న్యూయార్క్: ఆరు విభిన్న బిజినెస్ గ్రూప్‌లుగా సంస్థను విడదీయనున్నట్లు చైనా కార్పొరేట్ దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. క్లౌడ్ ఇంటెలిజెన్స్, టౌబవ్ టీమాల్ బిజినెస్, లోకల్ సర్వీసెస్, గ్లోబల్ డిజిటల్ బిజినెస్, కాయ్‌నియావో స్మార్ట్ లాజిస్టిక్స్, డిజిటల్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూపులుగా విడదీయనున్నట్లు నియంత్రణ సంస్థలకు అలీబాబా సమాచారమిచ్చింది.
దీంతో మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో అలీబాబా షేరు 8 శాతం జంప్‌చేసింది. కాగా.. ఒక్కో గ్రూప్ విడిగా పెట్టుబడులు సమీకరించగలదని తెలియజేసింది. తద్వారా పబ్లిక్ ఇష్యూలను చేపట్టగలవని పేర్కొంది. అయితే టౌబవ్ టీమాల్ బిజినెస్ గ్రూప్ మాత్రం అలీబాబాకు అనుబంధ సంస్థగా వ్యవహ రించనున్నట్లు వెల్లడించింది. మిగిలిన గ్రూప్‌లన్నీ సొంత సీఈవో, డైరెక్టర్ల బోర్డుతో స్వతంత్రంగా కార్యకలాపాలు సాగించనున్నట్లు స్పష్టం చేసింది. టౌబవ్ టీమాల్ బిజినెస్ గ్రూప్‌లో టౌబవ్, టీమాల్, టౌబవ్ డీల్స్, 1688.కామ్ తదితరాలు భాగం కానున్నట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment