న్యూఢిల్లీ: క్లయింట్ల వ్యాపార అవసరాలకు అనుగుణంగా మెరుగైన సర్వీసులు అందించడంపై, అలాగే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై విప్రో మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా నాలుగు వ్యూహాత్మక వ్యాపార విభాగాలపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ సాంకేతికత .. వ్యాపార పరివర్తన, ఇంజినీరింగ్, కన్సల్టింగ్ వీటిలో ఉంటాయి. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది.
నిర్ణయాల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు, పెట్టుబడుల విషయంలో సమర్ధమంతంగా వ్యవహరించేందుకు ఇవి తోడ్పడగలవని విప్రో ఎండీ థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. క్లౌడ్ సామరధ్యలన్నింటినీ విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ విభాగం కిందికి తేనున్నారు. ప్రస్తుతం క్లౌడ్ ఇన్‌ఫ్రా సర్వీసుల విభాగానికి హెడ్‌గా ఉన్న జో డెబెకర్ దీనికి సారథ్యం వహిస్తారు. ప్రస్తుతం విప్రో ఐకోర్ వ్యాపార హెడ్‌గా ఉన్న నాగేంద్ర బండారు .. విప్రో ఎంటర్‌ప్రైజ్ ఫ్యూచరింగ్‌కు గ్లోబల్ హెడ్‌గా ఉంటారు. క్యాప్‌కో, డిజైనిట్ మొదలైనవన్నీ విప్రో కన్సల్టింగ్ విభాగం కింద ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment