Wipro CEO Thierry Delaporte: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'థియరీ డెలాపోర్టే' (Thierry Delaporte) గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచంలోని అనేక దిగ్గజ కంపెనీలలో పనిచేస్తున్న సీఈఓలలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓగా ఈయన ప్రసిద్ధి చెందారు.
2022-23 ఆర్ధిక సంవత్సరం వార్షిక వేతనంలో 5శాతం తగ్గినప్పటికీ భారీ ప్యాకేజి తీసుకునే సీఈఓలలో ఇప్పటికీ ఒకరుగా ఉన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో డెలాపోర్టే 10 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం కలిగి ఉన్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 83 కోట్లు. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈయన వార్షిక వేతనం రూ. 79.66 కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈయన వేతనం రోజుకి రూ. 22.7 లక్షలు కావడం కావడం గమనార్హం.
(ఇదీ చదవండి: ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ మాజీ సీఈఓ..)
గత సంవత్సరంలో డెలాపోర్టే మాత్రమే కాకుండా ఎక్కువ జీతం తీసుకునే భారతీయ సీఈఓల జాబితాలో ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ (రూ. 71.02 కోట్లు), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ (రూ. 34 కోట్లు) ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే ఐబీఎమ్ సీఈఓ అరవింద్ కృష్ణ 17.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 144 కోట్లు), 'జూలీ స్వీట్' యాక్సెంచర్ (Accenture) సీఈఓ 23 మిలియన్ డాలర్ల జీతం (దాదాపు రూ. 189 కోట్లు) తీసుకుంటోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment