000 కోట్లు) విలువను ఆశిస్తోంది. ఇప్పటికే (2021 జూలై) లిస్టయిన ప్రత్యర్ధి కంపెనీ జొమాటో విలువ ప్రస్తుతం రూ. 2.13 లక్షల కోట్లకు చేరింది.
నిధుల వినియోగమిలా...
2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 611 కోట్ల నష్టం ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను టెక్నాలజీ, క్లౌడ్ ఇన్‌ఫ్రా, బ్రాండ్ మార్కెటింగ్, రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది.
ఆఫర్ ధర: రూ. 371–390
సమీకరణ: రూ. 11,327 కోట్లు
రిటైలర్లకు కనీస లాట్: 38 షేర్లు
ఆఫర్ ముగింపు: శుక్రవారం (8న)
షేర్ల అలాట్‌మెంట్: 11న
లిస్టింగ్: 13న
Comments
Please login to add a commentAdd a comment