Cloud
-
ఆర్థిక వృద్ధిలో క్లౌడ్, జీసీసీల కీలక పాత్ర
న్యూఢిల్లీ: భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో క్లౌడ్ మార్కెట్, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాలుగా కేంద్ర ప్రభుత్వం నివేదిక స్పష్టం చేసింది. దేశ జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా 2030 నాటికి 20 శాతానికి చేరుకుంటుదని తెలిపింది. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (మైటీ), కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్) సంయుక్త నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 2022–23 నాటికి జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.31.64 లక్షల కోట్ల మేర ఉన్నట్టు తెలిపింది. డిజిటల్ ఎకానమీలో సంప్రదాయ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసీటీ) ఇక ముందూ అతిపెద్ద విభాగంగా కొనసాగుతుందని పేర్కొంది. 2023నాటికి అంతర్జాతీయంగా భారత క్లౌడ్ మార్కెట్ వాటా 1.1–1.2 శాతం మేర ఉంటుందని వివరించింది. ‘‘భారత డిజిటల్ ఎకానమీ చాలా వేగంగా రెట్టింపు కానుంది. 2029–30 నాటికి 20 శాతం వాటాను అందించనుంది. వచ్చే ఆరేళ్లలో సంప్రదాయ వ్యవసాయం, తయారీని మించి డిజిటల్ ఎకానమీ ఎదగనుంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. 2023లో ఐసీటీ ఎగుమతులు 162 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఐర్లాండ్ 236 బిలియన్ డాలర్ల ఎగుమతుల తర్వాత రెండో పెద్ద ఎగుమతిదారుగా భారత్ నిలవడం గమనార్హం. 2023–24లో 1644 బిలియన్ డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. 20 బిలియన్ డాలర్లకు క్లౌడ్ మార్కెట్ ‘‘కంపెనీలు జనరేటివ్ ఏఐని అందిపుచ్చుకోవడం పెరుగుతోంది. తద్వారా ఉత్పాదకత, కస్టమర్ అనుభవాన్ని పెంచుకోవడం, కొత్త సేవల ప్రారంభంతో క్లౌడ్ మార్కెట్ ఏటా 24 శాతం చొప్పున పెరుగుతూ 2027 నాటికి 20.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. జీసీసీలకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా మారిందని, 2022 నాటికి ప్రపంచంలోని జీసీసీల్లో 55 శాతం భారత్‌లోనే ఉన్నట్టు తెలిపింది. పరిశోధన, అభివృద్ధి, ఐటీ సపోర్ట్ సేవలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ తదితర సేవల కోసం ఎంఎన్‌సీలు జీసీసీలను ఏర్పాటు చేస్తుంటాయి. -
విద్యార్థులకు ఏడబ్ల్యూఎస్ గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) తాజాగా 100 మిలియన్ డాలర్ల క్లౌడ్ క్రెడిట్స్‌ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్ సొల్యూషన్స్ అభివృద్ధి, తదుపరి స్థాయికి చేర్చడంలో అర్హత కలిగిన విద్యా సంస్థలు, పేద విద్యార్థులకు సహాయం చేయడానికి రాబోయే ఐదేళ్లలో ఈ క్రెడిట్స్‌ను అందజేయనున్నట్లు వెల్లడించింది.ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేషన్ ఈక్విటీ ఇనిషియేటివ్ కింద గ్రహీతలకు నగదు వలె పనిచేసే క్లౌడ్ క్రెడిట్స్‌ను మంజూరు చేస్తారు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలను ఉపయోగించినప్పుడు సంస్థలు వారి ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.ఈ క్రెడిట్స్‌తో గ్రహీతలు ఏఐ అసిస్టెంట్స్, కోడింగ్ కరికులమ్స్, కనెక్టివిటీ టూల్స్, ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్స్, మొబైల్ అప్లికేషన్స్, చాట్బాట్స్తోపాటు వివిధ సాంకేతిక ఆధారిత అభ్యాస అనుభవాల వంటి ఆవిష్కరణలను రూపొందించడానికి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ, అధునాతన ఏఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. -
భాగ్యనగరాన్ని.. కమ్మేస్తున్న క్లౌడ్స్..
దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో.. విభిన్న ఆహార రుచులకు కేంద్రమైన నగరాల్లో హైదరాబాద్ కూడా ప్రముఖమైనది. ప్రస్తుత కాంటినెంటల్ వంటకాలే కాదు నిజాం కాలం నాటి స్థానిక సాంస్కృతిక వంటకాలతోనూ మన భాగ్యనగరం ‘బౌల్ ఆఫ్ డెలీíÙయస్ డిష్’గా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా నగరంలో స్థానిక వంటకాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రుచులు కూడా ఆదరణ పొందుతున్నాయి. ఈ రుచుల కోసమే ప్రత్యేకంగా రెస్టారెంట్లు కూడా వెలిశాయి. అయితే కరోనా అనంతరం ఈ రంగంలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా క్లౌడ్ కిచెన్. ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడంతో మొదలైన ఈ కల్చర్.. వెళ్లే అవకాశమున్నా ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టేంతగా మార్పు చెందింది. నగరంలో విభిన్న రుచులు విభిన్న సంసంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ బిర్యానీ మొదలు ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ వరకూ అన్ని రుచులూ ఆన్లైన్, డిజిటల్ వేదికగా ఒక్కొక్క ఆర్డర్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్థానిక వంటకాలే కాదు చైనీస్, కొరియన్, మొగలాయి, కరాచి వంటి రుచులను అందించే రెస్టారెంట్లు తమ డోర్ స్టెప్ సేవలను అందిస్తున్నాయి. వీరికి వారధులుగా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ వేదికలు ఉన్నాయన్న విషయం విధితమే. అయితే.. ఈ కోవలోకి స్టార్ రెస్టారెంట్లు కాస్త విముఖతను ప్రదర్శించాయి. నాణ్యత, బ్రాండ్ వాల్యూ విషయంలో ఈ సేవలు అందించలేదనేది నిపుణుల మాట. కానీ ప్రస్తుతం నగరంలోని టాప్ 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు సైతం క్లౌడ్కిచెన్కు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి పాకశాస్త్ర నైపుణ్యాలతో నాణ్యత, ప్యాకింగ్, బ్రాండ్ వాల్యూ వంటి అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సేవలు ప్రారంభిస్తున్నాయి. విలాసవంతమైన జీవితాల్లో ఈ లోటును పూడ్చడానికి స్టార్ హోటళ్ల యాజమాన్యం ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా గమనించాలి. జూబ్లిహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల డిజిటల్ ఫుడ్ సేవలు ఊపందుకున్నాయి. అందరూ అదే దారిలో.. డైనింగ్‌తో పాటు ఈ క్లౌడ్ కిచెన్‌లో కూడా మంచి లాభాలు వస్తుండటంతో పలు రెస్టారెంట్లు ఈ డిజిటల్ ఇన్నోవేషన్‌కు సై అంటున్నాయి. కానీ స్టార్ హోటళ్లు మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే గత కొంత కాలంగా 5 స్టార్ హోటళ్లు సైతం క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించాయి. వాటి బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూనే, పాకశాస్త్ర నైపుణ్యాలను డిజిటల్ వేదికతో అనుసంధానం చేస్తూ సేవలందిస్తున్నాయి. ఇక క్లౌడ్ కిచెన్ సేవలను నగరవాసులు ఆస్వాదిస్తున్న తీరు అద్భుతం. ఈ నేపథ్యంలో వారికి మా సేవలను సైతం అందంచాలనే లక్ష్యంతో ఐటీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫుడ్‌టెక్ సేవలు ప్రారంభించాం. స్విగ్గీ, జొమాటో వంటి వేదికలతో అనుసంధానమై మా పసందైన రుచుల పండుగను ఆహార ప్రియుల వద్దకే చేర్చుతున్నాం. ముఖ్యంగా మా ప్రయత్నంలో అధిక–నాణ్యత భోజనాన్ని అందించడంతో పాటుగా పర్యావరణహితమైన ప్యాకింగ్‌ను కొనసాగిస్తున్నాం. డిజిటలీకరణతో అద్భుత ఫలితాలు ఫుడ్, హోటల్స్ రంగంలో అధునాతన డిజిటలీకరణ అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్‌లో పాకశాస్త్ర నిపుణులైన స్టార్ హోటల్ చెఫ్‌లు, కిచెన్ మేనేజర్లు విశేషమైన శిక్షణ ఉండటంతో ఈ విధమైన క్లౌడ్ కిచెన్‌కు మంచి ఆదరణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా వివిధ దశల్లో ఆహార పదార్థాల తనిఖీ, తయారీ విధానంలోనూ అధునాతన సాంకేతికత వినియోగించడంతో పాటు శాటిలైట్ కిచెన్లలో ఉపయోగించే యాప్‌లు ఈ వంటలకు మరింత నాణ్యతను, ఖచి్చతత్వాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ ఫుడ్ టెక్ సేవలలో సుస్థిరతే ప్రధాన లక్ష్యంగా స్టార్ హోటల్స్ ప్యాకింగ్‌ను వినూత్నంగా చేపడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, మారే ఉష్ణోగ్రతలు ఆహారాన్ని పాడు చేయకుండా స్పిల్లేజ్ ప్రూఫ్ కంటైనర్లను ఉపయోగిస్తుండటం విశేషం. ఫుడ్ లవర్స్ అభిరుచికి అనుగుణంగా.. నగరంలోని ఫుడ్ లవర్స్ ఇష్టపడే రుచులకు అనుగుణంగా, మా నాణ్యతా ప్రమాణాలను పెంచుకుంటూ 3 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందులో భాగంగా ప్రముఖ మాస్టర్ చెఫ్‌లచే రూపొందించబడిన దాల్ మఖీ్న, కబాబ్‌లు, ర్యానీలతో సహా గౌర్మెట్ నార్త్ ఇండియన్ వంటకాలను అందించడానికి ‘ఐటీసీ మాస్టర్ చెఫ్ క్రియేషన్స్’, ఆరోగ్యానికి హితమైన మిల్లెట్ కిచిడీ, ఇంటి వంటలను తలపించే చపాతీలు, అన్నం వంటి వాటికోసం ‘ఐటీసీ ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్’, క్రోసెంట్స్, బేగెల్స్, గౌర్మెట్ బ్రెడ్లు వంటి బేకరీ ఐటమ్స్ కోసం ‘ఐటీసీ సన్‌ఫీస్ట్ బేక్డ్ క్రియేషన్స్’ సేవలు ఉన్నాయి. ఈ మూడు రకాల సేవలను హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నైలోని 19 క్లౌడ్ కిచెన్లలో ప్రారంభించాం. – రోహిత్ భల్లా, ఫుడ్ టెక్ బిజినెస్ హెడ్, ఐటీసీ లిమిటెడ్. -
Younus Farhan: క్లౌడ్ ఫొటోగ్రఫీ.. ఓ మేఘ సందేశం
ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండే మేఘాన్ని ఎప్పుడైనా పలకరించారా..?? ఒంటరిగా ఉండే ఆకాశంతో ఫ్రెండ్షిప్ చేశారా..?? అసలు ఆకాశం మేఘాల ఆకారంలో మనతో మాట్లాడుతుందని మీకు తెలుసా..? ప్రకృతి పంపిన సందేశం మేఘాలని మీకసలు తెలుసా...?? అయితే ఇవన్నీ నాకు తెలుసు అంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ క్లౌడ్ ఫొటోగ్రాఫర్ యూనస్ ఫర్హాన్. మేఘంలో అమోఘం కనిపిస్తుంది అతడికి. స్కై కాన్వాస్‌పై నేచర్ చేసిన సిగ్నేచర్‌ను అతడి కెమెరా ఇట్టే బంధిస్తుంది. తను క్లిక్‌మనిపించే మేఘాల ఫొటోల్లో ఓ సందేశం ఉంటుంది. ఆత్మీయత, పర్యావరణం, సమానత్వం, జంతువులు, వింతలు, విశేషాలు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. అతడి క్లౌడ్ ఫొటోగ్రఫీలో నిక్షిప్తమై ఉంటాయి. 2011లో మన భారత దేశానికి క్రికెట్ వరల్డ్ కప్ వస్తుందనే మేఘ సందేశాన్ని 3 నెలల ముందే క్లిక్‌మనిపించి అందరితో ఔరా అని అనిపించుకున్నారు. స్కూల్ కిటికీలోంచి కనిపించిన మేఘంతో మొదలైన తన ఫ్రెండిషిప్ ప్రకృతి సందేశానికి మేఘాలు వారధులని నిరూపించే వరకు వచి్చందని యూనస్ ఫర్హాన్ అంటున్నారు. ఇప్పుడు అతడి మనసంతా మేఘావృతమైంది. అసలు అతని ప్రయాణమేంటో.. ఆయన చెప్పే మేఘ సందేశమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా..!? మేఘంతో నా సాన్నిహిత్యంచిన్నతనంలో 3 నుంచి 7వ తరగతి వరకు నల్లగొండలోని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు నాకున్న ఏకైక ఫ్రెండ్ మేఘం. అలా కదులుతూ వెళ్లే మేఘాలు నన్ను ఆకర్షించేవి. వాటి ప్రయాణంలో ఏదో అర్థం ఉందనిపించేది. వాటితో అలా మొదలైన నా స్నేహం 8వ తరగతిలో నాన్నకు ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్‌తో ఫొటోలు తీయడం నుంచి మరింత పెరిగింది. హాబీగా మొదలైన క్లౌడ్ ఫొటోగ్రఫీ కెరీర్‌గా మారింది. మొదట్లో మేఘాల్లో దాగి ఉన్న జంతువుల ఆకారాలను గుర్తించి క్లిక్మనిపించేవాడిని. అనంతరం అవే మేఘాలు నాకు చెప్పే కథలను ఫొటోలు తీయడం వరకూ సాగింది. ముఖ్యంగా 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిచే కన్నా 3 నెలల ముందే.. వరల్డ్ కప్ ఆకారమున్న మేఘాలు నాకు ఆకాశంలో కనిపించాయి. వాటిని క్లిక్‌మనిపించాను. ఆ తరువాత అదే నిజమైంది. భారత్ వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు నా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నాకు గుర్తింపునిచ్చాయి. ఆ సమయంలో నన్ను మొదట గుర్తించింది ‘సాక్షి’దినపత్రికనే. సాక్షి టీవీ స్టూడియోకు ఆహ్వానించి నా అభిరుచిని అభినందించింది. అనంతరం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్న సమయంలో, 2013 జూన్ 27న ఆకాశంలో తెలంగాణ రాష్ట్రాన్ని పోలిన మేఘం కనిపిస్తే, ఫొటో తీశాను. నాకు ముందే అందించిన మేఘ సందేశంలా దానిని భావించాను. ఇలా ఎన్నో విషయాలను నేను మేఘంలోనే వెతుక్కుంటాను. నార్కోటిక్స్ డే ప్రచారంగా.. నేను మొదటిసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రకృతిలోని ప్రతీ జీవి సమానం అనే సందేశాత్మకంగా ఉన్న మేఘాన్ని బంధించాను. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సందేశమున్న క్లౌడ్ షేప్‌ను కూడా ఫొటో తీశాను. వరల్డ్ నార్కోటిక్స్ డే రోజు నేను తీసిన ఫొటోను సంబంధిత శాఖ అధికారులు అధికారికంగా ఆవిష్కరించారు. అంతేకాకుండా పోలీసు శాఖకు చెందిన వీసీ సజ్జనార్, సీవీ ఆనంద్, మహేష్ భగత్ వంటి అధికారులు ఈ ఫొటో పోస్టర్లను ప్రత్యేకంగా ఆవిష్కరించి అభినందించారు. బయోడైవర్సిటీ, పర్యావరణం, జంతువులకు సంబంధించి నేను తీసిన పలు మేఘాల ఫొటోలు నన్ను ప్రపంచానికి పరిచయం చేశాయి. భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహం సోషల్ మీడియాలో నా క్లౌడ్ ఫొటోగ్రఫీ గురించి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నా ఫొటోలకు సముచిత స్థానాన్ని కలి్పంచారు. రవీంద్ర భారతిలో మొదటి క్లౌడ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం అందించారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లిటరరీ ఫెస్టివల్లో, ఇతర కాలేజీల్లో ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను. మేఘాల్లో దాగి ఉన్న జంతువుల ఫొటోలు నచ్చి నగరంలోని జవహర్లాల్ నెహ్రూ జులాజికల్ పార్క్ వారు ఆహా్వనించగా అక్కడ కూడా ప్రదర్శించాను. మైసూర్ యూనివర్సిటీ, బెంగుళూరు యూనివర్సిటీలో కూడా క్లౌడ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చేరాలి2009 నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 వేల సందేశపు మేఘాలను నా కెమెరాలో బంధించాను. నేను ఫొటోగ్రఫీలో ఎలాంటి కోర్సులు చేయలేదు. ప్రకృతి తన సందేశాన్ని సమాజానికి అందించడానికి నన్నొక వారధిలా మార్చుకుందని నమ్ముతాను. ప్రస్తుతం మాస్టర్స్ హిస్టరీ చేస్తున్నాను. తెలంగాణతోపాటు అరబ్ దేశాలు, అమెరికా వంటి దేశాలను పర్యటించి క్లౌడ్ ఫొటోలను తీయాలి. ఈ మేఘసందేశాన్ని ఒక సబ్జెక్ట్ లేదా థియరీలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆవిష్కృతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. – యూనస్ ఫర్హాన్ క్లౌడ్ ఫొటోగ్రాఫర్ -
టీవీలు కంప్యూటర్లుగా మారిపోతే.. జియో కొత్త టెక్నాలజీ
రిలయన్స్ జియో మరో కొత్త టెక్నాలజీకి నాంది పలుకుతోంది. ఇంట్లోని స్మార్ట్ టీవీలను తక్కువ ఖర్చుతో సులభంగా కంప్యూటర్లుగా మార్చే సాంకేతికతను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో ప్రదర్శించింది. జియో క్లౌడ్ పీసీ (Jio Cloud PC) అని పిలిచే ఈ టెక్నాలజీ కేవలం కొన్ని వందల రూపాయలకే టీవీని కంప్యూటర్‌గా మారుస్తుంది.ఇందుకోసం ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ టీవీ, టైపింగ్ కీబోర్డ్, మౌస్, జియో క్లౌడ్ పీసీ యాప్ మాత్రం ఉంటే చాలు. స్మార్ట్ టీవీలే కాకుండా సాధారణ టీవీలను సైతం జియోఫైబర్ లేదా జియోఎయిర్‌ఫైబర్‌తో వచ్చే సెట్-టాప్ బాక్స్ ద్వారా కంప్యూటర్లుగా మార్చుకోవచ్చు. జియో క్లౌడ్ పీసీ అనేది ఇంటర్నెట్ ద్వారా ఏదైనా టీవీని క్లౌడ్ కంప్యూటింగ్‌కు కనెక్ట్ చేసే సాంకేతికత.జియో క్లౌడ్ పీసీ టెక్నాలజీని ఉపయోగించడం చాలా సులభం. యూజర్ యాప్‌లోకి లాగిన్ అయితే చాలు. క్లౌడ్‌లో స్టోర్ అయిన డేటా మొత్తం టీవీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. సాధారణంగా కంప్యూటర్లో చేసే ఈమెయిల్, మెసేజింగ్, సోషల్ నెట్వర్కింగ్, ఇంటర్నెట్ సర్ఫింగ్, స్కూల్ ప్రాజెక్ట్‌లు, ఆఫీసు ప్రెజెంటేషన్ల వంటి పనులన్నింటినీ ఇప్పుడు టీవీలో చేయవచ్చు.ఖరీదైన కంప్యూటర్లను కొనుక్కోలేని దేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఈ సాంకేతికత ఒక వరం లాంటిది. క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు కాబట్టి, సాధారణ కంప్యూటర్‌తో పోలిస్తే ఇది సురక్షితంగా ఉండటమే కాకుండా డేటా రికవరీని చాలా సులభతరం చేస్తుంది. ఇది టీవీలతో పాటు మొబైల్ పరికరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌కు సంబంధించిన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, రాబోయే నెలల్లో దీనిని మార్కెట్లో విడుదల చేయవచ్చు. -
క్లౌడ్ కిచెన్
ఒకరి వద్ద ఉద్యోగిగా పనిచేయడం కన్నా.. ఏదైనా చిన్న వ్యాపారం చేసి తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటోంది ప్రస్తుత తరం. అలాంటి వారే ‘స్టార్టప్ కంపెనీ’ అనే పేరుతో వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఇందులోంచి పుట్టిందే క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్ట. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ట్రెండింగ్, సక్సెస్ఫుల్ బిజినెస్ అంటే ఇదే. 2015లో మొదటి క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభమైంది. 2016లో ఇది ఓ వ్యాపారంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,500కి పైగా క్లౌడ్ కిచెన్ స్టార్టప్‌లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని మార్కెట్లోకి రానున్నాయి. జాతీయ క్లౌడ్ కిచెన్ బిజినెస్ మార్కెట్ విలువ ఈ ఏడాది చివరి నాటికి రూ.25వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.క్లౌడ్ కిచెన్ అంటే..సాధారణంగా ఒక పెద్ద రెస్టారెంట్గానీ, హోటల్గానీ పెట్టాలనుకుంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. రెస్టారెంట్ డిజైన్ చేయించుకోవాలి. అది వాణిజ్య ప్రదేశంలో ఉండాలి. అందువల్ల అద్దె కూడా ఎక్కువగా చెల్లించాలి. కానీ, ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్్టలో కేవలం ఒక మంచి వంటగది ఏర్పాటుచేసుకుంటే సరిపోతుంది. రెస్టారెంట్లో ఏ విధంగా కిచెన్ ఏర్పాటుచేస్తారో అలాగే ఇంటి వద్ద కూడా కిచెన్ ఏర్పాటుచేసుకోవచ్చు. ఫుడ్ ఆర్డర్లను మీరు ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం స్విగ్గి, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు.. కిచెన్ సమీపంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని సొంత డెలివరీ బాయ్స్ ద్వారా ఫుడ్ చేరవేస్తే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.రెస్టారెంట్ పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. డైన్–ఇన్ కంటే డోర్‌స్టెప్ ఫుడ్ డెలివరీని కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో క్లౌడ్ కిచెన్ల హవా పెరిగింది. వీటిని డార్క్ కిచెన్లు, గోస్ట్ కిచెన్లు, వర్చువల్ రెస్టారెంట్లు, శాటిలైట్ రెస్టారెంట్లు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇవి జనాదరణ పొందుతుండడంతో చాలా రెస్టారెంట్లు ఇప్పుడు డైన్–ఇన్ రెస్టారెంట్ కల్చర్ నుంచి డోర్ డెలివరీ సెటప్ వైపు మొగ్గుచూపుతున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులతో ఎక్కువ లాభాలు పొందడమే ఈ క్లౌడ్ కిచెన్ల ప్రత్యేకత. –సాక్షి, అమరావతిఅనుమతులు తప్పనిసరి..⇒ క్లౌడ్ కిచెన్ నిర్వహణ కోసం స్థానికంగా మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. ⇒ అలాగే, సంస్థను రిజిస్టర్ చేయించుకోవడంతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ లైసెన్స్, జీఎస్టీ రిజి్రస్టేషన్, హెల్త్ లైసెన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అవసరం. ⇒ ఇలా కేవలం రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు పెట్టుబడితో క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించవచ్చు. ⇒కాస్త భారీస్థాయిలో అయితే రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అధ్యయనం ముఖ్యం.. క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైంది అధ్యయనం. కిచెన్ పెట్టాలనుకుంటున్న ప్రాంతంలో ఎలాంటి ఫుడ్‌కు డిమాండ్ ఉంది? ప్రజల ఇష్టాయిష్టాలు, ఆహారపు అలవాట్లు, ఇప్పటికే ఎలాంటి ఫుడ్ ఎంత ధరలో అందుబాటులో ఉంది.. దాని ధరలు ఎలా ఉన్నాయి.. వంటి వివరాలను తెలుసుకుని దానిబట్టి ప్రజలు ఎక్కవగా ఇష్టపడే ఆహారాన్నే రుచికరంగా, నాణ్యతతో, తక్కువ ఖర్చులో అందించాలి. క్లౌడ్ కిచెన్‌కు లొకేషన్‌తో సంబంధంలేదు. కానీ, రోడ్డుకు కొంచెం దగ్గరగా ఉంటే మంచిది. 500 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. డెలివరీ చేసే వాహనాల పార్కింగ్‌కు స్థలం ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాయే ప్రచారాస్త్రం.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. వ్యాపారం ఏదైనాసరే సోషల్ మీడియా పేజీ ఉండాల్సిందే. ఎందుకంటే దీనిద్వారా మరింత మంది కస్టమర్లు రావచ్చు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ట్విట్టర్లలో అకౌంట్లు ఓపెన్ చేయాలి. రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తుంటే. ఆటోమెటిగ్గా ఈ బిజినెస్ గురించి జనాలకు తెలుస్తుంది.ఖర్చు తక్కువ.. క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్టతో వ్యాపారాన్ని తొలుత హైదరాబాద్‌లో మొదలుపెట్టాలనుకున్నాం. కానీ, విజయవాడ వాసులు ఆహార ప్రియులు కావడంతో ఇక్కడే ఏర్పాటుచేసుకున్నాం. మా దగ్గర నాణ్యత ఉన్న ఆహారాన్ని బాక్స్‌లో ప్యాక్‌చేసి ఇస్చ్తాం. ఉ.11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఆహారాన్ని ఆన్లైన్ ద్వారా డెలివరీ ఇస్తున్నాం. సాధారణ రెస్టారెంట్‌తో పోలి్చతే దాదాపు 30–50 శాతం ఖర్చులు తక్కువ. అందువల్లే ధరలు తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. – ప్రసాద్, క్లౌడ్ కిచెన్ నిర్వాహకుడు, విజయవాడ -
క్లౌడ్ గేమింగ్ సూపర్ ‘క్లిక్’!
సరికొత్త వీడియో గేమ్‌లు మార్కెట్లోకి రిలీజ్ అయిన వెంటనే ఆడేయాలని ఎవరికుండదు చెప్పండి! నేటి జెన్ జడ్, యువతరానికి గేమ్స్ అంటే మరీ క్రేజ్. వీటిని ఆడాలంటే హై ఎండ్ పీసీతో పాటు ఖరీదైన గేమింగ్ కన్సోల్స్ తప్పనిసరి కావడంతో చాలా మందికి అందని ద్రాక్షగానే ఊరిస్తున్నాయి. అయితే, క్లౌడ్ గేమింగ్ ఎంట్రీతో వీడియో గేమ్స్ ముఖ చిత్రమే మారిపోతోంది. అతి తక్కువ ఖర్చుతో, ఇంట్లో ఉన్న సాధారణ పీసీతోనే అదిరిపోయే లేటెస్ట్ వీడియో గేమ్స్ ఆడే అవకాశం లభిస్తుండటంతో గేమర్స్ క్లిక్.. క్లిక్.. హుర్రే అంటున్నారు!గేమింగ్ ఆన్ డిమాండ్... గేమ్ స్ట్రీమింగ్.. క్లౌడ్ గేమింగ్... పేరేదైనా కానీ గేమర్ల పాలిట వరంలా మారింది. కేవలం హైస్పీడ్ ఇంటర్నెట్, గేమ్ ప్యాడ్/కంట్రోలర్ ఉంటే చాలు.. ఇప్పుడు ఎవరైనా తమ ఫేవరెట్ గేమ్స్‌ను డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టీవీలోనే ఎంచక్కా స్ట్రీమ్ చేసేయొచ్చన్నమాట! హై క్వాలిటీ గేమ్‌ను మన సొంత సిస్టమ్‌లో రన్ చేయాలంటే, ఆడటానికి ముందే ఆ గేమ్‌ను ఫిజికల్‌గా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీనికి పూర్తి భిన్నంగా ఎక్కడో క్లౌడ్ సర్వర్లలో ఉన్న నచ్చిన గేమ్‌ను ఏ డివైజ్ లేదా ప్లాట్‌ఫామ్‌లోనైనా ఆడేందుకు (స్ట్రీమ్ చేసేందుకు) వీలవుతోంది. ఒకేసారి పలు డివైజ్‌లలోనూ గేమ్ ఆడొచ్చు. అంతేకాదు, గేమ్‌ను ఆపిన చోట నుంచే మళ్లీ ఆడుకోవచ్చు కూడా. అందుకే గేమర్స్ దీన్ని ‘నెట్‌ఫ్లిక్స్ ఫర్ గేమ్స్’ అని కూడా పిలుచుకుంటారు! రెండేళ్లలో మూడింతలు... మార్కెట్ రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్.యూఎస్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ గేమింగ్ యూజర్ల సంఖ్య 2021లో దాదాపు 10.27 కోట్ల మంది కాగా, 2023లో ఈ సంఖ్య ఏకంగా 29.1 కోట్లకు ఎగబాకింది. అంటే రెండేళ్లలోనే మూడింతలైంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా క్లౌడ్ గేమింగ్ మార్కెట్ కూడా ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తోంది. 2030 నాటికి ప్రపంచ క్లౌడ్ గేమింగ్ మార్కెట్ 46.9 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)తో 85 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని ఫార్చూన్ బిజినెస్ లెక్కగట్టింది. 2022లో ఈ మార్కెట్ విలువ కేవలం 3.37 బిలియన్ డాలర్లు మాత్రమే. మరోపక్క, క్లౌడ్ గేమింగ్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్.. 2033 నాటికి పరిశ్రమ లీడర్‌గా ఎదుగుతుందని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ తాజా నివేదిక పేర్కొనడం గమనార్హం. ‘అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన సీఎస్జీ (క్లౌడ్–స్ట్రీమ్డ్ గేమింగ్) మార్కెట్లు, ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో మూడో వంతుకు పైగా ఆక్రమిస్తున్నాయి. వచ్చే పదేళ్లలో దక్షిణ, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా మార్కెట్లు భారీగా వృద్ధి చెందనున్నాయి. ముఖ్యంగా యువతరంతో ఉప్పొంగుతున్న భారత్‌లో, 5జీ విప్లవం ఆన్లైన్ గేమింగ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేయనుంది’ అని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ ఎనలిస్ట్ నాథన్ నాయుడు పేర్కొన్నారు. భారత్.. అవకాశాల ‘క్లౌడ్’ భారీ అవకాశాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, ఎన్‌వీడియో, సోనీ మొబైల్ విభాగాలు వర్ధమాన దేశాల మార్కెట్లలో విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి. యాపిల్ కూడా తన గేమ్–స్ట్రీమింగ్ యాప్‌లను ఈ మార్కెట్లలో అందుబాటులోకి తెస్తోంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచ మార్కెట్లో ఒక్కో గేమింగ్ యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 10% వార్షిక వృద్ధి సాధిస్తుండగా.. భారత్‌లో 15% చొప్పున పెరుగుతుండటం విశేషం. ‘మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ లభ్యత, చౌక డేటా ప్లాన్లు, 4జీ/5జీ భారీ విస్తరణ, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, అవి మరింత చౌక రేట్లతో మరింత పవర్ఫుల్ ఫీచర్లతో లభిస్తుండటం వంటి అనేక అంశాలు భారత్‌లో క్లౌడ్ గేమింగ్ జోరుకు దన్నుగా నిలుస్తున్నాయి’ అని యాంట్క్లౌడ్ సీఈఓ హిమాన్షు జైన్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో సేవలు ప్రారంభించిన ఈ క్లౌడ్ గేమింగ్, పీసీ సర్వీస్ ప్రొవైడర్ ఇప్పటికే 10,000 మంది యూజర్లను సంపాదించింది. ఈ ఏడాది చివరికల్లా 50,000 సబ్‌్రస్కిప్షన్లను లక్ష్యంగా పెట్టుకుంది.టెల్కోలకు భలే చాన్స్..దూసుకెళ్తున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్లో టెల్కోలు తమ సహజ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో రిలయన్స్ జియో ‘జియో గేమ్స్ క్లౌడ్’ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. నెలకు రూ.199 ప్లాన్‌తో గేమ ర్లు చెలరేగిపోవచ్చన్న మాట! 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా అందుబాటులో ఉంది. వొడాఫోన్ ఐడియా కూడా క్లౌడ్ ప్లే పేరుతో గేమింగ్ సరీ్వస్ మొదలుపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ హ్యాండ్సెట్లలో ఎలాంటి డౌన్లోడ్లు లేకుండానే అదిరిపోయే గేమింగ్ అనుభూతిని యూజర్లకు అందిస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఒకే ‘క్లౌడ్’ను నమ్ముకుంటే ఇంతే..
సాక్షి, అమరావతి: ఒక్క ‘క్లౌడ్’నే నమ్ముకొంటే ఇంతే.. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్రపంచానికి నేర్పిన గుణపాఠమిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లౌడ్ సర్వీసులు ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్ అజూర్ పైనే ఆధారపడిన సంస్థలన్నీ ఇప్పడు చిక్కుల్లో పడ్డాయి. ఐటీ, ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఖర్చుల నియంత్రణ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడుతుంటే ఇప్పుడు వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతోంది.తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ సర్వీసెస్ ‘అజూర్’ సంక్షోభంతో ఐటీ కంపెనీలు వాటి విధానంపై పునరాలోచనలో పడ్డాయి. అజూర్ సైబర్ సెక్యూరిటీలో ఒక అప్డేట్ సందర్భంగా తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, స్టాక్ ఎక్సే్ఛంజ్, వైద్యం వంటి పలు రంగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఐటీ కంపెనీలు దీనిపైనే దృష్టి పెట్టాయి. డేటా బ్యాకప్ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడితే వాటిల్లో అజూర్ లాగా సమస్య తలెత్తితే సాధారణ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి.ఒక క్లౌడ్‌పైనే ఆధారపడొద్దుఐటీ కంపెనీలు డేటా బ్యాకప్ కోసం కేవలం ఒక క్లౌడ్ సర్వీసుపైనే ఆధారపడకుండా అత్యవసర సమయాల కోసం మరో క్లౌడ్ సర్వీసు కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అజూర్ కాకుండా పదికి పైగా ప్రముఖ క్లౌడ్ సర్వీసు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ఫ్లాట్‌ఫాంలతో పాటు ఐబీఎం, ఒరాకిల్, ఆలీబాబా, డిజిటల్ ఓషన్, వీఎంవేర్, రెడ్‌హాట్ వంటి అనేక క్లౌడ్ సర్వీసులు ఉన్నాయి.తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యంత చౌకగా క్లౌడ్ సర్వీసులు అందించే కోర్వేవ్ వంటి సంస్థలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఐటీ సంస్థలు కేవలం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఒక ఐటీ వెండర్పైనే ఆధారపడకుండా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌పైనా సేవలంగించడానికి సిద్ధంగా ఉండాలని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రొఫెసర్ ఓకు ఇస్క్ చెబుతున్నారు.మైక్రోసాఫ్ట్‌తో పాటు మ్యాక్, లీనక్స్ వంటి ఐటీ వెండర్స్నూ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణబమైన మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. సెబర్ సెక్యూరిటీలో అప్‌గ్రెడేషన్ సందర్భంగా తలెత్తిన సంక్షోభం కేవలం విండోస్కే పరిమితమైందని ఆ ప్రకటన తెలిపింది. మ్యాక్, లీనక్స్ వంటి వాటిపై ఈ ప్రభావం లేదని క్రౌడ్‌స్ట్రైక్ పేర్కొంది. అందువల్ల ఐటీ, ఇతర సంస్థలు ప్రత్యామ్నాయాలనూ అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.తప్పించుకున్న రష్యామైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్‌లో తలెత్తిన సమస్యలతో ప్రపంచవ్యాప్తాంగా అనేక దేశాల్లో పలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రష్యాలో మాత్రం ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలపై రష్యా దాడులు. ఈ యుద్ధం కారణంగా అమెరికాకు చెందిన పలు సంస్థలు రష్యాకు తమ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించాయి. అందుకే మైక్రోసాఫ్ట్ సంస్థ కొన్ని సంవత్సరాలు రష్యాకు ఎటువంటి సహకారం అందించలేదు.ఈ సంక్షోభానికి కారణమైన అమెరికాకు చెందిన క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇంత వరకు రష్యాలో అడుగే పెట్టలేదు. దీంతో రష్యా సొంత సాఫ్ట్వేర్ పైనే ఆధారపడుతోంది. కాస్పర్స్క్రై వంటి స్వదేశానికి చెందిన సెబర్ సెక్యూరిటీ సేవలనే వినియోగించుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్‌తో తలెత్తిన సంక్షోభం తమ దేశంలో ఎక్కడా కనిపించలేదని రష్యా ప్రకటించింది. -
టెకీలకు గుడ్‌న్యూస్.. 2 లక్షల మందికి ట్రైనింగ్
క్లౌడ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలలో భారత్‌లోని 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఒరాకిల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒరాకిల్, తమిళనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి ఆధారిత శిక్షణను అందించడానికి ‘నాన్ ముదల్వన్’ కింద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి.పెరుగుతున్న యువ జనాభా ఉన్న భారత్‌లోని టాప్ 12 రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. యువత, యువ ప్రొఫెషనల్స్ తమను తాము మెరుగుపరుచుకోవడానికి, కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ఒక వేదికను అందించే బాధ్యతలో భాగంగా నాన్ ముదల్వన్ను ప్రారంభించినట్లు టీఎన్ఎస్డీసీ ఎండీ జె ఇన్నోసెంట్ దివ్య చెప్పారు.ఒరాకిల్ సర్టిఫికేషన్‌ను ప్రొఫెషనల్స్‌కు ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా గుర్తిస్తారని, ఇది జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, కంపెనీలు కోరుకునే నైపుణ్యాలను కూడా ధ్రువీకరిస్తుందని ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రాంతీయ ఎండీ శైలేందర్ కుమార్ అన్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు, స్థిరత్వం పెరుగుతాయన్నారు. -
భారత్‌లో మైక్రోసాఫ్ట్ సీడబ్ల్యూబీ ప్రోగ్రాం..
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ తమ ‘కోడ్ వితౌట్ బ్యారియర్స్’ (సీడబ్ల్యూబీ) ప్రోగ్రాంను భారత్‌లోనూ ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ కలి్పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్, కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో లింగ అసమానతలను తొలగించడంలో తోడ్పడే ఉద్దేశంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాల్లో 2021లో ఈ ప్రోగ్రాంను ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు. దీని కింద మహిళా డెవలపర్లు, కోడర్స్‌కు శిక్షణ, నెట్వర్కింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు శిక్షణ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షా కోపైలట్ ప్రోగ్రాం.. ప్రధానంగా ఉపాధ్యాయులకు సాధికారత కలి్పంచేందుకు ఉద్దేశించినదని సత్య నాదెళ్ల తెలిపారు. అజూర్ ఓపెన్ఏఐ మోడల్ తోడ్పాటుతో పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు శిక్షా కోపైలట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని 30 గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. -
క్లౌడ్‌కు ఏఐ మద్దతు: క్యాప్‌జెమిని
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో ప్రతీ మూడు ఫైనాన్షియల్ సరీ్వసుల సంస్థలలో రెండు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని పేర్కొంది. తద్వారా పూర్తి వేల్యూ చైన్‌లో ఏఐ వినియోగం జోరందుకోనున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. క్లౌడ్‌ను భారీస్థాయిలో అమలు చేస్తేనే ఏఐ పెట్టుబడుల ఫలితం లభిస్తుందని తెలియజేసింది. అయితే ఫైనాన్షియల్ సరీ్వసుల కంపెనీలు క్లౌడ్‌ను పరిమిత స్థాయిలోనే వినియోగిస్తుండటంతో ఏఐ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటున్నట్లు వివరించింది. నిజానికి బ్యాంకులు, బీమా సంస్థలలో సగంవరకూ కీలకమైన బిజినెస్ అప్లికేషన్లను క్లౌడ్‌లోకి మార్పు చేసుకోనేలేదని వెల్లడించింది. అయితే కొద్ది నెలలుగా బ్యాంకులు, బీమా సంస్థలలో 91 శాతం క్లౌడ్ సర్వీసుల వినియోగంలోకి ప్రవేశించాయని పేర్కొంది. 2020లో నమోదైన 37 శాతంతో పోలిస్తే ఇది భారీ పురోగతి అంటూ నివేదిక ప్రస్తావించింది. అయితే అధిక శాతం కంపెనీలు క్లౌడ్‌లోకి ప్రవేశించినప్పటికీ.. సర్వే ప్రకారం 50 శాతం సంస్థలు కీలక బిజినెస్ అప్లికేషన్లకు నామమాత్రంగానే క్లౌడ్ సేవలు పొందుతున్నట్లు క్యాప్‌జెమిని నివేదిక వెల్లడించింది. ఏఐకు భారీ డిమాండ్ కీలక సరీ్వసులలో ఏఐ, జెన్ ఏఐ విలువ ప్రతిబింబించాలంటే క్లౌడ్‌ను భారీ స్థాయిలో అమలు చేయవలసి ఉంటుందని క్యాప్‌జెమిని ఎగ్జిక్యూటివ్ అనుజ్ అగర్వాల్ తెలియజేశారు. వెరసి బ్యాంకులు క్లౌడ్‌కు ప్రాధాన్యత ఇస్తే ఫిన్‌టెక్ సరీ్వసుల్లో వృద్ధికి ఇది సహకరిస్తుందని వివరించారు. ప్రస్తుతం ఫిన్‌టెక్‌లు కొన్ని ప్రత్యేక విభాగాలలో ఏఐను వినియోగించడం ద్వారా బ్యాంకులకు భారీ విలువను చేకూర్చుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు ఆటోమేషన్, వ్యక్తిగత కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఆర్థిక నేరాల కట్టడి, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. ప్రపంచంలోనే దేశీయంగా ఏఐ నైపుణ్యం అత్యధిక స్థాయిలో విస్తరించి ఉన్నట్లు తెలియజేశారు. ఏఐలో భారీ పెట్టుబడులు నమోదుకావడంతోపాటు.. ఏఐ సొల్యూషన్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు తెలియజేశారు. డిజిటల్ ఇండియాకు ప్రభుత్వ మద్దతు, విస్తృత డేటా అందుబాటు తదితరాలు దేశంలో ఫిన్‌టెక్ విప్లవానికి తోడ్పాటునిస్తున్నట్లు వివరించారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..
దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google) బంపరాఫర్ ప్రకటించింది. 1,000 మంది ప్రభుత్వ అధికారులకు సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ సెర్ట్ఇన్ (CERT-In)తో గూగుల్ క్లౌడ్ (Google Cloud) తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సెర్ట్ఇన్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)లో భాగం. ఇది సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, హ్యాకింగ్, ఇతర సైబర్ సంబంధిత సమస్యలను చూసుకుంటుంది. (IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!) రూ.లక్ష స్కాలర్షిప్ కూడా.. 'సైబర్ ఫోర్స్' పేరుతో కొంతమంది ప్రభుత్వ అధికారులకు సైబర్ డిఫెన్స్ బెస్ట్ ప్రాక్టీస్‌లలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా వీరికి జనరేటివ్ ఏఐ వినియోగం, సైబర్ సెక్యూరిటీ ఏఐ హ్యాకథాన్ల నిర్వహణ వంటివి గూగుల్ క్లౌడ్, మాండియంట్ నిపుణులచే నిర్వహించన్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు రూ.లక్ష స్కాలర్షిప్ కూడా ఇవ్వననున్నట్లు పేర్కొంది. ‘సైబర్ భద్రత మన డిజిటల్ భవిష్యత్తుకు మూలస్తంభం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మరింత ముందుకు సాగాలంటే జనరేటివ్ ఏఐ శక్తిని వినియోగించుకోవడం చాలా అవసరం’ అని సెర్ట్ఇన్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహ్ల్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖతో కలిసి దేశవ్యాప్తంగా భారతీయులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని సులభతరం చేస్తున్నామని, కొత్త సురక్షితమైన భద్రత సేవలను అందించడానికి సహకారం అందిస్తున్నామని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ అన్నారు. -
కొత్త మార్గంగా డబ్బావాలా క్లౌడ్ కిచెన్!
ముంబై డబ్బావాలా.. తెల్లటి యూనిఫాంలో లంచ్‌బాక్సులను సైకిల్స్‌పై రైల్వే స్టేషన్లకు, రైల్వే స్టేషన్ల నుంచి ఆఫీసులకు అందజేస్తూ బిజీబిజీగా గడిపేవారు. సైకిళ్ల మోత, లంచ్ బాక్సుల చప్పుళ్లతో ఆ రోజులన్నీ కళకళలాడేవి. కోవిడ్ ముంబైని తాకింది. తెల్లగా మెరిసే వారి డబ్బాలు కార్పొరేట్ కార్యాలయాల నుంచి అదృశ్యమయ్యాయి. దుమ్ము పేరుకుపోయిన డబ్బాలు, తుప్పు పట్టిన సైకిళ్లు మిగిలిపోయాయి. వారి తెల్లటి యూనిఫాంలు, గాంధీ టోపీలు అల్మారాలో ముడుచుకున్నాయి. కరోనా ప్రభావం వివిధ వర్గాలతోపాటు వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయాలకు లంచ్ బాక్స్‌లు చేసే డబ్బావాలాలపైనా తీవ్రంగా చూపింది. లాక్‌డౌన్‌కు ముందు ముంబైలో సుమారు 5000కుపైగా డబ్బావాలాలుండేవారు. వివిధ కారణాలవల్ల ఈ సంఖ్య రెండు వేలకు చేరింది. ప్రస్తుతం ముంబైలో కేవలం 1,500 డబ్బావాలాలున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడం వారిని కలవర పెడుతోంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్‌లో ముంబైలో డబ్బావాలాలు కనుమరుగయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో.. ఒకప్పుడు మేనేజ్మెంట్ గురుగా ప్రపంచంలో గుర్తింపు పొందన ముంబై డబ్బావాలాల ఉనికి ప్రమాదంలో పడింది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ ప్రభావం డబ్బావాలాలపై తీవ్రంగా చూపింది. లాక్డౌన్ సమయంలో రవాణా సదుపాయంలేక వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. అప్పుడు డబ్బావాలాల అవసరమే లేకపోయింది. వారికి అసలు ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయి. ట్యాక్సీలు, బస్సులు, లోకల్ రైళ్లు తదితరా రవాణ వ్యవస్థలు యథాస్థితికి వచ్చాయి. అయినప్పటికీ అనేక మంది ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కొన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. పని చేస్తున్న మరికొన్ని కార్యాలయాల్లో క్యాంటీన్లు ప్రా రంభించారు. కొందరు ఉద్యోగులు ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు వెంట తీసుకొస్తున్నారు. కొందరు ఉ ద్యోగులు ఆన్లైన్లో ఆర్డర్చేసుకుంటున్నారు. దీంతో డబ్బావాలాల అవసరం లేకుండా పోయింది. లక్ష నుంచి 50 వేలకు.. ఒకప్పుడు ప్రతీరోజు రెండు లక్షల లంచ్‌బాక్స్‌లు చేరవేసిన ఈ డబ్బావాలాలు ఇప్పుడు 40 నుంచి 50 వేల వరకు మాత్రమే అందజేస్తున్నారు. ఫలితంగా వారి ఆదాయానికి గండిపడింది. ఒకప్పుడు ఒక్కో డబ్బావాలా నెలకు రూ.20 నుంచి 25 వేలు సంపాదించేవాడు. లంచ్ బాక్స్‌ల సంఖ్య తగ్గడంతో ఇప్పుడు రూ.12 నుంచి 15 వేలు ఆదాయం రావడం కూడా గగనమైపోయింది. అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారింది. ఫలితంగా ఈ మార్గాన్ని వదులుకుని మరో ఉద్యోగ వేటలో పడ్డారు. డబ్బావాలాల సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. దివాలో నివసించే 40 ఏళ్ల సచిన్ గావ్డే డబ్బావాలాగా జీవితాంతం పేరు తెచ్చుకున్నాడు. అతని ముత్తాతలు 1952 నుండి ముంబైలో డబ్బాలను పంపిణీ చేస్తున్నారు. అదే అతని గుర్తింపు, జీవనాధారం. వర్క్ ఫ్రమ్ హోమ్ తమ జీవితాలను పూర్తిగా తలకిందులు చేసిందని చెబుతున్నాడు. క్లౌడ్ కిచెన్.. ఆన్లైన్ ఆర్డర్స్ అయితే.. దీన్ని ఎదుర్కోవడానికి డబ్బావాలాల నాల్గోతరం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇటీవలే క్లౌడ్ కిచెన్‌ను మొదలుపెట్టారు. చాలామంది ఇంటి నుంచే పనిస్తుండటంతో లంచ్ బాక్స్‌లను డెలివరీ చేసే తమ సంప్రదాయ వ్యాపారం క్షీణించింది. ఈ నేపథ్యంలో మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి వంట చేయడం, హోమ్‌స్టైల్ మీల్స్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట సాకినాకాలో సెంట్రల్ కిచెన్‌ను స్థాపించాలని ప్లాన్ చేశారు. ఒక స్థలం నుంచి నగరవ్యాప్తంగా భోజనాన్ని పంపిణీ చేయడం సవాలుగా మారుతుందని భావించి వికేంద్రీకృత విధానాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ముంబయిలోని వివిధ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో డబ్బావాలాలు భాగస్వాములు అవుతున్నారు. కొంతమంది మహిళలు కలిసి వండిన ఆహారాన్ని ఆయా ప్రాంతాల దగ్గర్లోని ఆర్డర్లకు సప్లై చేస్తున్నారు. దీనివల్ల మహిళలు జీవనోపాధి పొందడంతోపాటు డబ్బావాలాలకు ఉపాధి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఆన్లైన్ ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఆన్లైన్ మెనూని బ్రౌజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు. శాఖాహార, మాంసాహార భోజనం ఉంటుంది. ధర పరిమాణాన్ని బట్టి రూ. 95 నుంచి ప్రారంభమై రూ.120 వరకు ఉంటుంది. రోజువారీ లేదా నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకోవచ్చు. ముందు రోజు సాయంత్రంలోపు ఆర్డర్ చేస్తే లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య డెలివరీ చేస్తున్నారు. (చదవండి: వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరు..!) -
'కిచెన్ క్వీన్స్'..వంటగదితోనే వ్యాపారం సృష్టించారు!
కొందరూ మహిళలు మహమ్మారీ కాలాన్ని చెడు కాలంగా ఫీలై గదులకే పరిమితమైపోలేదు. అవరోధంగా భావించకుండా అవకాశంగా మలుచుకున్నారు. వ్యాపారాన్ని సృష్టించుకునేందుకు అనువైనం కాలంగా క్యాష్ చేసుకున్నారు. వ్యాపారవేత్తలుగా మారి స్త్రీ సత్తా ఏంటో చూపించారు. నిజానికి కరోనా కాలం ఎంత భయానకంగా ఉందో చెప్పనవసరం లేదు. ఆ రోజులు గుర్తొచ్చిన బాబోయ్..! అనిపిస్తుంది. కానీ ఈ మహిళలు దాన్నే వరంగా మార్చుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంతో కుటుంబ ఆదాయన్ని సృష్టించుకుంటే. మరికొందరూ ఆ సక్సెస్ ఇచ్చిన స్థైర్యంతో తమ వ్యాపారాన్ని మరింత విస్తరింప చేసేలా చేసుకున్నారు. ఈ మేరకు లక్నోలో ఉండే 51 ఏళ్ల మీనాక్షి ఆర్య వంటపై తనకున్న ఆసక్తనే అవకాశంగా మలిచుకుంది. ఆ వంటిల్లునే చిన్నపాటి వాణిజ్యసంస్థగా మార్చింది. 'పంజాబీ కధై' అనే పేరుతో వివిధ రుచులను పరిచయం చేసింది. కోవిడ్ రోగులకు ఆహారాన్ని అందించడం ద్వారా ప్రారంభమైన బిజినెస్ కాస్త మరింతగా విస్తరించింది. ఆ టైంలో 'క్లౌడ్ కిచెన్' పేరుతో మహిళలు ఇంటి దగ్గరే స్వయంగా తయారు చేసిన ఆహారాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చాలామందికి ఆధారం అయ్యింది. ఎందుకంటే లాక్డౌన్ కారణంగా హోటల్స్, రెస్టారెంట్ మూసేయడంతో ఇది ఆ మహిళలకు వరమై మంచి ఆధాయ వనరుగా మారింది. ఇక అప్పుడు ఆ టైంలో ఫుడ్‌ని మీనాక్షి భర్తే డెలీవరీ చేసేవాడు. ప్రస్తుతం మాత్రం ఆమె ఉబర్‌లో పనిచేసే వ్యక్తి సాయంతో ఆర్డర్లు డెలివరీ చేస్తూ వ్యాపారాన్ని దిగ్విజయంగా నడుపుతోంది. అదేబాటలో నడిచింది శిక్షా ఖండేల్వాల్ ఆమె కూడా తన ఇంటి నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి డెలివరి చేసింది. ఆమె ఎక్కువగా కొరియర్ సర్వీస్‌లపై ఆధారపడింది. అదీగాక ఆ టైంలో టెక్కీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఉద్యోగాలు పోయి వీధిలో నిలబడి పోయే స్థితిలో ఆమెకు కూడా ఈ క్లౌడ్ కిచెన్ ఆధారమైంది. ఇదే కోవలోనే కోలకతాకు చెందని మాజీ ఐటీ ప్రోఫెషనల్ శిక్ష అత్యంత విజయవంతమైన 'కస్ట్మైజ్డ్ క్లౌడ్ కిచెన్'ని నడుపుతోంది. అదే ఆమె ఆధాయానికి బాసటయ్యింది. అలాగే తనలా ఇబ్బంది పడుతున్న ఐటీ వాళ్లకు కూడా ఈ వ్యాపారాన్ని పరిచయం చేసి..తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించే యత్నం చేస్తోంది. ఆమె శాఖాహారం, మాంసహారాన్ని ఎలాంటి డెలీవరీ చార్జీలే లేకుండానే అందిస్తున్నారు. వాటి తోపాటు పచ్చళ్లు, మురబ్బా, పాపడ్, తదితర వాటిని కూడా విక్రయిస్తుంది. ఏదీ ఏమైనా మనసు ఉండాలే గానీ చెడుకాలాన్ని కూడా చెడుగుడు ఆడేలా చక్కటి అవకాశం మార్చుకోవచ్చు అని నిరూపించారు ఈ మహిళలు. (చదవండి: కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్!ఏంటంటే ఇది!) -
హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..!
డెహ్రాడూన్: నైరుతి రుతుపవనాలు ఉత్తరాదిలో బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్‌లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే.. గత నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమైన నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఓ వింతైన దృగ్విశయం ఆవిషృతమైంది. సునామీ అలవలె కనిపించిన దట్టమైన మేఘాలు హరిద్వార్‌ను ముంచెేస్తాయా.! అనేలా గోచరించాయి. చూపరులకు కనువిందుగా కనిపించే ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హిమాలయాల అంచున ఉన్న పవిత్రమైన హరిద్వార్ అది. ఆద్యాత్మికతకు పెట్టింది పేరు. ఎక్కడ చూసినా అందమైన, ఎత్తైన కొండ ప్రాంతాలే ఉంటాయి. నాలుగు రోజులుగా వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆకాశమంతా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. సముద్రుడే మీద పడిపోతున్నాడా అనేంతగా పెద్ద అలల వలె కనిపిస్తున్న మేఘాలు ఒక్కసారిగా దూసుకొచ్చేశాయి. చూపరులకు కనువిందుగా కనిపించినప్పటికీ ఆ దృశ్యాలు భీతికొల్పేవిగా ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Massive shelf cloud appears in Haridwar, Uttarakhand. pic.twitter.com/vl7lU5yFjf — Anshul Saxena (@AskAnshul) July 11, 2023 భారీ వర్షాలు కురుస్తున్నందున వరద నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. ఆకస్మిక వరదల్లో వాహనాలు, రహదారులు కొట్టుకుపోయాయి. పంటపొలాలు, నివాసప్రాంతాలు నీటమునిగాయి. ఢిల్లీలో యమునా నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక యంత్రాంగాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని కోరారని పీఎంవో తెలిపింది. ఇదీ చదవండి: Himachal Pradesh Heavy Rains: ఉత్తరాది అతలాకుతలం.. మూడో రోజూ భారీ వర్షాలు, ప్రమాదస్థాయికి చేరుకున్న యమున -
అమెజాన్ దిమ్మతిరిగే పెట్టుబడులు: ఏడాదికి లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2030 నాటికి భారతదేశంలో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో12.7 బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సహా దిగ్గజ టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్న వేళ తాజా గుడ్ న్యూస్ వెల్లడించడం విశేషం. (మెగా బోనస్: 8 నెలల జీతం, ఎయిర్‌లెన్స్ ఉద్యోగుల సంబరాలు) అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 2030 నాటికి రూ. 1,05,600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గురువారం (మే 18) ప్రకటించింది. దీంతో తమ దీర్ఘకాలిక పెట్టుబడులు 2030 నాటికి రూ. 1,36,500 కోట్లకు ( 16.4 బిలియన్డాలర్లు) చేరుతుందని పేర్కొంది. దేశంలో క్లౌడ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ పెట్టుబడి ద్వారా ఏడాదికి సగటున 131,700 ఫుల్ టైం ఉద్యోగాలను సృష్టించనుందని అంచనా. అంతేకాదు 2030 నాటికి భారతదేశ మొత్తం స్థూల జాతీయోత్పత్తికి రూ.1,94,700 కోట్లు (23.3 బిలియన్ల డాలర్లను) అందజేస్తుంది కాగా 2016-22 మధ్య కాలంలో కంపెనీ మనదేశంలో దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను పెట్టింది. (గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్ భారతదేశంలో క్లౌడ్ అండ్ డేటా సెంటర్ల విస్తరణకు దారితీస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఇది ఖచ్చితంగా భారతదేశ డిజిటల్ ఏకానమీకి ఊతమిస్తుందంటూ అమెజాన్ పెట్టుబడులు స్వాగతించారు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) 2016 నుంచి తాము ఇండియా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టామని, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పునీత్ చందోక్ అన్నారు ఇండియా డిజిటల్ పవర్‌హౌస్‌గా గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని సీఈవో ఆడమ్ సెలిప్స్కీ వెల్లడించారు. .@awscloud has long been vested in India’s growth as a digital powerhouse, and I’m inspired to see how our infrastructure presence since 2016 has driven such tremendous progress. Today we’re announcing additional planned investment of $12.7 billion for cloud infrastructure in… pic.twitter.com/6Ml9DtpRWD — Adam Selipsky (@aselipsky) May 18, 2023 -
6 బిజినెస్ గ్రూపులుగా అలీబాబా
న్యూయార్క్: ఆరు విభిన్న బిజినెస్ గ్రూప్‌లుగా సంస్థను విడదీయనున్నట్లు చైనా కార్పొరేట్ దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. క్లౌడ్ ఇంటెలిజెన్స్, టౌబవ్ టీమాల్ బిజినెస్, లోకల్ సర్వీసెస్, గ్లోబల్ డిజిటల్ బిజినెస్, కాయ్నియావో స్మార్ట్ లాజిస్టిక్స్, డిజిటల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ గ్రూపులుగా విడదీయనున్నట్లు నియంత్రణ సంస్థలకు అలీబాబా సమాచారమిచ్చింది. దీంతో మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో అలీబాబా షేరు 8 శాతం జంప్‌చేసింది. కాగా.. ఒక్కో గ్రూప్ విడిగా పెట్టుబడులు సమీకరించగలదని తెలియజేసింది. తద్వారా పబ్లిక్ ఇష్యూలను చేపట్టగలవని పేర్కొంది. అయితే టౌబవ్ టీమాల్ బిజినెస్ గ్రూప్ మాత్రం అలీబాబాకు అనుబంధ సంస్థగా వ్యవహ రించనున్నట్లు వెల్లడించింది. మిగిలిన గ్రూప్‌లన్నీ సొంత సీఈవో, డైరెక్టర్ల బోర్డుతో స్వతంత్రంగా కార్యకలాపాలు సాగించనున్నట్లు స్పష్టం చేసింది. టౌబవ్ టీమాల్ బిజినెస్ గ్రూప్‌లో టౌబవ్, టీమాల్, టౌబవ్ డీల్స్, 1688.కామ్ తదితరాలు భాగం కానున్నట్లు తెలియజేసింది. -
మైక్రోసాఫ్ట్‌లో మూడో రౌండ్ తీసివేతలు, ఈసారి ఎవరంటే?
న్యూఢిల్లీ: టెక్దిగ్గజాల్లో వరుసగా ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెటా మరో దఫా జాబ్ కట్స్‌ను ప్రకటించగా తాజాగా మైక్రోసాఫ్ట్ మూడవ రౌండ్ ఉద్యోగ కోతలను నిర్వహించింది.ముఖ్యంగా. సరఫరా గొలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)కి సంబంధించిన ఉద్యోగులను తొలగించింది. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన 10వేల ఉద్యోగాల కోతలలో భాగంగానే వీరిని తొలగించిందని సీఆర్ఆన్ నివేదించింది. 689 మంది ఉద్యోగులను శాశ్వతంగా తొలగించినట్లు టెక్ దిగ్గజం సోమవారం తన సొంత రాష్ట్రానికి నివేదించింది. వివిధ స్థాయిలు, విధులు, టీమ్స్, భౌగోళికాల్లో ఉద్యోగాల కోతలు ఉన్నాయని కంపెనీని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.రికార్డుల ప్రకారం వాషింగ్టన్ రాష్ట్రంలో టెక్ దిగ్గజం ఇటీవల 689 మందిని ఫిబ్రవరిలో, 617 మంది ఉద్యోగులను తొలగించింది, ఇదే నెలలో, 108 మందిని, జనవరిలో, మైక్రోసాఫ్ట్ 878 మందిపై వేటు వేసింది. దీంతో వాషింగ్టన్ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,184కి చేరుకుంది. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌కు బై..బై చెప్పి ప్రత్యర్థి కంపెనీకి సీఎండీగా బాధ్యతలు కాగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగి లింక్డ్ఇన్ పోస్ట్ ప్రకారం, కంపెనీ తన ఏఐ ఆధారిత ఆటోమేషన ప్రాజెక్ట్ బోన్సాయ్‌ను మూసివేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం టీంను కూడా తొలగించింది. ప్రస్తుతం కంపెనీలో సుమారు 220,000కు పైగా ఉద్యోగులు ఉండగా, వీరిలో 5 శాతం మందిని లేఆఫ్స్ ప్రభావితం చేసింది. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివరి నాటికి మొత్తం పదివేల ఉద్యోగాలు తగ్గించే ప్లాన్లను గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నాలుగు విభాగాలపై విప్రో ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ: క్లయింట్ల వ్యాపార అవసరాలకు అనుగుణంగా మెరుగైన సర్వీసులు అందించడంపై, అలాగే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై విప్రో మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా నాలుగు వ్యూహాత్మక వ్యాపార విభాగాలపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. క్లౌడ్, ఎంటర్ప్రైజ్ సాంకేతికత .. వ్యాపార పరివర్తన, ఇంజినీరింగ్, కన్సల్టింగ్ వీటిలో ఉంటాయి. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. నిర్ణయాల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు, పెట్టుబడుల విషయంలో సమర్ధమంతంగా వ్యవహరించేందుకు ఇవి తోడ్పడగలవని విప్రో ఎండీ థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. క్లౌడ్ సామరధ్యలన్నింటినీ విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ విభాగం కిందికి తేనున్నారు. ప్రస్తుతం క్లౌడ్ ఇన్ఫ్రా సర్వీసుల విభాగానికి హెడ్‌గా ఉన్న జో డెబెకర్ దీనికి సారథ్యం వహిస్తారు. ప్రస్తుతం విప్రో ఐకోర్ వ్యాపార హెడ్‌గా ఉన్న నాగేంద్ర బండారు .. విప్రో ఎంటర్ప్రైజ్ ఫ్యూచరింగ్కు గ్లోబల్ హెడ్‌గా ఉంటారు. క్యాప్కో, డిజైనిట్ మొదలైనవన్నీ విప్రో కన్సల్టింగ్ విభాగం కింద ఉంటాయి. -
వింత ఘటన: ఆకాశంలో కనువిందు చేస్తున్న క్వీన్ ఎలిజబెత్ ఆకృతి
లండన్: క్విన్ ఎలిజబెత్ ఇక లేరు అని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించినన కొద్ది క్షణాల్లో యూకేలోని గగనపు వీధుల్లో పలు వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక చోట ఆకాశంలో మేఘం ఆమె ఆకృతిలో కనువిందు చేసింది. సెప్టెంబర్ 8న ఆమె మరణాన్ని ధృవీకరించిన కొద్ది క్షణాల్లో ఇలా యూకే గగన వీధుల్లో మేఘం ఇలా కనువిందు చేయడం అందర్నీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఈ ఘటన యూకేలోని ష్రాప్‌షైర్‌లోని టెల్ఫోర్డ్లో చోటు చేసుకుంది. లీన్ అనే మహిళ తన కుమార్తె లీసాతో కలసి కారులో ప్రయాణిస్తున్నప్పుడూ ఆకాశంలో ఈ దృశ్యం కనువిందు చేసింది. దీంతో వారు కొన్ని ఫోటోలను తమ కెమరాలో బంధించారు. ఇలాంటి వింత సంఘటనే బకింగ్‌హామ్ ప్యాలెస్ పై కూడా కనిపించింది. ప్యాలెస్ ఆమె లేరని ప్రకటించిన వెంటనే అక్కడ ఆకాశంలో డబుల్ రెయిన్ బో కనువిందు చేసింది. Queen Elizabeth spotted in the clouds. What a photo 🇬🇧❤️ pic.twitter.com/9AxJZlJknv — airborne assault services (@Wayne57072607) September 8, 2022 A double rainbow today over Buckingham Palace ❤️ They say a double rainbow symbolizes a transformation in life and when it appears after someone passes it is a gateway to heaven. Rest In Peace #QueenElizabeth pic.twitter.com/uXhdjYHTUQ — Jennifer Valentyne (@JennValentyne) September 8, 2022 (చదవండి: యాభై ఏళ్ల తర్వాత... ప్రభుత్వ లాంఛనాలతో క్వీన్‌కి అంత్యక్రియలు) -
అద్భుతం.. ఆకాశంలో కిరీట హరివిల్లు.. ఎందుకిలా ఏర్పడుతుందో తెలుసా!
చైనాలోని హైనన్ ప్రావిన్సులో ఉన్న హైకు నగరంలో ఇటీవల ఇంద్రధనుస్సు రంగుల్లో మెరిసిన మబ్బుల కిరీటమిది. ప్రకృతి చేసిన ఈ చిత్రవిచిత్రం నెటిజన్లను ఎంతగానో అబ్బురపరించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మబ్బుల్లోని నీటి బిందువులు, మంచు ముక్కల మధ్య సూర్యకాంతి వివర్తనం చెందినప్పుడు ఇంద్రధనుస్సు రంగుల్లో మేఘం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తరహా మబ్బులను పిలియస్, క్యాప్ క్లౌడ్స్ లేదా స్కార్ఫ్ క్లౌడ్స్‌గా పిలుస్తారని పేర్కొన్నారు. ఒక ప్రాంతంపై క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే క్రమంలో వాటి చుట్టూ ఉండే గాలి వేగంగా మరింత ఎత్తుకు చేరుకున్నాక అందులోని నీరు ఘనీభవించి గొడుగు ఆకారంలో ఈ మబ్బులు ఏర్పడతాయన్నారు. వాతావరణం తీవ్రంగా మారుతోందనేందుకు ఈ తరహా మేఘాలు సంకేతమని వివరించారు. చదవండి: 3 నెలల పాటు వండారు.. 8 నెలలు తిన్నారు Rainbow colored scarf cloud over Haikou city in China pic.twitter.com/ewKmQjsiIE — Sunlit Rain (@Earthlings10m) August 26, 2022 -
పచ్చని పంటపై కమ్ముకున్న కారుమేఘం
ఒట్టావా: ఆవాల పంటపై కుండపోత కురిపిస్తుందా అన్నంతగా కమ్ముకుంటున్న కారు మబ్బులివి. కెనడాలోని ఆల్బెర్టా రాష్ట్రంలోని క్రిమోనా గ్రామంలో శనివారం తీసిన ఫొటో ఇది. ఇదీ చదవండి: వరదలో మునిగిపోయిన ఇల్లు.. ప్రాణంగా ప్రేమించే శునకం కోసం బాలిక రిస్క్.. గంటలపాటు రూఫ్ పైనే.. -
ఎయిర్టెల్, టెక్ మహీంద్రా జట్టు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా చేతులు కలిపాయి. 5జీ, ప్రైవేట్ నెట్‌వర్క్‌లు, క్లౌడ్ వంటి విభాగాల్లో కంపెనీలకు అవసరమయ్యే డిజిటల్ సొల్యూషన్స్‌ను సంయుక్తంగా అభివృద్ధి, మార్కెటింగ్ చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్టెల్ ఇప్పటికే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. అటు టెక్ మహీంద్రా 5జీ సర్వీసులకు సంబంధించిన అప్లికేషన్స్, ప్లాట్‌ఫామ్‌లను రూపొందించింది. ఒప్పందం ప్రకారం భారత్, అంతర్జాతీయ మార్కెట్లలో 5జీ సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఇరు సంస్థలు సంయుక్తంగా ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాయి. -
బాచుపల్లిలో క్లౌడ్ 33
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అలయన్స్ గ్రూప్ అనుబంధ కంపెనీ అర్బన్‌రైజ్ బాచుపల్లిలో క్లౌడ్–33 అనే పేరుతో లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. 9.15 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో 2,600 లగ్జరీ అపార్ట్మెంట్లుంటాయి. 1,100 నుంచి 2,021 చ.అ.లలో 2, 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. సింగపూర్‌లోని సిటీస్కేప్స్, మొరాకో రాయల్ రెసిడెన్సీలను స్ఫూర్తిగా తీసుకొని ఈ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 85 వేల చ.అ.లలో క్లబ్ హౌస్‌లో జీరో గ్రావిటీ యోగా గది, రూఫ్ టాప్ మీద బార్బిక్యూ, ప్రైవేట్ పార్టీ ఏరియా, గ్రీన్ డైనింగ్, గేమింగ్ జోన్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. ముందస్తు సొమ్ము చెల్లించి బుకింగ్ చేసుకుంటే చాలు 2026లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాతే కొనుగోలుదారులకు నెలవారీ వాయిదా (ఈఎంఐ) మొదలవుతుందని ఈడీ రాజేంద్ర జోషి తెలిపారు. 1,3 ఎకరాల స్థలాన్ని సెంట్రల్ ల్యాండ్ స్కేపింగ్‌ను కేటాయించారు. దీంతో 75 శాతం స్థలం ఓపెన్ స్పేస్ ఉంటుంది. భవిష్యత్తులో పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘జీనియస్’ నాలెడ్జ్ సెంటర్‌ను నిర్మిస్తోంది. ఇందులో క్రచ్, డే కేర్ సెంటర్లతో పాటు ఆన్లైన్, ట్యూషన్, సంగీతం, నృత్యం, కుకరీ, ఏఐ, రోబోటిక్స్ వంటి శిక్షణ తరగతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. దీంతో పిల్లలకు భద్రత, రక్షణ ఉండటమే కాకుండా వారి అభిరుచులకు తగ్గట్లుగా శిక్షణ ఇప్పించేందుకు వీలవుతుంది. -
ఐటీ, బిజినెస్ సర్వీసెస్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 6.4 శాతం వృద్ధి సాధించింది. విలువ రూ.51,713 కోట్లకు చేరింది. ఐడీసీ నివేదిక ప్రకారం.. 2019 తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే గతేడాది ఇదే కాలంలో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ 5.1 శాతం వృద్ధి సాధించింది. కంపెనీలు డిజిటల్ వైపు పెద్ద ఎత్తున ఫోకస్ చేయడమే ఈ వృద్ధికి కారణం. పరిశ్రమలో ఐటీ సేవల వాటా 78 శాతం ఉంది. వృద్ధి 7.3 శాతం నమోదైంది. అంత క్రితం ఏడాది ఇది 5.7 శాతం. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతోపాటు క్లౌడ్, సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో కంపెనీల పెట్టుబడి వ్యయం పెరగడంతో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ రాబోయే కాలంలో మరింత జోరుగా ఉంటుంది. నాలుగేళ్లలో ఇలా.. భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 2025 నాటికి రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఐడీసీ తెలిపింది. ‘2020–25 మధ్య ఏటా 8.2 శాతం వృద్ధి సాధిస్తుంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ దెబ్బపడినప్పటికీ వ్యాపార విధానం మార్పు, కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు, వినియోగదార్లు, సిబ్బంది అనుభూతి పెరిగేందుకు, స్థితిస్థాపకత మెరుగుకు సంస్థలు డిజిటలీకరణకు పెట్టుబడులను కొనసాగిస్తాయి. ప్రభుత్వ, తయారీ రంగాలు 2020లో ఐటీ పెట్టుబడులను ఆలస్యం చేశాయి. 2021 జనవరి–జూన్‌లో ఖర్చులను పెంచాయి. వ్యాక్సినేషన్, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం, కస్టమర్ల సెంటిమెట్‌తో పరిశ్రమ కోవిడ్ ముందస్తు స్థాయికి తిరిగి రానుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలు ప్రాసెస్ ఆటోమేషన్, కస్టమర్ల అనుభూతి, హైబ్రిడ్ క్లౌడ్ నిర్వహణపై ఫోకస్ చేశాయి’ అని వివరించింది. -
మీ డాక్యుమెంట్లు భద్రమేనా...
ఒకప్పటితో పోలిస్తే నేటి జీవనంలో ఆర్థిక లావాదేవీల పాత్ర మరింత ఎక్కువైందనే చెప్పుకోవాలి. వ్యక్తుల ఆర్జనా శక్తి పెరిగినందున.. అవసరాలు, ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ప్రాపర్టీలు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు, బీమా పాలసీలు, బ్యాంకు ఖాతాలు.. లిస్ట్ పెద్దగానే ఉంటుంది. కానీ, వీటికి సంబంధించి డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకుంటున్నామా? తప్పకుండా ఉంచుకోవాలి. వీటికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను ఎక్కడ నిల్వ చేస్తున్నారు? సాధారణంగా ఈ డిజిటల్ డాక్యుమెంట్లు మెయిల్ బాక్స్‌లకు వస్తుంటాయి. స్టాక్స్‌లో లావాదేవీలకు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఏ రోజుకారోజు మెయిల్ బాక్స్‌కు వస్తుంటాయి. బీమా కంపెనీలు అయితే ప్రస్తుతం ఈ పాలసీ పత్రాలను రిజిస్టర్డ్ ఈ మెయిల్ అడ్రస్‌లకు పంపిస్తున్నాయి. పాలసీ ప్రీమియం సర్టిఫికెట్లను కూడా మెయిల్‌కు పంపిస్తున్నాయి. ఇలా భారీగా వచ్చే డిజిటల్ డాక్యుమెంట్లను ‘డిలీట్’ కొట్టేసేవారూ ఉన్నారు. కానీ, వేటి అవసరం ఎంత మేరకు అన్నది తెలుసుకోకుండా డిలీట్ చేయవద్దు. ప్రతీ డాక్యుమెంట్‌ను ఎంత కాలం పాటు ఉంచుకోవాలన్నది తెలిస్తే.. అప్పుడు వాటి నిర్వహణ సులువవుతుంది. ఐటీ... ఏటా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడంతో పని అయిపోయిందని భావిస్తే అది తప్పే అవుతుంది. ఆదాయపన్ను రిటర్నుల్లో పేర్కొన్న ఆదాయం, పెట్టుబడులు, ఇతరత్రా వనరుల సమాచారానికి సంబంధించిన ఆధారాలు కూడా మీ వద్ద భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ‘‘పన్ను చెల్లింపుదారు తన పన్ను వివరాలను, ఇందుకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు, ఆధారాలను కనీసం ఏడేళ్లపాటు ఉంచుకోవాలి. ఏడేళ్ల వరకు ఏదేనీ ఆసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను తిరిగి విచారించే అధికారం ఆదాయపన్ను శాఖా అధికారులకు ఉంటుంది’’అని ఎన్ఏ షా అసోసియేట్స్ పార్ట్నర్ గోపాల్ బోహ్రా తెలిపారు. ఒకవేళ గత కాలానికి సంబంధించి రిటర్నుల విషయమై ఏదైనా వివాదం ఆదాయపన్ను శాఖతో నెలకొని ఉంటే.. అది పరిష్కారం అయ్యే వరకు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పకుండా ఉంచుకోవాలని సూచించారు. ‘‘పన్ను చెల్లింపుదారుల ప్రాంగణాల్లో ఆదాయపన్ను శాఖా సోదాలు నిర్వహించినట్టయితే.. ఆ సందర్భంగా రూ.50 లక్షలకు మించి ఆస్తి లేదా ఆదాయాన్ని అసెసింగ్ అధికారి గుర్తించితే, అప్పుడు 10 ఏళ్ల నాటి పాత రికార్డులను కూడా తిరిగి విచారించే అధికారం కలిగి ఉంటారు’’ అని బోహ్రా వివరించారు. విదేశీ మార్గంలో ఆదాయాన్ని కలిగి ఉంటే లేదా విదేశీ ఆస్తి కలిగి ఉంటే సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుంచి 17 ఏళ్ల పాటు ఆయా ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆదాయాన్ని దాచిపెట్టినట్టు పన్ను అధికారులు భావిస్తే.. సంబంధిత అసెస్మెంట్ను తిరిగి తెరిచేందుకు చట్ట ప్రకారం వారికి 17 ఏళ్ల పాటు అధికారం ఉంటుంది. ► బ్యాంకు పత్రాలు రుణాలు తీసుకుని, చెల్లింపులు పూర్తయిన తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ‘‘రుణాన్ని పూర్తిగా చెల్లించేసినప్పటి నుంచి కనీసం ఎనిమిదేళ్ల పాటు డాక్యుమెంట్లను అలాగే ఉంచుకోవాలి. ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఆధారంగా ఇంతకాలం పాటు వాటిని భద్రపరుచుకుంటే సరిపోతుంది’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి సూచించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కూడా బ్యాంకులు ఐదు నుంచి ఎనిమిదేళ్ల పాటు పత్రాలను నిల్వ చేయాల్సి ఉంటుంది. కనుక ఇంత కాలం పాటు రుణాన్ని తీర్చివేసిన ఆధారాలను ఉంచుకుంటే సరిపోతుంది. భద్రత ఎక్కడ..? డాక్యుమెంట్లను నిల్వ చేసుకునేందుకు పలు మార్గాలున్నాయి. మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో పదిలపరుచుకోవచ్చు. లేదంటే పెన్‌డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్‌లు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో క్లౌడ్ స్టోరేజీ సదుపాయాలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ముఖ్యమైన పత్రాలను తమ ఈ మెయిల్ బాక్స్‌లోనే ఉంచేస్తుంటారు. ‘‘ఈ మెయిల్లో నిల్వ చేయడం అన్నది భద్రతా పరంగా సురక్షితమైనది కాదు. ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు పాస్‌వర్డ్‌తో వాటికి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. బిట్లాకర్ను ఇందుకు వినియోగించుకోవచ్చు’’ అని ఇన్ఫ్రాసాఫ్ట్ టెక్ ప్రొడక్ట్, ఇన్నోవేషన్ హెడ్ మనోజ్ చోప్రా తెలిపారు. బిట్లాకర్లో ఎన్క్రిప్షన్ సదుపాయం ఉంటుంది. దీంతో ఇందులో నిల్వ చేసుకునే డాక్యుమెంట్లకు రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా క్లౌడ్ రూపంలోనూ డాక్యుమెంట్లను భద్రపరచుకునే అవకాశం ఉంది. గూగుల్ డాక్యుమెంట్స్, ఐక్లౌడ్, డ్రాప్‌బాక్స్ ఇటువంటివే. స్కాన్ చేసిన డాక్యుమెంట్లను వీటిల్లో స్టోర్ చేసుకుని ఎక్కడి నుంచి అయినా తిరిగి పొందొచ్చు. ముఖ్యమైన, అవసరమైన డాక్యుమెంట్లను లోకల్‌గా (కంప్యూటర్లు, డిస్క్‌లు) స్టోర్ చేసుకోవడంతోపాటు.. వాటి బ్యాకప్ తీసుకుని కనీసం రెండు క్లౌడ్ వేదికల్లో అయినా పదిలం చేసుకోవాలని చోప్రా సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజీ లాకర్ కూడా ఇందుకు చక్కని వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ బీమా పాలసీ డాక్యుమెంట్‌తోపాటు, కట్టిన ప్రీమియం రసీదులను కూడా భద్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. దీనివల్ల భవిష్యత్తులో క్లెయిమ్ పరంగా ఎటువంటి సమస్యలు ఎదురైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ‘‘పన్ను మినహాయింపులు పొందాలని భావిస్తే అందుకు ప్రీమియం చెల్లింపుల రసీదులను సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో అవసరమైతే రిటర్నులతోపాటు జత చేయడానికి వీలుంటుంది’’ అని పాలసీఎక్స్ డాట్ కామ్ సీఈవో నావల్ గోయల్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరి, అందుకు అయ్యే చికిత్సా ఖర్చులను తిరిగి పొందినట్టయితే అందుకు సంబంధించిన పత్రాలను, కారు మరమ్మతులకు చేసుకునే బీమా క్లెయిమ్ ఆధారాలను కూడా దీర్ఘకాలం పాటు భద్రంగా ఉంచుకోవడం అవసరమని గోయల్ సూచించారు. పోర్టబిలిటీ సమయంలో ఇవి ఉపయోగపడతాయన్నారు. బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ ఇన్సూరెన్స్ అకౌంట్‌ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ‘‘మీ కుటుంబం, మీకు సంబంధించిన బీమా పత్రాలను ఇందులో భద్రంగా నిల్వ చేసుకోవచ్చు’’ అని చెప్పారు. ► మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో మీకున్న పెట్టుబడుల వివరాలన్నింటినీ ఒకే నివేదిక రూపంలో క్రోడీకరించి ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థలు కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్) పేరుతో ప్రతీ త్రైమాసికానికి ఇస్తుంటాయి. వీటిని కుటుంబ సభ్యుల్లో ఒకరితో పంచుకునేందుకు గాను ఆటో ఫార్వార్డ్‌ను ఎంచుకోవాలి. ఒక్క మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి అయితే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (క్యామ్స్) నుంచి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ను తీసుకుంటే చాలు. వేతన జీవులు అయితే తమ స్టాక్, మ్యూచువల్ ఫండ్ ఖాతాల స్టేట్మెంట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్వయం ఉపాధిలో ఉన్న వారు అయితే వీటిని కనీసం ఆరేళ్ల వరకు పదిలంగా ఉంచుకోవడం అవసరం. ► ఇవి చాలా కీలకం ఆస్తుల కొనుగోలు, అమ్మకాల పత్రాలను లావాదేవీ జరిగిన నాటి నుంచి కనీసం ఏడేళ్ల వరకు అయినా ఉంచుకోవడమే మంచిది. ఎందుకంటే ఆదాయపన్ను శాఖ ఏడేళ్లలోపు ఎప్పుడైనా తిరిగి పరిశీలించే చర్య తీసుకోవచ్చు. ‘‘పన్ను చెల్లింపుదారులు తప్పకుండా డాక్యుమెంట్లను అట్టిపెట్టుకోవాల్సిందే. ఆభరణాల కొనుగోళ్ల రసీదులు, అలాగే పెయింటింగ్, ఇళ్ల మరమ్మతులు, నవీకరణకు చేసే ఖర్చులకు సంబంధించిన ఆధారాలను కూడా ఉంచుకోవాలి. దీంతో ఆయా ఆస్తుల విక్రయం తర్వాత పన్ను తగ్గింపులను ఆదాయపన్ను శాఖ తిరస్కరించదు’’ అని బోహ్రా తెలియజేశారు. ► డిజీలాకర్ ఉచితంగా మీ డాక్యుమెంట్లను స్టోర్ చేసుకునే వేదిక ఇది. దీంతో భౌతికంగా పత్రాలను ఉంచుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఇందులో స్టోర్ చేసే డేటా, డాక్యుమెంట్లు అంతా క్లౌడ్ రూపంలోనే ఉంటాయి కనుక ఎక్కుడి నుంచి అయిన వాటిని పొందే వెసులుబాటు ఉంటుంది. పీడీఎఫ్, జేపీఈజీ, పీఎన్జీ రూపాల్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లపై ఈసైన్(ఎలక్ట్రానిక్ రూపంలో సంతకం) చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇవి సెల్ఫ్ అటెస్టేషన్ కాపీలుగా పనికి వస్తాయి. డిజిలాకర్‌లో అకౌంట్ కోసం మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది. ఆధార్ డేటా బేస్‌లో నమోదైన మొబైల్ నంబర్‌ను కూడా వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలను జ్టి్టpట://ఛీజీజజీ ౌఛిజ్ఛుట.జౌఠి.జీn/ వెబ్ సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. -
ఐటీ దిగ్గజం ‘సేల్స్ ఫోర్స్’ భారీ సహాయం
బెంగుళూరు: ప్రముఖ క్లౌడ్, ఐటీ దిగ్గజం సేల్స్‌ఫోర్స్ దేశంలోని డిజిటల్ నైపుణ్యాలను పెంచేందుకు 6 ఎన్జీఓ సంస్థలకు భారీ సహాయాన్ని ప్రకటించింది. డిజిటల్ నైపుణ్యాల పెంపు కోసం (2లక్షల 40వేల డాలర్ల) నిధులను కేటియించి ఔదార్యాన్ని చాటుకుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి మనిషికి డిజిటల్ నైపుణ్యాలు ఎంతో అవసరమని సేల్స్‌ఫోర్స్ ఇండియా సీఈఓ అరందతి బట్టాచార్య తెలిపారు. దేశ వ్యాప్తంగా అత్యుత్తమ సేవలందిస్తున్న ఆరు ఎన్జీఓ(అక్షయ పాత్ర ఫౌండేషన్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, ఆంథిల్ క్రియేషన్స్ ఫౌండేషన్, గూంజ్, ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా, ప్రోత్సాహాన్ ఇండియా ఫౌండేషన్ సంస్థలకు నిధులు కేటాయించింది. అయితే ఈ సంస్థలు 15,000 మంది డిజిటల్ నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వనున్నారు. కాగా కరోనా సంక్షోభంలోను తమ సంస్థ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించినట్లు తెలిపారు. సేల్స్‌ఫోర్స్ సంస్థలో ఖర్చు తక్కువతో మెరుగైన సేవలు అందిస్తుందని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా 1999 సంవత్సరంలో ఏర్పాటయిన సేల్స్‌ఫోర్స్ కంపెనీ 1,700 కోట్ల డాలర్ల తో క్లౌడ్ విభాగంలో అగ్రగామి సంస్థగా నిలిచింది. సేల్స్‌ఫోర్స్ సంస్థ కేవలం క్లౌడ్ విభాగంలో మాత్రమే కాకుండా మొబైల్, సోషల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్) తదితర రంగాలలో మెరుగైన సేవలతో దూసుకెళ్తుంది. -
దొంగల రావిడి
మా ఊరి మల్లి బీములో మెరుకు. నూరుమందిలో ఉన్నా ఏరుపడి పోతుంది. ఎబ్బుడో కాలంలో మనట్లా ఆడా మగా ఈ సంసారం ఎల్నీద లేక దేవుడ్ని ఏడుకున్నారంట. సామీ నెలకొక దినం తిండి,మూడు పూట్లా నీళ్లు పోసుకునేటట్టు వరం యిచ్చింటే ఏమి, మూడుపూట్లా తిండి పెట్టడంవలన మా కడుపులకి ఏమీ సాలడం లేదు అని. ఆ వరం సగం తిరగేసి మల్లక్కకు దక్కినట్టుంది. నెలనొక్కనాడే నీళ్ళబోసుకునేది. అది ఆయమ్మకి వరసాపిని. తాటికాయ వర్ణం ఒంటి రంగు. ఆకాశంలో నల్లమేఘం తెల్లమేఘం కలిసిపోతే ఎట్లుంటయో అట్లుంటాయి ఆ యమ్మ ఒంటిమింద గుడ్లు. రైక్కి కుడిరెక్కన అంత మసి ఎడమరెక్కన అంత మసి. నగితె ఒక్కాకు ఏసిన పండ్లు. నొస్నపావలా బిల్లంత ఎర్ర కుంకుమబొట్టు. ఇంగ ఆయమ్మ దావన నడిసిందంటే ముంతడు సారాయి తాగినోల్లు దావంత ఇసరతా ఇసరతా నడస్తారే అట్లుంటుంది ఈ యమ్మ దినామూ చేసే పని అద్దడు గిద్దడు బత్యమేసి ఒండుకొని తినేది, మొగునికంత పెట్టేది. మొగుడు గొర్ల కాడికి, ఈయమ్మ ఆవులకాడికి మేపను బొయ్యేది. ఈ యమ్మకి మూడు గొడ్లుండాయి. ఒకటి దొంగగొడ్డు. ఈ గొడ్డు కంట్లో కనుపాపను ఏమార్సి దొంగ గడ్డిని మేస్తుంది. రెండోది సిర కొమ్ములది. దాని రెండు కొమ్ములు ఒక్కొక్కటి చెయ్యి పొడుగు ఉండి తమర్లు ఉన్నట్లు ఉంటాయి. ఆ కొమ్ములు చూసి దాని దగ్గరికి ఎవరూబోరు, కుమ్ముతుందని బయపడతారు. కానీ అది ఎవర్నీ కుమ్మదు. మూడోది బొడుగ్గొడ్డు. అది ఎంత మేసినా దానికి ఒళ్ళు రాదు. మా ఊరికి దక్షినంగా ఉండే ఎర్రగుంట్లకల్ల చెరుగుదోటలు ఈడవలు ఈడవలుగా ఏసున్నారు. అక్కడికి ఈ మూడింటినీ మేతకు తోలుకుని పాయె మా మల్లి. ఆ పొద్దు మిట్ట మద్యానం అయ్యింది. ఆ యాలకాడ ఊర్లో మగోల్లు ఒకరూ లేరు. ఊర్లో పిల్లోల్లు కాకుండా ఊరంతా దేవినా అల్లబల్లగా ముసిలి ముతక, ఆడోల్లు అంతా ఒక పదిమందిమి ఉంటాము.అట్లాంటబుడు మల్లి పరిగెత్తుకుంటా వచ్చి తొట్ట తొలీత ఓట్నోరు రామక్కతో సెప్పింది ఏమని...‘నేను ఎర్రగుంట్ల చెరకుదోటలకల్లా ఆవులు మేపతా ఉంటే పదిమంది మొగోల్లు ఏట కొడవల్లు ఎత్తుకొని చెరుకు దోటల్లోకి పోయిరి, వాళ్ళు ఎట్లుండారంటే చెయెత్తు మనుషులు, వాళ్ళ కనుగుడ్లు ఎర్రగా చింతనిప్పులగతం పట్టెడు పట్టెడు ఉన్నాయి. మీసాలు పురి తిరిగినాయి. నేను వాళ్ళను జూసి పరిగెత్తితి, వాళ్ళు తోటల్లోకి దూరిరి అనే. దాంతో ఓట్నోరు రామక్క ఆ ఈదికి ఈ ఈదికి పొయ్యి ‘ఒసే నా బట్ట ముండల్లారా, ఇండ్లల్లో ఉండేవాళ్లంతా బయటకు రండి, మనూర్లోకి దొంగలు వస్తా ఉండారంట ఊరి చుట్టూ ఉండారంట. ఎక్కడెక్కడకు పోయినోళ్లందరినీ పిలసండి అనే. మేము ఇండ్లల్లో ఉండే వాళ్లంతా పరిగెత్తుకుని వచ్చి ఒక తావన ఉడ్డ జేరితిమి. దూరం బోయిండే వాల్లకు పోన్లు చేసి అరిజెంటుగా రమ్మంటిమి. చుట్టుపక్కల దగ్గరగా కూలికి పోయిండే వాళ్ళను జతలు జతలుగా మేమే పొయ్యి పిలుసుకువస్తిమి. టౌనుకు పొయ్యినోళ్లందరూ టెన్సన్ గా ఆజరైరి. ఊర్లోని మగోళ్లందరూ కత్తోడు కత్తి, దొన్నోడు దొన్నిఎత్తుకొని ఊరు సుట్టుపక్కల, చేరుకుదోటలంటి బస్తీ కాస్తా తారాడతా ఉండారు. ఆడోళ్లమంతా ఉడ్డజేరుకొని వుండాము. వీళ్ళ సందులో ఊర్లోటి తాగుబోతులు అయితే ఫుల్లుగా తాగి గట్టిగా అరిసేది.దొంగలరావిడి కన్నావీళ్ళ రావిడి ఎక్కువయ్యింది .‘తాగినోడు తమాషా ఎరగడని’ ఈ బాధ కూడా ఆనందమే వాళ్లకి. మా మల్లి మొగుడు తాగితే వానికి దమ్మిడీ ఆలి ఉండదు. వాడు కూడా ఫుల్లుగా తాగి రెట్టలు ఎగదీడతా ‘ఎవర్రా దొంగలు నేను సిమ్మం ఊర్లో ఉంటే ఎన్ని గుండ్లు రా ఊర్లోకి వచ్చేదానికి, ఏటకొడవలెత్తుకొని ఏటు కొకరిని నరకతా, రాండరా మీకు ధైర్నం ఉంటే నా ముందుకి’ అని అరిసేది. ఉడ్లగా ఉండే వాళ్ళదగ్గరకు పొయ్యి మీ కేమీ బయం లేదు ఈ సిమ్మం ఊర్లో ఉంది ఇండ్లకు పొయ్యి పడుకోండి ధైర్నంగా అనేది. ఆ యప్పను ఎవరన్నా అట్లా తోసితే తొంబై ఆమడ దూరం పడేది. ఈ తాగుబోతోళ్ళ అవంతరంతో మాకు అరదము పొద్దుబోయేది. ఆ పొద్దు రేయంతా కంటిమింద రెప్పఎయ్యకుండా కావిలి కాసినారు. ఆ మరుసటి దినం పోవిడి పెడితే మా పక్క పల్లెలోని మగోళ్ళు ఆ దావింటి అడివికి కొడివిండ్లు ఎత్తుకొని కట్లెకు బోయరని తేలింది. మా మల్లి వాళ్ళను జూసి ఒకటికి నాలుగు కలేసి జెప్పిందని ఊర్లో వాళ్ళందరూ చెడామడా తిట్టి ఇదేమి జెప్పినా నమ్మకూడదు. అన్నీ గచ్చులే జెప్పేది అని అప్పట్నుంచి ఆయమ్మ కి గచ్చుమల్లి అని పేరుపడింది. దీనికి తోడు ‘జల్లోని మాటలకు ఉత్తోడు జామీను’ అన్నట్టు ఈ ఓట్నోరుది ఊరికే ఉంటుందా, గోరంత జరిగితే కొండంత జేసింది.గచ్చుమల్లి చెప్పిందనే కాదు ఈ దొంగల రావిడితో ఇరవై ఏండ్ల నుంచి ప్రతి సంవత్సరం ఎదో ఒక పుకారుతో మేము భయపడుతూనే ఉన్నాము. ఆ పుకారు కూడా ప్రతి సంవత్సరం ఆవిటిగాలి కాలమే వస్తుంది. ఆవిటి గాలికి ఏనుగులు అరిసినా వినబడదంట. మాఅవ్వ అనేది ‘ఆవిటి గాలికి మనుషులకి ఆకిలెక్కువంట గెరిసల్లోని బత్యం, కుంటలోని నీళ్లు ఈ గాలికి ఆవిరై పోతాయంట’ అని. ఈ గాలి కాలం వచ్చిందంటే దొంగల రావిడి కూడా ఎక్కువే. రకరకాల పుకార్లతో బయపడతా ఉంటారు ఊరుజనం. ఈ సారి వచ్చిన పుకారు ఏందంటే నడి జామ కాడ యాభై మంది దొంగలొస్తారంట. తొలీత ఊర్లో ఒక మనిషిని లేపతారంట. మనకు అనుమానం రాకుండా ఆ మనిసి ద్వారా ఇంటింటికి వచ్చి అందరినీ లేపించి బెదిరించి మెల్ల మింద కత్తి పెట్టి వాళ్లకి దొరికింది దోచుకొని, కంటికి ఇంపుగా కనపడిన ఆడోల్లనైతే చెరిసి తిరగబడితే సంపేస్తారంట, ఇట్లా పలానా ఊర్లో లో జరిగిందంట. అడివి మార్గాల్లో ఉండే ఊర్లు యావి అని పోవిల్లు పెట్టుకొని మరీ వస్తారంట అని. అవన్నీవిని ఊర్లో ఆడ మగా పగలంతా కూలీలకు పోవాలన్నా ఒంటి సంటిగా పొయ్యేది లేదు. గుంపులు గుంపులుగా పొయ్యేది, రాత్రి పూట పొద్దు గూకకనే ఆడోల్లు అన్నం కూర చేసుకొని తినేసి మా ఈది లోని వాళ్లంతా ఒకింటికి వచ్చి ఉడ్‌ల ఉడ్లగా పనుకునేది భయపడి. మేము ఒంటికి పోయను కూడా బయటకు పోకుండా లబ్బరు బిందెలు ఇంట్లోనే పెట్టుకొని పిల్లోల్లను దాంట్లో ఒంటేలుకు పోయించేవాల్లము. మా దగ్గర కారప్పొడి డబ్బాలు, కట్లు పెట్టు్టకున్నాము. ఆ రోజు మా పెద్దమ్మ కొసుకు దగ్గు దగ్గతా ఉంది. మేమందరం ఆ యమ్మని ఉప్పు సట్టిలో ఉండే ఉప్పురాళ్లను మింగమనేది, ఆయమ్మ ఉప్పంతా మింగి ఉప్పురోసి కి తనుకులాడేది. దగ్గినబుడల్లా నోటిలో గుడ్డ దురుపుకోమనేది శబ్దం కాకుండా. ఆయమ్మ అవస్థ చూసి మళ్ళీ నవ్వుకునేది.ముందయితే ఊర్లో ఎన్నో ఇండ్లకు తలుపులకు లోగెల్లులేవు. రాత్రి పూట రాకిండ్లు తలుపుకు ఆనించేవాళ్ళు. ఎబుడు ఈ దొంగల రావిడి మొదలయ్యిందో అబుడు నుండి ప్రతి ఇంటికి లోగెల్లు తగిలించుకున్నారు. మగోళ్ళు కట్లు పట్టుకొని ఊరు సుటకారం గస్తీ తిరగతా ఉంటారు. వాళ్ళల్లో ఒక జుట్టు పోలిగాడు ఎవరికీ తెలియకుండా గుంపులోనుంచి పక్కకు పోయి ఇండ్ల మిండ రాళ్ళేసి మళ్ళీ వాడే గుంపులోకొచ్చి రాళ్లు ఆడ పడుతున్నాయి ఈడ పడుతున్నాయి అని అరుస్తాడు. దొంగలు ఆడ కొచ్చారు ఈడకొచ్చారు అని ఇంగా భయపెడతాడు. కాలం కాలం గడవగా మల్లి బయట పెడతారు ఇట్లా చేసినామని ... మగోళ్ళు రెయ్యి మేలుకొని పగలు నిద్రబోయ్యేవాళ్ళు. ఆ పద్దన్నే గుంపులు గుంపులుగా మాట్లాడుకునేది. నక్కలోడు దుడ్లు, పెండ్లాముసొమ్ములు ప్లాస్టిక్ కవర్లో పెట్టి గుంత తవ్వి గుంతలో పూడ్సి పెట్టినాడంట, పాసిన కొండమ్మ మూడేండ్ల నాటి మురగబెట్టిన కందులు, సద్దలు, అలసందులు గెరిసలోటివి తీసి మూటలు కట్టి తలదిండులో పెట్టిందట, మన సామల బిత్తిరి రెయ్యంతా వాడ సందులో పొయ్యి పనుకునిందట, ద్యాపట్లనాగి సీమెండి కడియాలు, సిడతనబంగారు కమ్మలు, మెడగజ్జెలు ఒలుచుకొని మూటకట్టి సవరంలో పెట్టుకొని కొప్పెసుకునింది కనపడకుండా అని ఇట్లా రెయ్యింబగళ్లు ఎవరెట్లా బయపడినారని పనులకాడ కతలు కతలు గా చెప్పుకుని నవ్వుకొనేది. ఈ మాదిరిగా ఉంటే ఆమరుసనాపొద్దు టౌనుకి పోదామని తెల్లారి బస్సెక్కితి. ఆ బస్సులో తొలగదబ్బను సందులేదు. పొరుగూరు వొగాయమ్మ నిలబడికొనే తూగతా ఉంది. డైవోరు బ్రేకేసే కొందికి ఇసరకొచ్చి జనాల మింద బడే. అదరా బదరా కండక్టర్ లేసి ఎమ్మా ఈయాలకే తూగుతున్నావు అనే. ఏమిజేప్పేదన్న రెయ్యంతా దొంగలరావిడి. రెయ్యి నిద్రలే, పగలు తీరికలే అనే. నేను మాఊర్లోనే కాదు అన్ని ఊర్లల్లో ఇట్లే ఉందే అనుకుంటి. ఈ దొంగల రావిడి సద్దుమణిగే దాకా మాకు ఈ తిప్పలు తప్పవు. అందుకే గచ్చుమల్లి చెప్పింది కూడా ఎనకా ముందు ఆలోచన సెయ్యకుండా నమ్మాల్సి వచ్చింది. అయినా జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంటారు అట్లా మా దగ్గర ఏముంది కాకపోతే పానబీతి అంతే! అర్థాలు గచ్చు –అబద్ధాలు / మెరుకు –వడ్లగింజ ఎల్నీద – బయటకి రాలేక / వరసాపిని– అలవాటు తమర్లు – ఠి ఆకారం లో ఉండటం బొడుగు – సన్నగా ఓట్నోరు– దాసుకోకుండా బయట చెప్పేది ఆలి – బలం / రావిడి –పోరు పోవిడి – విచారణ వాడ – ధాన్యాలు నిల్వ బెట్టుకునే గెరిసె రాకిండ్లు –దంపుకునే రాకిండ్లు సిడతన – కాకిబంగారం / పాసిన – పిసినారి ఎండపల్లి భారతి -
2 నెలల్లో 200 మంది నియామకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెంటరీ, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ మార్గ్ ఈఆర్పీ వచ్చే రెండు నెలల్లో 200 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లకి‡్ష్యంచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొత్తగా పది మంది ఉద్యోగులొస్తారని మార్గ్ ఈఆర్పీ నేషనల్ హెడ్ ప్రితేష్ ప్రభాకర్ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో మార్గ్ ఈఆర్పీకి 650 మంది ఉద్యోగులున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లో కార్యాలయం ఉందని... ఈ ఏడాది చివరి నాటికి విజయవాడలో ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. ‘‘జీఎస్టీ కంటే ముందు దేశంలో 9 లక్షల మంది కస్టమర్లుండేవారు. జీఎస్టీ తర్వాత 2 లక్షల మంది అదనంగా జతయ్యారు. జీఎస్టీ కంటే ముందు తెలంగాణ, ఏపీల్లో 16 వేలుగా ఉన్న కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 24 వేలను దాటింది. ఏడాదిలో ఈ సంఖ్యను 48 వేలకు చేర్చాలని లకి‡్ష్యంచాం’’ అని ఆయన వివరించారు. దేశంలో ఏటా 12 వేల అకౌంటింగ్ లైసెన్స్‌లను విక్రయిస్తున్నామని.. ఇందులో 450–500 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని చెప్పారు. ఒక్క లైసెన్స్ రూ.7,200–25,000 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. ఏడాదిలో క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్.. ప్రస్తుతం క్లౌడ్ ఆధారిత అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అభివృద్ధిపై పరిశోదన చేస్తున్నామని.. ఏడాదిలో దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తామని పాటిల్ చెప్పారు. మొబైల్, ల్యాప్‌ట్యాప్, డెస్క్‌టాప్ ఏ ఎలక్ట్రానిక్ ఉపకరణంలోనైనా వినియోగించుకునే వీలుండటమే దీని ప్రత్యేకత అని చెప్పారు. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.125 కోట్ల టర్నోవర్ నమోదు చేశామని, ఇందులో రూ.6.5 కోట్లు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుందని తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.180 కోట్లు లకి‡్ష్యంచామని తెలిపారు. -
నక్షత్రం పేలితే... వాన కురుస్తుంది!
‘‘నదులు, సముద్రాల్లోని నీరు ఆవిరై ఆకాశానికి చేరితే మేఘం ఏర్పడుతుంది.. తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మేఘం కాస్తా వానగా మళ్లీ భూమిని చేరుతుంది’’. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న విషయం ఇదే. బాగానే ఉందిగానీ.. మరి ‘తగిన’పరిస్థితులు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? ఈ సందేహాలు మీకెప్పుడైనా వచ్చాయా? డెన్మార్క్ శాస్త్రవేత్తలిప్పుడు దీనికో ఆశ్చర్యకరమైన కారణం కనిపెట్టారు. ప్రకృతి గురించి మనకంతా తెలుసుఅనుకునే వారు కూడా ముక్కున వేలేసుకునే ఆ వివరాలేమిటో చూసేయండి మరి! రాత్రిళ్లు ఆకాశానికేసి చూస్తే బోలెడన్ని నక్షత్రాలు కనిపిస్తాయి కదా... వీటిల్లో కొన్ని తమలోని ఇంధనం ఖర్చయిపోవడం వల్ల ఢామ్మని పేలిపోతుంటాయి. సూపర్ నోవా అని పిలిచే ఈ పేలుళ్ల కారణంగా భారీ మొత్తంలో కాస్మిక్ కిరణాలూ వెలువడుతుంటాయి. కోటానుకోట్ల మైళ్ల దూరాలు దాటుకుని భూమిని చేరే ఈ కిరణాలు వాతావరణం పైపొరల్లో మేఘాలు ఏర్పడేందుకు ‘తగిన’పరిస్థితులు కల్పిస్తుంటాయని డెన్మార్క్ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ.. కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం. చల్లటి నీళ్లు ఉన్న గాజుగ్లాసును కాసేపు అలాగే ఉంచితే..గోడలపై గాల్లోని ఆవిరి కాస్తా నీరుగా మారడం మనం గమనించే ఉంటాం. అచ్చం ఇలాంటి ప్రక్రియే ఆకాశంలోనూ జరుగుతుంది. కాకపోతే గాజు గ్లాసుకు బదులుగా అక్కడ ఏరోసాల్స్ ఉంటాయి. దుమ్మూ, ధూళితోపాటు అనేక రకాల రసాయనాల సూక్ష్మ కణాలనే ఏరోసాల్స్ అంటారు. వీటిల్లో కొన్నింటికి పరిసరాల్లోని నీటి ఆవిరిని ఆకర్షించే ప్రత్యేక లక్షణముంటుంది. ఇవే విత్తనాల మాదిరిగా వ్యవహరించి.. మేఘమనే చెట్టు ఎదిగేలా చేస్తాయి. విత్తనాలు ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ మేఘాలు ఏర్పడతాయి. అందుకు తగ్గట్టుగానే వానలూ పడతాయన్నమాట. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సూపర్నోవాల కారణంగా వెలువడే కాస్మిక్ కిరణాలు వాతావరణం పై పొరల్లో చేసే కొన్ని మార్పుల కారణంగా ఏరోసాల్స్ అధిక మోతాదులో విత్తనాలుగా మారతాయని డెన్మార్క్ శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటి ఆవిరితో కూడిన గాజు చాంబర్‌పైకి కాస్మిక్ కిరణాలను ప్రయోగించినప్పుడు ఆవిరి కాస్తా ద్రవంగా మారడం ఎక్కువైందని.. దాదాపు వందసార్లు ఇదే ప్రయోగాన్ని పునరావృతం చేసి.. ఒకే రకమైన ఫలితాలు సాధించామని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. సూర్యుడూ కారణమే... వాతావరణం పై పొరలను తాకే కాస్మిక్ కిరణాల మోతాదు మన సూర్యుడిపై చర్యల ఆధారంగా ఉంటాయని డెన్మార్క్ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు దశాబ్ద కాలంపాటు సూర్యుడిపై పేలుళ్లు పెరగడం.. ఆ తరువాత పదేళ్లు తగ్గుతుండటం మనకు తెలిసిందే. దీని కారణంగా సూర్యుడి విద్యుదయస్కాంత క్షేత్ర తీవ్రతలోనూ తేడాలొస్తాయి. తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ కాస్మిక్ కిరణాలు మేఘాలున్న ప్రాంతానికి చేరతాయి... ఎక్కువైనప్పుడు తక్కువవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే భూమ్మీద పదేళ్లపాటు మేఘాలు ఏర్పడటం కొంచెం ఎక్కువగా ఉండి.. ఉష్ణోగ్రతలు పడిపోతే... మరో పదేళ్లపాటు పెరుగుతూ ఉంటాయన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు అతితక్కువ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. 2008 నుంచి సూర్యుడిపై పేలుళ్ల వంటివి క్రమేపీ మందగిస్తున్నట్లు నాసా రికార్డులు చెబుతుండటం ఇక్కడ గమనార్హం. ఏమిటి దీని ప్రాముఖ్యత? నక్షత్రాల పేలుళ్లు... సూర్యుడి అయస్కాంత క్షేత్ర తీవ్రతలకు.. మేఘాలు ఏర్పడేందుకు మధ్య సంబంధం ఉందన్నది ఇప్పటివరకూ తెలియని విషయం. చరిత్రను తిరగేసినా.. సూర్యుడిపై చర్యలకు అనుగుణంగానే భూమ్మీద ఉష్ణోగ్రతలు, వానల్లో మార్పులు వచ్చిన విషయం స్పష్టమవుతుంది. మానవ చర్యల కారణంగా భూమి క్రమేపీ వేడెక్కుతోందని... పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి ఇది 3.6 డిగ్రీలకు చేరుకుని వాతావరణ మార్పులతో మానవ మనుగడ కష్టమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో డెన్మార్క్ శాస్త్రవేత్తల ప్రయోగానికి ప్రాముఖ్యత ఏర్పడింది. గత పదివేల ఏళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల కంటే ఎక్కువ స్థాయికి చేరుకున్న సందర్భాలు అనేకమున్నాయని.. ఇవన్నీ సూర్యుడిపై జరిగే చర్యలు.. తద్వారా కాస్మిక్ కిరణాల మోతాదుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం వల్లనేనని వీరు అంచనా వేస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో? – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భారత్‌లో ఆలీబాబా క్లౌడ్ సర్వీసులు
న్యూఢిల్లీ: చైనీస్ దిగ్గజం ఆలీబాబా తాజాగా భారత్‌లో తమ క్లౌడ్ సర్వీసులు అందించనుంది. ఇందులో భాగంగా ముంబైలో కొత్తగా డేటా సెంటర్ ప్రారంభిస్తోంది. ఇది వచ్చే నెలకల్లా అందుబాటులోకి రాగలదని ఆలీబాబా క్లౌడ్ (ఆలీబాబా గ్రూప్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం) తెలిపింది. భారత్‌లోని చిన్న, మధ్య తరహా సంస్థల్లో క్లౌడ్ కంప్యూటింగ్‌కి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ముంబైలోని డేటా సెంటర్ తోడ్పడుతుందని వివరించింది. అయితే, దీనిపై ఎంత ఇన్వెస్ట్ చేసినదీ కంపెనీ వెల్లడించలేదు. ‘ఆలీబాబా క్లౌడ్ గ్లోబలైజేషన్ వ్యూహంలో.. భారత్ కీలక మార్కెట్. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటం, భారతీయ సంస్థలు కార్యకలాపాలను గణనీయంగా విస్తరించాలని ఆకాంక్షిస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో ఇక్కడ భారీగా వ్యాపార అవకాశాలు ఉన్నాయి‘ అని ఆలీబాబా క్లౌడ్ ప్రెసిడెంట్, ఆలీబాబా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సైమన్ హు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులు అందిస్తున్న టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లతో ఆలీబాబా పోటీపడనుంది. సర్వీస్ ప్లానింగ్, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ ప్రణాళిక అమలుకు అవసరమైన సహకారం మొదలైనవి అందించేందుకు ఆలీబాబా క్లౌడ్ స్థానికంగా ప్రొఫెషనల్ కన్సల్టెంట్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని సైమన్ వివరించారు. భారత్‌లో సేవల కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో భాగమైన గ్లోబల్ క్లౌడ్ ఎక్స్చేంజ్ (జీసీఎక్స్)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం జీసీఎక్స్కి చెందిన క్లౌడ్ ఎక్స్ ఫ్యూజన్ సర్వీసు ద్వారా ఆలీబాబా క్లౌడ్ ఎక్స్‌ప్రెస్ కనెక్ట్ సేవలను నేరుగా పొందవచ్చని సైమన్ వివరించారు. అటు టాటా కమ్యూనికేషన్స్‌తో కూడా ఇదే తరహా ఒప్పందం ఉంది. కంప్యూటింగ్, స్టోరేజీ, బిగ్ డేటా ప్రాసెసింగ్ తదితర సర్వీసులు ఆలీబాబా క్లౌడ్ సూట్ ద్వారా అందుకోవచ్చు. ప్రస్తుతం ఇది 33 జోన్లలో అందుబాటులో ఉంది. -
ఫీల్డ్ ఉద్యోగులపై నిఘా!
► క్లౌడ్ ఆధారంగా ఉద్యోగులను ట్రాక్ చేస్తున్న స్పూర్ ► డేటాతో పాటు రిపోర్ట్లు, ఆడియో, వీడియోలూ పంపొచ్చు ► 6 దేశాల్లో 150 కంపెనీల్లో 30 వేల మందికి సేవలు ► గతేడాది రూ.4 కోట్ల టర్నోవర్; ఈ ఏడాది7 కోట్ల లక్ష్యం ► రెండేళ్లలో అమెరికా, ఆఫ్రికా, యూరప్‌లకు విస్తరణ ► ‘స్టార్టప్ డైరీ’తో స్పూర్ ఫౌండర్, సీఈఓ సీ రామకృష్ణా రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెటింగ్, కలెక్షన్, ఏజెంట్ వంటి ఫీల్డ్ ఉద్యోగాలు టార్గెట్‌ను చేరుకుంటే చాలు... ఎంచక్కా ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంటారు. ఎందుకంటే పై అధికారులకు ఫీల్డ్ ఉద్యోగులు ఎక్కడున్నారో తెలిసే అవకాశముండదు కాబట్టి!!. అంటే ట్రాకింగ్ చేసే వీలుండదని దానర్థం. కానీ, స్పూర్తో ట్రాకింగ్ మాత్రమే కాదు ఎప్పటికప్పుడు ఉద్యోగి పనితీరు రిపోర్ట్‌లూ వస్తాయి. డేటా విశ్లేషణతో పాటూ ఆడియో, వీడియోలు కూడా అందుతాయి. అది కూడా ఇంటర్నెట్ అక్కర్లేకుండానే!. ఆ విశేషాలేంటో స్పూర్.ఇన్ ఫౌండర్ అండ్ సీఈఓ సీ రామకృష్ణా రెడ్డి మాటల్లోనే.. మాది అనంతపురం జిల్లా. కర్ణాటకలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరా. తర్వాత సొనాటా బెంగళూరులో.. తరవాత అమెరికాలో ఇంటెల్ చిప్ కంపెనీలో చేశా. 2002 వరకు అక్కడే పనిచేసి.. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌కి తిరిగొచ్చా. ఆ సమయంలో మొబైల్ వాల్యూ యాడ్ సర్వీసెస్ కంపెనీ అయన్సిస్ను ప్రారంభించా. కానీ మొబైల్ ప్రాజెక్ట్‌లు నెల రెండు నెలల కంటే ఎక్కువ కాలం ఉండేవి కావు. ఇది కరెక్ట్ కాదని కంపెనీలకు ఉపయోగపడేలా ఏదైనా కొత్త టెక్నాలజీ స్టార్టప్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. అలా 2013 ఏప్రిల్‌లో స్పూర్.ఇన్ను బీజం పడింది. రూ.కోటి పెట్టుబడితో ఎఫర్ట్ అనే టెక్నాలజీ ప్రొడక్ట్‌ను రూపొందించాం. స్పూర్ అంటే.. స్పూర్ అంటే జంతువును గానీ మనిషిని గానీ ట్రాక్ చేయడం అని అర్థం. మా సేవలు కూడా ఉద్యోగుల పనితీరును ట్రాక్ చేయడమే కనుక ఈ పేరు పెట్టాం. ఎఫర్ట్ (ఈఎఫ్ఎఫ్ఓఆర్టీ) అంటే.. ఎఫర్ట్‌లెస్ ఫీల్డ్ ఫోర్స్ ఆప్టిమైజేషన్ అండ్ రిపోర్టింగ్ టూల్‌కిట్ అని. దీంతో ఫీల్డ్ ఉద్యోగుల్లో పారదర్శకత, సమర్ధత, జవాబుదారీతనం పెరుగుతుంది. కంపెనీలకు ఉత్పాదక పెరుగుతుంది. ఏ రంగంలోని ఫీల్డ్ ఉద్యోగులైనా సరే పై అధికారులకు మూడింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 1. ఎక్కడున్నారు? 2. ఈరోజు ఏం చేస్తారు? 3. చివరికి సాధించిందేంటి? వీటిల్లో ఫీల్డ్ ఉద్యోగులు ఏం చెబితే అదే ఫైనల్. అంటే అధికారులకు ప్రతి ఉద్యోగినీ స్వయంగా తనిఖీ చేయడం కుదరదు. స్పూర్తో అది కుదరదు. ఎందుకంటే స్పూర్ ‘ఎఫోర్ట్’ ఫీల్డ్ ఆఫీసర్లను ట్రాక్ చేస్తుంటుంది? ఎప్పటికప్పుడు వాటి వివరాలను అధికారికి చేరవేస్తుంది. డేటానే కాదు పిక్చర్స్, వీడియో, ఆడియోలను కూడా పంపించుకోవచ్చు. అది కూడా ఇంటర్నెట్ అవసరం లేకుండానే. ఒక్కో లాగిన్‌కు రూ.300 చార్జీ.. ఆటోమెటిక్ ఫీల్డ్ ఆపరేషన్, షెడ్యూలింగ్ అండ్ డిస్ప్యాచ్, జీయో ట్యాగింగ్, నోటిఫికేషన్స్ మరియు అలెర్ట్స్, మొబైల్ పేమెంట్స్, డిజిటల్ డేటా కోడింగ్, అడ్వాన్స్ రిపోర్ట్ వంటివి స్పూర్ ఫీచర్లలో కొన్ని. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ అవసరం లేకుండానే నిర్వహించుకోవచ్చు. అది కూడా ఏ మొబైల్‌లోనైనా, ఏ భాషలోనైనా పనిచేయడం ఎఫోర్ట్ సాప్ట్వేర్ ప్రత్యేకత. ఒక్కో లాగిన్‌కు రూ.300–800 చార్జీ ఉంటుంది. ఫీచర్లను బట్టి ధరలు మారుతాయి. గతేడాది రూ.4 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. ఈ ఏడాది రూ.7 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.20 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మా కంపెనీలో 50 మంది ఉద్యోగులున్నారు. వచ్చే రెండేళ్లలో క్లయింట్ల సంఖ్యను 300కు, టర్నోవర్‌ను రూ.100 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే సేవలను అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు విస్తరించాలని నిర్ణయించాం. 2014లో బంధువులు, తెలిసిన వాళ్ల నుంచి రూ.2 కోట్ల నిధులను సమీకరించాం. ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నాం. 6 దేశాల్లో 150 కంపెనీలు.. స్పూర్ టెక్నాలజీని సేల్స్, సర్వీసెస్, కలెక్షన్స్, ఆడిట్స్, మార్కెటింగ్, రియల్టీ, బీమా, బ్యాంకింగ్ వంటి రంగాల్లోనూ విని యోగించవచ్చు. ప్రస్తుతం 150 కంపెనీలు 30 వేల మం ది ఫీల్డ్ ఉద్యోగులు దీన్ని వినియోగిస్తున్నారు. మన దేశంతో పాటూ నేపాల్, దుబాయ్, దక్షిణాఫ్రికా, వియత్నాం, మయన్మార్ దేశాల నుంచి క్లయింట్లున్నారు. గోఐబిబో, జేకే సీడ్స్, మహీంద్రా ఫైనాన్స్, ఎల్అండ్టీ ఫైనాన్షియల్, రెడ్‌బస్, రిలయన్స్, ఎయిర్టెల్ వంటి కస్టమర్లున్నారు. హైదరాబాద్ నుంచి మెడ్‌ప్లస్, మైక్లాస్ బోర్డ్ వంటి 30కి పైగా కంపెనీలున్నాయి. -
వాన మాయచేసే స్పర్శ
ఊపిరి బిగబట్టిన మేఘం సాయంత్రాల్ని నల్లగా కౌగిలించుకుంటుంది ఆకాశం బిగ్గరగా అరుస్తూ ఒకానొక పొడి దృశ్యాన్ని పొక్కిలి చేస్తుంది తడి అద్దాల్లోంచి వెలుతురు దీపాలు అబ్స్ట్రాక్ట్ చిత్రాలను తలపిస్తాయి కొంచెంగా తెరిచిన తలుపు సందులోంచి వాన పంపిన రహస్య సందేశాన్ని మోసుకొస్తుంది గాలి దేహమంతా వాన కనులను చిత్రించుకుంటూ జ్ఞాపకం బాల్యం రొమ్మును ముద్దాడుతుంది వానంతా రాత్రి కలలో తడిచాక మెలుకువ మీద స్వప్నాన్ని ఆరేసుకోవడం చంద్రున్ని తాగినంత మత్తుగా ఉంటుంది - శ్రీనివాస్ సాహి 8106689529 -
క్లౌడ్ కంప్యూటింగ్‌పై వర్క్‌షాపు ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ) : జేఎన్టీయూకేలో సీఎస్ఈ విభాగం ఆధ్వర్వలో ఐదు రోజుల పాటు క్లౌడ్ కంప్యూటింగ్ అనే అంశంపై నిర్వహించే వర్క్‌షాపు సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్‌షాపులో మంజ్రా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆస్ట్రేలియా) సీఈఓ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ భూయ్యా మాట్లాడుతూ సాంకేతిక విప్లవ లాభాలు సామాన్య మానవుడి సమస్యలు తీర్చేలా ఉండాలన్నారు.70 శాతం ఐటీ వ్యాపార లావాదేవీలు అభివృద్ధి చెందిన దేశాల ద్వారా జరుగుతున్నాయని, వాటిలో భారత దేశం 30 శాతంతో ముందుకు వెళ్తోందన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సమీకృత విధానంతో మొబైల్ అప్లికేషన్లు, హెల్త్‌కేర్ అప్లికేషన్లు, రోబోటిక్ సర్వీస్‌లు వంటి వాటిలో వినూత్న ఆవిష్కరణలు జరిపి సున్నిత సమస్యలకు సాంకేతికతను జోడించి పరిష్కరించాలన్నారు. అనంతరం రాజ్‌కుమార్ భయ్యాను వర్సిటీ అధ్యాపకులు సత్కరించారు. మొబైల్ అండ్ క్లౌడ్ ల్యాబ్ హెడ్ సతీ‹ష్నారాయణ్ శ్రీరామ్, సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ కృష్ణమోహన్, కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎంహెచ్ కృష్ణప్రసాద్, కరుణ తదితరులు పాల్గొన్నారు. -
వాన జ్ఞాపకాలు ఎనిమ్ది
1. బడిగంటకు మబ్బు ముద్దు క్లాస్‌లో పాఠం ఆగిపోతుంది. అంతవరకూ గంభీరంగా పాఠం చెప్పిన మాస్టారు గడప దగ్గరకు వెళ్లి బయట కురుస్తున్న వానను చూస్తూ నిలబడి పైన ఆకాశం వంక చూసి ఇంకెంత వాన పడబోతుందో అన్నట్టుగా లెక్క వేస్తూ ఉంటాడు. పిల్లల తలలన్నీ కిటికీవైపు మళ్లుతాయి. బయట ప్లే గ్రవుండ్ తడుస్తూ ఉంటుంది. కచ్చితంగా ఒక వేప చెట్టు ఉంటుంది... అదీ తడుస్తూ ఉంటుంది. స్కూల్ అటెండర్ బాషా అంత వానలో గొడుగు వేసుకొని ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్‌కు సర్క్యులర్ ఏదో తీసుకువెళుతూ ఉంటాడు. ఉండి ఉండి ఒక జల్లు జివ్వున కొట్టి క్లాస్‌రూమ్‌లో దూరి మళ్లీ కంగారుగా వెనక్కు వెళ్లిపోతుంది. పుస్తకాలన్నీ తడిసిపోతున్నాయన్న వంకతో పిల్లలు కెవ్వుకెవ్వున ఆటగా కేరింతలు కొడతారు. యూనిఫామ్స్ గ్యారంటీగా తడుపుకోవడానికి ఇంతకు మించిన అవకాశం ఉండదు. ఇక ఈ పూటకు బడిలేనట్టే. బయట గొడుగు విప్పి కుంపటి మీద విసనకర్ర విసురుతూ మొక్కజొన్న పొత్తులను కాల్చే ముసలవ్వ మనసులో మెదలుతుంది. వానతో పొత్తు... పొత్తుతో వాన... ఒక చిననాటి జ్ఞాపకం. 2.తడి సిన పోస్టర్ వాన పడితే జనం రారు అన్నది ఉత్త మాటే. రిలీజ్ రోజున ఎంత వాన ఉన్నా రావాల్సిన వాళ్లంతా వస్తారు. నిండాల్సిన క్యూలన్నీ నిండుతాయి. సినిమా హాలు పైకప్పున ఉన్న రేకుల మీద వాన జమాయించి కొడుతూ ఉంటుంది. బయట అంటించిన పోస్టర్ మీద హీరో సంగతి ఏమో కాని హీరోయిన్ తడిసి ముద్దవుతూ ఉంటుంది. అబ్బ... టికెట్ దొరికి లోపలికి దూరితే ఎంత వెచ్చన! కాళ్లు రెండూ దగ్గరకు చేర్చి సీటులో వొదిగి కూచుని బయట వాన పడుతూ ఉండగా లోన సినిమా చూడటం చాలా బాగుంటుంది. ఇంటర్వెల్లో ఆరుబయట క్యాంటిన్‌కు తడుస్తూ వెళ్లాలి. వేడి వేడి బజ్జీలను కాగితం పొట్లంలో చుట్టుకు రావాలి. గాజు గ్లాసులో డికాక్షన్ టీ దొరికితే అది అమృతం. దొరికిన వాటితో లోపలికి వచ్చి కాసింత తిని సినిమా చూస్తూ వెచ్చటి టీని గుక్క గుక్కా తాగడం నిన్న మొన్నటి జ్ఞాపకం. 3. మాట్లాడే కిటికీలు వాన వస్తే కిటికీలకు మాటలు వస్తాయి. అవి టపాటపా మోతను చేస్తూ సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తాయి. వాటి నోరు కట్టించాలని ఉంటుంది. కాని బిగించి పెడితే బయట వానను చూడలేమని బెంగగా ఉంటుంది. తమ్ముడో చెల్లాయో తడిసిన పాదాలతో అటూ ఇటూ పరిగెత్తి నేల మీద ముచ్చటైన ముద్రలు వేస్తారు. అమ్మ కయ్యిమంటుంది. ఊరుకో అని నాన్న ఆ అల్లరిని ఆహ్వానిస్తాడు. పలకరించడానికి వచ్చిన బంధువు తన గొడుగును వరండాలో మడిచి ఒక ధార గచ్చు మీద పారేలా చూస్తాడు. గుట్టు చప్పుడు కాకుండా అమ్మ వంటగదిలో దూరి మిగిలిన దోసెల పిండిలో ఉల్లిపాయలు తరిగి వేడి చిరుతిండికి సన్నద్దం అవుతుంది. శ్లాబ్ మీద నుంచి దూకుతున్న ధారకు బకెట్ పెట్టడం ఒక ఆట. పారే నీటిలో మడిచిన కాగితపు కత్తి పడవను విడవడం ఆట. పక్కన ఉన్న పాత తాటాకుల ఇల్లు ధైర్యం అభినయిస్తుంది. ఎదురుగా ఉండే పెంకుటిల్లు మాత్రం ఓడిపోయి రెండు మూడు వాన ధారలను ఇంట్లోకి రానిస్తుంది. తడవని మనుషుల జ్ఞాపకాలు తడుస్తుంటాయి. తడిసే ఇళ్ల అనుభవాలు తడుస్తుంటాయి. తడవడం బాగుంటుంది. 4.రాజూ కూడా తడుస్తుంది అది ఇంటి కుక్క కాదు. కాని రాజూ అని పేరు పెట్టి అప్పుడప్పుడు అన్నం పెడుతుంటే వచ్చి పోతుంటుంది. వాన కురిసినప్పుడు మాత్రం సొతంత్రంగా గేటు నెట్టుకొని వచ్చి ఒళ్లంతా పెద్దగా దులపరించుకుని ఒక మూలన నన్ను వదిలేయండ్రా బాబూ అని కూలబడుతుంది. పెరట్లోని కోడి ఒక మోస్తరు వాన వచ్చేవరకు లెక్కలేనట్టుగా షికార్లు చేస్తుంది. ఆ తర్వాత పంచన చేరి బుట్ట దగ్గరకు పిల్లలను తోలుతుంది. జామచెట్టు కొమ్మ తడుస్తుంది. కొమ్మన ఉన్న కాకి తడుస్తుంది. మేత ముగించుకుని రెడ్డి గారింటికి చేరుకుంటున్న బర్రెగొడ్ల మందలో ఒకటి కదలక మెదలక నిలుచుని వానలో తన కొమ్ములను తడుపుకుంటూ ఉంటుంది. చీమలు గోడను పట్టుకొని వేగం పెంచి కవాతు చేస్తూ పోతూ ఉంటాయి. చీకటి పడ్డాక కప్పలు కచేరీ మొదలపెడతాయి. సకల సృష్టి తడుస్తుంది. అక్షులు పక్షులు తడుస్తాయి. కిటికీలో నుంచి చేయి బయటకు చాపితే తెల్లటి మన హస్తరేఖలు కూడా తడుస్తాయి. 5.మడమలు ప్రాప్తమవుతాయి దేవుడు చల్లగా చూస్తే కాలేజ్ వదిలే సమయానికే వాన పడుతుంది. చట్టాలు అరెస్టుల భయం లేకుండా అది ప్రతి ఆడపిల ్ల చేయి పట్టుకోవడానికి చూస్తుంది. ముంగురులు నిమురుతుంది. బుగ్గలు పుణుకుతుంది. నుదుటి బొట్టుకు చుక్కబొట్టు పెట్టడానికి ఉబలాట పడుతుంది. చుబుకాన జారుతుంది. కంఠాన ఆగనంటుంది. ఆడపిల్లలు భలే కిలాడీ పిల్లలు. వానకు అందకుండా పుస్తకాలు అడ్డం పెట్టుకుంటారు. వానకు చెందకుండా సైకిళ్లను పరుగుపెట్టిస్తారు. వాన ఎగుడు దిగుళ్లలోకి దూరకుండా గొడుగు విప్పి తమ శరీరానికి ఛత్రం పడతారు. కాని కింద పారే నీళ్ల ముందు వారు ఓడిపోతారు. అందమైన పావడాలను కొంచెం పెకైత్తి పట్టుకుని అంగలు వేస్తారు. అప్పుడు అబ్బాయిలకు వారి మడమలు ప్రాప్తమవుతాయి. అందమైన వాటి బరువు కింద తమ హృదయాలను పరుస్తారు. కొన్ని చితుకుతాయి. కొన్ని గెలుస్తాయి. తడిసే వానలో ఆడపిల్ల చేయి పట్టుకుని నడిచేవాడు ఆ పూటకు గ్రీకు చక్రవర్తిలా ఫీలైపోయి ఆ జ్ఞాపకాన్ని జన్మకు దాచుకుంటాడు. 6.ఖర్చులేని టోపీలు వానకు ఆకలి ఎక్కువ. ముసురు పట్టిన సాయంత్రం కాకాహోటళ్లన్నీ క్రిక్కిరిసి పోతాయి. సాదా దోసె... ఊతప్పం... ఆవిరి కక్కే ఇడ్లీ... సాంబార్ ఇష్టపడని వాడు కూడా వేడివేడి ఆ ద్రవంలో స్పూన్ ముంచి గొంతును ఘాటు చేసుకుంటాడు. ఒంట్లో వేడి నింపుకుంటాడు. వేయించిన పల్లీల బండికి గిరాకీ ఎక్కువ. ఇన్వర్టర్లు లేని కాలంలో పెట్రొమాక్స్ లైట్లే సలీసు ఇన్వర్టర్లు. కరెంటు లేని బజారులో కూడా తెలియని సందడి ఉంటుంది. గొడుగులు లేని వాళ్లంతా కొత్తకొత్త టోపీలు కనిపెట్టి కనిపిస్తారు. ఏ పూటకాపూట కొనుక్కునే దీనులు వాన పెరిగేలోగా నూకలతో ఇల్లు చేరాలని శెట్టిగారిని తొందర పెడుతుంటారు. వాన సాయంత్రాలు రేడియో వినబుద్ధి కాదు. గుడికి వెళ్లబుద్ధి కాదు. ఇంట్లో ఉండబుద్ధి కాదు. పుస్తకం ఉంటే సరే. వేడివేడి పకోడి ఉంటే సరే. అప్పుడు మూడో పార్ట్నర్గా వాన కలసి మన మూడ్ ఠీక్ చేస్తుంది. వాన ఒక్కోసారి బెంగ కూడా కలిగిస్తుంది. ఆ బెంగ తీయని నొప్పిలా కూడా ఉంటుంది. అవును.. ఇది తీయని జ్ఞాపకం. 7. వాయుగండం బంగాళాఖాతం అనే మాట తరచూ వినపడటం మొదలవుతుంది. వాయుగుండం అనే మాట కూడా. రానున్న నలభై ఎనిమిది గంటలు... ఇరవై ఎనిమిద గంటలు... ఈ అర్ధరాత్రికే... తుఫాను తీరం దాటుతుందట. అప్పుడు మాత్రం ఊరు కొంచెం కంగారుగా వార్తలు వింటుంది. పశుగొడ్లను భద్రం చేసుకుంటుంది. బలహీనమైన ఇళ్లవారిని బలమైన ఇళ్లలోకి ఆహ్వానం పలుకుతుంది. తీరంలోని పల్లెల్లో ఉన్నవాళ్లు ఊరి బడుల్లో ఆసరా పొంది క్లాస్‌రూముల్లో కొత్త స్టూడెంట్లలా కనిపిస్తారు. ఆకాశం మాత్రం అప్పుడు ఎందుకనో చాలా మూసుకుని వస్తుంది. గాలి ఎక్సిలరేటర్ని తెగ తొక్కుతూ ఉంటుంది. చెట్ల చొక్కాలు లేచిపోతాయి. కరెంటు దీపాలు కొండెక్కుతాయి. స్తంభాలు వానకు సలాము చేస్తూ నేలకు ఒంగుతాయి. వాయుగుండం పెద్ద గండం. కాని ఆ బీభత్సంలో కూడా ఒక సౌందర్యం ఉంటుంది. అది భీతి గొలిపే సౌందర్యం. 8. అర్జునుడి రథం వాన రాత్రుళ్లు పరమాద్భుతంగా ఉంటాయి. పప్పు, రొట్టెలు అంత రుచిగా ఎప్పుడూ అనిపించవు. చారు, అప్పడాలు కూడా. కరెంటు పోతుందేమోనన్న భయంలో అన్నాలు త్వరగా ముగించి అమ్మ వెచ్చటి పక్కలు సిద్ధం చేస్తుంది. కప్పుకోను మందపు దుప్పట్లు అందిస్తుంది. బయట వాన. పైన ఎక్కడో ఉరుములు. నానమ్మ అది అర్జునుడి రథచాలనం అని అబద్ధపు నిజం చెబుతుంది. అర్జునా.. ఫల్గుణా.. పార్థా... కిరీటీ... శ్వేతవాహనా... అని మంత్రమేదో చెప్పి జపించమంటుంది. లూజ్ కనెక్షన్ ఉన్న ట్యూబ్లైట్లలా మధ్య మధ్య మెరుపులు మెరిసి మాయమవుతుంటాయి. దుప్పటి వెచ్చగా కప్పుకుని పడుకుంటే బయట వాన ఆగకుండా జోకొడుతూ ఉంటుంది. అంత పెద్ద హోరు ఏదో తెలియని ఉత్తేజం కలిగిస్తుంది. వాన బాగా కురిస్తే ఫలానావారి చెట్టు బాదం కాయలు రాలి దొరుకుతాయని ఆశ. జామకాయలు నేలన పడతాయని ఆశ. వాన పంట ఇస్తుంది. పిల్లలకు ఇదిగో ఇలా కాయలు ఇస్తుంది. ఆ దశను దాటి వచ్చిన వారికి జ్ఞాపకాలు ఇస్తుంది. వాన అంకురాన్ని సృష్టిస్తుంది. సృష్టిని అంకురింప చేస్తుంది. వాన ఆయుష్షు. వాన.. ఒక తలపుల కుమ్మరింత. - నెటిజన్ కిశోర్ -
క్యుములో నింబస్ మేఘాల వల్లే పిడుగుల వర్షం
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో అకాల పిడుగులకు క్యూములో నింబస్ మేఘాలే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏకకాలంలో అటు కోస్తాంధ్ర మీదుగా, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి... ఇటు వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వీటికితోడు నైరుతి రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటున్నాయని, ఉదయపు వేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండడంతో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నట్టు వివరించారు. ఈ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడానికి దోహదపడుతున్నాయని వివరించారు. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లకిందకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. -
దావో.. బ్రేవో.. దావో.. బ్రేవో..
భారీ తుపాను మేఘం ఈమెను మింగేయడానికి వచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది కదూ.. ఇది గ్రాఫిక్ చిత్రం కాదు.. రెండు వేర్వేరు ఫొటోలను కలిపినది కానే కాదు.. ఇది అచ్చంగా ఒరిజినల్ ఫొటో. దీన్ని తీసింది అమెరికాలోని కాస్పర్‌కు చెందిన నికోలస్ అనే ఫొటోగ్రాఫర్.. ఫొటోలో ఉన్న యువతి అతడి భార్యే.. పేరు దావో. తుపాన్లకు సంబంధించిన ఫొటోలను చాలా మంది తీస్తారు. కానీ మనల్ని మింగేసేటట్లుండే ప్రమాదకరమైన మేఘాలు ఉన్నప్పుడు వాటికి దగ్గరగా వెళ్లడం.. వాటిని ఓ యువతి చూస్తున్నట్లు ఫొటోలు తీయడమంటే మాటలు కాదు కదా.. ఇలా తీయడం ప్రమాదకరమని తెలిసినా.. అలాంటి చిత్రాలు తీస్తేనే కదా కిక్ అంటున్నారు ఈ జంట. ‘కొన్నిసార్లు నాకు భయమేస్తుంది. కానీ ఈ జీవితం చాలా చిన్నది. అందుకే ఉన్నన్నాళ్లూ ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి’ అని దావో చెబుతోంది. -
క్లౌడ్ మార్కెట్‌పై..
భారత్‌లో ఇప్పుడు డిజిటల్, ఎంట్రప్రెన్యూర్షిప్, స్టార్టప్, క్లౌడ్ వంటివి హాట్ టాపిక్. భారతీయ క్లౌడ్ మార్కెట్లో రూ.120 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలున్నాయని ఢిల్లీలో నాదెళ్ల చెప్పారు. భవిష్యత్ క్లౌడ్దేనని, ఈ టెక్నాలజీపై మరింత దృష్టి సారించండని ఎంఐడీసీలో ఉద్యోగులకు ఉద్బోధించిన సంగతి తెలిసిందే. భారతీయ మార్కెట్‌పై పెద్ద ఎత్తున ఫోకస్ చేశామని ఆయన చెప్పారు. 2015 చివరికల్లా మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. గతేడాది మైక్రోసాఫ్ట్ క్లౌడ్ విభాగ ఆదాయం 100% వృద్ధి చెందడం కూడా కంపెనీకి ఇక్కడి మార్కెట్‌పై ఆశలు రేకెత్తిస్తోంది. ఏదేమైనా నాదెళ్ల పర్యటనబట్టి చూస్తే టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్.. అపార వ్యాపార అవకాశాలున్న భారత్‌ను ప్రధాన మార్కెట్‌గా భావిస్తోందనే చెప్పొచ్చు. -
కనికరించని కాలం..కరిగిపోయెను మేఘం
కామారెడ్డి :వానలు కురిసే కార్తెలు కరిగిపోయా యి. మేఘం వర్షించకుండా తేలిపోయింది. వర్షకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా.. వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాత ల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. అయితే వర్షా లు కురియనందున ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారు లు సూచిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో సరైన వర్షాలు కురియకపోవడంతో ఆందోళనలో ఉన్న రైతుల్లో భరోసా కల్పించేందుకోసం, ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేందు కోసం శుక్రవారం నుంచి గ్రామాల బాట పడుతున్నారు. కామారెడ్డి మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్ గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల గురించి వివరించారు. ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు కురియకపోవడం వల్ల ప్రత్యామ్నాయ పంటలైన కంది, ఆముదం, మినుము, పెసర వంటి పంటలు సాగు చేయాలని సూచించారు. మొక్కజొన్న వేసినా ఇబ్బందులు తప్పవన్నారు. ఒకవేళ మొక్కజొన్న పంటనే సాగు చేయాలని భావిస్తే తక్కువ కాలంలో చేతికందే విత్తనాలను ఎంచుకోవాలన్నారు. సబ్సిడీపై విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు బోర్లు, బావుల వద్ద వరి పంట సాగు చేయడానికి సిద్ధమైనప్పటికీ నాట్లు వేయడంలో ఆలస్యం అవుతున్నందున పంట పొట్టదశలోకి వచ్చేసరికి కరెంటు సమస్య ఎదురుకావచ్చని పేర్కొన్నారు. వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకుని కొంత ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. రైతుల్లో కలవరం... వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు కలవరానికి గురవుతున్నారు. తినడానికి అవసరమైన ధాన్యమైనా పండించుకునే పరిస్థితులు లేకుండాపోయాయని ఆవేదన చెందుతున్నారు. వరుణుడు కరుణిస్తేనే తమకు మేలు జరుగుతుందంటున్నారు. ఆరుతడి పంటలు సాగు చేస్తే తినడానికి కావాల్సిన తిండిగింజలు ఎక ్కడి నుంచి తెచ్చుకునేదని ప్రశ్నిస్తున్నారు. తక్కువ కాలంలో కోతకొచ్చే వరి విత్తనాలు అందించాలని కోరుతున్నారు. -
మేఘం మింగేసేలా..
మనల్ని మింగేయడానికి వస్తున్నట్లు కనిపిస్తున్న ఈ మేఘం ఫొటో.. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సీన్లా కనిపిస్తోంది కదూ.. ఎగిరే పళ్లెం(యూఎఫ్‌వో) తరహాలో కనిపిస్తున్న ఈ తుపాను మేఘం టోర్నడోలు, తుపానులు, అకస్మిక వరదలు వచ్చినప్పుడు ఏర్పడతాయి. ముఖ్యంగా బ్రెజిల్, అర్జెంటీనా, అమెరికాలో ఇలాంటి తుపాను మేఘాలు కనిపిస్తాయి. జనాన్ని భయపెట్టేలా కనిపిస్తున్న ఈ మేఘాల ఫొటోలు తీయడంలో కాలిఫోర్నియాకు చెందిన జోడీ మిల్లర్ దిట్ట. ఈ చిత్రాన్ని ఆమె అమెరికాలోని రాస్వెల్ ప్రాంతంలో గత నెలలో తీశారు. తుపానులు వచ్చే సమయంలో ఫొటోల కోసం ఇలాంటి మేఘాల వెంట పడటమంటే.. లైఫ్ రిస్కే. కానీ.. అందులో ఉండే మజాయే వేరని మిల్లర్ చెబుతున్నారు. -
మైక్రోసాఫ్ట్‌లో 18 వేల ఉద్యోగాల కోత!
న్యూయార్క్: అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 39 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ఉద్యోగాల కోతకు తెరతీసింది. వచ్చే ఏడాది వ్యవధిలో 18 వేల మేర సిబ్బందిని తొలగించనున్నట్లు కంపెనీ సీఈఓ, భారత్‌కు చెందిన సత్య నాదెళ్ల గురువారం ప్రకటించారు. ఈ చర్యలు కఠినమైనవే అయినా... కొద్ది నెలల క్రితం కొనుగోలు చేసిన నోకియా మొబైల్ డివైస్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌తో అనుసంధానించేందుకు ఇవి తప్పనిసరి అని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో ఆయన పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా రానున్న 12 నెలల్లో పన్ను ముందస్తు చార్జీల రూపంలో 1.6 బిలియన్ డాలర్లను(సుమారు రూ.9,600 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. సత్య నాదెళ్ల ఐదు నెలల క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి సిబ్బంది ఉధ్వాసన ప్రకటన కావడం గమనార్హం. అయితే, భారత్ చాలా కీలకమైన మార్కెట్‌గా నిలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగాల కోతలు పెద్దగా ఉండకపోవచ్చ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. తమకు భారత్‌లో నోకియా డివెజైస్‌తోసహా 6,500 మంది ఉద్యోగులు ఉన్నారని.. మైక్రోసాఫ్ట్ సిబ్బంది పునర్వ్యవస్థీకరణ ప్రభావం చాలా చాలా స్పల్పంగానే ఉంటుందని చెప్పారు. కాగా, ఈ 18,000 కోతల్లో సుమారు 12,500 వరకూ నోకియా డివెజైస్ అండ్ సర్వీసెస్ బిజినెస్‌కు చెందిన నిపుణలు, ఫ్యాక్టరీ సిబ్బందివే ఉంటాయని సమాచారం. ప్రధానంగా మైక్రోసాఫ్ట్, నోకియా డివెజైస్‌ల మధ్య సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. తొలి విడతలో భాగంలో 13,000 సిబ్బందిని తగ్గించుకునే చర్యలను ప్రారంభించామని... వచ్చే ఆరు నెలల్లో ఎవరిని తొలగించబోతున్నామనేది ప్రకటిస్తామని నాదెళ్ల వెల్లడించారు. మొత్తానికి 2015 జూన్ నాటికి ఈ మొత్తం సిబ్బంది కోత ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గతేడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో 99,000 పూర్తిస్థాయి(ఫుల్‌టైమ్) సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో 58,000 మంది అమెరికాలో, మిగతా 41,000 మంది ప్రపంచవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నోకియా డీల్ తర్వాత కంపెనీలోకి కొత్తగా వచ్చిచేరిన ఉద్యోగులు ఇందులో లేరు. 7.2 బిలియన్ డాలర్ల మొత్తానికి నోకియా మైబైల్ హ్యాండ్సెట్ల తయారీ విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడం తెలిసిందే. ప్రధానంగా 2009లో మైక్రోసాఫ్ట్ సుమారు 5,800 మంది ఉద్యోగులను తొలిగించిన తర్వాత మళ్లీ ఇంత భారీ స్థాయిలో కోతలను ప్రకటించడం ఇదే తొలిసారి.