భారత్‌లో ఇప్పుడు డిజిటల్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, స్టార్టప్, క్లౌడ్ వంటివి హాట్ టాపిక్. భారతీయ క్లౌడ్ మార్కెట్‌లో రూ.120 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలున్నాయని ఢిల్లీలో నాదెళ్ల చెప్పారు. భవిష్యత్ క్లౌడ్‌దేనని, ఈ టెక్నాలజీపై మరింత దృష్టి సారించండని ఎంఐడీసీలో ఉద్యోగులకు ఉద్బోధించిన సంగతి తెలిసిందే.
భారతీయ మార్కెట్‌పై పెద్ద ఎత్తున ఫోకస్ చేశామని ఆయన చెప్పారు. 2015 చివరికల్లా మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. గతేడాది మైక్రోసాఫ్ట్ క్లౌడ్ విభాగ ఆదాయం 100% వృద్ధి చెందడం కూడా కంపెనీకి ఇక్కడి మార్కెట్‌పై ఆశలు రేకెత్తిస్తోంది. ఏదేమైనా నాదెళ్ల పర్యటనబట్టి చూస్తే టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్.. అపార వ్యాపార అవకాశాలున్న భారత్‌ను ప్రధాన మార్కెట్‌గా భావిస్తోందనే చెప్పొచ్చు.
క్లౌడ్ మార్కెట్‌పై..
Published Thu, Oct 2 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM
Advertisement