aws need
-
విద్యార్థులకు ఏడబ్ల్యూఎస్ గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) తాజాగా 100 మిలియన్ డాలర్ల క్లౌడ్ క్రెడిట్స్‌ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్ సొల్యూషన్స్ అభివృద్ధి, తదుపరి స్థాయికి చేర్చడంలో అర్హత కలిగిన విద్యా సంస్థలు, పేద విద్యార్థులకు సహాయం చేయడానికి రాబోయే ఐదేళ్లలో ఈ క్రెడిట్స్‌ను అందజేయనున్నట్లు వెల్లడించింది.ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేషన్ ఈక్విటీ ఇనిషియేటివ్ కింద గ్రహీతలకు నగదు వలె పనిచేసే క్లౌడ్ క్రెడిట్స్‌ను మంజూరు చేస్తారు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలను ఉపయోగించినప్పుడు సంస్థలు వారి ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.ఈ క్రెడిట్స్‌తో గ్రహీతలు ఏఐ అసిస్టెంట్స్, కోడింగ్ కరికులమ్స్, కనెక్టివిటీ టూల్స్, ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్స్, మొబైల్ అప్లికేషన్స్, చాట్బాట్స్తోపాటు వివిధ సాంకేతిక ఆధారిత అభ్యాస అనుభవాల వంటి ఆవిష్కరణలను రూపొందించడానికి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ, అధునాతన ఏఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. -
చేతులు కలిపిన టెక్ మహీంద్రా, ఏడబ్ల్యూఎస్
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ టెక్ మహీంద్రా తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో (ఏడబ్ల్యూఎస్) ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజిన్స్ సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా టెలికం నెట్‌వర్క్‌లను రూపాంతరం చేసే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది.అధునాతన ఏఐ పరిష్కారాలను వినియోగించి నెట్వర్క్ సామర్థ్యాన్ని, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికి ఇరు సంస్థలు కృషిచేస్తాయి. కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు, ఎంటర్ప్రైజ్ కస్టమర్ల కోసం రూపొందించిన అటానమస్ నెట్వర్క్స్ ఆపరేషన్స్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో టెక్ మహీంద్రా బహుళ–సంవత్సరాల వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకం చేసింది. -
రిటర్న్ టు ఆఫీస్.. ‘నచ్చకపోతే వెళ్లిపోవచ్చు’
ఇంటి నుంచి పనిచేసే విధానానికి దాదాపు అన్ని కంపెనీలు ఇప్పటికే ముగింపు పలికేశాయి. కొన్ని కంపెనీలు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి ఇంకొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఆ పద్ధతికీ మంగళం పాడేసి పూర్తిగా రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన అమెజాన్ కూడా ఇటీవల వారానికి 5-రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వివాదాస్పదమైన ఈ విధానాన్ని అమెజాన్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తాజాగా సమర్థించారు. దీనికి మద్దతు ఇవ్వని వారు మరొక కంపెనీకి వెళ్లిపోవచ్చని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగిస్తున్న మెటా..అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఆ యూనిట్ సీఈవో మాట్ గార్మాన్ ప్రసంగిస్తూ.. తాను పది మందితో మాట్లాడితే వారిలో తొమ్మిది మంది జనవరిలో అమలులోకి వచ్చే కొత్త విధానానికి మద్దతుగా మాట్లాడారని చెప్పారు. కొత్త విధానం నచ్చని వారు నిష్క్రమించవచ్చని ఆయన సూచించారని రాయిటర్స్ పేర్కొంది.అమెజాన్ ప్రస్తుతం మూడు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే సీఈవో ఆండీ జాస్సీ గత నెలలో ఐదు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించారు. దీంతో అనేకమంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛంద రాజీనామాలకు దిగుతున్నట్లు చెప్పారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి తోటి టెక్నాలజీ కంపెనీలు రెండు-మూడు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీలను అమలు చేస్తుండగా అమెజాన్ మరో అడుగు ముందుకేసి పూర్తిగా ఐదు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీ అమలుకు సిద్ధమైంది. -
అమెజాన్ దిమ్మతిరిగే పెట్టుబడులు: ఏడాదికి లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2030 నాటికి భారతదేశంలో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో12.7 బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సహా దిగ్గజ టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్న వేళ తాజా గుడ్ న్యూస్ వెల్లడించడం విశేషం. (మెగా బోనస్: 8 నెలల జీతం, ఎయిర్‌లెన్స్ ఉద్యోగుల సంబరాలు) అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 2030 నాటికి రూ. 1,05,600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గురువారం (మే 18) ప్రకటించింది. దీంతో తమ దీర్ఘకాలిక పెట్టుబడులు 2030 నాటికి రూ. 1,36,500 కోట్లకు ( 16.4 బిలియన్డాలర్లు) చేరుతుందని పేర్కొంది. దేశంలో క్లౌడ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ పెట్టుబడి ద్వారా ఏడాదికి సగటున 131,700 ఫుల్ టైం ఉద్యోగాలను సృష్టించనుందని అంచనా. అంతేకాదు 2030 నాటికి భారతదేశ మొత్తం స్థూల జాతీయోత్పత్తికి రూ.1,94,700 కోట్లు (23.3 బిలియన్ల డాలర్లను) అందజేస్తుంది కాగా 2016-22 మధ్య కాలంలో కంపెనీ మనదేశంలో దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను పెట్టింది. (గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్ భారతదేశంలో క్లౌడ్ అండ్ డేటా సెంటర్ల విస్తరణకు దారితీస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఇది ఖచ్చితంగా భారతదేశ డిజిటల్ ఏకానమీకి ఊతమిస్తుందంటూ అమెజాన్ పెట్టుబడులు స్వాగతించారు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) 2016 నుంచి తాము ఇండియా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టామని, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పునీత్ చందోక్ అన్నారు ఇండియా డిజిటల్ పవర్‌హౌస్‌గా గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని సీఈవో ఆడమ్ సెలిప్స్కీ వెల్లడించారు. .@awscloud has long been vested in India’s growth as a digital powerhouse, and I’m inspired to see how our infrastructure presence since 2016 has driven such tremendous progress. Today we’re announcing additional planned investment of $12.7 billion for cloud infrastructure in… pic.twitter.com/6Ml9DtpRWD — Adam Selipsky (@aselipsky) May 18, 2023 -
నిరుద్యోగులకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తీపికబురు
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టెక్ నిరుద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు క్లౌడ్‌లోకి మారేందుకు సిద్ద పడుతున్న ఈ సమయంలో దానికి సంబంధించిన సేవలను వేగంగా అందించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్(ఏడబ్ల్యూఎస్ బీయూ)ను బుధవారం (నవంబర్ 3)న ప్రారంభించింది. ఈ ప్రత్యేక వ్యాపార యూనిట్ కోసం ఏడబ్ల్యుఎస్ ఇంజనీరింగ్, సొల్యూషన్స్, బిజినెస్ టీమ్‌లు సహకరిస్తాయని ఒక ప్రకటన తెలిపింది. "ప్రస్తుతం ఏడబ్ల్యుఎస్ టెక్నాలజీ కోసం దాదాపు 10వేల మంది సిబ్బందికి హెచ్‌సీఎల్ శిక్షణ ఇచ్చింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను 20,000 మందికి పైగా నిపుణులకు పెంచాలని యోచిస్తున్నట్లు" సంస్థ తెలిపింది. కొత్త వ్యాపార యూనిట్ మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్లను ఆధునికీకరించడానికి, క్లౌడ్ టెక్నాలజీ ప్రాజెక్టులను దక్కించుకోవడానికి, లక్ష్యాలను సాధించడానికి నిపుణులు అవసరం అని సంస్థ తెలిపింది. హెచ్‌సీఎల్ అనేది ఎడబ్ల్యుఎస్ ప్రీమియర్ కన్సల్టింగ్ పార్టనర్. ఇది మౌలిక సదుపాయాల కల్పన, అప్లికేషన్లు & డేటాను ఆధునీకరించడంలో, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడం కోసం తీసుకొచ్చినట్లు పేర్కొంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ & హెడ్(ఎకోసిస్టమ్స్) కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. "కంపెనీ #HCLCloudSmart వ్యూహంలో ఏడబ్ల్యూఎస్ బీయూ ఒక ముఖ్యమైన భాగం. వినియోగదారులకు పోటీదారుల కంటే ముందుగా బలమైన క్లౌడ్ వ్యవస్థల నిర్మాణం, సేవలు అందించడంలో ఇది సహాయపడుతుంది" అని అన్నారు. (చదవండి: ప్రతి నెల రూ.1500 పొదుపు చేస్తే.. రూ.35 లక్షలు మీ సొంతం!) -
జూలైలో అమెజాన్ కొత్త సీఈవో జెస్సీకి బాధ్యతలు
న్యూయార్క్: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి జెఫ్ బెజోస్ జూలై 5న తప్పుకోనున్నారు. ఆ రోజున కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. కంపెనీ వ్యవస్థాపకుడు బెజోస్ (57) ఈ విషయాలు వెల్లడించారు. తనకు ఆ రోజుతో సెంటిమెంటు ముడిపడి ఉన్నందున జూలై 5ని ఎంచుకున్నట్లు షేర్‌హోల్డర్ల సమావేశంలో బెజోస్ తెలిపారు. 27 ఏళ్ల క్రితం 1994లో సరిగ్గా ఆ రోజున తాను కంపెనీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కొత్త సీఈవోగా ఎంపికైన జస్సీ ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపార విభాగానికి సారథ్యం వహిస్తున్నారు. సీఈవోగా తప్పుకున్న తర్వాత బెజోస్.. ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై మరింతగా దృష్టి పెడతారు. 57 ఏళ్ల బెజోస్ 1994లో అమెజాన్‌ను స్థాపించారు. మొదటగా ఇంటర్నెట్లో పుస్తకాలు అమ్మెందుకు ఈ సంస్థను ప్రారంభించారు. తర్వాత కాలంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా నిలిచింది. అంతేకాదు బెజోస్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం అమెజాన్ ఆస్తుల విలువ 1.67 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచ ధనవంతుల జాబితాలో జెఫ్ బెజోస్ 187.4 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. చదవండి: అమెజాన్ వర్తకులకు కోవిడ్-19 ఆరోగ్య బీమా -
బాలల హక్కులు, చట్టాలపై అవగాహన ఉండాలి
న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి నీలిమ కేయూ క్యాంపస్ : ప్రాథమికంగా బాలల హక్కులు, చట్టాలపై ప్రతి అధికారికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వరంగల్ కార్యదర్శి జి.నీలిమ అన్నారు. మంగళవారం హన్మకొండలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలోని సెమినార్ హాల్లో సంస్థ ఆధ్వర్యంలో ‘ది రైట్ చిల్డ్రన్అంశంపై స్పెషల్ జువైనల్ యూనిట్స్‌కు, పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు, స్పెషల్ జువైనల్ మెంబర్స్‌కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తొలుత పిల్లల హక్కుల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భర్త మెయింటెనెన్ ఇవ్వక పిల్లల చదువులకు ఇబ్బంది పడుతున్న తల్లులు వారి పిల్లలకు హాస్టల్ వసతి కల్పిం చాలన్నారు. న్యాయ సేవా అధికార సంస్థ –ప్రి లిటిగేషన్ కేసులతో పాటు ప్రజలను న్యాయపరంగా చైతన్యపర్చడం హక్కుల గురించి తెలియజేయటం ముఖ్య ఉద్ధేశ్యంగా తెలిపారు,. పోలీసుల అధికారులు విధి నిర్వహణలో ప్రజలతో మమేకమై ఉండాలన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ లా కళాశాల డాక్టర్ విజయచందర్, యూఎన్సీఆర్సీ, యన్జీపీ జేడి తదితర అంశాలపై, ఏపీపీ జి.భద్రాద్రి కేర్ అండ్ ప్రొటెక్షన్యాక్ట్ 2000 , జువైనల్ జస్టిస్ మోడల్ రూల్స్ ఐపీసీ అంశాలపై మాట్లాడారు. న్యాయవాది పి.శ్రీనివాస్‌రావు, డీఎల్ఎస్ఏ సభ్యులు ఎం. రమేష్‌బాబు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ కె.అనితారెడ్డి, ఓపిఓ మంజుల, అడిషనల్ ఓపివో శ్రీదేవి, జిల్లా చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.