జాబితాలో పలు బిజినెస్ గ్రూపులు
- టాటా, జీఎంఆర్,వేదాంతా వంటి సంస్థలు
- అక్రమార్జనని చెప్పలేం: పత్రిక కథనం
న్యూఢిల్లీ: సంపన్నులు, బడా గ్రూపులు విదేశాల్లో పెట్టిన కంపెనీల గుట్టుమట్లను వెల్లడిస్తూ తొలుత ఆఫ్‌షోర్ లీకులు, తరవాత పనామా పత్రాల పేరిట వివరాలు వెల్లడించిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇనె ్వస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే)... తాజాగా బహమాస్ పత్రాలను బయటపెట్టింది. అక్కడ కంపెనీలు ఏర్పాటు చేసిన పలు అంతర్జాతీయ గ్రూపులు, భారతీయ సంస్థలు, వ్యక్తుల పేర్లను వెల్లడించింది. తాజా పత్రాల్లో వేదాంతా గ్రూపు అధిపతి అనిల్ అగర్వాల్, ఫ్యాషన్ టీవీ ఇండియా ప్రమోటరు అమన్ గుప్తా, బారన్ గ్రూపు అధిపతి కబీర్ మూల్‌చందానీ కూడా ఉండటం గమనార్హం.
రాష్ట్రానికి చెందిన నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన సోదరుడు ప్రకాష్ పేర్లు కూడా ఉన్నట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక వెల్లడించింది. జర్మనీకి చెందిన ‘షుడూచ్ జీటంగ్’ పత్రిక చేతిలో కొత్త పత్రాలున్నాయని, మొత్తం 1.75 లక్షల పత్రాల్లో ఇండియాకు చెందినవి 475 వరకూ ఉన్నాయని పత్రిక తెలియజేసింది. ‘‘ఇక్కడ కంపెనీలున్నంత మాత్రాన దాంట్లో ఉన్నదంతా అక్రమ ధనమనో, భారతదేశ చట్టాలకు వ్యతిరేకంగా వాటిని ఏర్పాటు చేశారనో అర్థం కాదు.
అయితే పన్ను స్వర్గమైన బహమాస్‌లో అలాంటి కంపెనీలు కూడా ఉంటే ఉండొచ్చు’’ అని ఆ పత్రిక తెలిపింది. ఈ కంపెనీలకు సంబంధించి పలువురిని తాము ఫోన్లో సంప్రదించామని, అంతా తాము ఆర్‌బీఐకి సమాచారం ఇచ్చాకే ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారని, ఎలాంటి అక్రమాలూ జరగలేదన్నారని పేర్కొంది. అయితే ఈ డేటాను తాము పన్ను అధికారులకు అందజేస్తామని, దర్యాప్తు అవసరమైతే వారే చేస్తారంది. నిజానికి ఐసీఐజేలో చూస్తే బహమాస్ లీక్స్ ద్వారా బయటపడిన ఇండియా కంపెనీల్లో టాటా గ్రూపునకు చెందిన టాటా ఇంక్, టాటా ఇన్వెస్ట్‌మెంట్, జీఎంఆర్ గ్రూపునకు చెందిన జీఎంఆర్ హోల్డింగ్స్ పేరిట 4 కంపెనీలున్నాయి. కంపెనీలు తమ అంతర్జాతీయ పెట్టుబడుల కోసం ఇలా పన్ను తక్కువ ఉండే దేశాల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తుంటాయి.
ఇపుడు బహమాస్ పత్రాల వంతు
Published Fri, Sep 23 2016 2:43 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement
Advertisement