Tata Group companies
-
టాటా పవర్.. డబుల్ ధమాకా!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 90 శాతం జంప్‌చేసి రూ. రూ. 884 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 466 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,310 కోట్ల నుంచి రూ. 14,639 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 9,480 కోట్ల నుంచి రూ. 14,660 కోట్లకు భారీగా పెరిగాయి. ఈ ఏడాది రూ. 14,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది. వీటిలో రూ. 10,000 కోట్లను పునరుత్పాదక ఇంధన విభాగంపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. సోలార్ సెల్ ప్లాంట్ 4 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంటు ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు టాటా పవర్ తాజాగా తెలియజేసింది. ఇందుకు రూ. 3,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 5,524 మెగావాట్లుకాగా.. దీనిలో స్థాపిత సామర్థ్యం 3,634 మెగావాట్లు. మరో 1,890 మెగావాట్ల యూనిట్లు వివిధ అభివృద్ధి దశలలో ఉన్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాలలో 75,000 సోలార్ పంపులను ఏర్పాటు చేసింది. విద్యుత్ ప్రసారం, పంపిణీ విభాగంలో ఎన్ఆర్ఎస్ఎస్ ట్రాన్స్‌మిషన్‌ను(100 శాతం వాటా) సొంతం చేసుకుంది. ఫలితాల నేపథ్యంలో టాటా పవర్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం నష్టంతోరూ. 226 దిగువన ముగిసింది. చదవండి: అక్రమ నిర్మాణం..వందల కోట్లకు ఇంటిని అమ్మేసిన మార్క్ జుకర్ బర్గ్! -
టాటా గ్రూప్స్..! ఎప్పటికీ రారాజే...!
2021గాను భారత్‌లో టాప్‌లో నిలిచిన బిజినెస్ గ్రూప్స్ వివరాలను బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500 వెల్లడించింది. భారత్‌లోనే బిగ్గెస్ట్ బిజినెస్ హౌజేస్గా ఈ కంపెనీలు నిలిచాయి. టాటా గ్రూప్స్...ఎప్పటికీ రారాజే..! 14 అనుబంధ సంస్థలతో టాటా గ్రూప్స్ టాప్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్స్ రెండో స్థానంలో నిలిచింది. అదానీ గ్రూప్స్ ఏడు అనుబంధ సంస్థలను కల్గి ఉంది. తరువాతి స్థానాల్లో ఆదిత్య బిర్లా గ్రూప్స్, మురుగప్ప గ్రూప్స్, బజాజ్గ్రూప్స్ నిలిచాయి. టాప్ 5 బిజినెస్ గ్రూప్స్ భారత్‌లో సాఫ్ట్వేర్, మెటల్స్ అండ్ మైనింగ్, ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్ , ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి అనేక రంగాలలో సేవలను అందిస్తున్నాయి. ఈ గ్రూప్స్ సుమారు రూ. 4.6 మిలియన్ కోట్ల కంటే ఎక్కువ విలువను కలిగి ఉంది. చదవండి: ఇండియా ఎలా ఉందన్న అమెరికన్.. ఈ ఆన్సర్ చూస్తే ఆశ్చర్యపోతారు! -
డబుల్ బెడ్రూం ఇళ్లలో భాగస్వామ్యం
టాటా గ్రూప్ అంగీకారం ♦ హైదరాబాద్‌లో టాటా ఏఐజీ సెంటర్ ♦ రక్షణ, ఏరోస్పేస్లో పెట్టుబడులకు ఆసక్తి ♦ ముంబైలో సైరస్ మిస్త్రీతో మంత్రి కేటీఆర్ భేటీ ♦ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతోనూ సమావేశం ♦ రాష్ట్రానికి అంబానీ కితాబు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్ సంస్థలు అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో టాటా-ఏఐజీ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ముం బైకి వెళ్లిన రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు సోమవారం టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో విడివివిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూపు ఆసక్తి కనబరిచింది. టీ హబ్ ఇన్నోవేషన్ ఫండ్‌కు టాటా క్యాపిటల్ నుంచి ఆర్థిక సహకారం అందించేందుకు అవగాహన కుదిరింది. అంబానీతో భేటీ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాన్ని మంత్రి కేటీఆర్ వివరించారు. పరిశ్రమల అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్యుత్ ప్రణాళికలను అంబానీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి పథకాన్ని నిర్దిష్ట గడువుతో పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని, వాటర్ గ్రిడ్ పూర్తి కాకుంటే వచ్చే ఎన్నికలకు వెళ్లబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను అంబానీకి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం దూర దృష్టితో ముందుకెళ్తోందని, దానికి అనుగుణంగా ఆచరణ కనిపిస్తోందని అంబానీ కితాబిచ్చారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరిస్తున్న ప్రణాళికలను, కార్యాచరణ విధానాన్ని మెచ్చుకున్నారు. ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు తమ వద్ద ప్రణాళికలున్నాయని, త్వరలోనే ప్రభుత్వం పెద్దఎత్తున వివిధ రంగాల్లో పని చేస్తామని మంత్రికి తెలిపారు. కేటీఆర్ వెంట ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఉన్నారు.