- న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి నీలిమ
బాలల హక్కులు, చట్టాలపై అవగాహన ఉండాలి
Published Wed, Sep 28 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
కేయూ క్యాంపస్ : ప్రాథమికంగా బాలల హక్కులు, చట్టాలపై ప్రతి అధికారికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వరంగల్ కార్యదర్శి జి.నీలిమ అన్నారు. మంగళవారం హన్మకొండలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలోని సెమినార్ హాల్‌లో సంస్థ ఆధ్వర్యంలో ‘ది రైట్ చిల్డ్రన్‌అంశంపై స్పెషల్ జువైనల్ యూనిట్స్‌కు, పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు, స్పెషల్ జువైనల్ మెంబర్స్‌కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తొలుత పిల్లల హక్కుల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భర్త మెయింటెనెన్ ఇవ్వక పిల్లల చదువులకు ఇబ్బంది పడుతున్న తల్లులు వారి పిల్లలకు హాస్టల్ వసతి కల్పిం చాలన్నారు.
న్యాయ సేవా అధికార సంస్థ –ప్రి లిటిగేషన్ కేసులతో పాటు ప్రజలను న్యాయపరంగా చైతన్యపర్చడం హక్కుల గురించి తెలియజేయటం ముఖ్య ఉద్ధేశ్యంగా తెలిపారు,. పోలీసుల అధికారులు విధి నిర్వహణలో ప్రజలతో మమేకమై ఉండాలన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ లా కళాశాల డాక్టర్ విజయచందర్, యూఎన్‌సీఆర్‌సీ, యన్‌జీపీ జేడి తదితర అంశాలపై, ఏపీపీ జి.భద్రాద్రి కేర్ అండ్ ప్రొటెక్షన్‌యాక్ట్ 2000 , జువైనల్ జస్టిస్ మోడల్ రూల్స్ ఐపీసీ అంశాలపై మాట్లాడారు. న్యాయవాది పి.శ్రీనివాస్‌రావు, డీఎల్‌ఎస్‌ఏ సభ్యులు ఎం. రమేష్‌బాబు, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ కె.అనితారెడ్డి, ఓపిఓ మంజుల, అడిషనల్ ఓపివో శ్రీదేవి, జిల్లా చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Advertisement