టాటా గ్రూప్స్‌..! ఎప్పటికీ రారాజే...! | Top 5 Business Groups In The 2021 Burgundy Private Hurun India 500 | Sakshi
Sakshi News home page

2021 Burgundy Private Hurun India 500: టాప్‌-5 బిజినెస్‌ గ్రూప్స్‌లో మొదటిస్థానంలో నిలిచిన టాటా గ్రూప్స్‌..!

Published Sun, Dec 12 2021 10:21 AM | Last Updated on Sun, Dec 12 2021 10:25 AM

Top 5 Business Groups In The 2021 Burgundy Private Hurun India 500 - Sakshi

2021గాను భారత్‌లో టాప్‌లో నిలిచిన బిజినెస్‌ గ్రూప్స్‌ వివరాలను బుర్గుండి ప్రైవేట్‌ హురున్‌ ఇండియా 500 వెల్లడించింది. భారత్‌లోనే బిగ్గెస్ట్‌ బిజినెస్‌ హౌజేస్‌గా ఈ కంపెనీలు నిలిచాయి. 

టాటా గ్రూప్స్‌...ఎప్పటికీ రారాజే..!
14 అనుబంధ సంస్థలతో టాటా గ్రూప్స్‌ టాప్‌-1  స్థానాన్ని కైవసం చేసుకుంది. గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్స్‌ రెండో స్థానంలో నిలిచింది. అదానీ గ్రూప్స్‌ ఏడు అనుబంధ సంస్థలను కల్గి ఉంది. తరువాతి స్థానాల్లో ఆదిత్య బిర్లా గ్రూప్స్‌, మురుగప్ప గ్రూప్స్‌, బజాజ్‌గ్రూప్స్‌ నిలిచాయి.

టాప్ 5 బిజినెస్ గ్రూప్స్‌ భారత్‌లో సాఫ్ట్‌వేర్, మెటల్స్ అండ్‌ మైనింగ్, ఆటోమొబైల్,  ఆటో కాంపోనెంట్స్ , ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి అనేక రంగాలలో సేవలను అందిస్తున్నాయి. ఈ గ్రూప్స్‌ సుమారు రూ. 4.6 మిలియన్ కోట్ల కంటే ఎక్కువ విలువను కలిగి ఉంది.
చదవండి: ఇండియా ఎలా ఉందన్న అమెరికన్‌.. ఈ ఆన్సర్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement