- నిబంధనలకు లోబడే ఎన్జీఓలు పనిచేయాలి
- అవగాహన సదస్సులో కలెక్టర్ కిషన్
జిల్లా పరిషత్ : అన్ని వర్గాల సమష్టి కృషితోనే బాలల హక్కుల రక్షణ సాధ్యమని కలెక్టర్ జి.కిషన్ అభిప్రాయపడ్డారు. బాలల హక్కుల కమిషన్ మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జెడ్పీలో స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓలు)ల ప్రతినిధులు, ప్రభు త్వ శాఖల అధికారులకు ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కులను పరిరక్షించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించకుండా సేవలు అందించాలన్నారు. జిల్లాలో 162 స్వచ్ఛంద సంస్థలుండగా.. వాటిలో 22 సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వివరించారు. మిగిలిన వాటి ని తనిఖీలు చేయాల్సి ఉందన్నారు. పేద, అనాథ పిల్లల కోసం మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. మూడో తరగతి నుంచి పోస్ట్‌మెట్రిక్ వరకు ఉచితంగా విద్య, వసతి సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తున్న విషయాలను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గుర్తుపెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు.
లక్ష్యాలను సాధించలేకపోతున్నాం..
2011లో జాతీయ బాలల పరిరక్షణ కమిషన్, 2104 ఫిబ్రవరి 2న రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ ఏర్పడ్డాయని, ఇవి బాలల కోసం పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయాయని కమిషన్ సభ్యుడు అచ్యుతరావు అభిప్రాయపడ్డారు. బాలల రక్షణ కోసం పలు శాఖలు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ శాఖలకు పరిమితులుంటాయని, అదే స్వచ్ఛంద సంస్థలకు విస్తృతంగా పనిచేసే అవకాశాలుంటాయన్నారు.
ఇప్పటి వరకు ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించామని ఆయన వివరించారు. అధికారులు, ఎన్జీఓలకు మధ్య సమన్వయం లేదన్న విషయాలను గుర్తించామన్నారు. చిన్నపిల్లలకు ఓటు హక్కు ఉంటే సకల సౌకర్యాలు సమకూరేవని ఆయన పేర్కొన్నారు.
ఎన్నో పోరాటాల ఫలితంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్రంలో ఏర్పాటైందని అచ్యుతరావు వివరించారు. ఐఏఎస్ అధికారి సుజాతారావు చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో కమిషన్ ఏర్పాటైందని జిల్లాకు చెందిన కమిషన్ సభ్యురాలు మమతారఘువీర్ తెలిపారు. తమ కమిషన్ సభ్యులు 24 గంటలు ఫోన్‌లో అందుబాటులో ఉంటారని, బాలలు ఎలాంటి ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
హక్కులపై అవగాహన కల్పించాలి..
బాలల హక్కులపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఇలాంటి అవగాహన సదస్సులు పాఠశాలల్లో నిర్వహిస్తే ప్ర యోజనకరంగా ఉంటుందని గీసుకొండ మండలం కొమ్మా ల గ్రామానికి చెందిన విద్యార్థిని సునీత కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు కోసం ప్రయత్నించినా ఎవరు సహకారం అందించలేదన్నారు. చి వరకు మరికొంత మందితో కలిసి కొన్ని పుస్తకాలు కొనుగో లు చేసి గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నామన్నారు.
బాల ల కోసం పనిచేస్తున్న కమిషన్, స్వచ్ఛంద సంస్థల్లో బాలల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పుడే బాలలకు సరైన రక్షణ ఉంటుందని తెలిపా రు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గాదె ఇన్నయ్య, శ్రీనివా స్, ఓంకార్, డీఈఓ విజయ్‌కుమార్, డీఎంహెచ్‌ఓ సాంబశి వరావు, కార్మికశాఖ అధికారి, ఓఎస్డీ నాగరాజు బాలల కోసం చేస్తున్న పనులను వివరించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు బాలరాజు, మురళీధర్‌రెడ్డి, రహీమొద్దీన్, అదనపు జేసీ కృష్ణారెడ్డి, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఐసీడీఎస్ పీఓ కృష్ణజ్యోతి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ అనితారెడ్డి, డీసీపీఓ వెంకటరమణ పాల్గొన్నారు.