ప్రముఖ టెక్ దిగ్గజం విప్రోలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే రాజీనామా చేశారు. ఆయన స్థానంలోశ్రీనివాస్ పల్లియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఏప్రిల్ 6న థియరీ డెలాపోర్టే తన పదవికి రాజీనామా చేసినట్లు విప్రో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తెలిపారు. మే 31,2024 వరకు ఆయన పదవిలోనే కొనసాగుతారని విప్రో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ప్రస్తుతం అమెరికాస్ 1 ఏరియా సీఈఓగా ఉన్న శ్రీనివాస్ పల్లియా ఏప్రిల్ 7 నుంచి విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో సీఈఓ పదవికి రాజీనామా చేసిన డెలాపోర్టే జూలై 2020లో విప్రో సీఈఓగా, ఎండీగా నియమితులయ్యారు. అంతకు ముందు క్యాప్‌జెమినీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పనిచేశారు.
విప్రో సీఈఓ జీతం ఎంత?
గత డిసెంబరులో, డెలాపోర్టే సంవత్సరానికి రూ. 82 కోట్లకు పైగా జీతం ప్యాకేజీని అందించినట్లు విప్రో నివేదించింది. తద్వారా డెలాపోర్టే భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా పేరు సంపాదించారు. డెలాపోర్టే సైన్సెస్‌పో ప్యారిస్ నుండి ఆర్థిక, ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, సోర్బోన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లాస్‌ను పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment