అద్భుతం.. ఆకాశంలో కిరీట హరివిల్లు.. ఎందుకిలా ఏర్పడుతుందో తెలుసా! | Viral: Rainbow Like Cloud Leaves Chinese Rresidents Awe | Sakshi
Sakshi News home page

Viral Video: ఎంత అద్భుతం.. ఆకాశంలో కిరీట హరివిల్లు.. ఎందుకిలా ఏర్పడుతుందో తెలుసా!

Published Mon, Aug 29 2022 8:21 AM | Last Updated on Mon, Aug 29 2022 8:34 AM

Viral: Rainbow Like Cloud Leaves Chinese Rresidents Awe - Sakshi

చైనాలోని హైనన్‌ ప్రావిన్సులో ఉన్న హైకు నగరంలో ఇటీవల ఇంద్రధనుస్సు రంగుల్లో మెరిసిన మబ్బుల కిరీటమిది. ప్రకృతి చేసిన ఈ చిత్రవిచిత్రం నెటిజన్లను ఎంతగానో అబ్బురపరించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మబ్బుల్లోని నీటి బిందువులు, మంచు ముక్కల మధ్య సూర్యకాంతి వివర్తనం చెందినప్పుడు ఇంద్రధనుస్సు రంగుల్లో మేఘం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ తరహా మబ్బులను పిలియస్, క్యాప్‌ క్లౌడ్స్‌ లేదా స్కార్ఫ్‌ క్లౌడ్స్‌గా పిలుస్తారని పేర్కొన్నారు. ఒక ప్రాంతంపై క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడే క్రమంలో వాటి చుట్టూ ఉండే గాలి వేగంగా మరింత ఎత్తుకు చేరుకున్నాక అందులోని నీరు ఘనీభవించి గొడుగు ఆకారంలో ఈ మబ్బులు ఏర్పడతాయన్నారు. వాతావరణం తీవ్రంగా మారుతోందనేందుకు ఈ తరహా మేఘాలు సంకేతమని వివరించారు. 
చదవండి: 3 నెలల పాటు వండారు..  8 నెలలు తిన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement