ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విప్రో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పల్లియా.. రెండు నెలలు లోపే సంస్థ మాజీ సీఈఓ థియరీ డెలాపోర్టే సీఈఓగా పని చేసే సమయంలో పలు విభాగాల్లో ముఖ్యపాత్ర పోషించిన టాప్ మేనేజ్మెంట్‌ను ఇతర విభాగాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు.
విప్రోను ముందుకు నడిపించే తన నమ‍్మకస్తుల్ని అక్కున చేర్చుకుంటున్నారు పల్లియా. ఇందులో భాగంగా థియరీ డెలాపోర్టేకు నమ్మకస్తులైన ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు బదిలి చేశారు.
ఇక విప్రో వ్యాపారం పుంజుకునేలా శ్రీనివాస్ పల్లియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విప్రోలో ప్రముఖ పాత్ర పోషించే ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ ఫ్యూచరింగ్, ఇంజనీరింగ్ ఎడ్జ్ అండ్ కన్సల్టింగ్ విభాగాల్లో మార్పులు చేశారు.
సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎకోసిస్టమ్స్ & పార్ట్‌నర్‌షిప్ గ్లోబల్ హెడ్, జాసన్ ఐచెన్‌హోల్జ్ వ్యాపార కార్యకలాపాల గురించి ఇప్పుడు విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ బిజినెస్ లైన్ హెడ్ జో డెబెకర్‌కి రిపోర్ట్ చేయాలి. ఐచెన్‌హోల్జ్ ఆగస్ట్ 2021లో విప్రోలో చేరగా, డెబెకర్ జనవరి 2022లో విప్రోలో బాధ్యతలు చేపట్టారు.
విప్రో ఆసియా పసిపిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (APMEA) స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్‌కు సీఈఓగా వినయ్ ఫిరాకే కొద్ది రోజుల క్రితం నియమించింది. ఆయన నియమాకం తర్వాత విప్రో కంపెనీ బెనెలక్స్, నార్డిక్ దేశాలు కార్యకలాపాలను కలిపి ఒకే ఉత్తర ఐరోపా ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది .
ప్రస్తుత బెనెలక్స్ దేశ విప్రో మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ కొత్త ఉత్తర ఐరోపా ప్రాంతానికి నాయకత్వం వహిస్తారని కంపెనీ తెలిపింది.
దీంతో పాటు విప్రో ఉనికి ఎక్కువగా ఉన్న యూరోపియన్ దేశాల్లో తన వ్యాపారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు యూకే, ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, నార్డిక్స్, బెనెలక్స్, దక్షిణ ఐరోపాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తన డెలివరీ లొకేషన్లను ఏర్పాటు చేయనుంది.
విప్రో ఇంజినీరింగ్ ఎడ్జ్‌లో, నోకియాతో ప్రైవేట్ వైర్‌లెస్ జాయింట్ సొల్యూషన్ కోసం విప్రో ఎంగేజ్‌మెంట్ లీడర్‌గా శ్రేయాస్ భోసలే నియమించింది.ఇలా విప్రో కంపెనీ తన యూనిట్‌లలో భారీ మార్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment