Hainan province
-
అద్భుతం.. ఆకాశంలో కిరీట హరివిల్లు.. ఎందుకిలా ఏర్పడుతుందో తెలుసా!
చైనాలోని హైనన్ ప్రావిన్సులో ఉన్న హైకు నగరంలో ఇటీవల ఇంద్రధనుస్సు రంగుల్లో మెరిసిన మబ్బుల కిరీటమిది. ప్రకృతి చేసిన ఈ చిత్రవిచిత్రం నెటిజన్లను ఎంతగానో అబ్బురపరించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మబ్బుల్లోని నీటి బిందువులు, మంచు ముక్కల మధ్య సూర్యకాంతి వివర్తనం చెందినప్పుడు ఇంద్రధనుస్సు రంగుల్లో మేఘం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తరహా మబ్బులను పిలియస్, క్యాప్ క్లౌడ్స్ లేదా స్కార్ఫ్ క్లౌడ్స్‌గా పిలుస్తారని పేర్కొన్నారు. ఒక ప్రాంతంపై క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే క్రమంలో వాటి చుట్టూ ఉండే గాలి వేగంగా మరింత ఎత్తుకు చేరుకున్నాక అందులోని నీరు ఘనీభవించి గొడుగు ఆకారంలో ఈ మబ్బులు ఏర్పడతాయన్నారు. వాతావరణం తీవ్రంగా మారుతోందనేందుకు ఈ తరహా మేఘాలు సంకేతమని వివరించారు. చదవండి: 3 నెలల పాటు వండారు.. 8 నెలలు తిన్నారు Rainbow colored scarf cloud over Haikou city in China pic.twitter.com/ewKmQjsiIE — Sunlit Rain (@Earthlings10m) August 26, 2022 -
అవినీతికి తాతలాంటోడు..!
బీజింగ్: చైనాలో అతడో ఉన్నతాధికారి. కమ్యూనిస్టు పార్టీ నేత.. అతడి అవినీతికి అంతే లేకుండా పోయింది. ఇటీవల జరిపిన అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడుల్లో కళ్లు బైర్లు కమ్మేలా ఆ అధికారి సంపాదన బయటపడింది. ఇంతకీ ఆ అవినీతి సొమ్ము ఎంతో తెలుసా.. రూ.4,500 కోట్ల విలువైన 13.5 టన్నుల బంగారం, రూ.2.65 లక్షల కోట్లు.. మన దేశంలోని రెండు చిన్నపాటి రాష్ట్రాల ఏడాది బడ్జెట్ మొత్తం ఇది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం చైనాలోనే అత్యంత సంపన్నుడైన జాక్‌మా సంపాదన కన్నా అధికం. హైనన్ ప్రావిన్స్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న జాంగ్ కీ (58) ఇంట్లో ఇటీవల అధికారులు సోదాలు జరపగా.. టన్నుల కొద్దీ బంగారం బిస్కెట్లు కుప్పలు తెప్పలుగా దొరికాయి. ఇతడి బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.2.65 లక్షల కోట్ల అవినీతి సొమ్మును గుర్తించారు. ఇవే కాకుండా లంచం కింద విలాసవంతమైన విల్లాలను పలువురి నుంచి భారీగా తీసుకున్నట్లు తెలిసింది. బంగారాన్ని వ్యక్తి లెక్కిస్తున్న ఓ వీడియో ట్విట్టర్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై చైనాలో నిషేధం విధించారు. తూర్పు చైనాలో పుట్టిన జాంగ్.. 1983లో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. హైవాన్ ప్రావిన్స్‌లోని సాన్యా సిటీ డిప్యూటీ మేయర్‌గా, డాంగ్జో సిటీ మేయర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ హైకో సిటీ సెక్రటరీగా కూడా పనిచేశాడు. 2012లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చాక అవినీతికి వ్యతిరేకంగా కఠిన చట్టాలు తీసుకొచ్చారు. గత ఏడేళ్లుగా భారీగా అవినీతికి పాల్పడిన దాదాపు 53 మంది అధికారులు పట్టుబడ్డారు. ఈ ఏడాదిలో జాంగ్‌తో పాటు 17 మంది అవినీతి తిమింగలాలు చిక్కాయి. -
ఆ ద్వీపానికి.. 59 దేశాలకు వీసా ఫ్రీ జర్నీ
బీజింగ్ : చైనాలో అడుగుపెట్టాలంటే అక్కడి వీసా నిబంధనలు కఠినంగా ఉంటాయని తెలిసిందే. కానీ చైనా దక్షిణ ప్రాతంలోని హైనన్ ద్వీపానికి వీసా లేకుండానే సందర్శకులను ఆహ్వానిస్తోంది. ఈ విషయాన్ని బుధవారం చైనా అధికారులు తెలిపారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ సహా 59 దేశాలకు చెందిన సందర్శకులకు 30 రోజుల పాటు ఈ ద్వీపంలో ఎలాంటి వీసా లేకుండా పర్యటించడానికి అనుమతిస్తారు. ఈ జాబితాలో భారత్‌కు అవకాశం కల్పించలేదు. నూతన విధానం మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని స్థానిక మీడియా తెలిపింది. హైనన్ ద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందడానికి ఈ విధానం తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 2010లోనే చైనా 21 దేశాలకు చెందిన పర్యాటకులకు 15 రోజుల పాటు వీసా లేకుండా హైనన్‌లో పర్యటించే అవకాశం కల్పించింది. ఆ తర్వాత 2010లో ఆ సంఖ్యను 26కు పెంచింది. ఈ నిర్ణయం తర్వాత పర్యాటకంగా అభివృద్ధి జరగడంతో పాటు, ఆదాయం పెరగడంతో.. తాజాగా దీనిని 59 దేశాలకు పొడిగించటంతో పాటు అక్కడ గడిపే సమయాన్ని మరింత పెంచింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రానికి ఉండాల్సిన అన్ని అనుకూలతలు హైనన్‌లో ఉండటంతో భారీగా ఆదాయం రాబట్టడానికి చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. -
హైనన్ ప్రావిన్స్‌తో రాష్ట్రం ఎంవోయూ
- చైనాతో తెలంగాణ మైత్రీ బంధం - ఐటీ, తయారీ రంగాల్లో పరస్పర సహకారానికి కృషి - మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇరుపక్షాల సంతకాలు - పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మారుస్తాం: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: చైనాలోని హైనన్ ప్రావిన్స్ (రాష్ట్రం)తో తెలంగాణ దృఢ మైత్రీ బంధం ఏర్పరుచుకుంటుందని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. హైనన్ ప్రావిన్స్, రాష్ట్రం నడుమ మైత్రీ బంధానికి (సిస్టర్ ప్రావిన్స్ రిలేషన్) సంబంధించి సోమవారం హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, హైనన్ ప్రావిన్స్ తరఫున అక్కడి గవర్నర్ లీ సుగుయ్ సంతకాలు చేశారు. ఈ ఎంవోయూ ప్రకారం ఇరుపక్షాలు ఐటీ, తయారీ, ఇతర రంగాల్లో సహకారానికి సమానత్వం, పరస్పర లబ్ధి ప్రాతిపదికన కృషి చేస్తాయి. తద్వారా స్నేహ సంబంధాలతోపాటు ఆర్థిక, వాణిజ్య బంధాలను ఏర్పరచుకుంటాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఈ సందర్భంగా చైనా ప్రతినిధులకు వివరించారు. పెట్టుబడులకు తెలంగాణను ప్రథమ గమ్యస్థానంగా మారుస్తామన్నారు. పరస్పర వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కలసి నడుస్తామని సుగుయ్ తెలిపారు. హైనన్ ప్రావిన్స్‌లో పర్యటించాల్సిందిగా కేటీఆర్‌ను లీ సుగుయ్ ఆహ్వానించగా మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు హైనన్ ప్రావిన్స్‌తో టీ హబ్ మరో ఎంవోయూ కుదుర్చుకోగా హైనన్ ప్రావిన్స్‌లో ఆస్పత్రి స్థాపనకు అపోలో హాస్పిటల్స్ కూడా ఎంవోయూ కుదర్చుకుంది. సమావేశంలో పరిశ్రమలశాఖ అధికారులతోపాటు హైనన్ ప్రావిన్స్ ప్రతినిధులు లూ జియువాన్, వాంగ్ షెంగ్, ఎల్వీ యాంగ్, హాన్ యాంగ్ పాల్గొన్నారు. -
పేట్రేగిన ఉన్మాది: కత్తితో చిన్నారులపై దాడి
పౌరులకు తుపాకులిచ్చే విషయంలో ఆంక్షలు లేకపోయేదుంటే సామూహిక హత్యాకాండల్లో చైనా అమెరికాను ఎప్పుడో దాటిపోయేది. వ్యవస్థపై ఉన్న కోపంతో అమాయకులపై దాడులకు పాల్పడుతోన్నవారి సంఖ్య కమ్యూనిస్ట్ దేశంలో నానాటికీ పెరిగిపోతోంది. సోమవారం హైనన్ ప్రావిన్స్ లో చోటుచేసుకున్న ఈ సంఘటన అందుకు మరో ఉదాహరణ.. మటన్ కొట్టే కత్తిని చేతబట్టుకున్న ఉన్మాది.. ఓ ప్రైమరీ స్కూల్ లోకి చొరబడి చేతికందిన పిల్లలను నరికేప్రయత్నం చేశాడు. లంచ్ టైమ్ కావడంతో విద్యార్థులంతా గ్రౌండ్ లోకి వచ్చారు. అదే అదనుగా వాళ్లపై విచక్షణా రహితంగా దాడిచేశాడా ఉన్మాది. హైకూ నగరంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఉన్మాది దాడితో స్కూల్ ఆవరణలో ఎటుచూసినా రక్తపు మరకలే అగుపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ వద్దకు చేరుకునేలోపే ఉన్మాది పరారయ్యాడు. కాసేపటి తర్వాత స్కూల్ పక్క సందులో విగతజీవిగా కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక పోలీసులు కాల్చి చంపారా అన్నది తెలియాల్సిఉంది. గాయపడ్డ విద్యార్థుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఉన్మాదిని హాంకాగ్ జాతీయుడైన లీ గా గుర్తించామని, ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. చైనాలో సామాజిక ప్రతీకార(సోషల్ రివేంజ్) దాడులకు దిగుతోన్నవారు ప్రధానంగా చిన్నపిల్లల్నే టార్గెట్ చేసుకుంటుండటం గమనార్హం. గత ఏడాది మార్చిలో షాంఘైలో చోటుచేసుకున్న దాడిలో ఓ ఉన్మాది ఆరుగురు పిల్లలు సహా 11 మందిని కత్తితో పొడిచి చంపేశాడు. అంతకు ముందు ఏడాదిలో సోషల్ రివేంజ్ దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 17గా ఉంది. కత్తులతోనే తాక చిన్నతరహా పేలుళ్ల ద్వారాను అమాయకుల ప్రాణాలు పొట్టనపెట్టుకుంటున్నారు ఉన్మాదులు.