అవినీతికి తాతలాంటోడు..! | 13.5 TONS of gold found piled in Chinese ex-governor home | Sakshi
Sakshi News home page

అవినీతికి తాతలాంటోడు..!

Published Thu, Oct 3 2019 3:53 AM | Last Updated on Thu, Oct 3 2019 11:38 AM

13.5 TONS of gold found piled in Chinese ex-governor home - Sakshi

జాంగ్‌ కీ

బీజింగ్‌: చైనాలో అతడో ఉన్నతాధికారి. కమ్యూనిస్టు పార్టీ నేత.. అతడి అవినీతికి అంతే లేకుండా పోయింది. ఇటీవల జరిపిన అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడుల్లో కళ్లు బైర్లు కమ్మేలా ఆ అధికారి సంపాదన బయటపడింది. ఇంతకీ ఆ అవినీతి సొమ్ము ఎంతో తెలుసా.. రూ.4,500 కోట్ల విలువైన 13.5 టన్నుల బంగారం, రూ.2.65 లక్షల కోట్లు.. మన దేశంలోని రెండు చిన్నపాటి రాష్ట్రాల ఏడాది బడ్జెట్‌ మొత్తం ఇది. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం చైనాలోనే అత్యంత సంపన్నుడైన జాక్‌మా సంపాదన కన్నా అధికం.

హైనన్‌ ప్రావిన్స్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న జాంగ్‌ కీ (58) ఇంట్లో ఇటీవల అధికారులు సోదాలు జరపగా.. టన్నుల కొద్దీ బంగారం బిస్కెట్లు కుప్పలు తెప్పలుగా దొరికాయి. ఇతడి బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.2.65 లక్షల కోట్ల అవినీతి సొమ్మును గుర్తించారు. ఇవే కాకుండా లంచం కింద విలాసవంతమైన విల్లాలను పలువురి నుంచి భారీగా తీసుకున్నట్లు తెలిసింది. బంగారాన్ని వ్యక్తి లెక్కిస్తున్న ఓ వీడియో ట్విట్టర్‌లో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోపై చైనాలో నిషేధం విధించారు.

తూర్పు చైనాలో పుట్టిన జాంగ్‌.. 1983లో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. హైవాన్‌ ప్రావిన్స్‌లోని సాన్యా సిటీ డిప్యూటీ మేయర్‌గా, డాంగ్జో సిటీ మేయర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ హైకో సిటీ సెక్రటరీగా కూడా పనిచేశాడు. 2012లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అధికారంలోకి వచ్చాక అవినీతికి వ్యతిరేకంగా కఠిన చట్టాలు తీసుకొచ్చారు. గత ఏడేళ్లుగా భారీగా అవినీతికి పాల్పడిన దాదాపు 53 మంది అధికారులు పట్టుబడ్డారు. ఈ ఏడాదిలో జాంగ్‌తో పాటు 17 మంది అవినీతి తిమింగలాలు చిక్కాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement