టాటా స్టీల్ తన ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తామన్న ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. బ్రిటన్ తయారీ యూనిట్‌లోని ‘కార్బన్ ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నేస్’ మూసివేత ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పింది. ఈమేరకు టాటా స్టీల్ గ్లోబల్ సీఈఓ టీవీ నరేంద్రన్ రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్రిటన్‌లోని టాటా స్టీల్ తయారీ ప్లాంట్‌లో ఉద్యోగులు కోత ఉండబోతుందని గతంలోనే ప్రకటించాం. ఆ ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులేదు. ఇప్పటికే ఒక కార్బన్-ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నేస్‌ను మూసివేస్తున్నట్లు చెప్పాం. ఆమేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. స్టీల్ ముడిసరుకుగా ఉన్న ఐరన్‌ఓర్ ధరలు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం లేదు. యూకే ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపించాం. తయారీ యూనిట్‌లోని మరో బ్లాస్ట్ ఫర్నేస్‌ను సెప్టెంబర్‌లో మూసివేసేలా చర్చలు జరుగుతున్నాయి. రెండు ఫర్నేస్‌లు మూతపడడంతో సౌత్ వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్ యూనిట్‌లో 2,800 వరకు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఉద్యోగులు తొలగింపు అంశం యూనియన్లు, కంపెనీ, ప్రభుత్వం సమష్టి బాధ్యత. కేవలం కంపెనీ నిర్ణయాలే వాటిని ప్రభావితం చేయవు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: జులైలో పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు
బ్రిటన్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ జులైలో మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం టాటా స్టీల్ ప్రతినిధులతో చర్చించి ఉద్యోగులు కోతను నివారించేలా చర్యలు చేపడుతుందన్నారు. ప్లాంట్ నుంచి తక్కువ కార్బన్ విడుదలయ్యేలా అవసరమయ్యే సాంకేతిక సహాయం అందిస్తుందని చెప్పారు. ‘లోకార్బన్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్’ను నిర్మించడంలో సహాయం చేయడానికి గత ప్రభుత్వం టాటా స్టీల్‌తో చేసుకున్న 500 మిలియన్ పౌండ్ (రూ.5,318 కోట్లు) ఒప్పంద ప్యాకేజీపై కొత్త ప్రభుత్వం సంతకం చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment