ఫీల్డ్‌ ఉద్యోగులపై నిఘా! | Surveillance on Field Employees! | Sakshi
Sakshi News home page

ఫీల్డ్‌ ఉద్యోగులపై నిఘా!

Published Sat, Apr 22 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

ఫీల్డ్‌ ఉద్యోగులపై నిఘా!

ఫీల్డ్‌ ఉద్యోగులపై నిఘా!

► క్లౌడ్‌ ఆధారంగా ఉద్యోగులను ట్రాక్‌ చేస్తున్న స్పూర్‌
► డేటాతో పాటు రిపోర్ట్‌లు, ఆడియో, వీడియోలూ పంపొచ్చు
► 6 దేశాల్లో 150 కంపెనీల్లో 30 వేల మందికి సేవలు
► గతేడాది రూ.4 కోట్ల టర్నోవర్‌; ఈ ఏడాది7 కోట్ల లక్ష్యం
► రెండేళ్లలో అమెరికా, ఆఫ్రికా, యూరప్‌లకు విస్తరణ
► ‘స్టార్టప్‌ డైరీ’తో స్పూర్‌ ఫౌండర్, సీఈఓ సీ రామకృష్ణా రెడ్డి  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మార్కెటింగ్, కలెక్షన్, ఏజెంట్‌ వంటి ఫీల్డ్‌ ఉద్యోగాలు టార్గెట్‌ను చేరుకుంటే చాలు... ఎంచక్కా ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంటారు. ఎందుకంటే పై అధికారులకు ఫీల్డ్‌ ఉద్యోగులు ఎక్కడున్నారో తెలిసే అవకాశముండదు కాబట్టి!!. అంటే ట్రాకింగ్‌ చేసే వీలుండదని దానర్థం. కానీ, స్పూర్‌తో ట్రాకింగ్‌ మాత్రమే కాదు ఎప్పటికప్పుడు ఉద్యోగి పనితీరు రిపోర్ట్‌లూ వస్తాయి. డేటా విశ్లేషణతో పాటూ ఆడియో, వీడియోలు కూడా అందుతాయి. అది కూడా ఇంటర్నెట్‌ అక్కర్లేకుండానే!. ఆ విశేషాలేంటో స్పూర్‌.ఇన్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ సీ రామకృష్ణా రెడ్డి మాటల్లోనే..

మాది అనంతపురం జిల్లా. కర్ణాటకలో ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరా. తర్వాత సొనాటా బెంగళూరులో.. తరవాత అమెరికాలో ఇంటెల్‌ చిప్‌ కంపెనీలో చేశా. 2002 వరకు అక్కడే పనిచేసి.. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌కి తిరిగొచ్చా. ఆ సమయంలో మొబైల్‌ వాల్యూ యాడ్‌ సర్వీసెస్‌ కంపెనీ అయన్సిస్‌ను ప్రారంభించా. కానీ మొబైల్‌ ప్రాజెక్ట్‌లు నెల రెండు నెలల కంటే ఎక్కువ కాలం ఉండేవి కావు. ఇది కరెక్ట్‌ కాదని కంపెనీలకు ఉపయోగపడేలా ఏదైనా కొత్త టెక్నాలజీ స్టార్టప్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. అలా 2013 ఏప్రిల్‌లో స్పూర్‌.ఇన్‌ను బీజం పడింది. రూ.కోటి పెట్టుబడితో ఎఫర్ట్‌ అనే టెక్నాలజీ ప్రొడక్ట్‌ను రూపొందించాం.

స్పూర్‌ అంటే..
స్పూర్‌ అంటే జంతువును గానీ మనిషిని గానీ ట్రాక్‌ చేయడం అని అర్థం. మా సేవలు కూడా ఉద్యోగుల పనితీరును ట్రాక్‌ చేయడమే కనుక ఈ పేరు పెట్టాం. ఎఫర్ట్‌ (ఈఎఫ్‌ఎఫ్‌ఓఆర్‌టీ) అంటే.. ఎఫర్ట్‌లెస్‌ ఫీల్డ్‌ ఫోర్స్‌ ఆప్టిమైజేషన్‌ అండ్‌ రిపోర్టింగ్‌ టూల్‌కిట్‌ అని. దీంతో ఫీల్డ్‌ ఉద్యోగుల్లో పారదర్శకత, సమర్ధత, జవాబుదారీతనం పెరుగుతుంది. కంపెనీలకు ఉత్పాదక పెరుగుతుంది. ఏ రంగంలోని ఫీల్డ్‌ ఉద్యోగులైనా సరే పై అధికారులకు మూడింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

1. ఎక్కడున్నారు? 2. ఈరోజు ఏం చేస్తారు? 3. చివరికి సాధించిందేంటి? వీటిల్లో ఫీల్డ్‌ ఉద్యోగులు ఏం చెబితే అదే ఫైనల్‌. అంటే అధికారులకు ప్రతి ఉద్యోగినీ స్వయంగా తనిఖీ చేయడం కుదరదు. స్పూర్‌తో అది కుదరదు. ఎందుకంటే స్పూర్‌ ‘ఎఫోర్ట్‌’ ఫీల్డ్‌ ఆఫీసర్లను ట్రాక్‌ చేస్తుంటుంది? ఎప్పటికప్పుడు వాటి వివరాలను అధికారికి చేరవేస్తుంది. డేటానే కాదు పిక్చర్స్, వీడియో, ఆడియోలను కూడా పంపించుకోవచ్చు. అది కూడా ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే.

ఒక్కో లాగిన్‌కు రూ.300 చార్జీ..
ఆటోమెటిక్‌ ఫీల్డ్‌ ఆపరేషన్, షెడ్యూలింగ్‌ అండ్‌ డిస్‌ప్యాచ్, జీయో ట్యాగింగ్, నోటిఫికేషన్స్‌ మరియు అలెర్ట్స్, మొబైల్‌ పేమెంట్స్, డిజిటల్‌ డేటా కోడింగ్, అడ్వాన్స్‌ రిపోర్ట్‌ వంటివి స్పూర్‌ ఫీచర్లలో కొన్ని. ఇవన్నీ కూడా ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే నిర్వహించుకోవచ్చు. అది కూడా ఏ మొబైల్‌లోనైనా, ఏ భాషలోనైనా పనిచేయడం ఎఫోర్ట్‌ సాప్ట్‌వేర్‌ ప్రత్యేకత. ఒక్కో లాగిన్‌కు రూ.300–800 చార్జీ ఉంటుంది. ఫీచర్లను బట్టి ధరలు మారుతాయి. గతేడాది రూ.4 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. ఈ ఏడాది రూ.7 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం.

రూ.20 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం మా కంపెనీలో 50 మంది ఉద్యోగులున్నారు. వచ్చే రెండేళ్లలో క్లయింట్ల సంఖ్యను 300కు, టర్నోవర్‌ను రూ.100 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే సేవలను అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు విస్తరించాలని నిర్ణయించాం. 2014లో బంధువులు, తెలిసిన వాళ్ల నుంచి రూ.2 కోట్ల నిధులను సమీకరించాం. ఇప్పుడు ప్రైవేట్‌ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నాం.

6 దేశాల్లో 150 కంపెనీలు..
స్పూర్‌ టెక్నాలజీని సేల్స్, సర్వీసెస్, కలెక్షన్స్, ఆడిట్స్, మార్కెటింగ్, రియల్టీ, బీమా, బ్యాంకింగ్‌ వంటి రంగాల్లోనూ విని యోగించవచ్చు. ప్రస్తుతం 150 కంపెనీలు 30 వేల మం ది ఫీల్డ్‌ ఉద్యోగులు దీన్ని వినియోగిస్తున్నారు. మన దేశంతో పాటూ నేపాల్, దుబాయ్, దక్షిణాఫ్రికా, వియత్నాం, మయన్మార్‌ దేశాల నుంచి క్లయింట్లున్నారు. గోఐబిబో, జేకే సీడ్స్, మహీంద్రా ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్షియల్, రెడ్‌బస్, రిలయన్స్,  ఎయిర్‌టెల్‌ వంటి కస్టమర్లున్నారు. హైదరాబాద్‌ నుంచి మెడ్‌ప్లస్, మైక్లాస్‌ బోర్డ్‌ వంటి 30కి పైగా కంపెనీలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement