ప్రముఖ స్టీల్ తయారీ కంపెనీ టాటా స్టీల్ మైనింగ్ కార్యకాలాపాలను పూర్తిగా మహిళలతోనే నిర్వహించి రికార్డు నెలకొల్పింది. పురుషులకు ధీటుగా మైనింగ్ పనుల్లో పూర్తి మహిళలతో స్టీల్‌ను ఉత్పత్తి చేస్తుంది. దేశంలో మొట్టమొదటిసారి ఇలా మహిళలతో మైనింగ్ పనులు చేయిస్తున్న కంపెనీగా టాటా గుర్తింపు పొందింది.
ఇదీ చదవండి: విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్
జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలోని నోముండి ఇనుప గనిలో టాటా స్టీల్ మహిళాషిఫ్ట్‌ను ప్రారంభించింది. భారీ మెషినరీ, పారలు, లోడర్లు, డ్రిల్స్, డోజర్లు, షిఫ్ట్ పర్యవేక్షణతో సహా అన్ని మైనింగ్ కార్యకలాపాలను మహిళా ఉద్యోగులతోనే నిర్వహిస్తోంది. మహిళలు దేనిలో తక్కువకాదని చెప్పడంతోపాటు వారు సమాజంలో మరింత ధీమాగా ఉండేలా కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడంలో స్థానికులను భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేకంగా ‘తేజస్విని’ పేరుతో నియామకాలు, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment