క్లౌడ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలలో భారత్‌లోని 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఒరాకిల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒరాకిల్, తమిళనాడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి ఆధారిత శిక్షణను అందించడానికి ‘నాన్ ముదల్వన్’ కింద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
పెరుగుతున్న యువ జనాభా ఉన్న భారత్‌లోని టాప్ 12 రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. యువత, యువ ప్రొఫెషనల్స్ తమను తాము మెరుగుపరుచుకోవడానికి, కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ఒక వేదికను అందించే బాధ్యతలో భాగంగా నాన్ ముదల్వన్‌ను ప్రారంభించినట్లు టీఎన్ఎస్‌డీసీ ఎండీ జె ఇన్నోసెంట్ దివ్య చెప్పారు.
ఒరాకిల్ సర్టిఫికేషన్‌ను ప్రొఫెషనల్స్‌కు ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా గుర్తిస్తారని, ఇది జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, కంపెనీలు కోరుకునే నైపుణ్యాలను కూడా ధ్రువీకరిస్తుందని ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రాంతీయ ఎండీ శైలేందర్ కుమార్ అన్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు, స్థిరత్వం పెరుగుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment