ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలందించే స్విమ్‌లేన్.. హైదరాబాద్‌లో ప్రాంతీయ సైబర్‌సెక్యూరిటీ ఇన్నోవేషన్‌తోపాటు ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించింది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ హబ్ ‘కొత్త లొకేషన్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ఫంక్షన్‌లకు వ్యూహాత్మక హబ్‌గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, కస్టమర్లకు ప్రత్యేక సేవలు అందించేలా ఈ సెంటర్‌ను నెలకొల్పినట్లు’ స్విమ్‌లేన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఫ్రాన్స్ జేవియర్ అన్నారు. ఈ సెంటర్‌లో ప్రస్తుతం 75 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాది చివరినాటికి సిబ్బంది సంఖ్యను 200కి పెంచేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ సెంటర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్ధ్యంతో సామర్థ్యాలతో స్విమ్‌లేన్ టర్బైన్ తక్కువ-కోడ్ సెక్యూరిటీ ఆటోమేషన్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత అభివృద్ధి చేస్తుంది. సెక్యూరిటీ అలర్ట్ , డేటా ఓవర్‌లోడ్, దీర్ఘకాలిక సిబ్బంది కొరతను అధిగమించేలా ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బృందాలకు సహాయం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో ఫ్రాన్స్ జేవియర్ వెల్లడించారు.
పెరిగిపోతున్న డిమాండ్‌కు అనుగుణంగా
భారత్ అన్నీ రంగాల్లో అభివృద్ది పథం వైపు దూసుకెళ్తుంది. అపారమైన నైపుణ్యం కలిగిన వనరులకు కొదువలేదని ఫ్రాన్స్ జేవియర్ కొనియాడారు. 2027 నాటికి భారత్‌లో సైబర్‌సైక్యూరిటీ మార్కెట్ 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటున్నదన్న అంచనాతో ఇక్కడ మరో ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment