చాట్ జీపీటీ, బింగ్, బార్డ్ వంటి స్మార్ట్ చాట్‌బాట్‌లకు మూలాధారమైన కృత్రిమ మేధ (ఏఐ)కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. అందుకు అనువుగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు పరిశోధనలు సాగిస్తున్నాయి. ఏఐకు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చే లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్(ఎల్‌ఎల్‌ఎం) నిపుణులకు గిరాకీ పెరుగుతోంది.
ఆసక్తి ఉన్న టెకీల చదువు, పూర్వ పని అనుభవంతో సంబంధం లేకుండా కంపెనీలు అవకాశాలు ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఏఐలో పని చేయాలనుకునే వారికి శిక్షణతోపాటు గుర్తింపు ఇస్తున్నాయి. దాంతో భవిష్యత్తులో వారు ఏదైనా ఇంటర్వ్యూకు హాజరైతే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏఐ ఒడిస్సీ ప్రోగ్రామ్‌తో దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ ప్రోగ్రామ్ నెల రోజుల పాటు జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటిదశలో అజూర్ ఏఐ సర్వీస్‌లకు సంబంధించిన మెలకువలు నేర్పుతారు. కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలు ఎలా సాధించాలో, నేర్చుకున్న మెలకువలను ఎలా ఉపయోగించాలో చెబుతారు.
రెండోదశలో నైపుణ్యాలను ప్రాక్టికల్‌గా అమలు చేయాల్సి ఉంటుంది. ఇంటరాక్టివ్ ల్యాబ్ టాస్క్‌లతో ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌ను పూర్తి చేయాలి. విజయవంతంగా ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారు మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని ఏఐ రియల్‌టైమ్ సమస్యలపై పనిచేసేందుకు వీలుంటుంది. దాంతోపాటు ఫిబ్రవరి 8న బెంగళూరులో జరగబోయే మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్‌కు వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఈ టూర్‌లో జనరేటివ్ ఏఐకు సంబంధించి అత్యాధునిక ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు.
ఏఐ ఒడిస్సీకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
- aka.ms/AIOdyssey లింక్‌పై క్లిక్ చేయాలి.
- అవసరమైన వివరాలను అందులో నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత లెర్నింగ్ మాడ్యూల్స్‌కు యాక్సెస్ పొందుతారు. అందులో లాగిన్ అవ్వాలి.
- ప్రోగ్రామ్ మొదటి దశలో అజూర్ ఏఐ సర్వీస్‌లను ఎలా ఉపయోగించాలో ఉంటుంది.
- రెండో దశలో ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ద్వారా ఏఐ నైపుణ్యాలను పరీక్షించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment