Childrens rights
-
జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నేరవేరుతున్నాయి
-
సత్యార్థి ‘నోబెల్’ దొరికింది
న్యూఢిల్లీ: నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నోబెల్ బహుమతి నమూనా సహా పలు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7న సత్యార్థి ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అదే వీధిలో మరో రెండు ఇళ్లలోనూ నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాలల హక్కు లపై పోరాడినందుకు గానూ సత్యార్థికి 2014లో నోబెల్ బహుమతి లభించింది. -
బాలల హక్కులు హరిస్తే కేసులే!
ఇంకొల్లు : బాలల హక్కులను హరించే వారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా బాలల సంరక్షణాధికారిణి జ్యోతిసుప్రియ హెచ్చరించారు. ‘బతుకులు మెతుకులు వెతుకుతున్నయట!’ శీర్షికన ఈనెల 8వ తేదీన ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. సోమవారం ఇంకొల్లు వద్ద పాత మద్రాసు రోడ్డులో మట్టి పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి సౌకర్యాలను పరిశీలించారు. అక్కడున్న పిల్లలను సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కార్యకర్తలను ఆదేశించారు. పనులు చేసే ప్రాంతాల్లో బాలలకు రక్షణకు చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. లేదంటే బాలల హక్కులను హరిస్తున్నందుకు వారిపై కేసు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. -
బాలల హక్కులు పరిరక్షించాలి
ఒంగోలు టౌన్ : బాలల హక్కులు పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు కోరారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు సభకు ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. బాలల హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. బాలలకు అన్నిరకాల వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పురుషులతో సమానంగా ఆడ పిల్లలను చదివించాలని కోరారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ జి. విశాలాక్షి అధ్యక్షతన నిర్వహించిన సభలో మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి, డీఎంహెచ్ఓ యాస్మిన్, అడిషనల్ డీఈఓ విజయలక్ష్మి, జీసీడీఓ సరస్వతి, ఐసీపీఎస్ డీసీపీఓ జ్యోతిసుప్రియ, ఏసీఎల్ రమాదేవి, ఐఈఆర్‌ఎఫ్ సంస్థ ప్రతినిధి జోసఫ్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగరాజు రాంబాబు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు బాలల హక్కుల వారోత్సవాల ముగింపు సందర్భంగా బాలికల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దర్శి కేజీబీవీకి చెందిన బాలికలు ప్రదర్శించిన ‘బచావో బేటీ పడావో’ నాటిక సభికులను ఆలోచింప జేసింది. ఆడపిల్లల పట్ల లింగ వివక్ష చూపరాదని, వారిని రక్షించాలంటూ బాలికల ప్రదర్శన ఆకట్టుకుంది. ఒంగోలులోని శారా హోమ్‌కు చెందిన మానసిక విద్యార్థులు దేశభక్తి గీతానికి చక్కగా అభినయం చేసి ప్రశంసలు అందుకున్నారు. ఒంగోలులోని బాలసదన్, ఐఈఆర్ఎఫ్కు చెందిన బాలలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వల్లూరు సెక్టార్‌కు చెంందిన అంగన్వాడీ కేంద్రాల చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలతో అలరించారు. సుప్రియ కళానిలయం డెరైక్టర్ రంగుల సంధ్య సమాజ ఆచారాలు, కట్టుబాట్ల పేర్లతో మహిళలకు వేస్తున్న సంకెళ్లను చేధించుకొని ఏవిధంగా ముందడుగు వేస్తారన్న దానిని స్పాట్ పెయింటింగ్ రూపంలో చక్కగా చిత్రాన్ని చూపించారు. రంగుల సంధ్య స్పాట్ పెయింటింగ్‌కు ముగ్ధుడైన ఎస్ఎస్ఏ పీఓ సుధాకర్ అక్కడికక్కడే రెండు వేల రూపాయలు చెల్లించి ఆ పెయింటింగ్‌ను సొంతం చేసుకున్నారు. బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జిల్లాకు చెందిన అంగన్వాడీ కేంద్రాల చిన్నారులను అభినంధించారు. -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
– జేసీ–2 రామస్వామి – ఘనంగా బాలల హక్కుల వారోత్సవాలు కర్నూలు(అర్బన్): బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్–2 రామస్వామి అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఐసీడీఎస్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి మాట్లాడుతూ.. బాల బాలికలు విద్య, ఆరోగ్యం, ఆహార విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో సమగ్ర బాలల సంరక్షణ కేంద్రాలు పని చేస్తున్నాయని, అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి వయో వృద్ధుల వరకు అన్ని రకాల సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని ఐసీడీఎస్ ఆర్జేడీ శారద చెప్పారు. చెడు అలవాట్లకు లోనుకాకుండా యోగా కేంద్రాలకు వెళ్లి ఏకాగ్రతను పెంచుకోవాలని సీనియర్ న్యాయవాది నాగలక్ష్మిదేవి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపాలని డిప్యూటీ డీఈఓ తాహెరా సుల్తానా అన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీపీ ఈశ్వరమ్మ, సర్పంచును సన్మానించారు. వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. బాలికా సంరక్షణ పథకం కింద మంజూరైన ఇన్సూరెన్స్ బాండ్లను 40 మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు జేసీ–2 అందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఏపీడీ అరుణ, 1098 పీడీ మోహన్‌రావు, జిల్లాలోని ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రతి జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలు
- పిల్లల్ని వేధిస్తే 1098కి ఫోన్ చేయాలి - మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ - సంచాలకులు విజయేందిర బోరుు సాక్షి, హైదరాబాద్: ‘బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత. వారి సంరక్షణకు ప్రతి జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా సంక్షేమాధికారి కన్వీనర్‌గా, సంబంధిత శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ఈ కేంద్రా లు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లల్ని వేధించినట్లు తెలిస్తే వెంటనే 1098కి ఫోన్ చేయం డి. ఈ కమిటీ చర్యలకు ఉపక్రమిస్తుంది’ అని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు విజయేందిర బోరుు పేర్కొన్నారు. రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ నెల 14న బాలల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో రాష్ట్రస్థారుు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30కి గన్‌పార్క్ నుంచి రవీంద్రభారతి వరకు చిన్నారులతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. పిల్లల హక్కులు, సంరక్షణ చట్టంపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. బాల సదనాల ను పెంచేందుకు ప్రభుత్వానికి నివేదించామన్నారు. పిల్లల దత్తతను ఆన్లైన్లో చేపడుతున్నామని, గతేడాది 215 మంది పిల్లల్ని దత్తతిచ్చామన్నారు. పట్టణాల్లో పిల్లల భిక్షా టనపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నెలాఖర్లో నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. శాఖ పరంగా వసతి పొందుతున్న బాల, బా లికలకు గురుకులాలు, కేజీబీవీల్లో చేర్పించనున్న ట్లు వివరించారు. సమావేశంలో ఆ శాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మి, రాములు పాల్గొన్నారు. -
బాలల హక్కులు, చట్టాలపై అవగాహన ఉండాలి
న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి నీలిమ కేయూ క్యాంపస్ : ప్రాథమికంగా బాలల హక్కులు, చట్టాలపై ప్రతి అధికారికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వరంగల్ కార్యదర్శి జి.నీలిమ అన్నారు. మంగళవారం హన్మకొండలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలోని సెమినార్ హాల్లో సంస్థ ఆధ్వర్యంలో ‘ది రైట్ చిల్డ్రన్అంశంపై స్పెషల్ జువైనల్ యూనిట్స్‌కు, పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు, స్పెషల్ జువైనల్ మెంబర్స్‌కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తొలుత పిల్లల హక్కుల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భర్త మెయింటెనెన్ ఇవ్వక పిల్లల చదువులకు ఇబ్బంది పడుతున్న తల్లులు వారి పిల్లలకు హాస్టల్ వసతి కల్పిం చాలన్నారు. న్యాయ సేవా అధికార సంస్థ –ప్రి లిటిగేషన్ కేసులతో పాటు ప్రజలను న్యాయపరంగా చైతన్యపర్చడం హక్కుల గురించి తెలియజేయటం ముఖ్య ఉద్ధేశ్యంగా తెలిపారు,. పోలీసుల అధికారులు విధి నిర్వహణలో ప్రజలతో మమేకమై ఉండాలన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ లా కళాశాల డాక్టర్ విజయచందర్, యూఎన్సీఆర్సీ, యన్జీపీ జేడి తదితర అంశాలపై, ఏపీపీ జి.భద్రాద్రి కేర్ అండ్ ప్రొటెక్షన్యాక్ట్ 2000 , జువైనల్ జస్టిస్ మోడల్ రూల్స్ ఐపీసీ అంశాలపై మాట్లాడారు. న్యాయవాది పి.శ్రీనివాస్‌రావు, డీఎల్ఎస్ఏ సభ్యులు ఎం. రమేష్‌బాబు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ కె.అనితారెడ్డి, ఓపిఓ మంజుల, అడిషనల్ ఓపివో శ్రీదేవి, జిల్లా చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకుంటానని మోసం
బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన బాలిక హిమాయత్‌నగర్: పెళ్లి చేసుకుంటానని మోసం చేసి.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన యువకుడిపై బాలిక (16) బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావుతో కలిసి బాధితురాలు బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా బీరోలు గ్రామానికి చెందిన బాలిక తనకు మామ వరసయ్యే నేతగాని వెంకన్న ఇంటికి వంట చేసేందుకు వెళ్లగా...అతని కుమారుడు నేతగాని నగేష్ (28) పెళ్లి చేసుకుంటానని లొంగదీసుకున్నాడు. గర్భం దాల్చగా.. బలవంతంగా బాలికతో మాత్రలు మింగించి అబార్షన్ అయ్యేలా చేశాడు. ఆ తర్వాత బాలిక పెళ్లి చేసుకోవాలని కోరగా.... దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడు. గురువారం అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాడానికి సిద్ధం కావడంతో బాలిక బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఆ పెళ్లిని ఆపి తాను మేజర్ అయిన తర్వాత నగేష్‌తో తనకు వివాహం జరిపించాలని కోరింది. -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
గజ్వేల్: బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా కార్యదర్శి కనకదుర్గ పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో బాలల న్యాయ సలహా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలబాలికలు హింసకు గురికాకుండా ఈ కేంద్రం ద్వారా భద్రత కల్పిస్తామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారు కేంద్రాన్ని సందర్శించి న్యాయాన్ని పొందాలని సూచించారు. లీగల్ సెల్ అథారిటీ, జడ్జి, పోలీసుల సమన్వయంతో కేంద్రం పనిచేస్తుందన్నారు. రైతు ఆత్మహత్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యల బారిన పడుతున్నారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు లీగల్ సర్వీస్ అథారీటీ అండగా ఉంటుందన్నారు. ఎవరైనా నేరుగా వచ్చి సమస్యలను చెప్పుకోవచ్చని తెలిపారు. సమావేశంలో గజ్వేల్ సీఐ అమృతరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎస్ఐ జార్జి, ఎస్ఐ-2 స్వామి, నగర పంచాయతీ కౌన్సిలర్లు నరేందర్‌రావు, బోస్, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, ఆకుల దేవేందర్, రామచంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. బాల్యవివాహలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు జగదేవ్‌పూర్: ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలంటే అందరూ చిన్నచూపు చూస్తున్నారని, దేశం ఎంత ప్రగతి సాధించినా సామాజిక రుగ్మతలు కొనసాగుతున్నయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కనకదుర్గ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ఐసీడీఎస్ అధ్వర్యంలో జరిగిన బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కనకదుర్గ మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు బాలికల నిష్పత్తి తగ్గుతోందన్నారు. తప్పుడు భావనలే ఇందుకు మూలమన్నారు. ఆడపిల్ల పుట్టక ముందే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. దీనిని ఆరికట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆడపిల్లల రక్షణ కోసమే ప్రభుత్వాలు ఆడపిల్లను బతికిద్దాం..ఆడపిల్లను చదవిద్దాం అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పేదరికం వల్ల గ్రామాల్లో బాలికలను బడికి పంపకుండా, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. బాల్యవివాహాలు చేసినా, లింగవివక్షకు పాల్పడినా చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. బాలల హక్కులను సంరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. చదువుతోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. అందుకే ఆడ మగ తేడా లేకుండా తల్లిదండ్రులు చదివించాలని సూచించారు. కార్యక్రమంలో గజ్వేల్ జూనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాస్కర్, ఎస్ఐ వీరన్న, డిసిఎ రత్నం, ఐసిడిఎస్ అధికారి విమల, అంగన్వాడి మండల సూపర్వైజర్లు వర్దనమ్మ, రమణ, జెడ్పీటీసీ రాంచ్రందం, తహశీల్దార్ శ్రీనివాసులు, సర్పంచ్ కరుణకర్, ఎంఈఓ సుగుణకర్‌రావు, ఎంపీటీసీలు వెంకటయ్య, బాలేషం, అన్ని గ్రామాల అంగన్వాడి కర్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
పెద్దశంకరంపేట : బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జోగిపేట జూనియర్ సివిల్ జడ్జి రమాకాంత్ అన్నారు. శుక్రవారం పేట పోలీస్‌స్టేషన్‌లో బాలల సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. సమాజంలో బాల నేరస్తులు ఉండరాదన్నారు. బాలలను నేరస్తులుగా చూడొద్దని, వారిపై నేరస్తులన్న ముద్ర వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి : డిసెంబర్ 6న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని జడ్జి రమాకాంత్ పిలుపునిచ్చారు. అన్ని కోర్టుల్లో ఈ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జోగిపేట సీఐ రఘు, పేట ఎస్ఐ మహేష్ గౌడ్, న్యాయవాదులు భాస్కర్, లింగం, ఎస్హెచ్ఓ లక్ష్మణ్, చిరంజీవి, విఠల్ గౌడ్, ప్రేమ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులున్నారు. -
బాలల హక్కులను పరిరక్షించాలి
నిబంధనలకు లోబడే ఎన్జీఓలు పనిచేయాలి అవగాహన సదస్సులో కలెక్టర్ కిషన్ జిల్లా పరిషత్ : అన్ని వర్గాల సమష్టి కృషితోనే బాలల హక్కుల రక్షణ సాధ్యమని కలెక్టర్ జి.కిషన్ అభిప్రాయపడ్డారు. బాలల హక్కుల కమిషన్ మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జెడ్పీలో స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓలు)ల ప్రతినిధులు, ప్రభు త్వ శాఖల అధికారులకు ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కులను పరిరక్షించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించకుండా సేవలు అందించాలన్నారు. జిల్లాలో 162 స్వచ్ఛంద సంస్థలుండగా.. వాటిలో 22 సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వివరించారు. మిగిలిన వాటి ని తనిఖీలు చేయాల్సి ఉందన్నారు. పేద, అనాథ పిల్లల కోసం మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. మూడో తరగతి నుంచి పోస్ట్‌మెట్రిక్ వరకు ఉచితంగా విద్య, వసతి సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తున్న విషయాలను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గుర్తుపెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. లక్ష్యాలను సాధించలేకపోతున్నాం.. 2011లో జాతీయ బాలల పరిరక్షణ కమిషన్, 2104 ఫిబ్రవరి 2న రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ ఏర్పడ్డాయని, ఇవి బాలల కోసం పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయాయని కమిషన్ సభ్యుడు అచ్యుతరావు అభిప్రాయపడ్డారు. బాలల రక్షణ కోసం పలు శాఖలు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ శాఖలకు పరిమితులుంటాయని, అదే స్వచ్ఛంద సంస్థలకు విస్తృతంగా పనిచేసే అవకాశాలుంటాయన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించామని ఆయన వివరించారు. అధికారులు, ఎన్జీఓలకు మధ్య సమన్వయం లేదన్న విషయాలను గుర్తించామన్నారు. చిన్నపిల్లలకు ఓటు హక్కు ఉంటే సకల సౌకర్యాలు సమకూరేవని ఆయన పేర్కొన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్రంలో ఏర్పాటైందని అచ్యుతరావు వివరించారు. ఐఏఎస్ అధికారి సుజాతారావు చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో కమిషన్ ఏర్పాటైందని జిల్లాకు చెందిన కమిషన్ సభ్యురాలు మమతారఘువీర్ తెలిపారు. తమ కమిషన్ సభ్యులు 24 గంటలు ఫోన్లో అందుబాటులో ఉంటారని, బాలలు ఎలాంటి ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. హక్కులపై అవగాహన కల్పించాలి.. బాలల హక్కులపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఇలాంటి అవగాహన సదస్సులు పాఠశాలల్లో నిర్వహిస్తే ప్ర యోజనకరంగా ఉంటుందని గీసుకొండ మండలం కొమ్మా ల గ్రామానికి చెందిన విద్యార్థిని సునీత కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు కోసం ప్రయత్నించినా ఎవరు సహకారం అందించలేదన్నారు. చి వరకు మరికొంత మందితో కలిసి కొన్ని పుస్తకాలు కొనుగో లు చేసి గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నామన్నారు. బాల ల కోసం పనిచేస్తున్న కమిషన్, స్వచ్ఛంద సంస్థల్లో బాలల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పుడే బాలలకు సరైన రక్షణ ఉంటుందని తెలిపా రు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గాదె ఇన్నయ్య, శ్రీనివా స్, ఓంకార్, డీఈఓ విజయ్‌కుమార్, డీఎంహెచ్ఓ సాంబశి వరావు, కార్మికశాఖ అధికారి, ఓఎస్డీ నాగరాజు బాలల కోసం చేస్తున్న పనులను వివరించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు బాలరాజు, మురళీధర్‌రెడ్డి, రహీమొద్దీన్, అదనపు జేసీ కృష్ణారెడ్డి, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఐసీడీఎస్ పీఓ కృష్ణజ్యోతి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అనితారెడ్డి, డీసీపీఓ వెంకటరమణ పాల్గొన్నారు.