న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2030 నాటికి భారతదేశంలో క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో12.7 బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సహా దిగ్గజ టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్న వేళ తాజా గుడ్ న్యూస్ వెల్లడించడం విశేషం. (మెగా బోనస్: 8 నెలల జీతం, ఎయిర్‌లెన్స్ ఉద్యోగుల సంబరాలు)
అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 2030 నాటికి రూ. 1,05,600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గురువారం (మే 18) ప్రకటించింది. దీంతో తమ దీర్ఘకాలిక పెట్టుబడులు 2030 నాటికి రూ. 1,36,500 కోట్లకు ( 16.4 బిలియన్‌డాలర్లు) చేరుతుందని పేర్కొంది. దేశంలో క్లౌడ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఈ పెట్టుబడి ద్వారా ఏడాదికి సగటున 131,700 ఫుల్ టైం ఉద్యోగాలను సృష్టించనుందని అంచనా. అంతేకాదు 2030 నాటికి భారతదేశ మొత్తం స్థూల జాతీయోత్పత్తికి రూ.1,94,700 కోట్లు (23.3 బిలియన్ల డాలర్లను) అందజేస్తుంది కాగా 2016-22 మధ్య కాలంలో కంపెనీ మనదేశంలో దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను పెట్టింది. (గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్ భారతదేశంలో క్లౌడ్ అండ్ డేటా సెంటర్ల విస్తరణకు దారితీస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఇది ఖచ్చితంగా భారతదేశ డిజిటల్ ఏకానమీకి ఊతమిస్తుందంటూ అమెజాన్ పెట్టుబడులు స్వాగతించారు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్)
2016 నుంచి తాము ఇండియా క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టామని, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పునీత్ చందోక్ అన్నారు ఇండియా డిజిటల్ పవర్‌హౌస్‌గా గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని సీఈవో ఆడమ్ సెలిప్‌స్కీ వెల్లడించారు.
.@awscloud has long been vested in India’s growth as a digital powerhouse, and I’m inspired to see how our infrastructure presence since 2016 has driven such tremendous progress. Today we’re announcing additional planned investment of $12.7 billion for cloud infrastructure in… pic.twitter.com/6Ml9DtpRWD
— Adam Selipsky (@aselipsky) May 18, 2023
Comments
Please login to add a commentAdd a comment