Business groups
-
స్వాతంత్య్రానికి ముందే పుట్టి.. నేటికీ మేటి!!
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ 78 ఏళ్లలో దేశ వ్యాపార రంగం ఎంతో పురోగమించింది. భారతీయ వ్యాపార సంస్థలు అంతర్జాతీయంగానూ శాసిస్తున్నాయి. అయితే స్వాతంత్య్రానికి పూర్వమే భారతీయుల వ్యాపార పటిమ ఏంటన్నది ఎందరో దిగ్గజాలు ప్రపంచానికి చాటి చెప్పారు. అలా స్వాతంత్య్రానికి ముందే పుట్టి మార్కెట్లో నేటికీ మేటిగా కొనసాగుతున్న కొన్ని భారతీయ వ్యాపార సంస్థల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..వాడియా గ్రూప్దేశంలో పురాతన వ్యాపార సామ్రాజ్యాల్లో వాడియా గ్రూప్ కూడా ఒకటి. 1736లో లోవ్జీ నుస్సర్వాంజీ వాడియా దీన్ని స్థాపించారు. దీని అనుబంధ సంస్థ ది బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 1863లో స్థాపితమైంది. గో ఫస్ట్, బ్రిటానియా ఇండస్ట్రీస్ మరికొన్ని అనుబంధ సంస్థలు.టాటా గ్రూప్టాటా గ్రూప్ అనేది 150కి పైగా దేశాలలో ఉత్పత్తులు, సేవలు అందిస్తూ 100 దేశాలలో కార్యకలాపాలున సాగిస్తున్న భారతదేశపు అతిపెద్ద సమ్మేళనం. దీన్ని 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంకా మరెన్నో అనుబంధ సంస్థలు దీనికి ఉన్నాయి.డాబర్ ఇండియాడాబర్ ఇండియా లిమిటెడ్ సంస్థను ఎస్కే బర్మన్ 1884లో స్థాపించారు. ఆయుర్వేద ఉత్పత్తులు, వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులను తయారు చేసే ఈ సంస్థ మార్కెట్లో అగ్ర సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది.కిర్లోస్కర్ గ్రూప్1888లో స్థాపించిన కిర్లోస్కర్ గ్రూప్ దేశంలో పురాతనమైన ఇంజినీరింగ్ సమ్మేళనాల్లో ఒకటి. లక్ష్మణరావు కిర్లోస్కర్ దీని వ్యవస్థాపకులు. ఈ సంస్థ తయారు చేసే యంత్ర పనిముట్లు ఆఫ్రికా, ఆగ్నేయాసియా, యూరప్‌లోని దాదాపు 70 దేశాలకు ఎగుమతవుతున్నాయి.గోద్రెజ్ గ్రూప్ గోద్రెజ్ గ్రూప్‌ను అర్దేషిర్ గోద్రేజ్ 1897లో స్థాపించారు. మొదట తాళాల తయారీలో గుర్తింపు పొందిన ఈ సంస్థ తర్వాత అనేక ఉత్పత్తులకు విస్తరించింది. రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆధిపత్యాన్ని చాటుతోంది.లక్ష్మీ మిల్స్దేశంలోని టెక్స్టైల్ రంగంలో లక్ష్మీ మిల్స్ పురాతన కంపెనీ. కోయంబత్తూరు కేంద్రంగా 1910లో జి.కుప్పుస్వామి నాయుడు దీన్ని స్థాపించారు. దేశ విదేశాల్లో నూలు దారాలు, వస్త్రాల ఉత్పత్తిలో ఇప్పటికీ రాణిస్తోంది.జేకే గ్రూప్ జేకే ఆర్గనైజేషన్ భారతీయ పారిశ్రామిక సమ్మేళనం. 1918లో లాలా కమ్లాపత్ సింఘానియా స్థాపించారు. ఈ గ్రూప్‌నకు చెందిన జేకే లక్ష్మి సిమెంట్ నిర్మాణ రంగంలో ప్రధానంగా ఉంది. అలాగే జేకే టైర్స్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది.బజాజ్ గ్రూప్బజాజ్ గ్రూప్ అనేది 1926లో జమ్నాలాల్ బజాజ్ స్థాపించిన భారతీయ బహుళజాతి సమ్మేళనం. ఈ సమూహంలో 40 కంపెనీలు ఉన్నాయి. దీని ప్రధాన సంస్థ బజాజ్ ఆటో ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ద్విచక్ర, త్రి-వీలర్ తయారీదారుగా పేరు పొందింది. -
7 బిజినెస్ గ్రూప్‌ల ఆస్తుల వేలం: సెబీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏడు బిజినెస్ గ్రూప్‌లకు చెందిన 17 ఆస్తులను వేలం వేయనున్నట్లు తాజాగా పేర్కొంది. జాబితాలో ఎంపీఎస్, వైబ్‌గ్యోర్ గ్రూప్‌లతోపాటు, టవర్ ఇన్ఫోటెక్ తదితరాలున్నాయి. ఇన్వెస్టర్ల సొమ్ము రికవరీ నిమిత్తం ఈ నెల 28న వేలం నిర్వహించనున్నట్లు సెబీ వెల్లడించింది. ఇందుకు రూ. 51 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఇతర గ్రూప్‌లలో ప్రయాగ్, మల్టీపర్పస్ బియోస్ ఇండియా, వారిస్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్, పైలాన్ గ్రూప్‌లున్నట్లు సెబీ ప్రకటించింది. వీటికి సంబంధించిన ప్రాపర్టీలను బ్లాక్ చేస్తున్నట్లు నోటీసు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో విస్తరించిన ఈ ఆస్తులలో భూములు, పలు అంతస్తుల భవంతులు, ఫ్లాట్లు, వాణిజ్య కార్యాలయాలున్నట్లు తెలియజేసింది. ఆన్లైన్ మార్గంలో నిర్వహించనున్న ఆస్తుల వేలానికి క్విక్‌ఆర్ రియల్టీ విక్రయ సేవలందించనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థలన్నీ నిబంధనలు పాటించకుండా ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణ చేపట్టినట్లు సెబీ వివరించింది. -
6 బిజినెస్ గ్రూపులుగా అలీబాబా
న్యూయార్క్: ఆరు విభిన్న బిజినెస్ గ్రూప్‌లుగా సంస్థను విడదీయనున్నట్లు చైనా కార్పొరేట్ దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. క్లౌడ్ ఇంటెలిజెన్స్, టౌబవ్ టీమాల్ బిజినెస్, లోకల్ సర్వీసెస్, గ్లోబల్ డిజిటల్ బిజినెస్, కాయ్నియావో స్మార్ట్ లాజిస్టిక్స్, డిజిటల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ గ్రూపులుగా విడదీయనున్నట్లు నియంత్రణ సంస్థలకు అలీబాబా సమాచారమిచ్చింది. దీంతో మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో అలీబాబా షేరు 8 శాతం జంప్‌చేసింది. కాగా.. ఒక్కో గ్రూప్ విడిగా పెట్టుబడులు సమీకరించగలదని తెలియజేసింది. తద్వారా పబ్లిక్ ఇష్యూలను చేపట్టగలవని పేర్కొంది. అయితే టౌబవ్ టీమాల్ బిజినెస్ గ్రూప్ మాత్రం అలీబాబాకు అనుబంధ సంస్థగా వ్యవహ రించనున్నట్లు వెల్లడించింది. మిగిలిన గ్రూప్‌లన్నీ సొంత సీఈవో, డైరెక్టర్ల బోర్డుతో స్వతంత్రంగా కార్యకలాపాలు సాగించనున్నట్లు స్పష్టం చేసింది. టౌబవ్ టీమాల్ బిజినెస్ గ్రూప్‌లో టౌబవ్, టీమాల్, టౌబవ్ డీల్స్, 1688.కామ్ తదితరాలు భాగం కానున్నట్లు తెలియజేసింది. -
టాటా గ్రూప్స్..! ఎప్పటికీ రారాజే...!
2021గాను భారత్‌లో టాప్‌లో నిలిచిన బిజినెస్ గ్రూప్స్ వివరాలను బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500 వెల్లడించింది. భారత్‌లోనే బిగ్గెస్ట్ బిజినెస్ హౌజేస్గా ఈ కంపెనీలు నిలిచాయి. టాటా గ్రూప్స్...ఎప్పటికీ రారాజే..! 14 అనుబంధ సంస్థలతో టాటా గ్రూప్స్ టాప్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్స్ రెండో స్థానంలో నిలిచింది. అదానీ గ్రూప్స్ ఏడు అనుబంధ సంస్థలను కల్గి ఉంది. తరువాతి స్థానాల్లో ఆదిత్య బిర్లా గ్రూప్స్, మురుగప్ప గ్రూప్స్, బజాజ్గ్రూప్స్ నిలిచాయి. టాప్ 5 బిజినెస్ గ్రూప్స్ భారత్‌లో సాఫ్ట్వేర్, మెటల్స్ అండ్ మైనింగ్, ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్ , ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి అనేక రంగాలలో సేవలను అందిస్తున్నాయి. ఈ గ్రూప్స్ సుమారు రూ. 4.6 మిలియన్ కోట్ల కంటే ఎక్కువ విలువను కలిగి ఉంది. చదవండి: ఇండియా ఎలా ఉందన్న అమెరికన్.. ఈ ఆన్సర్ చూస్తే ఆశ్చర్యపోతారు! -
వీసాల నిలిపివేత : ట్రంప్‌నకు భారీ షాక్
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి అమెరికన్ వ్యాపార దిగ్గజాల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్1బీ వీసాలతో సహా వర్కింగ్ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన నియంత్రణలను ఎత్తివేయాలని కోరుతూ పలు అమెరికన్ కంపెనీలు న్యాయస్ధానాన్ని ఆశ్రయించాయి. వీసా నియంత్రణలను సవాల్ చేస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ, విదేశాంగ శాఖలకు వ్యతిరేకంగా శాన్ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో మంగళవారం లాసూట్‌ను నమోదు చేశాయి. అమెరికాలో పనిచేసేందుకు వచ్చే వేలాది ప్రొఫెషనల్స్, ఉద్యోగులపై వీసాల నిలిపివేత నిర్ణయం ప్రభావం చూపుతుందని పలు అమెరికన్ కంపెనీలు వాదిస్తున్నాయి. ట్రంప్ తన అధికారాలను అధిగమించి జారీ చేసిన ఉత్తర్వులు పలువురిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడంలో కీలకమైన ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, ఐటీ నిపుణులు, డాక్టర్లు, నర్సులు,ఇతర కీలక రంగాల్లో పనిచేసే వారికి ఇవి ప్రతిబంధకమని, ఈ చట్టవిరుద్ధ వలస నియంత్రణలను రద్దు చేయాలని యూఎస్ పారిశ్రామికవేత్తలు, కంపెనీ అధిపతులు కోరుతున్నారు. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ తదితర వాణిజ్య సంఘాలు వీసా నియంత్రణలపై భగ్గుమంటున్నాయి. ట్రంప్ యంత్రాంగం వీసా నియంత్రణలపై తీసుకున్న నిర్ణయాన్ని తిరగతోడాలని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ థామస్ దనోహు కోరారు. చదవండి : అమెరికా తర్వాత ఇండియానే: ట్రంప్ ఆర్థిక వ్యవస్థ రికవరీ, పునరుద్ధరణకు ఈ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని, వీసా నియంత్రణలతో అమెరికా నుంచి నైపుణ్యాలతో కూడిన వ్యక్తులను ఇతర దేశాలు ఆకర్షించే అవకాశం ఉందని ఎన్ఏఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ కాన్సుల్ లిండా కెల్లీ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా అమెరికా వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక సంఘాలు దాఖలు చేసిన దావాపై హోంల్యాండ్ సెక్యూరిటీ, వైట్‌హౌస్, విదేశాంగ శాఖలు ఇప్పటివరకూ స్పందించలేదు. అన్ని రకాల వర్కింగ్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ జూన్ 22న ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపాయి. ట్రంప్ నిర్ణయంతో అన్ని రంగాల్లో అమెరికా వ్యాపారాలకు హాని చేకూరుతుందని దావాలో ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడి అధికార పరిధికి మించి తీసుకున్నఈ నిర్ణయాన్ని ఫెడరల్ విభాగాలు, అధికారులు అమలు చేయరాదని పేర్కొన్నారు. -
ఇపుడు బహమాస్ పత్రాల వంతు
జాబితాలో పలు బిజినెస్ గ్రూపులు - టాటా, జీఎంఆర్,వేదాంతా వంటి సంస్థలు - అక్రమార్జనని చెప్పలేం: పత్రిక కథనం న్యూఢిల్లీ: సంపన్నులు, బడా గ్రూపులు విదేశాల్లో పెట్టిన కంపెనీల గుట్టుమట్లను వెల్లడిస్తూ తొలుత ఆఫ్‌షోర్ లీకులు, తరవాత పనామా పత్రాల పేరిట వివరాలు వెల్లడించిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇనె ్వస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే)... తాజాగా బహమాస్ పత్రాలను బయటపెట్టింది. అక్కడ కంపెనీలు ఏర్పాటు చేసిన పలు అంతర్జాతీయ గ్రూపులు, భారతీయ సంస్థలు, వ్యక్తుల పేర్లను వెల్లడించింది. తాజా పత్రాల్లో వేదాంతా గ్రూపు అధిపతి అనిల్ అగర్వాల్, ఫ్యాషన్ టీవీ ఇండియా ప్రమోటరు అమన్ గుప్తా, బారన్ గ్రూపు అధిపతి కబీర్ మూల్‌చందానీ కూడా ఉండటం గమనార్హం. రాష్ట్రానికి చెందిన నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన సోదరుడు ప్రకాష్ పేర్లు కూడా ఉన్నట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక వెల్లడించింది. జర్మనీకి చెందిన ‘షుడూచ్ జీటంగ్’ పత్రిక చేతిలో కొత్త పత్రాలున్నాయని, మొత్తం 1.75 లక్షల పత్రాల్లో ఇండియాకు చెందినవి 475 వరకూ ఉన్నాయని పత్రిక తెలియజేసింది. ‘‘ఇక్కడ కంపెనీలున్నంత మాత్రాన దాంట్లో ఉన్నదంతా అక్రమ ధనమనో, భారతదేశ చట్టాలకు వ్యతిరేకంగా వాటిని ఏర్పాటు చేశారనో అర్థం కాదు. అయితే పన్ను స్వర్గమైన బహమాస్‌లో అలాంటి కంపెనీలు కూడా ఉంటే ఉండొచ్చు’’ అని ఆ పత్రిక తెలిపింది. ఈ కంపెనీలకు సంబంధించి పలువురిని తాము ఫోన్లో సంప్రదించామని, అంతా తాము ఆర్బీఐకి సమాచారం ఇచ్చాకే ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారని, ఎలాంటి అక్రమాలూ జరగలేదన్నారని పేర్కొంది. అయితే ఈ డేటాను తాము పన్ను అధికారులకు అందజేస్తామని, దర్యాప్తు అవసరమైతే వారే చేస్తారంది. నిజానికి ఐసీఐజేలో చూస్తే బహమాస్ లీక్స్ ద్వారా బయటపడిన ఇండియా కంపెనీల్లో టాటా గ్రూపునకు చెందిన టాటా ఇంక్, టాటా ఇన్వెస్ట్మెంట్, జీఎంఆర్ గ్రూపునకు చెందిన జీఎంఆర్ హోల్డింగ్స్ పేరిట 4 కంపెనీలున్నాయి. కంపెనీలు తమ అంతర్జాతీయ పెట్టుబడుల కోసం ఇలా పన్ను తక్కువ ఉండే దేశాల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తుంటాయి.