స్వయం కృషితో అవతరించిన దిగ్గజ పారిశ్రామికవేత్తల జాబితాను ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్, హరూన్ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. 2,000 సంవత్సరం తర్వాత స్వయం కృషితో ఎదిగిన వ్యాపారవేత్తలు, వారు ఏర్పాటు చేసిన 200 కంపెనీ వివరాలను తెలియజేశాయి. అందులో దేశవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలుగా పేరున్న డీమార్ట్, జొమాటో, స్విగ్గీ, మేక్ మై ట్రిప్, మ్యాక్స్ హెల్త్‌కేర్, డ్రీమ్11..వంటి సంస్థలున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు కూడా ఆ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
స్విగ్గీ
ర్యాంకు: 3
వ్యవస్థాపకులు: నందన్‌రెడ్డి, శ్రీహార్ష మాజేటి
కంపెనీ విలువ: రూ.1,01,300 కోట్లు.
ఈ సంస్థను 2013లో ఏర్పాటు చేశారు.
దెక్కన్ ఫైన్ కెమికల్స్
ర్యాంకు: 25
వ్యవస్థాపకులు: వంశీ గోకరాజు, జీఎస్ రాజు.
కంపెనీ విలువ: రూ.31,600 కోట్లు
ఈ సంస్థను 2006లో స్థాపించారు.
ఎంఎస్‌ఎన్ లేబోరేటరీస్
ర్యాంకు: 31
వ్యవస్థాపకులు: సత్యనారాయణ రెడ్డి
కంపెనీ విలువ: రూ.26,200 కోట్లు
ఈ సంస్థను 2003లో స్థాపించారు.
లారస్ ల్యాబ్స్
ర్యాంకు: 34
వ్యవస్థాపకులు: సత్యనారాయణ చావ
కంపెనీ విలువ: రూ.24,900 కోట్లు
ఈ సంస్థను 2005లో స్థాపించారు.
కిమ్స్
ర్యాంకు: 40
వ్యవస్థాపకులు: భాస్కర్‌రావు
కంపెనీ విలువ: రూ.21,900 కోట్లు
ఈ సంస్థను 2000లో స్థాపించారు.
ర్యాపిడో
ర్యాంకు: 98
వ్యవస్థాపకులు: అరవింద్ సంకా, పవన్ గుంటుపల్లి
కంపెనీ విలువ: రూ.9,200 కోట్లు
ఈ సంస్థను 2015లో స్థాపించారు.
ఇదీ చదవండి: ఏఐకి సవాళ్లు.. హ్యాకింగ్ రిస్కులు!
మెడ్‌ప్లస్
ర్యాంకు: 119
వ్యవస్థాపకులు: మధుకర్ గంగిడి
కంపెనీ విలువ: రూ.8,200 కోట్లు
ఈ సంస్థను 2006లో స్థాపించారు.
బొండాడ ఇంజినీరింగ్
ర్యాంకు: 142
వ్యవస్థాపకులు: రాఘవేంద్ర రావు
కంపెనీ విలువ: రూ.6,400 కోట్లు
ఈ సంస్థను 2012లో స్థాపించారు.
జాగిల్ ప్రీపెయిడ్
ర్యాంకు: 160
వ్యవస్థాపకులు: రాజ్‌ఫణి
కంపెనీ విలువ: రూ.5,300 కోట్లు
ఈ సంస్థను 2011లో స్థాపించారు.
టీమ్‌లీజ్ సర్వీసెస్
ర్యాంకు: 162
వ్యవస్థాపకులు: అశోక్ రెడ్డి
కంపెనీ విలువ: రూ.5,200 కోట్లు
ఈ సంస్థను 2000లో స్థాపించారు.
Comments
Please login to add a commentAdd a comment