Indian Women's Are Turning Home Kitchens Into Successful Businesses - Sakshi
Sakshi News home page

'కిచెన్‌ క్వీన్స్‌'..వంటగదితోనే వ్యాపారం సృష్టించారు!

Published Mon, Jul 31 2023 3:57 PM | Last Updated on Mon, Jul 31 2023 4:32 PM

Women Are Turning Home Kitchens Into Successful Businesses - Sakshi

కొందరూ మహిళలు మహమ్మారీ కాలాన్ని చెడు కాలంగా ఫీలై గదులకే పరిమితమైపోలేదు. అవరోధంగా భావించకుండా అవకాశంగా మలుచుకున్నారు. వ్యాపారాన్ని సృష్టించుకునేందుకు అనువైనం కాలంగా క్యాష్‌ చేసుకున్నారు. వ్యాపారవేత్తలుగా మారి స్త్రీ సత్తా ఏంటో చూపించారు.

నిజానికి కరోనా కాలం ఎంత భయానకంగా ఉందో చెప్పనవసరం లేదు. ఆ రోజులు గుర్తొచ్చిన బాబోయ్‌..! అనిపిస్తుంది. కానీ ఈ మహిళలు దాన్నే వరంగా మార్చుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంతో కుటుంబ ఆదాయన్ని సృష్టించుకుంటే. మరికొందరూ ఆ సక్సెస్‌ ఇచ్చిన స్థైర్యంతో తమ వ్యాపారాన్ని మరింత విస్తరింప చేసేలా చేసుకున్నారు. ఈ మేరకు లక్నోలో ఉండే 51 ఏళ్ల మీనాక్షి ఆర్య వంటపై తనకున్న ఆసక్తనే అవకాశంగా మలిచుకుంది. ఆ  వంటిల్లునే చిన్నపాటి వాణిజ్యసంస్థగా మార్చింది. 'పంజాబీ కధై' అనే పేరుతో వివిధ రుచులను పరిచయం చేసింది.

కోవిడ్‌ రోగులకు ఆహారాన్ని అందించడం ద్వారా ప్రారంభమైన బిజినెస్‌ కాస్త మరింతగా విస్తరించింది. ఆ టైంలో 'క్లౌడ్‌ కిచెన్‌' పేరుతో మహిళలు ఇంటి దగ్గరే స్వయంగా తయారు చేసిన ఆహారాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చాలామందికి ఆధారం అయ్యింది. ఎందుకంటే లాక్‌డౌన్‌ కారణంగా ‍హోటల్స్‌, రెస్టారెంట్‌ మూసేయడంతో ఇది ఆ మహిళలకు వరమై మంచి ఆధాయ వనరుగా మారింది. ఇక అప్పుడు ఆ టైంలో ఫుడ్‌ని మీనాక్షి భర్తే డెలీవరీ చేసేవాడు. ప్రస్తుతం మాత్రం ఆమె ఉబర్‌లో పనిచేసే వ్యక్తి సాయంతో ఆర్డర్‌లు డెలివరీ చేస్తూ వ్యాపారాన్ని దిగ్విజయంగా నడుపుతోంది.

అదేబాటలో నడిచింది శిక్షా ఖండేల్వాల్‌ ఆమె కూడా తన ఇంటి నుంచి ఫుడ్‌ ప్రిపేర్ చేసి డెలివరి చేసింది. ఆమె ఎక్కువగా కొరియర్‌ సర్వీస్‌లపై ఆధారపడింది. అదీగాక ఆ టైంలో టెక్కీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఉద్యోగాలు పోయి వీధిలో నిలబడి పోయే స్థితిలో ఆమెకు కూడా ఈ క్లౌడ్‌ కిచెన్‌ ఆధారమైంది. ఇదే కోవలోనే కోలకతాకు చెందని మాజీ ఐటీ ప్రోఫెషనల్‌ శిక్ష అత్యంత విజయవంతమైన 'కస్ట్‌మైజ్డ్‌ క్లౌడ్‌ కిచెన్‌'ని నడుపుతోంది.

అదే ఆమె ఆధాయానికి బాసటయ్యింది. అలాగే తనలా ఇబ్బంది పడుతున్న ఐటీ వాళ్లకు కూడా ఈ వ్యాపారాన్ని పరిచయం చేసి..తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించే యత్నం చేస్తోంది. ఆమె శాఖాహారం, మాంసహారాన్ని ఎలాంటి డెలీవరీ చార్జీలే లేకుండానే అందిస్తున్నారు. వాటి తోపాటు పచ్చళ్లు, మురబ్బా, పాపడ్‌, తదితర వాటిని కూడా విక్రయిస్తుంది. ఏదీ ఏమైనా మనసు ఉండాలే గానీ చెడుకాలాన్ని కూడా చెడుగుడు ఆడేలా చక్కటి అవకాశం మార్చుకోవచ్చు అని నిరూపించారు ఈ మహిళలు. 

(చదవండి:  కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్‌!ఏంటంటే ఇది!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement