పలు ‘ఫైవ్ స్టార్’ హోటళ్లూ అదే దారిలో
సిటీలో అతి పెద్ద వ్యాపారంగా అవతరణ
ఊపందుకున్న స్విగ్గీ, జొమాటో
బ్రాండ్ ఇమేజ్ దృష్ట్యా ఈ దారిలోకి రాని 5 స్టార్ హోటల్స్
చెక్ పెడుతున్న ఐటీసీ వంటి స్టార్ హోటల్స్
అథెంటిసిటీ మిస్ అవ్వకుండా సేవలు
దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో.. విభిన్న ఆహార రుచులకు కేంద్రమైన నగరాల్లో హైదరాబాద్ కూడా ప్రముఖమైనది. ప్రస్తుత కాంటినెంటల్ వంటకాలే కాదు నిజాం కాలం నాటి స్థానిక సాంస్కృతిక వంటకాలతోనూ మన భాగ్యనగరం ‘బౌల్ ఆఫ్ డెలీíÙయస్ డిష్’గా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా నగరంలో స్థానిక వంటకాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రుచులు కూడా ఆదరణ పొందుతున్నాయి. ఈ రుచుల కోసమే ప్రత్యేకంగా రెస్టారెంట్లు కూడా వెలిశాయి. అయితే కరోనా అనంతరం ఈ రంగంలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా క్లౌడ్ కిచెన్. ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడంతో మొదలైన ఈ కల్చర్.. వెళ్లే అవకాశమున్నా ఆన్‌లైన్ లోనే ఆర్డర్ పెట్టేంతగా మార్పు చెందింది.
నగరంలో విభిన్న రుచులు విభిన్న సంసంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ బిర్యానీ మొదలు ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ వరకూ అన్ని రుచులూ ఆన్‌లైన్, డిజిటల్ వేదికగా ఒక్కొక్క ఆర్డర్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్థానిక వంటకాలే కాదు చైనీస్, కొరియన్, మొగలాయి, కరాచి వంటి రుచులను అందించే రెస్టారెంట్లు తమ డోర్ స్టెప్ సేవలను అందిస్తున్నాయి. వీరికి వారధులుగా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ వేదికలు ఉన్నాయన్న విషయం విధితమే. అయితే.. ఈ కోవలోకి స్టార్ రెస్టారెంట్లు కాస్త విముఖతను ప్రదర్శించాయి.
నాణ్యత, బ్రాండ్ వాల్యూ విషయంలో ఈ సేవలు అందించలేదనేది నిపుణుల మాట. కానీ ప్రస్తుతం నగరంలోని టాప్ 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు సైతం క్లౌడ్‌కిచెన్‌కు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి పాకశాస్త్ర నైపుణ్యాలతో నాణ్యత, ప్యాకింగ్, బ్రాండ్ వాల్యూ వంటి అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సేవలు ప్రారంభిస్తున్నాయి. విలాసవంతమైన జీవితాల్లో ఈ లోటును పూడ్చడానికి స్టార్ హోటళ్ల యాజమాన్యం ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా గమనించాలి. జూబ్లిహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల డిజిటల్ ఫుడ్ సేవలు ఊపందుకున్నాయి.
అందరూ అదే దారిలో..
డైనింగ్‌తో పాటు ఈ క్లౌడ్ కిచెన్‌లో కూడా మంచి లాభాలు వస్తుండటంతో పలు రెస్టారెంట్లు ఈ డిజిటల్ ఇన్నోవేషన్‌కు సై అంటున్నాయి. కానీ స్టార్ హోటళ్లు మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే గత కొంత కాలంగా 5 స్టార్ హోటళ్లు సైతం క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించాయి. వాటి బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూనే, పాకశాస్త్ర నైపుణ్యాలను డిజిటల్ వేదికతో అనుసంధానం చేస్తూ సేవలందిస్తున్నాయి. ఇక క్లౌడ్ కిచెన్ సేవలను నగరవాసులు ఆస్వాదిస్తున్న తీరు అద్భుతం. ఈ నేపథ్యంలో వారికి మా సేవలను సైతం అందంచాలనే లక్ష్యంతో ఐటీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫుడ్‌టెక్ సేవలు ప్రారంభించాం. స్విగ్గీ, జొమాటో వంటి వేదికలతో అనుసంధానమై మా పసందైన రుచుల పండుగను ఆహార ప్రియుల వద్దకే చేర్చుతున్నాం. ముఖ్యంగా మా ప్రయత్నంలో అధిక–నాణ్యత భోజనాన్ని అందించడంతో పాటుగా పర్యావరణహితమైన ప్యాకింగ్‌ను కొనసాగిస్తున్నాం.
డిజిటలీకరణతో అద్భుత ఫలితాలు
ఫుడ్, హోటల్స్ రంగంలో అధునాతన డిజిటలీకరణ అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్‌లో పాకశాస్త్ర నిపుణులైన స్టార్ హోటల్ చెఫ్‌లు, కిచెన్ మేనేజర్‌లు విశేషమైన శిక్షణ ఉండటంతో ఈ విధమైన క్లౌడ్ కిచెన్‌కు మంచి ఆదరణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా వివిధ దశల్లో ఆహార పదార్థాల తనిఖీ, తయారీ విధానంలోనూ అధునాతన సాంకేతికత వినియోగించడంతో పాటు శాటిలైట్ కిచెన్‌లలో ఉపయోగించే యాప్‌లు ఈ వంటలకు మరింత నాణ్యతను, ఖచి్చతత్వాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ ఫుడ్ టెక్ సేవలలో సుస్థిరతే ప్రధాన లక్ష్యంగా స్టార్ హోటల్స్ ప్యాకింగ్‌ను వినూత్నంగా చేపడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, మారే ఉష్ణోగ్రతలు ఆహారాన్ని పాడు చేయకుండా స్పిల్లేజ్ ప్రూఫ్ కంటైనర్‌లను ఉపయోగిస్తుండటం విశేషం.
ఫుడ్ లవర్స్ అభిరుచికి అనుగుణంగా..
నగరంలోని ఫుడ్ లవర్స్ ఇష్టపడే రుచులకు అనుగుణంగా, మా నాణ్యతా ప్రమాణాలను పెంచుకుంటూ 3 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందులో భాగంగా ప్రముఖ మాస్టర్ చెఫ్‌లచే రూపొందించబడిన దాల్ మఖీ్న, కబాబ్‌లు, ర్యానీలతో సహా గౌర్మెట్ నార్త్ ఇండియన్ వంటకాలను అందించడానికి ‘ఐటీసీ మాస్టర్ చెఫ్ క్రియేషన్స్’, ఆరోగ్యానికి హితమైన మిల్లెట్ కిచిడీ, ఇంటి వంటలను తలపించే చపాతీలు, అన్నం వంటి వాటికోసం ‘ఐటీసీ ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్’, క్రోసెంట్స్, బేగెల్స్, గౌర్మెట్ బ్రెడ్‌లు వంటి బేకరీ ఐటమ్స్ కోసం ‘ఐటీసీ సన్‌ఫీస్ట్ బేక్డ్ క్రియేషన్స్’ సేవలు ఉన్నాయి. ఈ మూడు రకాల సేవలను హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నైలోని 19 క్లౌడ్ కిచెన్‌లలో ప్రారంభించాం.
– రోహిత్ భల్లా, ఫుడ్ టెక్ బిజినెస్ హెడ్, ఐటీసీ లిమిటెడ్.
Comments
Please login to add a commentAdd a comment