Kishan
-
వీడియో రికార్డు చేస్తూ అధికారి లైంగిక వేధింపులు..
-
ఇషాన్ కిషన్‌తో కలిసి హార్దిక్ పాండ్యా పూజలు (ఫొటోలు)
-
నటుడి మెడలో తాళి కట్టిన హీరోయిన్ (ఫోటోలు)
-
Phone tapping Case: రాధాకిషన్‌రావుకు జ్యుడీషియల్ రిమాండ్
సాక్షి, హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసులు గురువారం ఉదయం రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్న విషయం తెలి సిందే. అప్పటి నుంచి రాత్రి వరకు ఆయన్ను బంజారాహిల్స్ ఠాణాలో సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను శుక్రవారం ఉదయం వీరిని చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పంజగుట్ట పోలీ సులు వైద్యపరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు పోలీసులు ఈ ముగ్గురినీ కలిపి, విడివిడిగా విచారించారు. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్‌తో పాటు అక్రమ వసూళ్ల కోణంలోనూ ప్రశ్నించారు. ఆపై రాధాకిషన్ రావును గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కొంపల్లికి తీసుకు వెళ్లారు. తదుపరి విచారణ నిమిత్తం రాధాకిషన్ రావును పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. దీనికోసం అనుమతి కోరుతూ శనివారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ప్రభాకర్‌రావుతో లింకులు, వసూళ్ల కోణంలో... సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. ఏసీబీ కేసుకు రంగం సిద్ధం రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేక ల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టా రని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు.వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివా దాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తో ంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోప ణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియో గాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కార ణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. నగదు రవాణా చేసినట్టూ అంగీకరించారు.. పంజగుట్ట ఠాణాలో నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించాం. ఆయన తాను చేసిన నేరాలను అంగీకరించారు. చట్టవిరుద్ధంగా, తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేయడం, కుట్రపూరితంగా అనధికారికంగా ఆ వ్యక్తులపై నిఘా ఉంచడం చేసినట్టు బయటపెట్టారు. రాజకీయంగా పక్షపాతంతో వ్యవహరించడంతోపాటు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలో తాము అక్రమంగా డబ్బు రవాణా చేయడానికి అధికారిక వనరులను వినియోగించామని అంగీకరించారు. ఇతర నిందితులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మరియు సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారు. – ఎస్ఎం.విజయ్‌కుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ -
టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని 10 గంటలు విచారించిన తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లు పంజగుట్ట పోలీసులు తెలిపారు. శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు. మరోవైపు గతంలో టాస్్క ఫోర్స్, ఎస్‌ఐబీల్లో పని చేసిన రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ బి.గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ట్యాపింగ్‌తో పాటు బలవంతపు వసూళ్లలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. తొలుత డీసీపీగా, తర్వాత ఓఎస్డీగా.. గతంలో ముఖ్యమంత్రి భద్రత విభాగంలో అదనపు ఎస్పీగా పని చేసిన రాధాకిషన్‌రావు నాన్–క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొంది, 2017 నవంబర్ 3న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టు 31న ఈయన పదవీ విరమణ చేసినా.. మూడేళ్ల పాటు ఓఎస్డీగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఆగస్టు 31తో ఆ గడువు ముగిసింది. అయితే గడువును ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పొడిగించింది. 2018 నాటి ఎన్నికల సమయంలో రాధాకిషన్‌రావు డీసీపీ హోదాలో విధులు నిర్వర్తించారు. ఒక అధికారి ఒకే పోస్టులో రెండు ఎన్నికలకు పని చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో పాటు ఆయన అధికార పారీ్టకి సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలూ వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ గత ఏడాది అక్టోబర్ 20న ఆయనపై బదిలీ వేటు వేసింది. అప్పటి నుంచి విధులకు దూరంగా ఉన్న ఆయన.. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కొత్త సర్కారు ఏర్పడుతుండటంతో గత ఏడాది డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ప్రభాకర్‌రావుతో కలిసి భారీ వసూళ్లు.. ఎస్ఐబీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని టీమ్ వ్యవహారాల్లో రాధాకిషన్‌రావుకు కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన సిబ్బందితో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. వీళ్లు టార్గెట్ చేసిన వారిలో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నారు. ప్రణీత్‌రావు ఇచ్చే సమాచారంతో రంగంలోకి దిగే రాధాకిషన్‌రావు సైన్యం ఓ పార్టీ కోసం విరాళాలతో పాటు తమ బాస్‌ల కోసం పెద్ద మొత్తంలో మామూళ్లు వసూలు చేశారు. ప్రణీత్‌రావు అరెస్టు తర్వాత రాధాకిషన్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ప్రణీత్‌తో పాటు భుజంగరావు, తిరుపతన్నల విచారణలో రాధాకిషన్‌రావు పాత్రపై సిట్‌కు అనేక ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) కూడా జారీ చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య రాధాకిషన్‌రావు గురువారం పోలీసులకు చిక్కారు. ఇన్స్పెక్టర్ గట్టు మల్లు ఇద్దరికీ సన్నిహితుడే.. సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రశ్నిస్తున్న ఇన్స్పెక్టర్ గట్టుమల్లు అటు ప్రభాకర్‌రావు, ఇటు రాధాకిషన్‌రావులకు సన్నిహితుడని తెలుస్తోంది. ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా పని చేసినప్పుడు ఇతను చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేశాడు. రాధాకిషన్‌రావు హయాంలో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గానూ విధులు నిర్వర్తించాడు. ఇక్కడ నుంచి మళ్లీ ప్రభాకర్‌రావు నేతృత్వం వహిస్తున్న ఎస్ఐబీలోకే వెళ్లాడు. ఇటీవల అరెస్టు అయిన అదనపు ఎస్పీ తిరుపతన్న టీమ్‌లో చురుకుగా వ్యవహరించాడని సిట్ చెప్తోంది. ఈ రెండు విభాగాల్లోనూ గట్టు మల్లు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న నలుగురు అధికారులను పిలిచి విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. వీళ్లు రాధాకిషన్‌రావు హయాంలోనూ టాస్్కఫోర్స్లోనే పని చేయడంతో వీరి పాత్రపై ఆరా తీస్తున్న సిట్.. సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని విశ్లేషి స్తోంది. భుజంగరావు, మేకల తిరుపతన్న సస్పెన్షన్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణీత్‌రావు అదనపు కస్టడీ పిటిషన్‌ను మాత్రం న్యాయస్థానం కొట్టేసింది. ఇలావుండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిని ఈనెల 23న పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
కీచక డీఎస్పీ.. బాధితురాలి ఫోన్‌కు రొమాంటిక్ పాటలు, వీడియోలు
సాక్షి,హైదరాబాద్: పోలీసు నినాదం గతి తప్పింది. మహిళలకు రక్షణకుకల్పించాల్సిన పోలీసే వేధింపులకు గురి చేశాడు. సమస్య ఉందని ఆశ్రయించిన ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) డీఎస్పీ కిషన్ సింగ్జీపై చైతన్యపురి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మార్గదర్శి కాలనీకి చెందిన మహిళ (48) తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డి్రస్టిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. 2020లో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఇంటర్ డిపార్ట్మెంట్ క్రీడా పోటీలకు సిద్ధమవుతున్న సమయంలో సీఐడీ డీఎస్పీ కిషన్ సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. శిక్షణ తరగతులకు హాజరుకావాలని అతను ఆమెకు సూచించాడు. సీనియర్ పోలీసు అధికారి కావటంతో అంగీకరించిన బాధితురాలు.. తన ఫోన్ నంబరును పోలీసు అధికారికి ఇచి్చంది. అప్పటి నుంచి ఆ పోలీసు ఉన్నతాధికారి ఆమె వాట్సాప్ నంబరుకు రొమాంటిక్ హిందీ పాటలు, సెన్సార్ చేయని వీడియోలను పంపించడం మొదలుపెట్టాడు. శిక్షణ తరగతులకు చీర కట్టుకోవాలని రావాలంటూ ఒత్తిడికి గురి చేసేవాడని బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సాయం కోసం వెళితే.. కిషన్‌సింగ్ ప్రవర్తన బాగా లేకపోవటంతో ఫోన్ కాల్స్‌కు, వీడియోలకు ఏడాది పాటు స్పందించడం మానేసింది. కొన్ని నెలల క్రితం హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగినప్పుడు సహాయం కోసం బాధితురాలు సదరు సీఐడీ పోలీసు అధికారిని సంప్రదించింది. దీన్ని ఆసరా చేసుకున్న అతను.. తనతో చనువుగా ఉండాలని, తనను కౌగిలించుకోవాలని పట్టుబట్టాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో భవిష్యత్తులో ఎలాంటి సహాయం చేయనని బెదిరించాడు. దీంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. వారి సూచన మేరకు.. చైతన్యపురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు కిషన్‌సింగ్‌పై 354 (డి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాధితురాలి సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుని మరిన్ని వివరాలు, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
Gouri G Kishan : మాల్దీవుల్లో అందాల ఊయల ఊగేస్తున్న గౌరీ కిషన్(ఫోటోలు)
-
లింకేజీ సమస్యలు.. రైతులకు అందని ‘పీఎం కిసాన్’!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ పథకం) కింద పేర్లు నమోదు చేసుకోవడంలో ఎదురవుతున్న పలు సమస్యల కారణంగా రాష్ట్రంలో వేలాది మంది రైతులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందట్లేదని లిబ్టెక్ ఇండియా అనే ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. ప్రధానంగా ఆధార్, పాన్‌కార్డుల లింకేజీ సమస్యలు, బ్యాంకు ఖాతాల్లో పేర్లు సరిపోలకపోవడం, డేటాలో తప్పులు, ఆధార్ ప్రాతిపదికన తిరస్కరణ, లబ్ధిదారుల పేర్లకు ఆమోదం తెలపడంలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కొంత జాప్యం చోటుచేసుకోవడం, తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు ఈ సంస్థ తాజా నివేదిక తేల్చింది. అలాగే పేర్ల నమోదు వెబ్సైట్ ఆంగ్లంలో ఉండటం, రైతులందరికీ ఈ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తెలియకపోవడం వంటి సమస్యలు కూడా ఇందుకు కారణమని ఈ అధ్యయనంలో తేలింది. ఇదీ అధ్యయనం... లిబ్టెక్ ఆధ్వర్యంలో ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న సమాచారం, వివరాలతో సమగ్ర పరిశీలన నిర్వహించారు. తెలంగాణలోని 32 జిల్లాల్లో కిసాన్ సమ్మాన్ అమలు తీరును పరిశీలించారు. 2018 డిసెంబర్ నుంచి 2021 జూన్ (26వ తేదీ) వరకు కేంద్రం 8 కిస్తీలు (ఇన్స్టాల్మెంట్లు) చెల్లించగా అవి ఏ మేరకు లబ్ధిదారులకు చేరాయన్న అంశాన్ని బేరీజు వేశారు. ఇదీ పీఎం కిసాన్ పథకం... చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఏటా రూ. 6 వేలు (రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో) ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద లబ్ధి పొందేందుకు రిజిస్టర్ అయిన రైతులకు ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్–డీబీటీ) కింద నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం జమ అవుతుంది. ముందుగా రాష్ట్రాల స్థాయిలో ఈ పథకం కింద అర్హులైన రైతులను గుర్తిస్తారు. చెల్లుబాటయ్యే ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాల పరిశీలన అనంతరం నేరుగా ఆ సొమ్మును వారి ఖాతాల్లో జమచేస్తారు. రాష్ట్రంలో అమలు తీరిలా... ►ఈ పథకం మొదలైన నాటి నుంచి 38,40,670 మంది రైతులు రిజిస్టర్ చేసుకోగా వారికి 2.83 కోట్ల ఇన్స్టాల్మెంట్ల ద్వారా రూ. 5,664 కోట్లు లబ్ధి చేకూరాలి. అయితే 37,73,259 మంది రైతులకు 2.65 కోట్ల ఇన్స్టాల్మెంట్ల ద్వారా రూ. 5,311 కోట్లు మాత్రమే అందాయి. ►34.12 లక్షల మంది రైతులకు (88.9 శాతం) అన్ని ఇన్స్టాల్మెంట్లు అందగా 3.6 లక్షల మందికి కనీసం ఒక ఇన్స్టాల్మెంట్ మొత్తమైనా చేరింది. ►67,411 మంది రైతులకు ఒక్క ఇన్స్టాల్మెంట్ మొత్తం కూడా డిపాజిట్ కాలేదు. ►మేడ్చల్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో 80 శాతానికిపైగా రైతులకు అన్ని ఇన్స్టాల్మెంట్లు అందాయి ►వాటిలో నాగర్‌కర్నూల్, నల్లగొండ, యాదాద్రి, నారాయణ్‌పేట జిల్లాలు వెనుకబడ్డాయి. ►260 గ్రామాల్లోని 100 శాతం రైతులకు అన్ని ఇన్స్టాల్మెంట్స్ అందాయి. ►339 గ్రామాల 75 శాతం రైతులకు ఈ ఇన్స్టాల్మెంట్స్ చేరాయి ►29 గ్రామాల్లోని 50 నుంచి 100 శాతం రైతులకు ఎలాంటి ఇన్స్టాల్మెంట్ అందలేదు. ►15 గ్రామాల్లోని 100 శాతం రైతులకు ఒక్క ఇన్స్టాల్మెంట్ జమకాలేదు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ సరిగా లేదు. డిజిటల్ సిస్టమ్‌లోనూ లోపాలున్నాయి. రైతులకు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించే ఓపిక బ్యాంకు అధికారులకు ఉండట్లేదు. అన్ని డీబీటీ పథకాల్లోనూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. రైతులకు అందుతున్న నగదు లబ్ధికి సంబంధించి సెంట్రల్ ఏజెన్సీ వద్ద బ్రాంచీలవారీగా వివరాలు ఉండేలా చర్యలు చేపట్టాలి. – డాక్టర్ డి. నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణుడు పీఎం కిసాన్ పథకం అమల్లో భాగస్వాములైన ఏజెన్సీలు, బ్యాంకులు, సంస్థల్లో జవాబుదారీతనం ఉండట్లేదు. రైతులు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లేదా మీ–సేవ కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణలో పీఎం కిసాన్ కింద రైతుల రిజిస్ట్రేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని లబ్ధిదారుల సంఖ్యను 38 లక్షల నుంచి 63 లక్షలకు పెంచాలి. – చక్రధర్ బుద్ధా, డైరెక్టర్, లిబ్టెక్ ఇండియా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్రంలో నోడల్ ఆఫీసర్ లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. కొందరు అర్హులకు ఆర్థిక సాయం అందట్లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఎక్కడ, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియట్లేదు. అందువల్ల కేంద్రం ఈ పథకం అమలుకు రాష్ట్ర స్థాయిలో ఒక అధికారిని నియమించాలి. – రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు -
ఒక జాక్‌పాట్ కవి
‘ఏ జిందగీ ఉసీకి హై జో కిసీకా హోగయా ప్యార్ హీ మే ఖోగయా’... రాజేంద్ర కిషన్‌ను తలుచుకోగానే ఈ పాట గుర్తుకొస్తుంది. ‘షోలా జో ధడ్ కే దిల్ మేరా భడ్కే దర్ద్ జవానీకా సతాయే బఢ్ బఢ్ కే...’ రాజేంద్ర కిషన్‌ను తలుచుకుంటూ ఈ పాట కూడా గుర్తుకొస్తుంది. నా బోలే నా బోలే నా బోలేరే ఘూంఘట్ కే పట్ నా ఖోలెరే... ఈ సూపర్‌హిట్ పాట రాజేంద్ర కిషన్ పేరు చెప్పిన వెంటనే గుర్తుకు రాక మానదు. హిందీ సంగీత అభిమానులకు పాటల ప్రేమికులకు రాజేంద్ర కిషన్ ఇష్టుడు. స్నేహితుడు. వేల హిట్ పాటలు ఇచ్చినందుకు ప్రియ సఖుడు. హిందీ సినిమాలలో హస్రత్ జైపూరి, శైలేంద్ర, మజ్రూ సుల్తాన్‌పురి... ఒకవైపు వరుస పెట్టి కమర్షియల్ సినిమాలకు రాస్తుంటే మరోవైపు రాజేంద్ర కిషన్ వారికి పోటీగా అప్రతిహతంగా పాటలు రాశాడు. అతని పాటల్లో గొప్ప ఉర్దూ లేకపోవచ్చు. ఉదాత్త భావాలు ఉండకపోవచ్చు. కాని పామరులు మనో రంజితం అయ్యేలా మాటలు ఉంటాయి. ఊపు ఉంటుంది. హుషారు ఉంటుంది. ఈనా మీనా డీకా డాయ్ డమనికా మాక నాక నాక చీక పీక రీకా... రాజేంద్ర కిషన్‌ది సిమ్లా. చిన్నప్పుడే కవిత్వం పురుగు పట్టి కరిచింది. ఏవో ఒక రాతలు రాసి, రాధాకృష్ణుల మంటపాల కోసం భజనలు రాసి ఆ ఊళ్లో గుర్తింపు పొందాడు. ముంబై వెళదామనుకున్నాడు కాని గవర్నమెంట్ ఆఫీసులో గుమాస్తా అయ్యాడు. అదీ మంచికే అనుకుని ఉన్న ఆ నాలుగు ఫైళ్ల పని తెమిల్చి పుస్తకాలు చదువుకునేవాడు. కవిత్వం రాసేవాడు. ఆ తర్వాత ఈ కుర్చీలో కూచుని వచ్చేపోయే వారికి జవాబు చెప్పడం కంటే స్వేచ్ఛగా కవిగా బతికితే బాగుంటుందని ఉద్యోగానికి 1942లో రాజీనామా చేసి బొంబాయి చేరుకున్నాడు. అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అదృష్టమే ఇతని కోసం అక్కడ కాపు కాచి ఉంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడైన సి.రామచంద్రతో జత కట్టి రాజేంద్ర కిషన్ సూపర్ హిట్ పాటలు అనేకం రాశాడు. తెలుగులో ‘నాటకాల రాయుడు’ లో హిట్ అయిన ‘నీలాల కన్నుల్లో’ పాట హిందీలో ‘అల్బేలా’లో రాజేందర్ కిషన్ రాసిన పాటే. ధీరేసే ఆజారి అఖియన్ మే నిందియా ఆజారి ఆజా ధీరే సే ఆజా... రాజేంద్ర కిషన్ సినిమాల్లో పాటలు మాత్రమే కాదు స్క్రిప్ట్స్ కూడా రాశాడు. ముఖ్యంగా దక్షిణాది నుంచి హిందీలోకి రీమేక్ అయ్యే మన ఏవిఎం వారి సినిమాలకు చాలావాటికి అతడు పని చేశాడు. తెలుగులో హిట్ అయిన ‘పయనించే ఓ చిలుకా ఎగిరిపో’ పాటను హిందీరో రాజేందర్ సింగ్ రాశాడు. చల్ ఉడ్‌జారే పంఛీ తేరా దేశ్ హువా బేగానా... ఆ తర్వాత సంగీత దర్శకుడు హేమంత్ కుమార్ కోసం రాజేందర్ కిషన్ ‘నాగిన్’లో సూపర్‌డూపర్ హిట్ రాశాడు. అదే ‘తన్ డోలే మేరా మన్ డోలే’. రాజేందర్ కిషన్ అత్యంత వేగంగా రాసే కవి. తొందరగా పని ముగించుకొని ఏ పేకట ఆడటానికో, గుర్రప్పందాల్లో పాల్గొనడానికో వెళ్లిపోయేవాడు. ఇన్ని వ్యసనాలు ఉన్నా పాట దగ్గర అతడు చిత్తశుద్ధి కోల్పోలేదు. రాసిన ప్రతి పాటను హిట్ చేయడానికి తాపత్రయ పడ్డాడు. ‘హమ్ ప్యార్ మే జల్నే వాలోంకో’ (జైలర్), ‘మేరా పియా గయా రంగూన్’ (పతంగా), ‘ఇత్న నా ముజ్ సే తూ ప్యార్ బఢా’ (ఛాయా), ‘తుమ్హీ మేరి మందిర్ తుమ్హి మేరి పూజా’ (ఖాందాన్) ఆ హిట్లకు అంతే లేదు. సినిమాల్లో సంపాదించింది చాలక రాజేందర్ కిషన్ రేసుల్లో దాదాపు 46 లక్షలు సంపాదించాడు 1970లలో. అందువల్ల ఆయన అత్యంత శ్రీమంతుడైన సినీ కవి అయ్యాడు. ఆ తర్వాత పాటలు రాయలేదు. 1919లో పుట్టిన రాజేందర్ కిషన్ 1987లో మరణించాడు. అతడు ప్రచారానికి, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండేవాడు. కాని శ్రోతలు ఎప్పుడూ అతని పాటకు దగ్గరగా ఉండేవారు. ఇవాళ్టికీ ఉన్నారు. రాజేందర్ కిషన్‌ను తమవాడిగా భావిస్తూనే ఉన్నారు. కభి న కభి కహీ న కహీ కోయినా కోయి ఆయేగా ఆప్ నా ముఝే బనాయేగా.. – సాక్షి ఫ్యామిలీ -
బిగ్‌బాస్‌లో ముద్దుల గోల
బెంగళూరు: ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాల్సిన బిగ్‌బాస్ గేమ్ షో.. రొమాన్స్‌కు వేదికగా మారుతోంది. కర్ణాటకలో ఓ టీవీ చానల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ కార్యక్రమంలో కిశన్ కొద్దిరోజుల క్రితం చందనకు కౌగిలించుకోని ముద్దు ఇచ్చాడు. ఇప్పుడు మరో అమ్మాయికి ముద్దు ఇవ్వటం వివాదంగా మారింది. బిగ్‌బాస్ షోలో ఉన్న భూమిశెట్టి, కిశన్, జై జగదీశ్, ప్రియాంక, పథ్వి, రాజు తాళికోటి, కురి ప్రతాప్, హరిశ్ రాజ్, చందన్ ఆచార్లు గార్డన్ ఏరియాలో కూర్చోని మాట్లాడుతుండగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు వస్తారనే చర్చ వచ్చింది. వైల్డ్‌కార్డ్ ద్వారా యువతి వస్తే కిశన్ ముద్దు ఇవ్వాలని ప్రియాంక చెప్పింది. ఆ సమయంలో కిశన్ మాట్లాడుతూ భూమికి ముద్దుపెట్టాడు. అయితే ఈ వీడియో టీవీలో ప్రచారం కాకూండా కట్ చేశారు. అతని దూకుడుపై షో ప్రేక్షకులు అసహనం వ్యక్తంచేశారు. -
రహానే, ఇషాన్ కిషన్ సెంచరీలు
న్యూఢిల్లీ: ఇరు జట్ల కెప్టెన్లు అద్భుత శతకాలతో చెలరేగిన దేవధర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ‘సి’ను విజయం వరించింది. కెప్టెన్ అజింక్య రహానే (156 బంతుల్లో 144 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (87 బంతుల్లో 114; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగారు. ఫలితంగా దేవధర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ‘సి’ జట్టు 29 పరుగుల తేడాతో భారత్ ‘బి’పై గెలిచి విజేతగా నిలిచింది. శనివారం ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ‘సి’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానే, ఇషాన్ కిషన్ తొలి వికెట్‌కు 210 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేశారు. అనంతరం ఇషాన్ ఔటైనా... శుబ్‌మన్ గిల్ (26), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్స్‌లు)ల సాయంతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రహానే జట్టుకు భారీ స్కోరు అందించాడు. ప్రత్యర్థి బౌలర్లలో జైదేవ్ ఉనాద్కట్ 3, దీపక్ చహర్, మయాంక్ మార్కండే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ ‘బి’ జట్టు 46.1 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ‘బి’ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (14) త్వరగానే ఔటైనా... కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (114 బంతుల్లో 148; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (60; 7 పోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం రుతురాజ్, హనుమ విహారి (8), మనోజ్ తివారి (4) వెంట వెంటనే ఔటయ్యారు. ఆ సమయంలో అంకుశ్ (37; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి శ్రేయస్ ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. 60 బంతుల్లో 70 పరుగులు చేయాల్సిన దశలో అయ్యర్ క్రీజులో ఉండటంతో గెలుపు సునాయాసమే అనిపించినా... 43వ ఓవర్ చివరి బంతికి అయ్యర్ ఏడో వికెట్‌గా వెనుదిరగడంతో భారత్ ‘బి’ ఓటమి ఖాయమైంది. ‘సి’ జట్టు బౌలర్లలో పప్పు రాయ్ 3 వికెట్లు పడగొట్టాడు. -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషన్ వల్గోట్ కిషన్
-
ష్.. సైలెన్స్
కిషన్, డానియల్ హీరోలుగా, సుమ హీరోయిన్గా రంజిత్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ష్.. సైలెన్స్’. నాగలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్‌పై వి. రమణబాబు, డానియల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ క్లాప్ ఇచ్చారు. వి.రమణబాబు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. కథ నచ్చడంతో సినిమా నిర్మాణం ప్రారంభించాం. ఈ నెల ద్వితీయార్ధంలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నా. ఈ చిత్రం నాకు మంచి పేరు, గుర్తింపు ఇస్తుంది’’ అన్నారు కిషన్. ‘‘చక్కటి కథతో రూపొందుతోన్న చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నాను. ఈ చిత్రబృందానికి మంచి పేరు తెస్తుంది’’ అన్నారు డానియల్. విక్కీ, బుల్లెట్ సుధాకర్, బళ్లారి బాబు తదితరులు నటి స్తోన్న ఈ చిత్రానికి సంగీతం: దేవేందర్, కెమెరా: ఏ. విజయ్ కుమార్. -
ఏప్రిల్ నెలాఖరులోగా పాఠశాలల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల ఎక్స్టెన్షన్ ఆఫ్ టెంపరరీ రికగ్నైజేషన్ (ఈటీఆర్) గుర్తింపు ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు విద్యా శాఖ కమిషనర్ కిషన్ వెల్లడించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయం నాటికి గుర్తింపులేని స్కూళ్లు అనేవే లేకుండా, ముందుగానే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో 12 స్కూళ్లకు సంబంధించిన ఈటీఆర్ల విషయంలో ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన సిబ్బందిపై కేసులు నమోదు చేశామని, విచారణ కొనసాగుతోందన్నారు. హైదరాబాద్‌లో ఇంటి అడ్వాన్స్‌ల విషయంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి రుణం తీసుకున్న సిబ్బంది విషయంలోను విచారణ జరుపుతున్నామన్నారు. -
బాసూ.. మెమరీలాసు..!
సాక్షి, హైదరాబాద్: పోలీస్ రోబో.. రాష్ట్ర రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఇదీ. అయితే ఈ పోలీస్ రోబో కాస్తా ఇప్పుడు మెమరీలాస్‌తో సతమతమవుతోంది. మనుషులను గుర్తించడం.. ఇతరత్రా సాంకేతిక విషయాల్లో తడబడుతోంది. నగరంలోని హెచ్‌బోట్స్ రోబోటిక్స్ సంస్థ రూ.7 లక్షల వ్యయంతో ‘స్మార్ట్ పోలీసింగ్ రోబో బెటా వెర్షన్’ను రూపొందించింది. వాస్తవానికి డిసెంబర్ 31నే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఈ రోబోను బహిరంగంగా పరీక్షించాలని భావించినా సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా వేశారు. అయితే ఇప్పటికే ఫోరంమాల్తోపాటు జేఎన్టీయూ చౌరస్తాలో ఈ రోబోను ఒక గంట పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించినట్టు హెచ్‌బోట్స్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. రోబోలోని కెమెరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని.. అయితే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ.. వారి ఫిర్యాదులకు ప్రతిస్పందించే తీరులో స్పష్టత లేకపోవడంతో ఈ రోబోపై మరిన్ని పరీక్షలు చేసి ఆధునికరిస్తామన్నారు. కాగా, త్వరలో నాగ్‌పూర్‌లోనూ ఈ రోబో కృత్రిమ మేధస్సుకు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల అనంతరం మార్చిలో ఈ రోబోను బహిరంగ ప్రదేశాల్లో మరోసారి పరీక్షిస్తామని.. జూలై నుంచి సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దుతామని నిర్వాహకులు ‘సాక్షి’కి తెలిపారు. పోలీసు విధుల్లో పాలుపంచుకునేందుకు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను రోబోలో మిళితం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆరు నెలలుగా నలుగురు ఫౌండర్లు, మరో 16 మంది సభ్యులు ఈ రోబో తయారీకి అహర్నిశలు శ్రమించారని హెచ్‌బోట్స్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు కిషన్ పీఎస్వీ తెలిపారు. -
ఇతడు – అతడు
రెండు దశాబ్దాల క్రితం జరిగింది ఇది. అయినా నిన్నటి జ్ఞాపకంలానే భయపెడుతోంది. డిగ్రీ చేసిన తరువాత జాబ్ చేయడానికి రెక్కలు కట్టుకొని బాంబేలో వాలిపోయాను. జాబ్ కంటే బాంబేలో ఉండాలనే కోరికే నన్ను ఈ పని చేయించింది. ఎలాగో కష్టపడి, చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరిపోయాను. ఒక స్లమ్ ఏరియాలో చిన్న రూమ్ తీసుకొని ఉండేవాడిని. సంవత్సరం గిర్రుమని తిరిగింది. ఒకరోజు...అర్ధరాత్రి తరువాత తలుపు చప్పుడు కావడంతో ‘ఎవరు?’ అంటూనే తలుపు తీశాను. ఎదురుగా అపరిచితుడు. కానీ... ఎక్కడో చూశాను. ‘‘గుర్తు పట్టలేదా... మీ అన్నయ్య ఫ్రెండ్ కిషన్‌ని’’ అన్నాడు. వెంటనే ‘సారీ బ్రదర్’ అంటూ రూమ్‌లోకి తీసుకువచ్చాను. బాంబేలో ఏదో పని ఉండి వచ్చానని, రెండు రోజులు ఉండిపోతానని చెప్పాడు. నా అడ్రస్ అన్నయ్య ఇచ్చినట్లున్నాడు. కొద్దిసేపటి తరువాత నిద్రపోయాం. ఒక గంట తరువాత నాకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. పక్కన చూస్తే కిషన్ లేడు! గొళ్లెం వేసే ఉంది. మరో టైంలో అయితే... దీని గురించి లోతుగా ఆలోచించేవాడినేమో... కళ్లు మండుతుండడంతో మళ్లీ గుర్రు పెట్టి నిద్రపోయాను. తెల్లారి లేచి చూస్తే నా పక్కనే ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు కిషన్. ‘‘అన్నా...రాత్రి ఎటైనా వెళ్లావా?’’ అని అడిగాను. ‘‘నేనెటు వెళతాను తమ్ముడూ...నువ్వు కలగని ఉంటావు’’ అని చిన్నగా నవ్వాడు. అవును. కలగని ఉంటాను! ఎన్నడూ లేనిది కాలనీలో ఆరోజు అలజడి మొదలైంది. రాత్రి ఏవో వింత శబ్దాలు వినిపించాయని, ఇంటిపై కప్పు మీద ఎవరో ఎగిరి దూకుతున్న శబ్దాలు వినిపించాయని...ఇలా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఇవి విని నేను, కిషన్ చిన్నగా నవ్వుకున్నాం. ఈలోపు మా రూమ్ ఓనర్ తుపానులా దూసుకొచ్చాడు... ‘‘నీకెన్నిసార్లు చెప్పాను, ఫ్రెండ్స్‌ను రానివ్వొద్దని. మొన్ననే ఒకడు వచ్చి వారం రోజులు ఉండిపోయాడు. అసలే నీళ్లు దొరక్క చస్తుంటే...’’ అతనలా తిడుతూనే ఉన్నాడు. ‘‘సారీ తమ్ముడూ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు’’ అంటూ అప్పటికప్పుడు రూమ్ నుంచి వెళ్లిపోయాడు కిషన్. ఇది జరిగిన వారానికి మా బంధువు ఒకరు చనిపోతే సొంతూరికి వెళ్లాను. నేను ఊరెళ్లక సంవత్సరం దాటింది. అంత్యక్రియలు పూర్తయిన తరువాత ఒక చెట్టుకింద కూర్చొని మాట్లాడుకుంటు న్నాం. ఏదో విషయం మాట్లాడుతూ మా అన్నయ్య ‘‘చచ్చి ఎక్కడున్నాడోగానీ ఆ కిషన్‌గాడు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవాడు’’ అన్నాడు. ‘‘పాపం కిషన్ చనిపోయాడా? ఎలా? వారం రోజుల క్రితమే నా రూమ్‌కు వచ్చాడు’’ అన్నాను. ‘‘వాడు చనిపోయి సంవత్సరం కావొస్తుంది. వారం రోజుల క్రితం నీ రూమ్‌కు ఎలా వస్తాడు?’’ ఆశ్చర్యంగా అడిగాడు అన్నయ్య. గట్టిగా వాదిస్తే నాకు పిచ్చిపట్టింది అనుకుంటారని ‘‘ఇతను కాదు...రమేశ్ అనుకుంటా నీ ఫ్రెండ్ ఒకరు వచ్చారు’’ అని మాట మార్చాను. బాంబేలో కొంత కాలం ఉన్న కిషన్, డిప్రెషన్‌తో బాధ పడుతూ రైలుకింద తలపెట్టి చనిపోయాడట. ఆ రైల్వేట్రాక్ మా రూమ్‌కు కూతవేటు దూరంలో ఉంటుంది.ఆరోజు రూమ్ ఓనర్ వచ్చి తిట్టకపోయి ఉంటే కిషన్ వెళ్లి ఉండేవాడు కాదు. ఆ తరువాత ఏం జరిగి ఉండేది? నా కాళ్లు సన్నగా వణకడం మొదలైంది! – అలోక్ కుమార్, నారాయణ్‌పూర్, బిహార్ -
హీరోని కాళ్తో కొట్టిన హీరోయిన్.
-
మానవీయ కోణంలో
నిజామాబాద్ నాగారం: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజన సందర్భంగా వారి మనోభావాలు దెబ్బ తీయకుండా విభజన చేపట్టాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3,434 పోస్టులు ఉండగా, 1134 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలని, భర్త ఎక్కడ ఉంటే భార్యకు అదే జిల్లాలో విధులు నిర్వహించేలా చూడాలని కోరారు. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులను ఇదే జిల్లాలో కొనసాగించేలా చూడాలని కోరారు. కొత్త జిల్లాలో ఉద్యోగులందరికీ 20శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలన్నారు. జిల్లాలో టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించున్నట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లాకు వెళ్లబోయే ఉద్యోగులకు త్వరలోనే ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. స.హ. చట్టం పేరుతో కొందరు ఉద్యోగులను అనవసరంగా బెదిరిస్తున్నారని, ఇలాంటివి సహించేది లేదన్నారు. ఉద్యోగులు అందరు బంగారు తెలంగాణ కోసం పనిచేస్తున్నారని అన్నారు. టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సతీష్‌రెడ్డి, నేతలు దయానంద్, అమృత్‌కుమార్, నరేందర్, సుధాకర్, నరహరి తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ స్టేషన్లో గొంతుకోసుకున్నయువకుడు
అచ్చంపేట: దొంగతనం కేసులో పోలీసులు విచారణకు పిలవటంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని సింగారం గ్రామం పెద్దతండాకు చెందిన చెందిన కిషన్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్నాడు. ఓ దొంగతనం కేసులో అనుమానంతో కిషన్ ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే తను ఏ నేరం చేయలేదని కిషన్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో కిషన్ గొంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావటంతో పోలీసులు వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారటంతో హైదరాబాద్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా కిషన్
వరంగల్ : టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడి గా అంగోతు కిషన్‌నాయక్‌ను నియమిం చినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. 56 మందితో కార్యవర్గం ఏర్పా టు చే సినట్లు తెలిపారు. మహబూబాబాద్ మండలం వేమునూరు గ్రామ మాజీ సర్పంచ్ కిషన్‌నాయక్ అధ్యక్షుడిగా, ప్రధా న కార్యదర్శులుగా భూక్య సమ్మయ్యనాయక్, మోహన్‌నాయక్, ఉపాధ్యక్షులుగా బానోతు దర్జీనాయక్, గుగులోతు కనకరాజు,భూక్య వెంకన్న, మంగ్యానాయక్, పోరిక బదర్జీ, గుగులోతు సారయ్య, బానోత్ నర్సింహనాయక్, ప్రచార కార్యదర్శులుగా దారావత్ వీరన్న, అంగోతు బిక్షపతి, బానోత్ వీర్యానాయక్, అధికార ప్ర తినిధులుగా బానోతు రవీందర్, శ్యాం లాల్నాయక్, కోశాధికారిగా బాదవత్ రాజేశ్వరిలను నియమించినట్లు తెలిపారు. -
వెయ్యి రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం
కోల్‌కతా నుంచి వెయ్యి రూపాయల నకిలీ నోట్లు తెస్తున్న ఓ వ్యక్తిని మలక్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై రమేష్ తెలిపిన వివరాలివీ.. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముప్పారంతండాకు చెందిన కరంటోతు కిషన్(48), రేగోడ్ మండలం జంగంలంకతండాకు చెందిన శంకర్‌నాయక్ స్నేహితులు. ఈ క్రమంలో శంకర్‌నాయక్ వారం కిత్రం కిషన్‌కు రూ.50 నగదు ఇచ్చి కోల్‌కతా సమీపంలోని హౌరాలో ఉన్న గౌసుద్దీన్ అనే వ్యక్తి వద్దకు పంపిచాండు. అతడు వెళ్లి గౌసుద్దీన్‌కు ఆ నగదు ఇవ్వగా...అతడు ఇచ్చిన నకిలీ వెయ్యిరూపాయల నోట్లు రూ.1.10 లక్షలు తీసుకుని శనివారం దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లో దిగాడు. విశ్వనీయ సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్‌లో కిషన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అతని వద్ద నుంచి లక్షా పదివేల నకిలీ వెయ్యి రూపాయల నోట్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కిషన్ గతంలో రూ.3 లక్షల నకిలీ వెయ్యి నోట్లు హౌరా నుంచి తెచ్చినట్లు విచారణలో తేలింది. శంకర్‌నాయక్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
సర్కారీ బడికి డబుల్ ధమాకా!
- పక్కాగా నిర్వహణ, పరిశుభ్రత కోసం గ్రాంటు రెట్టింపు చేసిన ప్రభుత్వం - విద్యార్థులను బట్టి ఉన్నత పాఠశాలలకు రూ.లక్ష వరకు.. - ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.30 వేల వరకు నిధులు - వర్కర్లను, నైట్ వాచ్మన్లను నియమించుకునేందుకు అవకాశం - చాక్‌పీసులు కొనేందుకూ పడిన ఇబ్బందులు ఇక దూరం - డిప్యూటీ సీఎం కడియం ప్రత్యేక చొరవ.. డీఈవోలకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: విద్యార్థులే తరగతి గదులను ఊడ్చుకోవడం.. ఆవరణను శుభ్రపరచుకోవడం.. చివరికి మరుగుదొడ్లు పరిశుభ్రం చేసుకోవడం వంటి వాటికి కాలం చెల్లనుంది. స్కూళ్లలో చాక్‌పీసులు కొనేందుకూ డబ్బుల్లేని దుస్థితిని దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల నిర్వహణకు అవసరమైన కొంతడబ్బు స్కూల్లో ఉండేలా చూడడంతోపాటు వర్కర్లను నియమించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ఇప్పటి వరకూ స్కూళ్లకు ఇస్తున్న గ్రాంటును ఏకంగా రెండింతలకు పైగా పెంచింది. విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏటా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు.. ఉన్నత పాఠశాలలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. గతంలో రూ.15 వేల లోపే.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం... 25 వేల స్కూళ్లలో లక్ష డ్యుయల్ డెస్కు (విద్యార్థులు కూర్చోవడంతోపాటు పుస్తకాలు పెట్టుకుని రాసుకునేందుకు వీలైన టేబుల్)లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇకపై ప్రభుత్వ బడుల నిర్వహణ పక్కాగా చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సరిపడా నిధులివ్వడంతోపాటు వర్కర్ల నియామకం ద్వారా పాఠశాల పరిశుభ్రత, మరుగుదొడ్లను శుభ్రం చేయడం, రాత్రివేళల్లో పాఠశాలలకు రక్షణ వంటి చర్యలు చేపట్టనుంది. ఇప్పటివరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏటా స్కూల్ గ్రాంటు, నిర్వహణ గ్రాంటు పేరుతో రూ.12 వేలు మాత్రమే ఇచ్చే వారు. దీనిని తాజాగా రూ.25 వేలకు పెంచింది. విద్యార్థుల సంఖ్యను బట్టి మరింత ఎక్కువ ఇవ్వనున్నారు. ఇక ఉన్నత పాఠశాలకు ఇప్పటివరకు రూ.15 వేల వరకు ఇస్తుండగా... తాజాగా విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.లక్ష వరకు అందజేయనున్నారు. ఈ అంశంపై ప్రత్యేక చొరవ చూపిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యా అధికారులను ఆదేశించారు. దీంతో పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ మార్గదర్శకాలను రూపొందించి డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం... ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 40మందిలోపు విద్యార్థులుంటే రూ.25 వేలు గ్రాంట్‌గా ఇస్తారు. 40 కంటే ఎక్కువగా ఉంటే రూ.30 వేలు ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లో 40 మందిలోపు విద్యార్థులుంటే రూ.50 వేలు, 100 మందికంటే ఎక్కువ ఉంటే రూ.లక్ష గ్రాంటు అందిస్తారు. అవసరమైతే ఇద్దరు వర్కర్లు: పాఠశాలల నిర్వహణ కోసం వర్కర్లను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాల సమయంలో పనిచేసే పార్ట్‌టైం వర్కర్, రాత్రివేళల్లో నైట్ వాచ్మెన్ల నియామకానికి ఓకే చెప్పింది. ఏడాదిలో 10 నెలలపాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక్కొక్కరి చొప్పున, 100 మందికంటే ఎక్కువగా విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో ఇద్దరి చొప్పున వర్కర్లను నియమించుకోవచ్చని పేర్కొంది. 40 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నెలకు రూ.2 వేలు, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే రూ.2,500 వేతనంగా ఇవ్వవచ్చని సూచించింది. 40 మందిలోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో రూ.2,500, 40 నుంచి 100 మంది వరకున్న స్కూళ్లలో రూ.3 వేలు, అంతకంటే ఎక్కువ మంది ఉన్న స్కూళ్లలో రూ.3,500 చెల్లించవచ్చని పేర్కొంది. వారి వేతనాలను స్కూల్ గ్రాంటు నుంచి చెల్లించాలని సూచించింది. వర్కర్లు చేయాల్సిన పనులివే: ఉదయం 7:30 గంటలకు పాఠశాల తెరవాలి. ఆవరణ, తరగతి గదులు, టాయిలెట్లు శుభ్రం చేయాలి. మొక్కలకు నీళ్లు పోయాలి. టాయిలె ట్లలో నీటి సదుపాయం ఉండేలా చూడాలి. పాఠశాల సమయం ముగిసే వరకు ఉండాలి. నైట్ వాచ్‌మన్ అయితే సాయంత్రం 4:30 గంటలకు పాఠశాలకు వచ్చి ఉదయం 9 వరకు ఉండాలి. ఎందుకీ గ్రాంట్ ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన చాక్‌పీసులు, పెన్నులు, నోట్‌బుక్‌ల వంటి స్టేషనరీ సామగ్రి కొనుగోలు.. పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఈ నిర్వహణ గ్రాంట్‌ను వినియోగిస్తారు. తరగతి గదులను, ఆవరణను ఊడ్వడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించడం కోసం నియమించుకునే వర్కర్లకు దీని నుంచే వేతనాలు చెల్లిస్తారు. పాఠశాలలకు వివిధ అవసరాలకు ప్రభుత్వం నిధులు ఇస్తుంది. అవిగాకుండా మిగతా అవసరాలకు ఈ గ్రాంట్ నిధులను వాడుకోవచ్చు. నిర్వహణ పక్కాగా ఉంటుంది ‘‘ఇటీవలే ఇంగ్లిషు మీడియం ప్రారంభానికి చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. స్కూల్ గ్రాంట్ పెంచడం అభినందనీయం. దీంతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పక్కాగా ఉండటంతోపాటు ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దవచ్చు..’’ - సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు ప్రభుత్వ చొరవ అభినందనీయం ‘‘ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ విషయంలో సర్కారు చొరవ అభినందనీయం. ప్రస్తుత చర్యలతో ఎంతో ఉపయోగం ఉంటుంది. చాక్‌పీసులు, ఇతర పనులకు డబ్బు సమస్య ఉండదు. గతంలో ఎప్పుడో డిసెంబర్, జనవరి నెలల్లో ఇచ్చే వారు. ఇప్పుడు జూలైలోనే ఇస్తామంటున్నారు. ముందుగానే ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది..’’ - మల్లికార్జున శర్మ, రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ఇది మంచి పరిణామం ‘‘ఇది మంచి పరిణామం. అస్తవ్యస్తంగా ఉండే పాఠశాలల నిర్వహణ ఇకపై బాగుంటుంది. అయితే దీనిని పక్కాగా నిర్వహించాలి. టాయిలెట్ల క్లీనింగ్ కోసం ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఒకరిని నియమించాలి..’’ - రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి -
జనవరిలో కాకతీయ ఉత్సవాలు
వరంగల్‌లో మూడు రోజులు, ఇతర జిల్లాల్లో రెండు రోజులు నాటి కళావైభవం ఉట్టిపడేలా నిర్వహణ పర్యాటక భవన్లో సన్నాహక సమావేశం సాక్షి, హైదరాబాద్: కాకతీయ ఉత్సవాలను వచ్చే జనవరి రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో జనవరి 10, 11 తేదీల్లో జరపాలని నిర్ణయించగా, వరంగల్ జిల్లాలో మాత్రం ఒకరోజు ముందుగా 9వ తేదీన ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వ సలహాదారులు పాపారావు, రమణాచారిలు సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య, ఆ శాఖ సంచాలకులు హరికృష్ణ, వరంగల్ జిల్లా కలెక్టర్ కిషన్, సమాచార శాఖ సంచాలకులు సుభాష్‌గౌడ్‌లతో పర్యాటక భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాకతీయ సామ్రాజ్యంలో అలరారిన కళాసంపదతో పాటు వారసత్వ కళలను, ప్రజాదరణ పొందిన గ్రామీణ కళారూపాలను ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించాలని వారు ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్షించి ఏర్పాట్లు చేయాలని, ఇందుకు సాంస్కృతిక శాఖ సంచాలకులు, వరంగల్ జిల్లా కలెక్టర్ వారికి సహకరించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని, ఉత్సవాలను వీలైనంత ఎక్కువ మంది తిలకించేలా జిల్లా కేంద్రాల్లో వేదికను తీర్చిదిద్దాలని సూచించారు. కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లతో ఊరారా ప్రచారం చేయాలని, ప్రధాన వేదిక వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వృద్ధ కళాకారులకు ఇటీవల రూ.1,500కు పెంచిన పింఛన్‌ను ఈ సందర్భంగా పంపిణీ చేసేందుకు వీలుగా పరిశీలన ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్న లబ్ధిదారులే కాకుండా కొత్తగా అర్హులను కూడా గుర్తించాలని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేయాలని, ఉత్సవాల సందర్భంగా ఆయా జిల్లాల్లోని ప్రముఖులు, మేధావులు, కళాకారులతో వేదిక వరకు ర్యాలీ నిర్వహించాలని పర్యాటక శాఖ అడిషనల్ చీఫ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్టాక్ కన్వీనర్లు అనూరాధారెడ్డి, పాండురంగారావు, పురావస్తు శాఖ సంచాలకులు మనోహర్, శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
సౌదీలో కరీంనగర్‌వాసి అనుమానాస్పదమృతి
ముస్తాబాద్: కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన మాడూరి కిషన్(30) సౌదీ అరేబియాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మంగళవారం కిషన్ భవనంపై అంతస్థు నుంచి పడిపోయి మృతి చెందినట్లు ఆయన పనిచేస్తున్న కంపెనీ ప్రతి నిధులు సమాచారం అందించారు. కిషన్ మూడేళ్ల క్రితం అప్పులు చేసి సౌదీ వెళ్లాడు. మరోవారంలో వస్తున్నట్లు భార్య లావణ్యకు తెలిపాడు. ఇంతలోనే కిషన్ ప్రమాదం లో మరణించాడనే సమాచారం వచ్చింది. సోమవారం తన భర్త ఫోన్లో మాట్లాడడని, కంపెనీలో కొంతమంది బెదిరిస్తున్నారని తెలిపాడని లావణ్య పేర్కొంది. కొంతమంది కావాలనే బిల్డింగ్‌పై నుంచి తోసి వేసి హత్య చేశారని ఆరోపించింది. -
అప్పుల బాధతో ఆరుగురు రైతులు మృతి
సాక్షి, నెట్వర్క్: ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఆరుగురు రైతులు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులోని కుమ్మరిబొగుడ కాలనీకి చెందిన రైతు తోట కిషన్(43) పంట దిగు బడి రాక రూ. 6 లక్షలు అప్పు అయింది. అది తీర్చే మార్గం కనిపించక ఇంట్లో ఉరివేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తికి చెం దిన కొండోజు నర్సింహ(45) నాలుగు ఎకరాల్లో పత్తి వేశాడు. రూ. 2 లక్షల వరకు అప్పు చేశాడు. సంఘ బంధంలో తీసుకున్న రూ.10 వేలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో మానసిక వేదనకు గురై శనివారం గుండెపోటుతో చనిపోయాడు. ఇదే జిల్లా కోదాడ మండల పరిధిలోని మొగలాయికోటకు చెందిన పెద్దపంగు అబ్రహం(68) రెండు లక్షల అప్పు తీరే మార్గం కనిపించక శనివారం ఉరి వేసుకున్నాడు. అనుముల మండలం వీర్లగడ్డతండా చెందిన దేపావత్ పాండు(32) రూ. 1.50 లక్షలు అప్పు చేశాడు. శుక్రవారం ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం తింసాన్పల్లికి చెందిన బుద్దారం రాములు(36) పెట్టుబడుల కోసం 5 లక్షలు అప్పు చేయగా దిగుబడి రాక శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. నవాబుపేట మండలం ఎక్మామిడి గ్రామానికి చెందిన కుమ్మరి నర్సయ్య(65) 2.30లక్షలు అప్పు చేశాడు. దిగుబడి రాక మనస్తాపం చెందిన ఆయన శని వారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
నక్కలగుట్ట : జిల్లావ్యాప్తంగా ఆహార భద్రత కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ జి.కిషన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనకు నియమించిన ప్రత్యేక అధికారుల సమావేశం శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స హాలులో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం 5.20లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇందులో 1.20లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, మిగి లిన దరఖాస్తుల పరిశీలన కూడా త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన కు నియమించిన సిబ్బంది ఉదయం 8గంటల లోగా గ్రామాలకు చేరుకోవాలని, రోజుకు 200 దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్ సూచిం చారు. ఇలా జిల్లావ్యాప్తంగా రోజుకు 50వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయితే గడువు లోగా లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. నగరంలో... వరంగల్ నగరంలో లక్షా 80వేల గృహలు ఉండగా లక్షా 45వేల దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ కిషన్ తెలిపారు. ఇందులో 54వేల దరఖాస్తులు పింఛన్లకు సంబంధించినవే ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, దరఖాస్తుల పరిశీలన సమయంలో సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని, కులం, ఆడ, మగ, భూమి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచిం చారు. అంతేకాకుండా వికలాంగులను సదరం క్యాంపులకు పంపించాలన్నారు. జిల్లాలోని నగర పంచాయతీలు, మునిసిపాలిటీల్లో దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లోని సూపరింటెండెంట్లను డిప్యూటేషన్ పంపించాలని డీఆర్వో సురేంద్రకరణ్‌ను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసమిబసు, డీఆర్వో సురేంద్రకర ణ్, డీఎఫ్ఓ గంగారెడ్డితో పాటు ఆర్డీఓలు వెంకటమాధవరావు, వెంకటరెడ్డి, భాస్కర్‌రావు, వరంగల్ బల్దియా అడిషినల్ కమిషనర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయండి
బ్యాంకర్లకు కలెక్టర్ కిషన్ ఆదేశం అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స హన్మకొండ అర్బన్ : రాష్ట్ర స్థాయిలో జరిగిన ఒప్పందంలో భాగంగా రైతులకు సంబంధించిన రుణాలు వెంటనే రీషెడ్యూల్ చేయాలని కలెక్టర్ జి.కిషన్ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, బ్యాంకర్లతో మంగళవారం ఆయన మాట్లాడారు. బ్యాంకర్లు ఈ విషయంలో నిక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ఇబ్బందులు ఉన్నట్లయితే లిఖితపూర్వకంగా ఇవ్వాలని స్పష్టంచేశారు. సమస్యలు తనదృష్టికి తీసుకువస్తే జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. సమస్యలు ఉన్నట్లయితే రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. ఆహార భద్రత కార్డులు, పింఛన్లు, ఫాస్ట్ పథకాలకు సంబంధించిన దర ఖాస్తుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని, నిబంధనలు త్వరలో వస్తాయని తెలిపారు. ప్రజలకు రశీదు ఇవ్వాలి దర ఖాస్తుదారులకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వే వివరాల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. వికలాంగులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మహబూబాబాద్, జనగామ, ములుగు ఏరియూ ఆస్పత్రులు, ఎంజీఎంలలో క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా కేంద్రం నుంచి డీఆర్డీఏ పీడీ శంకరయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పాతవన్నీ పోతాయ్ !
అన్ని సంక్షేమ పథకాలు అంతే ప్రస్తుత లబ్ధిదారులూ కొత్తగా అర్జీ పెట్టుకోవాల్సిందే అర్హత ఉన్న అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందే... ప్రాథమిక దశలోనే భారీగా తగ్గుదల క్షేత్రస్థాయి ఉద్యోగులకు కలెక్టర్ కిషన్ ఆదేశాలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియను మొదలుపెట్టింది. అర్హులందరు దరఖా స్తు చేసుకోవాలని సూచించింది. ప్రధానంగా కుటుంబ ఆహార భద్రత కార్డులు (రేషన్), సామాజిక పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా రానున్నాయి. దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం మెలిక పెట్టింది. ప్రస్తుతం రేషన్‌కార్డు ఉన్నవారు, సామాజిక పింఛన్లు పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు మళ్లీ కొత్తగా దరఖా స్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అన్ని రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్త రాష్ట్రంలో కొత్తగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. గ్రామ స్థాయిలో ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని కలెక్టర్లు క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించారు. ‘అర్హత ఉన్న వారు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న వారికీ ఇది వర్తిస్తుంది’ అని వరంగల్ జిల్లా కలెక్టర్ జి.కిషన్ గురువా రం విలేకరులు సమావేశంలో వెల్లడించారు. ఈ మేరకు గ్రామ స్థాయిలో ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో రేషన్ కా ర్డుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోం ది. రాష్ట్రంలో ప్రస్తుతం 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు వారి సామాజిక పరిస్థితిపై నివేదకలు ఇచ్చారు. ప్రభుత్వం వీటి ఆధారం గా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుండడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గుతుందని అధికారు లు చెబున్నారు. సమాజిక పించన్ల పరిస్థితి ఇలా గే ఉండనుంది. అన్ని రకాల సామాజిక పించ న్లు కలిపి రాష్ట్రంలో ప్రస్తుతం 26.95 లక్షలు ఉన్నాయి. వీటితో పోల్చితే కొత్తగా వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అర్హుల ఎంపిక మొదలైంది. రేషన్ కార్డులు, పింఛన్లు, ఫీజు రాయితీలు తదితర ఫలాలు పొందుతున్న వారందర్ని రద్దు చేస్తూ... వాటిస్థానంలో కొత్త గా అర్హులను గుర్తిస్తోంది. ఇందులో భాగంగా అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోం ది. రేషన్ కార్డు స్థానంలో ఆహార భధ్రత కార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా కొత్త పిం ఛన్ విధానం.. ఫీజు రాయితీ పథకాలను అమ లు చేయనుంది. ఈ క్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరు ఫలాలు అందుకునేందుకు తప్పనిసరి గా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఈ నెల 15 దరఖాస్తు దాఖలుకు చివరి తేదీగా ప్రకటించారు. తెల్లకాగితమే దరఖాస్తు పత్రం.. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే అంశంలో రాష్ట్ర సర్కారు కొత్త ప్రక్రియకు శ్రీకా రం చుట్టింది. గతంలో ఏదైనా పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకుగాను ప్రత్యేక నమూనాతో కూడిన దరఖాస్తులో వివరాలు సమర్పిం చేవారు. ఇలా చేయడం వల్ల దళారులు దరఖాస్తులను అమ్ముకోవడం వంటివి జరిగేవి. నిరక్షరాస్యుల నుంచి దరఖాస్తులు పూర్తి చేసినందు కు ఎంతో కొంత మొత్తం వీరు తీసుకునేవారు. తెల్ల కాగితం నిబంధనతో ఈ పరిస్థితి మారనుంది. దరఖాస్తు వివరాలను సమగ్ర సర్వే వివరాలతో సరిపోల్చడంతో పాటు క్షేత్ర పరిశీలన చేసిన అనంతరమే అర్హులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు సమాచారం. -
పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి
కలెక్టర్ కిషన్ సుబేదారి : ఆహార భద్రత (రేషన్) కార్డుతో పాటు సామాజిక పింఛన్లు, ఫాస్ట్ పథకం కింద ఆర్థిక సాయం కోసం ఈనెల 15వ తేదీలోగా దరఖా స్తు చేసుకోవాలని కలెక్టర్ జి.కిషన్ సూచించా రు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు, సామాజిక పింఛన్లు పొందుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక ఫారాలు ఉండవని, తెల్లకాగితంపై పూర్తి వివరాలు, ఏ పథకం కింద ఇస్తున్నారో రాస్తే సరిపోతుందని తెలిపారు. సెలవు దినాల్లోనూ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తారని వివరించారు. ఆహార భద్రత కార్డు, పింఛన్లకు గ్రామాల్లోనే.. ఆహార భద్రత (రేషన్) కార్డుతోపాటు సామాజిక పింఛన్ల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు వారి గ్రామాల్లోనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కిషన్ సూచించారు. ఆహార భద్రత కార్డు, పింఛన్ల కోసం గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు అందజేయాలని, వచ్చిన దరఖాస్తులను ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పరిశీలిస్తారని తెలిపారు. ఇక విద్యార్థులు ఫాస్ట్ పథకం కింద ఆర్థిక సాయం, కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా, ఆహార భద్రత కార్డు, సామాజిక పింఛన్ల కోసం వరంగల్ నగర ప్రజలు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, డీఆర్వో వీఎల్.సురేంద్రకరణ్, సమాచార పౌర సం బంధాల శాఖ ఏడీ డీఎస్.జగన్, డీడీ బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి
కలెక్టర్ కిషన్ ఘనంగా ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం’ ఎంజీఎం : సమాజంలోని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కలెక్టర్ కిషన్ అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవా న్ని పురస్కరించుకుని బుధవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హాల్లో జిల్లా ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత వివిధ కళాశాల విద్యార్థు లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కిషన్ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడారు. రక్తదానం, అవయవదానాన్ని ప్రజలందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రక్త సేకరణ లక్ష్యంలో జిల్లాలో గత ఏడాది 99 శాతం సాధించామని, ఈసారి కూడా 27 వేల యూనిట్ల లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. రక్త సేకరణకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీ యమన్నారు. అదనపు సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రక్తదానంపై విద్యార్థులు, యువకుల కు అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ నాగేశ్వర్రావు మాట్లాడుతూ రక్తసేకరణలో ఎంజీఎం ఆస్పత్రి రాష్ట్రంలో ఆరుసార్లు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరాం అధ్యక్షతన జరిగిన సదస్సులో నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ మనోరంజన్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సురేష్‌లాల్, కేంద్ర సాహిత్య అవా ర్డు గ్రహీత అంపశయ్య నవీన్ పాల్గొన్నారు. సదస్సు అనంతరం 20 నుంచి 85 సార్లు రక్తదానం చేసి న వారికి కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు. అలాగే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అంపశయ్య నవీన్‌ను కలెక్టర్ సన్మానించారు. -
‘ప్రణాళిక’ కోసం రూ.32.47 కోట్లు
హన్మకొండ అర్బన్ : మన ఊరు-మన ప్రణాళిక అమలు కోసం రూ.32.47 కోట్లనిధులు మంజూరయ్యూయని కలెక్టర్ కిషన్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రణాళికల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనాభా ఆధారంగా నిధులు మంజూరయ్యూయని పేర్కొన్నారు. మంజూరైన నిధుల్లో 50 శాతం పంచాయతీలు, 30 శాతం మండల పరిషత్‌లు, 20 శాతం జిల్లా అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా.. ఆ మేరకు కేటాయింపులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తాగునీరు, కిచెన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, కార్పొరేషన్లో విలీనమైన 42 గ్రామాల్లో లింకు రోడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, తండాల్లో విద్యుత్ సౌకర్యం, వీధిదీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లు, సోషల్ వెల్ఫేర్ డీడీ రోశన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 26న పర్యాటక శాఖ ప్యాకేజీ టూర్ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఈనెల 26న ప్యాకేజీ టూర్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక శాఖ ప్యాకేజీ టూర్లో భాగంగా రామప్ప, లక్నవరం, ఖిలావరంగల్‌లో సౌండ్‌అండ్ లైట్స్ షో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 25వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటలోపు 9392445721, 9849338854, 9866919131 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రత్యేక సదస్సు, 25 నుంచి 27 వరకు పబ్లిక్‌గార్డెన్‌లోని టౌన్హాల్లో పర్యాటక ప్రాంతాల ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందని కలెక్టర్ కిషన్ తెలిపారు. -
పనులు పూర్తిచేయని సంస్థలపై చర్యలు తీసుకోవాలి
ఐటీడీఏ అధికారులకు కలెక్టర్ ఆదేశం హన్మకొండ అర్బన్ : సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయని సంస్థలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కిషన్ ఆదేశించారు. 2011-12, 2012-13 సంవత్సరం ఐఏపీ పనుల పురోగతిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఆయన ఐటీడీఏ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంట్రిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద చేపట్టే పనుల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటి వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. ఐఏపీ పనుల్లో 65 శాతం గిరిజన ప్రాంతాల్లో వినియోగించాల్సి ఉండగా... జిల్లాలో 85 శాతం వినియోగిస్తున్నామని చెప్పారు. ఏటూరునాగారం పరిధిలోని అన్ని పాఠశాలల్లో,వసతి గృహాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించి ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి, విద్యార్థులకు సురక్షిత మంచి నీటిని అందించాలన్నారు. వెంటిలేటర్స్‌తో కూడిన అంబులెన్స్‌లు కొనుగోలు చేయాలని, ఇందుకోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీలకు ఎల్ఈడీ లైట్లు సరఫరా చేసి, తద్వారా విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, సీపీఓ బీఆర్‌రావు, ఇతర అధికారుల పాల్గొన్నారు. -
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి
కలెక్టర్‌కు టీయూడబ్ల్యూజే వినతి సుబేదారి : జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని ఇండియన్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ) అనుబంధ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నాయకులు బుధవారం కలెక్టర్ జి.కిషన్‌ను కోరారు. బుధవారం కలెక్టర్ కిషన్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు పిన్నా శివకుమార్ మాట్లాడారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేశారని అన్నారు. అలాగే వరంగల్ జిల్లాలో కూడా జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారన్నారు. జిల్లా కేంద్రంలో పాటు వివిధ మండలాల్లో సుమారుగా 800 మంది జర్నలిస్టుల పిల్లలు ఇందుకు అర్హులని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వీరికి ఉచిత విద్యను అందజేయాలని వారు కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ జి. కిషన్ స్పందిస్తూ రంగారెడ్డి జిల్లాలో జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను పరిశీలించి చర్యలు తీసుకుంటానని, జిల్లా విద్యాశాఖాధికారికి ఈ విషయమై ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఐజేయూ నాయకుడు దాసరి కృష్ణారెడ్డి, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి విఠల్, తోట సుధాకర్, జిల్లా నాయకులు కంకణాల సంతోష్, సదాశివుడు, ఎండీ.వాజిద్, గోకారపు శ్యాం, బి.సునిల్‌రెడ్డి, నవీన్, ప్రదీప్ పాల్గొన్నారు. -
సిబ్బంది కొరతే శాపమా?
కేఎంసీలో సీట్ల కొనసాగింపునకు ఎంసీఐ ససేమిరా కలెక్టర్ లేఖ రాసినా...స్పందించని గత ప్రభుత్వం పునఃపరిశీలనపై జిల్లా వాసుల ఆశలు డిప్యూటీ సీఎం స్పందించాలని వినతి ఎంజీఎం : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)తో పాటు అనుబంధ టీచింగ్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యసిబ్బంది కొరతే.. కేఎంసీలో 50 సీట్ల రద్దు నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. కేఎంసీ, ఎంజీఎంలో వైద్య సిబ్బంది కొరత, పరికరాల లేమిపై ‘సాక్షి’ దినపత్రికలో గతంలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై స్పందిం చిన జిల్లా కలెక్టర్ కిషన్ స్పందించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైద్యసిబ్బంది నియమించాలని కోరుతూ లేఖ రాసినా ఎవరూ పట్టించుకోలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) అధికారులు కేఎంసీలో గత నెల 9, 10వ తేదీలోల నిర్వహించిన తనిఖీల సందర్భంగా పలు లోపాలను గుర్తించారు. అనంతరం వారు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా సిబ్బంది కొరత విషయాన్ని పేర్కొనడంతో కేఎంసీలోని యాభై సీట్లు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. 54 మంది వైద్యుల కొరత కాకతీయ మెడికల్ కళాశాలతో పాటు ఎంజీఎం ఆస్పత్రిలో మొత్తం వివిధ విభాగాల్లో 266 మంది వైద్యులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే, కేవలం 212 మంది వైద్యులే ఉండగా.. మిగతా 54 మంది వైద్యులను నియమించాలని స్వయంగా కలెక్టర్ కిషన్ మూడు నెలల క్రితం లేఖ రాశారు. 17 ప్రొఫెసర్ పోస్టులు, 04 అసోసియేట్ ప్రొఫెసర్లు పోస్టులతో పాటు 30 అసిస్టింట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా, మరికొన్నింటిని కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీంతో ఎంసీఐ బృందం కేఎంసీ కళాశాలలో 5 శాతం సిబ్బంది కొరత ఉందని నివేదికలో పేర్కొంది. పత్తా లేని సూపర్ స్పెషాలిటీ పోస్టులు 1956లో 80 పడకలతో స్థాపించిన ఎంజీఎం ఆస్పత్రిని 1976 ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుని 690 పడకలుగా అభివృద్ధి చేసి కాకతీయ మెడికల్ కళాశాలకు అనుసంధానం చేసింది. అనంతరం 2005లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి వేయి పడకల ఆస్పత్రిగా ఎంజీఎంను అప్‌గ్రేడ్ చేస్తూ సూపర్‌స్పెషాలిటీ సేవలకు నాంది పలికారు. కానీ ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలకు సంబంధించి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో అటు వైద్యవిద్యార్థులతో పాటు ఇటు రోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. సూపర్‌స్పెషాలిటీ సేవలైనా న్యూరాలజీ, ఎండ్రోక్రైనాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరోసర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ వంటి విభాగాల్లో నెప్రాలజీ, యూరాలజీ డిపార్టుమెంట్లలో ఒక్కో ప్రొఫెసర్ పోస్టు తప్ప మిగతావన్నీ ఖాళీ గానే ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు డీఎంఈ పుట్ట శ్రీనివాస్ సైతం ఇటీవల నివేదిక సమర్పించారు. డిప్యూటీ సీఎం చొరవ కోసం ఎదురుచూపు వరంగల్‌లోని కేఎంసీతో పాటు టీచింగ్ ఆస్పత్రిగా ఉన్న ఎంజీ ఎంలో వెంటనే సిబ్బంది నియామకాలు చేపడితేనే కేఎంసీలో సీట్లు రద్దయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. దీనిపై జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య చొర చూపాలని.. ఆ తర్వాత ఎంసీఐ బృందం పునఃపరిశీలన జరిగితే తప్ప సీట్లు దక్కవని వైద్యులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్, డెరైక్టర్ పబ్లిక్ హెల్త్ ద్వారా కేఎంసీలో సిబ్బంది కొరతను తీర్చి మెడికల్ సీట్లను కాపాడాల్సిన బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ఓరుగల్లు ప్రాంత విద్యార్థులు కోరుతున్నారు. -
బాలల హక్కులను పరిరక్షించాలి
నిబంధనలకు లోబడే ఎన్జీఓలు పనిచేయాలి అవగాహన సదస్సులో కలెక్టర్ కిషన్ జిల్లా పరిషత్ : అన్ని వర్గాల సమష్టి కృషితోనే బాలల హక్కుల రక్షణ సాధ్యమని కలెక్టర్ జి.కిషన్ అభిప్రాయపడ్డారు. బాలల హక్కుల కమిషన్ మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జెడ్పీలో స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓలు)ల ప్రతినిధులు, ప్రభు త్వ శాఖల అధికారులకు ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కులను పరిరక్షించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించకుండా సేవలు అందించాలన్నారు. జిల్లాలో 162 స్వచ్ఛంద సంస్థలుండగా.. వాటిలో 22 సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వివరించారు. మిగిలిన వాటి ని తనిఖీలు చేయాల్సి ఉందన్నారు. పేద, అనాథ పిల్లల కోసం మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. మూడో తరగతి నుంచి పోస్ట్‌మెట్రిక్ వరకు ఉచితంగా విద్య, వసతి సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తున్న విషయాలను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గుర్తుపెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. లక్ష్యాలను సాధించలేకపోతున్నాం.. 2011లో జాతీయ బాలల పరిరక్షణ కమిషన్, 2104 ఫిబ్రవరి 2న రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ ఏర్పడ్డాయని, ఇవి బాలల కోసం పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయాయని కమిషన్ సభ్యుడు అచ్యుతరావు అభిప్రాయపడ్డారు. బాలల రక్షణ కోసం పలు శాఖలు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ శాఖలకు పరిమితులుంటాయని, అదే స్వచ్ఛంద సంస్థలకు విస్తృతంగా పనిచేసే అవకాశాలుంటాయన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించామని ఆయన వివరించారు. అధికారులు, ఎన్జీఓలకు మధ్య సమన్వయం లేదన్న విషయాలను గుర్తించామన్నారు. చిన్నపిల్లలకు ఓటు హక్కు ఉంటే సకల సౌకర్యాలు సమకూరేవని ఆయన పేర్కొన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్రంలో ఏర్పాటైందని అచ్యుతరావు వివరించారు. ఐఏఎస్ అధికారి సుజాతారావు చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో కమిషన్ ఏర్పాటైందని జిల్లాకు చెందిన కమిషన్ సభ్యురాలు మమతారఘువీర్ తెలిపారు. తమ కమిషన్ సభ్యులు 24 గంటలు ఫోన్లో అందుబాటులో ఉంటారని, బాలలు ఎలాంటి ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. హక్కులపై అవగాహన కల్పించాలి.. బాలల హక్కులపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఇలాంటి అవగాహన సదస్సులు పాఠశాలల్లో నిర్వహిస్తే ప్ర యోజనకరంగా ఉంటుందని గీసుకొండ మండలం కొమ్మా ల గ్రామానికి చెందిన విద్యార్థిని సునీత కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు కోసం ప్రయత్నించినా ఎవరు సహకారం అందించలేదన్నారు. చి వరకు మరికొంత మందితో కలిసి కొన్ని పుస్తకాలు కొనుగో లు చేసి గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నామన్నారు. బాల ల కోసం పనిచేస్తున్న కమిషన్, స్వచ్ఛంద సంస్థల్లో బాలల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పుడే బాలలకు సరైన రక్షణ ఉంటుందని తెలిపా రు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గాదె ఇన్నయ్య, శ్రీనివా స్, ఓంకార్, డీఈఓ విజయ్‌కుమార్, డీఎంహెచ్ఓ సాంబశి వరావు, కార్మికశాఖ అధికారి, ఓఎస్డీ నాగరాజు బాలల కోసం చేస్తున్న పనులను వివరించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు బాలరాజు, మురళీధర్‌రెడ్డి, రహీమొద్దీన్, అదనపు జేసీ కృష్ణారెడ్డి, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఐసీడీఎస్ పీఓ కృష్ణజ్యోతి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అనితారెడ్డి, డీసీపీఓ వెంకటరమణ పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఓయూ సెట్
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓయూ సెట్-2014 పరీక్షలు ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను హైదరాబాద్ నగరంలోనే 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్ల్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ శివరాజ్, జాయింట్ డెరైక్టర్ కిషన్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అదనంగా ఒక పాస్ ఫొటోను హాల్‌టిక్కెట్‌పై అంటించి ఫొటోపై సంతకం చేసి ఇవ్వాలని సూచించారు. ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు ప్రతి రోజు మూడు చొప్పున ఉదయం 9.30 నుంచి 11 గంటలు, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 15 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తామని తెలిపారు. -
కాళోజీ, జయశంకర్ కలలు సాకారం చేద్దాం
రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోర ణానికి చోటుదక్కడం జిల్లాకు గర్వకారణం అభివృద్ధిలో అందరి సహకారం అవసరం కీర్తి స్థూపం మన బాధ్యతను పెంచింది అవతరణ వేడుకల్లో కలెక్టర్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : స్వరాష్ట్ర ఏర్పాటు.. అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి అమరులైన ప్రజాకవి కాళోజీ నారాయణరావు, ఆచా ర్య కొత్తపల్లి జయశంకర్‌ల ఆశయాలు సాధించేందుకు ప్రతిఒక్కరూ అంకిత భా వంతో కృషిచేయాలని కలెక్టర్ జి.కిషన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 36 లక్షల మంది ప్రజలకు రాష్ట్ర ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధికారిక ముద్రలో కాకతీయుల కళాతోరణంకు చోటుదక్కడం అందరికీ గర్వకారణమన్నారు. ఓరుగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించిన కీర్తి స్థూపం మనపై మరింత భారం పెంచిందని కలెక్టర్ గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించా రు. అంద్శైరాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. సభికులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. సమరయోధులకు సన్మానం.. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమర యోధులను శాలువాలతో కలెక్టర్ సన్మానించారు. ఇటీవల టెన్త్‌లో పదికి పది జీపీఎస్ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్ ప్రశంస పత్రాలు అంద జేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమలు ఆహుతులను అలరించాయి. నూతన రాష్ట్ర ప్రచార సాహిత్యాన్ని వేదికపై కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ పౌసుమి బసు, కమిషనర్ సువర్ణపాండాదాస్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, ఏజేసీ కృష్ణారెడ్డి, డీఆర్వో సురేందర్‌కరణ్, సమాచార శాఖ డీడీ బాలగంగాధర్‌తిలక్, ఇతర ఉన్నతాధికారులు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వల్సపైడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
తెలంఘన సంబురం
అర్ధరాత్రి ఆవిష్కృతమైన రాష్ట్రం ఉద్విగ్నభరితంగా ఆవిర్భావ వేడుకలు సబ్బండవర్ణాల జనజాతరల హోరు వరంగల్, న్యూస్‌లైన్ : కళ్లెదుట ఆవిష్కృతమైన తెలంగాణ.. గుండెల్లో అమరుల జ్ఞాపకాలు.. ఆకాశమే హద్దుగా సాగిన జై తెలంగాణ నినాదాలహోరు మధ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆదివారం అర్ధరాత్రి పురుడుపోసుకున్నది. 60 యేళ్ల తం డ్లాట, 120మంది అమరవీరుల త్యాగాలఫలం సాక్షిగా ఓరుగల్లు జనం రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో ఓలలాడారు. జనజాతరలు పల్లే పట్నం తేడాలేకుండా జిల్లా అంతటా జనజాతరలై సాగాయి. ఓరుగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లాకు ఎదురుగా ఏర్పాటు చేసిన కీర్తి స్థూపం ఉద్యమ చరిత్రలో నిలిచిపోయింది. కలెక్టర్ కిషన్ ఆధ్వర్యంలో కీర్తి స్థూపం ఆవిష్కరించారు. కళాకారుల ధూంధాం, కార్నివాల్ తో జాతరను తలపించింది. ఉద్యోగ, రాజకీయ ప్రతినిధులతోపాటు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పట్నంలో కలిసికట్టుగా.. ఎన్నికల జాతర ముగిసిన తర్వాత అన్ని వర్గాలు మరోసారి సమూహమై సాగారు. ఆర్తి, ఆవేదన, ఆకాంక్షను చాటిచెప్పేందుకు కడలి తరంగాల్లా కదిలివచ్చారు. ముందుగానే సన్నద్ధమై న విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, యువజను లు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, కార్మికులు, జర్నలిస్టులు సబ్బండవర్ణాల సకలజనులు పోరు వారసులై సాగివచ్చారు. జిల్లా కేంద్రమైన హన్మకొండలో చౌరస్తా, అశోకసెంటర్, అంబేద్కర్ సెంటర్, కాళోజీ సెంటర్, అమరవీరుల సెంటర్, కలెక్టరేట్ పరిసరాలు, నిట్ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. కాకతీయ యూని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు పోరుజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వరంగల్ ఎంజీ ఎం సెంటర్, పోచమ్మమైదాన్, చౌరస్తా, ఖిలావరంగల్, రంగశాయిపేట సెంటర్లలో ప్రజ లు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. కోట జనసంద్రాన్ని తలపించింది. ఎంజీఎం సెంటర్ నుంచి కోట వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కాగడాల ర్యాలీ నిర్వహిం చారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమా ల్లో టీజేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ సంఘాలు కొవ్వత్తులతో ర్యాలీలు నిర్వహించి అమరుల కు నివాళులర్పించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీజేపీ, టీడీపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ తదితర రాజకీయ పార్టీలన్నీ ఉత్సవాల్లో భాగస్వామ్యమయ్యాయి. కొత్త రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పనిలో పనిగా నూతన ఎమ్మెల్యేలు, ఎంపీల స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పల్లెల్లో జట్లుగా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, ములు గు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, తొర్రూరు, వర్ధన్నపేట, హసన్‌పర్తి, ఆత్మకూరు తదితర సెంటర్లతోపాటు పల్లెపల్లెనా, ఇంటింటా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కనులపండువగా జరిగా యి. అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అమరవీరుల కుటుం బాలను గుండెలకు హత్తుకున్నారు. పరకాల అమరధామం వద్ద నివాళులు అర్పించారు. దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. కులం, మతం అనే తేడా లేకుండా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. కళాకారుల ధూంధాంలతో జిల్లాలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కన్పించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కరెంట్ పంచాయితీ
పేరుకుపోయిన గ్రామపంచాయతీల విద్యుత్ బకాయిలు రూ.58 కోట్లు చెల్లించాలని నోటీసులు కలెక్టర్ వద్దకు చేరిన పెండింగ్ లొల్లి బిల్లులపై కిషన్ అనుమానాలు రీడింగ్‌ల వారీగా సమాచారం ఇవ్వాలని సూచన అన్నీ ఉన్నాయంటూ.. కనెక్షన్ల తొలగింపునకు సిద్ధమైన కరెంటోళ్లు హన్మకొండ, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీ కరెంట్ బిల్లుల వ్యవహారం రెండు శాఖల్లో ప్రచ్ఛన్న యుద్ధానికి తెర లేపింది. జిల్లాలోని గ్రామపంచాయతీలు రూ.58 కోట్ల విద్యుత్ బిల్లులు బాకీ పడ్డాయని... వెంటనే వీటిని చెల్లించాలని పంచాయతీ విభాగం అధికారులకు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. మూడు విడతల్లో విద్యుత్ బకాయిలు చెల్లిస్తామని పంచాయతీ విభాగం అధికారు లతోపాటు ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందని... ఇంతవరకూ ఒక్క రూపాయి ఇవ్వలేదని మూడురోజుల క్రితం విద్యుత్ అధికారులు కలెక్టర్ కిషన్‌ను కలిసి నివేదిక అందజేశారు. అయితే.. విద్యుత్ బిల్లులపై కలెక్టర్ అనుమానాలు వ్యక్తం చేశారు. పలు అంశాలను లేఖలో పొందుపరిచి వారికి అందజేశారు. గ్రామాల్లో వీధి దీపాలకు కనెక్షన్లు లేవని... మీటర్లు ఎక్కడా పెట్టలేదని... కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు లేకున్నా లక్షల రూపాయల బిల్లులు వేశారని... సగటున లెక్కలేసుకుంటూ బిల్లులు ఎలా వేస్తారంటూ అందులో ప్రశ్నించారు. దీంతో డిసెం బర్ నుంచి ఇస్తామంటూ పెండింగ్ పెట్టిన పంచాయతీ బిల్లుల లొల్లి మళ్లీ మొదలైంది. 2009 నుంచి పెండింగ్ జిల్లాలోని 944 గ్రామ పంచాయతీల్లో 2009 నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. పల్లెలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జీఓ నంబర్ 80 విడుదల చేశారు. పంచాయతీలకు విద్యుత్ బిల్లులు మినహాయించాలని ఇందులో పేర్కొన్నారు. దీంతో అప్పటివరకు పంచాయతీల నిధుల నుంచి చెల్లించిన బిల్లులకు బ్రేక్ పడింది. ఆ తర్వాత 2011లో పంచాయతీల నుంచి బిల్లులు రాకపోవడం, ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో గ్రామపంచాయతీలకు కరెంట్ సరఫరా చేయమని విద్యుత్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో అప్పటి కిరణ్ సర్కారు పాత బిల్లులిస్తామని, పంచాయతీల బిల్లులు భరిస్తామని హామీ ఇచ్చారు. కానీ... 2013 వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఫలితంగా జిల్లాలోని పంచాయతీలకు సంబంధించి విద్యుత్ బిల్లుల బకారుులు రూ.58 కోట్లకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో బిల్లుల వసూళ్లకు విద్యుత్ శాఖ ఒత్తిడి పెంచింది. తాగునీటి పథకాలు, వీధిలైట్లకు సరఫరా కట్ చేసింది. అప్పుడు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు పంచాయతీల కరెంట్ బిల్లులు భారంగా మారాయి. పంచాయతీల ఖాతాల్లో రూపాయి లేకపోవడంతో, బడ్జెట్లో బిల్లులు చెల్లించే అవకాశం లేకపోవడంతో కలెక్టర్ కిషన్‌కు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీలకు కరెంట్ కట్ చేయొద్దని, విడతల వారీగా విద్యుత్ బిల్లులు చెల్లించే విషయాన్ని పరిశీలిస్తామని విద్యుత్ అధికారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ అధికారులు దీన్ని ఆసరాగా చేసుకుని బిల్లుల వసూలుకు సంబంధించి ఇటీవల కలెక్టర్‌ను కలిసి ఒత్తిడి తీసుకొచ్చారు. విద్యుత్ బిల్లులు ఇవ్వకుంటే కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఒకింత అసహనానికి గురైన కలెక్టర్ వారితో కటువుగానే మాట్లాడినట్లు తెలిసింది. మీటర్లే లేవు.. బిల్లు ఎట్ల వేశారు.. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు మీటర్లు లేవని... అలాంటప్పుడు బిల్లులు ఎట్ల వేశారని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. స్తంభాలు లేని ఊళ్లకు కూడా లక్షల్లో బిల్లు వేశారని నిలదీసినట్లు సమాచారం. గ్రామాలవారీగా పంచాయతీలు వినియోగించుకున్న విద్యుత్ బిల్లులను రీడింగ్‌ల వారీగా ఇవ్వాలని లేఖ అందజేశారు. దీనికి విద్యుత్ శాఖ అధికారులు సమాధానమిచ్చారు. ప్రతి గ్రామంలో వినియోగించిన విద్యుత్‌కు రీడింగ్ లెక్కలు ఉన్నాయని కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అరుుతే కలెక్టర్ కోరినట్లు రీడింగ్‌ల వారీగా మాత్రం ఇవ్వలేదు. ఈ క్రమంలో ఖజానాలో రూపాయి లేదని, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు మరింత సమయం కావాలని విద్యుత్ శాఖకు పంచాయతీ రాజ్ శాఖ లేఖ రాసింది. కానీ... బిల్లుల కోసం కనెక్షన్లు తొలగించేందుకు విద్యుత్ అధికారులు సిద్ధమవుతున్నారు. -
జాన్ హెన్రీ కృషి మరువలేనిది
సుబేదారి, న్యూస్‌లైన్ : రెడ్‌క్రాస్ సంస్థలను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడంలో జాన్ హెన్రీ చేసిన కృషి మరువలేనిదని కలెక్టర్ కిషన్ అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ సుబేదారిలోని రెడ్‌క్రాస్ భవనం లో గురువారం ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ కిషన్ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్త సేకరణలో రాష్ట్రంలో నే జిల్లా రెండో స్థానంలో ఉందని, ఈ దఫా మొదటి స్థానం సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. రక్త సేకరణకు ఎన్జీఓ, స్వచ్ఛంద సంస్థలు శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన ఉద్యోగులు, వివిధ సంస్థలకు కలెక్టర్ సర్టిపికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర నాయకుడు డాక్టర్ విజ య్‌చందర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ రవీందర్రావు, కోశాధికారి నాగయ్య, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్ గౌడ్, కోశాధికారి రత్నాకర్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి జగన్మోహన్రావు పాల్గొన్నారు. కాగా, కలెక్టర్ కిషన్ స్వయంగా రక్తదానం చేసి ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ శిబిరంలో 240 మంది ఉద్యోగులు, అధికారులు 240 యూని ట్ల రక్తాన్ని దానం చేశారు. -
ఉజ్వల భవిష్యత్ కోసం ఓటేయండి
ఓటరు అవగాహన ర్యాలీలో కలెక్టర్ కిషన్ వరంగల్ చౌరస్తా, న్యూస్‌లైన్ : ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి.. ఉజ్వల భవిష్యత్ కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవడం అవసరం.. అందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్ పిలుపునిచ్చారు. వరంగల్ చౌరస్తాలో సోమవారం రోటరీ, ఇన్నర్‌వీల్, వాసవీ, వాసవీ వనితా క్లబ్‌ల ప్రతినిధులు, గోల్డెన్ త్రిశూల్, రిషి స్పోకెన్, శారదా పబ్లిక్ స్కూ ల్ అధ్యాపకులు, విద్యార్థులు చేపట్టిన ఓటరు అవగాహన ర్యాలీ ని ఆయన ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కేవలం 53 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఈ సారి ఓటింగ్ 80 శాతానికి పెంచడానికి ఓటరు చైతన్య ర్యాలీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో అక్షరాస్యులు అధికంగా ఉన్నా ఓటుకు దూరంగా ఉండటం సరి కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడంతోపాటు సుపరిపాలన కోసం ప్రతి ఒక్కరూ ఓటు ఆయుధాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ వందశాతానికి పెంచేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపా రు. ర్యాలీ జేపీఎన్ రోడ్డు మీదుగా పోచమ్మమైదాన్ వరకు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన మానవహారం కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ ఓటు అనే అస్త్రం సంధించి నిస్వార్థమైన నేతలను ఎన్నుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, కార్యక్రమ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యం లో జరిగిన ఈ ర్యాలీలో వరంగల్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు కె.రాజగోపాల్, సెక్రటరీ తోట వైద్యనాథ్, వాసవీ క్లబ్ అధ్యక్షుడు సత్యనారయణ, కార్యదర్శి టి.వాసుదేవులు, కోశాధికారి గాదె వాసుదేవ్, వెలిశాల ఆనంద్, ఐత గోపీనాథ్, వాసవీ వనితా క్లబ్ ప్రతినిధులు కళావతి, విజలక్ష్మి, గోల్డెన్ త్రిశూల్ కరస్పాండెంట్ డాక్టర్ కె.చంద్రశేఖర్ ఆర్యా, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ హరి రమాదేవి పాల్గొన్నారు. ర్యాలీలో గోల్డెన్ త్రిశూల్ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మువ్వన్నెల రంగుల షర్టులు ధరించిన చిన్నారులు ‘ఫ్లీజ్ ప్రతి ఒక్కరూ ఓటేయండి’ అంటూ బుల్లిబుల్లి మాటలతో ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వారిని అభినందించారు. -
‘స్థానిక’ నోటిఫికేషన్ జారీ
50 జెడ్పీటీసీ... 705 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు తొలి రోజు మందకొడిగా నామినేషన్ల దాఖలు జెడ్పీటీసీ స్థానాలకు 3.. ఎంపీటీసీ స్థానాలకు 22 జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 50 జెడ్పీటీ సీ, 705 ఎంపీటీసీ స్థానాలకు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. జెడ్పీటీసీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, డీపీఓ ఈఎస్.నాయక్... ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు ఆయా మండలాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆదివారం రాత్రి వరకు మంగపేట మండలంలో ఎన్నికలు జరుపాలా...వద్దా అన్న అంశంపై జిల్లా అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్చర్చించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆయన కోరినట్లు సమాచారం. ఎస్ఈసీ నుంచి అనుమతి రావడంతో జిల్లాలోని మొత్తం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీకాగా... మొదటి రోజు సాయంత్రం వరకు జెడ్పీ కార్యాలయానికి నామినేషన్ వేసేందుకు జెడ్పీటీసీ అభ్యర్థులు ఎవరూ రాలేదు. నామినేషన్ దాఖలు సమయం ముగియనున్న సమయంలో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జెడ్పీటీసీ స్థానాలకు 3 నామినేషన్లు తాడ్వాయి మండల జెడ్పీటీసీ స్థానానికి పోటి చేసేందుకు రామసహాయం రజిత నామినేషన్ దా ఖలు చేశారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సతీమణీ అయిన రజిత టీఆర్ఎస్ నుంచి పోటి చేస్తున్నట్లు నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. ఏటూరునాగారానికి చెందిన తుమ్మ అనితారెడ్డి ఏటూరునాగారం జెడ్పీటీసీగా పోటీ చేసేం దుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈమె టీఆర్ఎస్ మండల పార్టీ నాయకుడు తుమ్మ మల్లారెడ్డి సతీమణీ. గూడూరు మండలానికి చెందిన మేకల రవీందర్‌యాదవ్ జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈయన వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్లో పేర్కొన్నారు. ఎంపీటీసీ స్థానాలకు 22 నామినేషన్లు ఎంపీటీసీ నామినేషన్లు తొలిరోజు మందకొడిగా దాఖలయ్యాయి. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రా ల్లో ఏర్పాటు చేసిన స్వీకరణ కేంద్రాల్లో 22 నామినేషన్లు దాఖలైయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నర్సంపేట డివిజన్లో ఒకరు, వరంగల్, జనగామ డివిజన్లో నలుగురు చొప్పున, ములుగు డివిజన్ లో ఎనిమిది మంది, మహబూబాబాద్ డివిజన్లో ఐదుగురు నామినేషన్లు వేశారు. కాగా, జెడ్పీ వద్ద సీఐలు కిరణ్‌కుమార్, పృథ్వీధర్‌రావు, ఎస్సై విజ్ఞాన్‌రావు బందోబస్తు నిర్వహించారు. -
అందరి సహకారంతోనే మేడారం జాతర సక్సెస్
రూ.100 కోట్లు ఖర్చు చేశాం.. భవిష్యత్‌లో శాశ్వత పనులు చేపడతాం కలెక్టర్ కిషన్ హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేయడం వల్ల మేడారం జాతర సక్సెస్ అయిందని జిల్లా కలెక్టర్ కిషన్ అన్నారు. నగర పరిధిలోని చింతగట్టు అతిథి గృహంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర సక్సెస్‌పై శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో కలెక్టర్ మాట్లాడుతూ మేడారం జాతర పనుల కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతరలో ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ పనితీరును అభినందించారు. కోట్లాది మంది హాజరైన ఈ వేడుకల్లో అందరికీ తాగునీరు. బూత్రూంలను ఏర్పాటు చేసి... ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. మేడారంలో భవిష్యత్‌లో జాతరలో శాశ్వత పనులు చేపడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉండేలా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం భారత్ అభియాన్ పథకం కింద రెండు లక్షల ఐఎస్ఎల్లు మార్చి నెలాఖరు వరకు పూర్తి చేయాలని చెప్పారు. వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి ఏర్పడకుండా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిలా పరిషత్ సీఇ వో ఆంజనేయులు మాట్లాడుతూ మేడారం జాతరను పురస్కరించుకుని ఆరునెలల ముందు నుంచే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ...అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేయడం వల్లే సక్సెస్ అయ్యామని వివరించారు. ఈ సందర్భంగా జాతరలో విధులు నిర్వహించిన ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ సురేష్‌కుమార్, ఈఈ శ్రీనివాస్‌రావు, రిటైర్డ్ జేడీ విద్యాసాగర్, లింగారవు, మహిపాల్, పులి ప్రభాకర్, శ్రీనివాస్‌రావు, రామ్మోహన్, గంగాధర్, తహసిల్దార్ ఎల్.కిశోర్‌కుమార్, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
పరీక్షకు హాజరుకానున్న 52,688 మంది అభ్యర్థులు 160 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ 2,200 మంది ఇన్విజిలేటర్ల నియూమకం కలెక్టర్ కిషన్ వెల్లడి జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : పంచాయతీరాజ్ శాఖలో ని పంచాయతీ సెక్రటరీ(గ్రూప్-4) పోస్టుల భర్తీ కో సం ఏపీపీఎస్సీ ఆదివారం నిర్వహిస్తున్న రాత పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. పరీక్ష నిర్వహణలో పాల్గొ నే అధికారులకు ఒక రోజు శిక్షణ కా ర్యక్రమం జిల్లా పరిషత్ కార్యాలయం లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ సెక్రటరీ పోస్టుల కోసం 52,688 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని, ఇందు కోసం జిల్లా కేంద్రంలో 160 పరీక్షా కేంద్రాల ను ఏర్పాటు చేశామన్నారు. 32 రూ ట్లుగా విభజించి ప్రతి రూట్‌కు ఒక లైజన్ ఆఫీసర్‌ను నియమించామని, ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక సూపరిం టెండెంట్, ఒక లైజన్ ఆఫీసర్ ఉంటారని వివరిం చారు. 2200 మంది ఇన్విజిలేటర్లను, 20 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. పరీక్ష కేం ద్రాలతో పాటు ప్ర శ్నాపత్రాల రవాణాకు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు, పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ కోత లేకుం డా చూడాలని ఎన్పీడీసీఎల్ అధికారులకు, కేంద్రాలకు బస్ సర్వీసుల సౌకర్యం కల్పిం చాలని ఆర్టీసీ అధికారులకు సూచించి నట్లు తెలిపారు. అవగాహన కల్పించాలి పరీక్ష రాసే అభ్యర్థులకు ఓఎంఆర్ షీ టలో హాల్‌టికెట్లు నింపడంపై అభ్య ర్థులకు ఇన్విజిలేటర్లు అవగాహన కల్పించాలని పరీక్షల సమన్వయ అధికారి, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు సూచించారు. ఓఎంఆర్ షీట్లు నింపిన తర్వాత డూప్లికేట్ తీసుకెళ్లేలా పరిశీ లన చేయాలన్నారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో 10శాతం మంది బార్ కోడిం గ్ తప్పుగా నింపడం వల్ల అభ్యర్థుల జవాబు పత్రాలు వాల్యుయేషన్ జరగలేదని ఏపీపీఎస్సీ గుర్తించిందన్నా రు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్ష కేంద్రాల్లో నమూ నా ఓఎంఆర్ షీట్లను అతికిస్తున్నామన్నారు. -
విద్యార్థులను తీర్చిదిద్దేది గురువులే
విద్య, ఆరోగ్యం రెండూ ముఖ్యమే మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చేయాలి పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత గురువులదేనని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ సూచించారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ఆదివారం జిల్లాలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, మోడల్ స్కూల్స్, కేజీబీ వీల స్పెషల్ ఆఫీసర్లు, ఐదో జోన్‌లోని జిల్లా విద్యాశాఖాధికారులు, డిప్యూటీ డీఈఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో విద్య, ఆరోగ్యం రెండూ ముఖ్యమేనని, ఇందులో విద్యను అతి ముఖ్యమైనదిగా భావిస్తానని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అర్థమయ్యే విధంగా బోధన చేయాలని పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులకు నాణ్యమైన విద్య అం దుతుందని, మరికొన్ని చోట్ల విద్యార్థులకు సరిగా చదవడం, రాయడం కూడా రావడం లేదని ఆమె వివరించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. కొందరు ఉపాధ్యాయులు విజ్ఞప్తులను పట్టుకుని విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగడం వల్ల విద్యార్థులకు జరిగే నష్టం అంతాఇంతా కాదన్నా రు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం సక్రమంగా అమలు కు కృషిచేయాలని ఆదేశించారు. కుకింగ్ ఏజెన్సీలు భోజనం తయారు చేసేటప్పుడు పరిశుభ్రతను పాటించటంలేదని వివరించారు. పాఠశాలల్లోని హెచ్ఎంలు ప్రతి నెల ఒక ఉపాధ్యాయుడిని ఇన్చార్జ్గా నియమించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించేలా చర్య తీసుకోవాలని కోరారు. దాతలు, తమ పరిధిలోని ప్రజాప్రతినిధుల సహకారంతో వారంలో అదనంగా మరో గుడ్డు కూడా విద్యార్థులకు అందించవచ్చని పేర్కొన్నారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు రాజీవ్ విద్యామిషన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ ద్వారా కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయని వెల్లడించారు. టెన్త్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తే హెచ్ఎంలు, డీఈఓలకు ప్రో త్సాహక బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఆత్మవిమర్శ చేసుకోవాలి : కలెక్టర్ కిషన్ గత ఏడాది టెన్త్ ఫలితాల్లో జిల్లాకు నాలుగో స్థానం వచ్చిం దని కలెక్టర్ కిషన్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు వచ్చినా తెలుగు సబ్జెక్టులో 637 మంది విద్యార్థులు ఫెయిలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పనితీరును సక్రమంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతృభాషలోనే ఫెయిల్ అయితే ఇక విద్యార్థుల పరిస్థితి ఏమిటని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కొందరు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్లు డీఈఓ పాఠశాలలను తనిఖీ చేసినప్పుడు వెల్లడైందని వివరించారు. దీనికి మీరేకాదు నేను కూడా బాధ్యుడేనని కలెక్టర్ చెప్పారు. ఉపాధ్యాయులు బాధ్యతలను విస్మరించి ఎప్పుడు హక్కుల కోస మే పనిచేస్తుంటారని, ఇప్పటికైనా 90 శాతం బాధ్యతలు నిర్వర్తించేలా కృషిచేయాలని కోరారు. టెన్త్ పరీక్షలు సమీపిస్తున్న దృష్ట్యా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే సాయంత్రం వేళ తాను భోజన వసతి కూడా ఏర్పాటు చేయించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఓరుగల్లు సేవాసమితి ట్రస్టు ద్వారా నిధుల ను అవసరమైతే విద్యార్థుల కోసం ఖర్చుచేస్తామని ఆయన వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్య, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, జిల్లా విద్యాశాఖాధికారులు డాక్టర్ ఎస్.విజయకుమార్, కె.లింగయ్య, రవీంద్రనాథ్‌రెడ్డి, భద్రాచలం ఏజెన్సీ డీఈఓ రాజేష్, ఆదిలాబాద్ ఇన్చార్జ్ డీఈఓ పీవీజే.రామారావు, డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, రేణుక, అబ్దుల్‌హై, కృష్ణమూర్తి, నరేందర్‌రెడ్డి, జయవీర్రావు, పి.వజ్రయ్యతో పాటు అన్ని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. మీలో ఎందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు? సమావేశానికి హాజ రైన హెచ్ఎంలు, విద్యాశాఖాధికారు లు ఎందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి స్తున్నారని కలెక్టర్ కిషన్ ప్రశ్నించగా ఇద్దరే చేతులెత్తారు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఉపాధ్యాయులు అర్బన్ ప్రాంతానికి వచ్చి తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించుకుంటున్నారని, ప్రభు త్వ పాఠశాలల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇకనైనా మీలో మార్పురావాలి, ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీ క్షల్లో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు. గుర్తింపులేని పాఠశాలలకు నోటీసులు ఇవ్వాలి గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీచేయాలని వాణీమోహన్ డీఈఓలను ఆదేశించారు. అంబేద్కర్ భవన్లో ఐదో జోన్‌లోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డీఈఓలు, డిప్యూటీ డీఈఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభానికి ముందుగానే గుర్తింపులేని పాఠశాల లు, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాల ల యాజమాన్యాలకు షోకాజ్ నోటీస్‌లు ఇవ్వాలని డీఈఓలను ఆదేశించారు. గుర్తింపులేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించ డం అనేక సమస్యలు వస్తున్నాయని వివరించారు. డిప్యూటీ డీఈఓలు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీచేసి మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలవుతుందా లేదా అనేది పరిశీలించాలన్నారు. డిప్యూటీ డీఈఓలకు ఇటీవలనే వాహనాలను కూడా సమకూర్చామని.. పాఠశాలలు, మోడల్ స్కూళ్ల తనిఖీలు ముమ్మురం చేయాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్య, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆది లాబాద్ జిల్లాల, భద్రాచలం ఏజెన్సీ డీఈఓలు డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్, రవీంధ్రనాథ్‌రెడ్డి, కె.లింగయ్య, పీవీజే.రామారావు, రాజేష్, డిప్యూటీ డీఈఓలు అబ్దుల్‌హై, డి.వాసంతి, రేణుక, నరేందర్‌రెడ్డి, జయవీర్రావు, పి.వజ్రయ్య పాల్గొన్నారు. నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి మోడల్ స్కూళ్లలో నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయాలని పాఠశాల విద్యాశాఖ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ బాధ్యులు కోరారు. ఈమేరకు డీఈ ఓ కార్యాలయానికి ఆదివారం వచ్చిన పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్ కు వారు వినతిపత్రం అందజేశారు. మినీస్టీరియల్ బాధ్యులు వేణుగోపాల్, ఫకృద్దీన్, ఉస్మా న్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే, మోడల్ స్కూళ్ల లో పనిచేస్తున్న పీజీటీ, టీజీటీ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్‌ను రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ రాష్ర్ట కమిషనర్ అండ్ డెరైక్టర్ వాణీమోహన్‌కు మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వీస్‌రూల్స్ లేక పోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు హెల్త్‌కార్డులు, పీఆర్సీ, మధ్యంతర భృతి ఇప్పించాలని కోరారు. తెలంగా ణ మోడల్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ బాధ్యు డు దామెర రాజేందర్ కూడా పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. -
ఉద్విగ్న భరిణెం
జనం చేరిన అమ్మ ప్రతిరూపం పులకించిన మేడారం.. ఉప్పొంగిన భక్తిభావం ఉదయం నుంచే.. సమ్మక్క రాక సందర్భంగా సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, పూజారులు దోబె పగడయ్య, సిద్దబోయిన సమ్మయ్య(తండ్రి పొట్టయ్య), సిద్దబోయిన సమ్మయ్య (తండ్రి దానయ్య), మాదిరి పుల్లయ్య, మాదిరి నారాయణ గురువారం మేడారంలోని సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే అడవికి వెళ్లి వనం(వెదురు) తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం 3.50 గంటలకు చిలకలగుట్టపైకి వెళ్లి పూజలు చేసి తల్లిని గద్దెలపైకి చేర్చారు. అడుగడుగునా నీరాజనాలు తల్లి సమ్మక్క గద్దెకు చేరుతుండగా భక్తులు అడుగడుగునా ఎదురుకోళ్లతో ఘనస్వాగతం పలికారు. గాలిలోకి కోళ్లు ఎగురవేస్తూ ఆహ్వానించారు. తల్లిపై ఒడి బియ్యం చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. దారిపొడవునా బారులుదీరి న భక్తులు తల్లిని ప్రత్యక్షంగా చూసేందుకు ఆ రాటపడ్డారు. అమ్మను కళ్లారా చూసి తరించా రు. యాటపోతులు, కోళ్లతో ఎదురెళ్లి బలిచ్చా రు. భక్తులు, శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. తల్లి నామస్మరణతో మేడారం హోరెత్తింది. థింసా నృత్యాలు అలరించాయి. పోలీసుల భారీ బందోబస్తు పోలీసుల భారీ బందోబస్తు మధ్య సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెకు చేర్చారు. సమ్మక్కను పూజారులు తీసుకుని వస్తుండగా రెండు రోప్‌పార్టీలు రక్షణ ఇచ్చాయి. రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు ఆధ్వర్యంలో డీఎస్పీ దక్షిణామూర్తి, సీఐలు దేవేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, ఇతర బలగాలు భద్రత చేపట్టాయి. అధికారుల ఘనస్వాగతం కలెక్టర్ కిషన్, రూరల్ ఎస్పీ కాళిదాసు, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క, ఊరట్టం సర్పంచ్ గడ్డం సంధ్యారాణి, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈఓ దూస రాజేశ్వర్‌రావు తల్లికి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 5.39కు ఏకే-47తో రూరల్ ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. గుట్ట దిగగానే 5.42 గంటలకు, గద్దెల ప్రాంగణానికి వస్తుండగా చిలకలగుట్ట రోడ్డుకు చేరిన సమయంలో, సాయంత్రం 5.55 గంటలకు మరోసారి కాల్పులు జరిపారు. గుట్టెక్కిన భక్తులు చిలకలగుట్ట నుంచి తల్లిని గద్దెలకు తీసుకెళ్లిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు చిలకలగుట్ట ఎక్కారు. పూజారుల పూజా విధానంపై ఆసక్తితో వారు గుట్ట ఎక్కినా అక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో కిందికి దిగారు. ఇక తల్లిపై వేసిన బియ్యాన్ని ఆమె వెళ్లిపోయిన తర్వాత భక్తులు సేకరించారు. అలాగే గుట్ట సమీపంలోని చెట్ల బెరడును కూడా తీసుకెళ్లారు. దేవతలను దర్శించుకున్న 30 లక్షల మంది తల్లీబిడ్డలు గద్దెలపై కొలువుదీరగానే సుమారు 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు గద్దెల వద్ద భక్తజన ప్రవాహం కొనసాగింది. అమ్మలకు ఇష్టమైన నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు కిక్కిరిసింది. మొత్తంగా ఇప్పటివరకు సుమారు 70లక్షలమంది అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
నిఘా నేత్రం
మేడారంలో వాచ్ టవర్ల ఏర్పాటు కొత్తగా ఆరు నిర్మాణం పూర్తి కావస్తున్న పనులు మేడారం, న్యూస్‌లైన్ : మేడారం మహా జాతరపై నిరంతరం నిఘా కొనగనుంది. ఇందులో భాగంగా ఈసారి అధికారులు వాచ్ టవర్స్(మంచెలు) ఏర్పాటు చేస్తున్నారు. జాతరకు కోటికి పైగా భక్తులు వస్తారన్న అంచనాతో.. పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కలెక్టర్ కిషన్ ప్రత్యేక చొరవతో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో వాచ్ టవర్స్ నిర్మిస్తున్నారు. లక్షలాది మంది భక్తుల కదలికలను గుర్తిస్తూ.. అంవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వాచ్ టవర్స్‌పై నుంచి అధికారులు పర్యవేక్షణ చేయనున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు ముమ్మరమయ్యాయి. సీసీ కెమెరాలను ఎల్సీడీలకు అనుసంధానం చేసుకుని అధికారులు జాతరను పర్యవేక్షిస్తారు. మేడారం పరిసరాల్లో రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి ఐదు టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మీడియా అభ్యర్థన మేరకు గద్దెల వద్ద ఉన్న వాచ్‌టవర్‌ను ఆనుకుని మరొకటి అదనంగా నిర్మిస్తున్నారు. దీంతో మొత్తం ఆరు టవర్స్ అవుతున్నాయి. ఒక్కో టవర్ నిర్మాణానికి *6.50 లక్షలు వెచ్చించారు. ఇదివరకు కేవలం గద్దెల వద్ద మాత్రమే మంచె ఉండగా దీనిపై ఉండి పర్యవేక్షణ చేయడం అధికారులకు కష్టంగా ఉండేది.. దీనికితోడు మీడియా కూడా తమ కవరేజీకి ఈ మంచెనే ఉపయోగించేది. దీంతో మరింత ఇబ్బందులు తలెత్తేవి. ఇది కేవలం గద్దెల వద్ద మాత్రమే భక్తుల రద్దీని పర్యవేక్షించే వీలుండేది. దీంతో లక్షల సంఖ్యలో భక్తులు విడిది చేసే జాతర పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణ అధికారులకు కష్టంగా ఉండేంది.. ఈక్రమంలో పర్యవేక్షణను సులువు చేసుకునేందుకు యంత్రాంగం ఈ సారి అదనపు వాచ్‌టవర్స్ ఏర్పాటుకు పూనుకుంది. వాచ్‌టవర్ పై భాగంలో అధికారులు ఉండి జాతరలోని భక్తుల కదలికలను చూసేందుకు అనువుగా ఉంటుంది. కింది భాగంలో అధికారులుండేందుకు గది కూడా నిర్మితమవుతుండడం మరింత సౌకర్యాంగా ఉంది. రద్దీగా ఉండే చోట్ల.. మేడారం జాతరలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆరుచోట్ల కొత్తగా వాచ్ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ముఖ్యంగా గద్దెల వద్ద అత్యంత జనసమర్థం ఉంటుంది. అందుకుగాను ఇక్కడ వీఐపీ ద్వారం వైపు గతంలో ఉన్న వాచ్ టవర్‌కు తోడు దాని పక్కనే మరొకటి నిర్మాణం చేస్తున్నారు. అదేవిధంగా గద్దెల వద్ద నుంచి బయటకు వెళ్లే ముఖద్వారం సమీపంలో మరొకటి ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల తదుపరి అత్యంత రద్దీ ప్రాంతమైన జంపన్నవాగు వద్ద, ఊరట్టం లోలెవల్ కాజ్వే సమీపంలో, ఆర్టీసీ బస్టాండ్ వద్ద, కొత్తూరు కాజ్వే సమీపంలో వాచ్ టవర్ల నిర్మాణం జరుగుతోంది. దాదాపుగా నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. -
ప్రాణాలు నిలపండి!
ఎంజీఎంలో వైద్య సిబ్బంది కొరత తీర్చండి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన 29 వైద్యుల పోస్టులు ఖాళీ.. పరికరాలున్నా.. అందని సేవలు మూడేళ్లుగా నిలిచిన గుండె శస్త్ర చికిత్సలు సాక్షిప్రతినిధి, వరంగల్ : మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంజీఎం) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సాక్షి పత్రిక ప్రచురించిన కథనాలపై కలెక్టర్ జి.కిషన్ స్పందించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించే ఎంజీఎంను చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశారు. ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిని కోరారు. వైద్య సేవల్లో అంతరాయంతో పత్రికల్లో వ్యతిరేక కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంజీఎం ఆస్పత్రిని 690 పడకల నుంచి వెయ్యి పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత వివిధ కేటగిరీల్లో కలిపి మంజూరైన 291 పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. పోస్టులు భర్తీ చేయకపోవడంతో వైద్య సేవలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. ఈ నెల 19న జరిగిన ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలోనూ వైద్యులు, వైద్య సిబ్బంది కొరతపైనే ప్రధానంగా చర్చ జరిగిందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేయాలని కోరారు. వైద్యులు లేక..మరణాలు ఎంజీఎంలో వైద్యుల కొరతతో రోగులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పేద వర్గాలకు సంజీవనిగా ఉండాల్సిన ఎంజీఎంలో వైద్య సేవల్లో లోపాలు ఉంటున్నాయి. ఎంజీఎంలో 47 మంది వైద్యులకు గాను.. ఇప్పుడు 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్డియాలజీ, న్యూరోసర్జన్, వాస్కిలర్సర్జన్, ఎండ్రొకనాలజిస్ట్లు, ఇతర సాధారణ వైద్యులు లేరు. పేద ప్రజలకు రోగం వస్తే నయంకాని పరిస్థితి ఉంది. అసలే తక్కువ మంది వైద్యులు ఉన్నారంటే.. వీరిలో కొందరు రాజకీయ పలుకుబడితో డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రేడియోథెరపీ, కృత్రిమ శ్వాస ఇచ్చి ప్రాణాలు నిలిపే వెంటిలేటర్లు, రక్త పరీక్షలు నిర్వహించే ఏబీజీ మిషన్ పని చేయకపోవడంతో సరైన వైద్య సేవలు అందడం లేదు. ప్రధానమైన కార్డియాలజీ(గుండె) విభాగం అధ్వానంగా ఉంది. పర్మినెంట్ కార్డియాలజీస్టును కేటాయించినా.. ఆయన డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. మూడేళ్లుగా గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై ఎంతో మంది క్షతగాత్రులు నిత్యం ఎంజీఎం ఆస్పత్రికి వస్తుంటారు. వీరికి వెంటనే వైద్యచికిత్సలు చేయాల్సి ఉంటుంది. తలకు గాయాలైన వారికి శస్త్ర చికిత్సలు చేయాలంటే న్యూరోసర్జన్ తప్పని సరిగా ఉండాల్సిందే. ఎంజీఎం ఆస్పత్రిలో న్యూరోసర్జన్ వైద్యుడు లేకపోవడంతో ఎంతో మంది రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. -
మరుగున పడ్డపనులు
మేడారం, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ... తెలంగాణ కుంభమేళాను తలపించే అతి పెద్ద గిరిజన జాతర... కోటిమందికి పైగా భక్తులు తరలివచ్చే మహాజాతర... అలాంటి ప్రతిష్టాత్మకమైన జనజాతరలో కనీస ఏర్పాట్లపై ఆర్డబ్ల్యూఎస్ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. కలెక్టర్ కిషన్ విధించిన డెడ్‌లైన్ జనవరి 31 ముంచుకొస్తున్నా.. మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు నత్తనడకన కొనసా...గుతూనే ఉన్నారుు. మేడారంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.2.50 కోట్లతో 10 వేల మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వచ్చే నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతరలో భక్తుల సౌకర్యార్థం ములుగు శివారు గట్టమ్మ ఆలయం మొదలుకుని మేడారం పరిసరాల వరకు బిట్లు బిట్లుగా చేసి నిర్మాణాలు చేస్తున్నారు. జాతరలో అభివృద్ధి పనులను దక్కించుకునే సమయంలో పలు దఫాలుగా చర్చలు జరుపుకుని వాటాలు పంచుకున్న పార్టీలు పనుల పురోగతిపై మాత్రం ఊసెత్తడం లేదు. దీనిపై అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. అనుభవం నేర్వని అధికారులు గత జాతరలో మరుగుదొడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా సాగింది. దీంతో భక్తులు అష్టకష్టాలు పడినా అధికారులు అనుభవ పాఠాలు నేర్వలేదు. దీనికి ఈ జాతరలో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులే తార్కాణంగా చెప్పొచ్చు. గత జాతరలో 8,800 మరుగుదొడ్లు నిర్మించారు. అయితే ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు వాటిని 10వేలకు పెంచారు. పనుల వద్ద ఎటువంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకు ఆయా పార్టీలకు ముందుగానే అధికార యంత్రాంగం సంకేతాలు ఇవ్వగా చర్చోపచర్చలు జరుపుకున్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్ 40, టీడీపీ 30, టీఆర్ఎస్ 30 శాతం పనుల ‘కంపు’ను పంచుకున్నాయి. ఇది జరిగి నెల రోజులు దాటినా పనుల్లో మాత్రం చురుకుదనం కారావడంలేదు. గతంలో జాతర రేపుమాపు అనే వరకూ పనులు చేయడంతో తొలిరోజే కంపు..కంపు అయిన పరిస్థితి తెలిసిందే. ముందస్తుగా పనుల పూర్తిపై వెంటబడని అధికార యంత్రాంగం డెడ్‌లైన్ దగ్గరపడ్డాక పరుగులు పెట్టించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో పనులు దక్కించుకున్న వారు అడ్డదిడ్డంగా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పలుచోట్ల కనీసం వాడకముందే మరుగుదొడ్లు కూలిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ అనుభవంతోనైనా ముందస్తు చర్యలు చేపడుతారనుకుంటే ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. బేస్మెంట్ దశలో... ములుగు గట్టమ్మ ఆలయం శివారు నుంచి మేడారం జంపన్నవాగు, కన్నెపల్లి, ఊరట్టం, నార్లాపూర్, రెడ్డిగూడెం, కాల్వపల్లి పరిసరాల్లో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. పలుచోట్ల పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఊరట్టం, మేడారం ఇంగ్లిష్ మీడియం, చిలకలగుట్ట తదితర చోట్ల బేస్మెంట్ దశకు వచ్చాయి. తూతూమంత్రంగా చేపడుతున్న పనుల కు సరిగా క్యూరింగ్ చేయడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో అవి కుంగిపోయి భక్తులకు నరకప్రాయంగా మారే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో నిర్మాణాలు చేపట్టడంతో అధికారుల పర్యవేక్షణ కూడా సరిగా లేని పరిస్థితి. పనులు త్వరగా పూర్తి చేస్తే మరుగుదొడ్ల బేసిన్లు ఎత్తుకుపోతారని నిర్మాణదారులు పేర్కొంటున్నారు. దీనిని సాకుగా చూపి పనుల్లో వేగం పూర్తిగా తగ్గించేశారు. అయితే పనులు దక్కించుకున్న వారు కూడా మమ అనిపించి నిధులు నొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. పేరుకే 10వేల మరుగుదొడ్ల సంఖ్య ఉందని, వీటిలో ఏడెనిమిది వేల మరుగుదొడ్లు చేపట్టి మిగతావి రికార్డుల్లో రాసుకుని పంపకాలు చేసుకుంటారన్న ఆరోపణలున్నాయి. గత జాతరలో నాసిరకానికి తోడు ఇలాంటి తతంగం జరిగిందని అప్పట్లో పనుల సందర్శనకు వచ్చిన ఆయా పార్టీల బృందాలే బాహాటంగా ఆరోపించాయి. అయితే ఆ మూడు పార్టీలు పనుల కంపును పంచుకున్నందున ఇప్పుడు అక్రమాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. భక్తుల మేలుకోరే అధికారులు ఈసారైనా కక్కుర్తి పనులకు మంగళం పాడాల్సిన అవసముంది. ఇప్పటికే జాతర సందడి నెలకొన్న క్రమంలో మరుగుదొడ్ల పనుల్లో వేగం పెంచి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. -
సమన్వయంతోనే అభివృద్ధి
=జిల్లా కలెక్టర్ కిషన్ =పథకాలను గ్రామస్థాయిలో అమలు చేయాలి =లోపాలుంటే అధికారుల దృష్టికి తేవాలి =బ్యాంకు ఖాతాలకు 16 నుంచి స్పెషల్ డ్రైవ్ ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని కలెక్టర్ జి.కిషన్ సూచించారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో గ్రామ దర్శిని కార్యక్రమం అమలుపై జిల్లా, ఆదర్శ అధికారులు, సర్పంచ్‌లతో వరంగల్ డివిజన్‌స్థాయి సమీక్ష సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో గ్రామ ఆదర్శ అధికారుల విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దశాబ్దాలుగా గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు జరుగుతున్నా ప్రజల అవసరాలకు అనుగుణంగా హేతుబద్దంగా ప్రయోజనం చేకూరడం లేదన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేసేందుకు దిక్సూచిగా ఉండేందుకు ఆదర్శ అధికారులను నియమించామన్నారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల అమలులో లోపాలుంటే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. వారంలో ఒకరోజు పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, హాస్టల్, రేషన్ షాపులను సందర్శించి వాటి పనితీరును పరిశీలించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు సేవాభావంతో పనిచేయాలన్నారు. గ్రామాల్లో ప్రతీ ఒక్కరిని అక్షరాస్యలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా ఇన్చార్జ్ అధికారి, రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో వీధి దీపాలు నిరంతరాయంగా వెలగకుండా చూడాలన్నారు. ప్రతీ ఒక్కరు విద్యుత్‌ను పొదుపు చేయాలన్నారు. సమావేశంలో ఏజేసీ బి.సంజీవయ్య, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డీఆర్డీఏ పీడీ ఎస్.విజయ్‌గోపాల్, డీపీఓ మోహన్‌నాయక్, డ్యామా పీడీ హైమవతి, డీఎంఅండ్‌హెచ్‌ఓ పి.సాంబశివరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ఓకే.. సమస్యలకు పరిష్కారమే లేదు.. కార్యక్రమం బాగున్నా.. సమస్యలు మాత్రం సకాలంలో పరిష్కారం కావడం లేదని పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ దర్శిని కార్యక్రమం అమలుపై వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రతీ శుక్రవారం ఆదర్శ అధికారి గ్రామానికి వచ్చి సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకుంటున్నారని, ఇవి వారం తర్వాత జరిగే సమావేశం నాటికి కూడా పరిష్కారం కావడం లేదన్నారు. ఆదర్శ అధికారుల సమావేశాల ద్వారా అభివృద్ధిలో ముందుకు పోయే మార్గం కనపడుతున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మరో సమస్యకు దారి తీస్తోందన్నారు. సమస్య పరిష్కారానికి నిధులు వెచ్చించే అధికారం ఆదర్శ అధికారికి లేకపోవడంతో ఫలితం లేకుండా పోతోందన్నారు. అలాగే రెండు నుంచి నాలుగు గ్రామాలకు ఒకే పంచాయతీ కార్యదర్శి ఉండడం మరో సమస్యగా మారిందన్నారు. వారంవారం కాకుండా 15 రోజులకోసారి సమావేశాలు నిర్వహించాలని కొందరు సర్పంచ్‌లు, నెలకోసారి నిర్వహించాలని మరికొందరు సర్పంచ్‌లు సూచించారు. వలస వెళ్తున్న వారి ఓటు హక్కు, ఆధార్, రేషన్ కార్డు, పింఛన్‌ను తొలగించొద్దన్నారు. అధికారులతో మాట్లాడడానికి సర్పంచ్‌లకు సీయూజీ సిమ్‌లు అందించాలని, గౌరవ వేతనం పెంచాలని కోరారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు అనుకూలంగా లేని సర్పంచ్‌లున్న గ్రామాల్లో ఆ ఎమ్మెల్యే అధికారులను ప్రభావితం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని కొందరు సర్పంచ్‌లు ఆరోపించారు. సృజనాత్మకత తో పని చేయాలి : కలెక్టర్ గ్రామ అదర్శ అధికారులు సృజనాత్మకతతో పని చేయాలని కలెక్టర్ జి.కిషన్ సూచించారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో అధికారులతో వరంగల్ డివిజన్‌స్థాయి సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ఆదర్శ అధికారులు అన్ని శాఖలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామ దర్శిని కరదీపికను పూర్తిగా చదివి అవ గాహన ఏర్పరచుకోవాలన్నారు. గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే ఆదర్శ అధికారులకు అందిస్తామన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణం, పరిశుభ్రత, ఎన్బీఏ పథకాల అమలును తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. మార్చిలో పదో తరగతి పరీక్షలు ఉన్నందున పాఠ శాలలను తప్పనిసరిగా తనిఖీ చేసి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. ఈనెల 24న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించి ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించాలని ఆయన సూచించారు. ఏజేసీబి.సంజీవయ్య మాట్లాడుతూ మంగళవారం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ను త్వరగా ముగించాలన్నారు. సోమవారం మండలం నుంచి నివేదికలను తెప్పించుకొని, సమీక్ష నోట్‌ను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మండల అధికారులంతా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని అన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డీఎంఅండ్‌హెచ్‌ఓ పి.సాంబశివరావు, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్, గృహ నిర్మాణ సంస్థ పీడీ లక్ష్మణ్, డ్వామా పీడీ హైమవతి పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరికీ జీరో బ్యాలెన్స్ ఖాతాలు
=16 నుంచి స్పెషల్ డ్రైవ్ =బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ కిషన్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రతిఒక్కరికీ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం బ్యాంకర్ల జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18 ఏళ్ల పైబడిన వారు జనాభాలో 20 లక్షలకు పైగా ఉంటే... 8 లక్షల మందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయన్నారు. ఆర్బీఐ నిబంధలన ప్రకారం ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతాలు ఉండాలన్నారు. ప్రస్తుతం 12 లక్షల మందికి జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచేందుకు చ ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు విసృ్తత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని జిల్లా లీడ్ బ్యాంకు అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం గ్రామ ఆదర్శ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. గతంలో శాంతి భద్రతల కారణంగా ఇతర ప్రాంతాలకు తరలించిన 31 బ్యాంకులను తిరిగి సంబంధిత సర్వీసు ప్రాంతాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.1,260 కోట్ల పంట రుణాలను అందించాలని లక్ష్యం నిర్ధేశించుకోగా... రూ. 985.31 కోట్లను అందించామన్నారు. 79 శాతం మేర లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు. ప్రస్తుత రబీ సీజన్లో రూ.540 కోట్లను పంట రుణాలుగా అందించాలన్న లక్ష్యాన్ని వంద శాతం చేరుకునేందుకు కృషి చేయాలని బ్యాంకర్లకు సూచించారు. బంగారుతల్లి, స్కాలర్షిప్లు, పింఛన్‌దారులకు వెంటనే బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు సహకరించాలన్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లతోపాటు సెట్వార్, ఐటీడీఏల ద్వారా అందించే పథకాలకు వెంటనే బ్యాంకు రుణాలను అందించాలన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 12,026 మహిళా గ్రూపులకు రూ.266.86 కోట్ల బ్యాంకు రుణాలను అందించినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎస్.విజయ్‌గోపాల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం సర్కార్, నాబార్డ్ ఏజీఎం ఉదయభాస్కర్, లీడ్ బ్యాంక్ అధికారి దత్‌తోపాటు వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మానవ విలువలతో కూడిన సమాజం ఏర్పడాలి
=కలెక్టర్ కిషన్ =‘కాకతీయుల వంశరహస్యం’ పుస్తకావిష్కరణ సుబేదారి, న్యూస్‌లైన్ : కాకతీయుల కాలంలో మానవవిలువలు ఫరిడవిల్లాయని, మానవ విలువలతో కూడిన సమాజం ఏర్పడాలని కలెక్టర్ కిషన్ ఆకాంక్షించారు. డాక్టర్ తక్కెళ్ల బాలరాజు రాసిన కాకతీయుల వంశర హస్యం పుస్తకాన్ని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకతీయ ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 22 పుస్తకాల ఆవిష్కరణ జరిగిందని, కాకతీయుల గూర్చి ఏది తెలిసినా... రాయాలని మేధావులు, చరిత్రకారులను కోరారు. చరిత్రను భద్రపరచడం ద్వారా భవిష్యత్ తరాలకు అందించవచ్చన్నారు. వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు మాట్లాడుతూ కాకతీయుల చరిత్రను ప్రచురించడం సాహోసపేతమైన నిర్ణయం అన్నారు. కాకతీయుల మూలాలపై పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూరల్ ఎస్పీ కాళిదాసు మాట్లాడుతూ పరిశోధన విమర్శకు గురవుతుందన్నారు. అయితే పరిశోధనలో ఉన్న వాస్తవాలను గుర్తించాల్సి ఉందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ కాకతీయులు శూద్రులని, శైవ మతాన్ని ఆచరించారని పేర్కొన్నారు. కార్యక్రమానికి కళాపబ్లికేషన్స్ సంపాదకుడు, సీనియర్ జర్నలిస్ట్ బండి రవీందర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య, జిల్లా రెవెన్యూ అధికారి వీఎల్,సురేంద్రకరణ్ పాల్గొన్నారు. -
కాకతీయ ఉత్సవాలకు రూ. 30 లక్షలు
సాక్షి, హన్మకొండ : కాకతీయ ఉత్సవాలకు రూ. 30 లక్షలు విడుదల చేస్తూ రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు ఖిలావరంగల్, వేయిస్తంభాల గుడి వేదికలుగా ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే నిధుల లేమి కారణంగా కాకతీయ ఉత్సవాలు అరకొరగా సాగుతున్నాయి. ఉత్సవాల నిర్వాహణకు కోటి రూపాయలు విడుదల చేస్తామని గతేడాది ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు రెండు విడతలుగా రూ. 60 లక్షలు విడుదల చేసింది. ఆ నిధులన్నీ గతంలో నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన బకాయిలు చెల్లించడానికే సరిపోయాయి. డిసెంబర్లో జరిగే ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు నిధుల కేటాయించాల్సిందిగా ఇటీవలే జిల్లా కలెక్టర్ కిషన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కురవి, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కిషన్ కోరారు. గురువారం కురవిలోని శ్రీవీరభద్రస్వామి టాకీసు ఆవరణలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. మండలానికి రేషన్‌కార్డులు తక్కువగా వచ్చాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 20 శాతం అంగవైకల్యం ఉన్నవారికి పెన్షన్ అంది స్తామని, సదరం క్యాంపులో సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. పేదలకు పంపిణీ చేసిన భూములను పరిశీలించి పొజీషన్ సర్టిఫికెట్లు అందిస్తామని, ఇప్పటి వరకు ఇందిరమ్మ గృహాలకు 55వేల పొజీషన్ సర్టిఫికెట్లు ఇచ్చామని, దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు సొంత ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు లేని వారికి భూమి కొనుగోలు చేసి ఇళ్లు మంజూరు చేస్తామ ని చెప్పారు. గ్రామాల్లో అభ్యుదయ అధికారులను నియమించామని, వారు ప్రతీ శుక్రవారం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారని తెలిపారు. సర్పంచ్‌లు అభ్యుదయ అధికారులకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ తప్పని సరి ఉండాలన్నారు. ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, ఇందుకు రూ.9,100 ప్రభుత్వం ఇస్తోందని చెప్పా రు. అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులకు పౌష్టికాహారాన్ని ఇవ్వడంతోపాటు గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు సమస్యలు ఉంటే నేరుగా తెలిపితే పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. గుండ్రాతిమడుగు(స్టేషన్)లో వెయ్యి ఎకరాల భూమి ఉందని, అది ఉక్కు పరిశ్రమకు అనువుగా ఉందా లేదా అనే విష యం పరిశీలిస్తామని, భూమికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆర్డీఓను ఆదేశించారు. డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు. జంక్షన్ అభివృద్ధికి వంద ఎకరాల స్థలం ఉందని, రైల్వే పరిశ్రమ ఏర్పాటు చేసేం దుకు సహకరించాలన్నారు. ఎస్సారెస్పీ మొద టి దశ పనులు సత్వరమే పూర్తిచేసేలా ఆదేశా లు ఇవ్వాలని కోరారు. రచ్చబండలో 174 రేషన్ కార్డులు, 734 పెన్షన్లు, 64 బంగారు తల్లి, 609 పక్కా గృహాలు, వడ్డీలేని రుణాలు రూ.60.66లక్షలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్, మహబూబాబాద్ ఆర్డీఓ మధుసూదన్‌నాయక్, ఐకేపీ ఏసీ అంజనమ్మ, ఎంపీడీఓ మోజెస్, తహసీల్దార్ సత్యపాల్‌రెడ్డి, స్పెషల్ అధికారి విజయ్భాస్క ర్, సమన్వయ కమిటీ సభ్యులు బజ్జూరి పిచ్చిరెడ్డి, సర్పంచ్‌లు ముత్యం సారయ్య, జి.సరోజ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ కలిపింది.. గోదావరి విడదీసింది..
చేపల వేట సరదా ధర్మాజీ యాదగిరి ప్రాణాల మీదకు తెచ్చింది. మంచి ఉద్యోగంలో చేరాల్సిన సమయంలో మృత్యుఒడికి చేరాడు. పట్టణంలోని కాలేజీరోడ్కు చెందిన యూదగిరి మంళవారం మధ్యాహ్నం వరుసకు సోదరుడైన సతీశ్‌తో కలిసి గోదావరి నదికి చేపల వేటకు వెళ్లాడు. అరగంటపాటు చేపలు పట్టారు. ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు యాదగిరి నది నీటి మడుగులో పడి గల్లంతయ్యూడు. అతడిని కాపాడేందుకు సతీశ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కుటుంబ సభ్యులతోపాటు తహశీల్దార్ కిషన్, అగ్నిమాపక సిబ్బంది నది వద్దకు చేరుకుని రాత్రి ఎనిమిది గంటల వరకు గాలింపు చేపట్టినా యూదగిరి జాడ తెలియరాలేదు. బుధవారం ఉదయం తొమ్మిది గంట లకు మృత దేహం కరీంనగర్ జిల్లా సరిహద్దు గోదావరి నదిలో లభ్యమైంది. మృతదేహాన్ని చూడగానే కుటుం బ సభ్యులు గుండెలవిసేలా విలపించారు. కరీంనగర్ జిల్లా రామగుండం పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నా రు. ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మంచిర్యాలకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. పెళ్లరుున ఆరు నెలలకే.. యాదగిరి, శ్రీరాంపూర్‌కు చెందిన సరిత ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి మే 18న పెళ్లి చేసుకున్నారు. స్నేహితులు, బంధువులు సర్దిజెప్పడంతో యూదగిరి తల్లిదండ్రులు సమ్మతించారు. కొడు కు, కోడలిని తమ ఇంటికి తీసుకొచ్చారు. యూదగిరి, సరిత కాపురం సంతోషంగా సాగింది. మంచిర్యాలలో బీఎస్సీ బయోమెట్రిక్స్ చదివిన యాదగిరి ఓ ప్రముఖ మెడికల్ కంపెనీ రిప్రజెంటీటివ్ ఉద్యోగం కోసం ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యూడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చి తాను ఇం టర్య్వూలో సెలెక్ట్ అయ్యానని, ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో అంతా ఆనందించారు. ఇక తమ కష్టాలు తీరనున్నాయని ఆ నవ దంపతులు సంబరపడ్డారు. అంతలోనే యూదగిరిని చేపల వేట రూపంలో గోదావరినది బలిగొంది. ఎన్నో ఆశలతో ప్రేమించినోడి వెంట వచ్చి అతడిని పెళ్లి చేసుకున్న సరిత యూదగిరి మృతితో శోకసంద్రంలో ముని గిపోరుుంది. ఆమె దయనీయ స్థితి బంధువులు, స్థాని కులను కంటతడి పెట్టించింది. యాదగిరికి తల్లిదండ్రులు, తమ్ముడు, అక్క, చెల్లె ఉన్నారు. తండ్రి రాజమ ల్లు సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
ఇసుక మాఫియూపై కొరడా
చెన్నూర్, న్యూస్‌లైన్ : ఇసుక మాఫియూపై ఆర్డీవో కొరడా ఝళిపించారు. అర్ధరాత్రి ఇసుక స్థావరాలపై దాడుల చేసి హల్చల్ సృష్టించారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారం మేరకు మంచిర్యాల ఆర్డీవో చక్రధర్ బుధవారం అర్ధరాత్రి మంచిర్యాల తహశీల్దార్ కిషన్, ఆర్ఐ లక్ష్మీనారాయణ, శ్రీహరి, చందు, ప్రభాకర్ బృందంతో కలిసి ఇసుక స్థావరాలపై వరుస దాడులు నిర్వహించారు. స్థానిక బతుకమ్మ వాగు, మండలంలోని చింతలపల్లి సమీపంలోని గోదావరి నది ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు, ఫిషర్ మెన్ సొసైటీ, ప్రైవేట్ పట్టాదారుడికి చెందిన 63 లారీలు ఇసుక నింపుకుని తరలిస్తుండగా ఆర్డీవో పట్టుకున్నారు. డంప్ యూర్డుల వద్ద ఇసుక నింపుకునేందుకు సిద్ధంగా ఉన్న 132 లారీలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 195 లారీలతోపాటు డంప్‌యార్డ్ వద్ద ఉన్న రెండు జేసీబీలను పట్టుకున్నారు. అనంతరం చెన్నూర్ డిప్యూటీ తహశీల్దార్, జైపూర్ తహశీల్దార్ రవీందర్‌ను సంఘటన స్థలానికి పిలిపించారు. పట్టుకున్న లారీల వివరాలను అందజేశారు. శుక్రవారం విచారణ జరిపి అనుమతి లేని లారీలను సీజ్ చేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి గురువారం వేకువజాము 3 గంటల వరకు ఈ దాడులు కొనసాగాయి. అధికారుల తీరుపై అనుమానాలు... బుధవారం అర్ధరాత్రి ఇసుక తీసుకెళ్తున్న సుమారు 63 లారీలను పట్టుకున్నట్లు ఆర్డీవో చక్రధర్ తెలిపారు. కానీ.. ఇందుకు చెన్నూర్ తహశీల్దార్ వీరన్న గురువారం తెలిపిన వివరాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఇసుక తరలిస్తుండగా 12 లారీలు పట్టుకున్నామని, ఇందులో 8 సింగరేణి సంస్థకు చెందినవని, మిగిలిన నాలుగు 4 ప్రైవేట్ వ్యక్తులవని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ లారీలకు అనుమతి ఉందని, మిగతా లారీలకు లేకపోవడంతో ఒక్కోదానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేలు జరిమానా విధించామని చెప్పారు. ఇసుక లోడింగ్ లేని 132 లారీల విషయూన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. తహశీల్దార్ తెలిపిన పొంతనలేని వివరాలతో అధికారుల తీరుపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బడా నాయకులు ఒత్తిడి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్‌శాఖ అనుమతి లేకుండానే.. పట్టణంలోని గోదావరి నది నుంచి ఇసుక తరలించేందుకు సింగరేణి సంస్థకు 30 సంవత్సరాలపాటు అనుమతి ఉంది. ఫిషర్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న భూముల్లో లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక తీసుకెళ్లేందుకు నవంబర్ 20 వరకు అనుమతి పొందారు. బతుకమ్మ వాగు పరీవాహక ప్రాంతంలోని తన పట్టాభూ మిలో ఇసుక మేటలు వేసిందని, తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పట్టాదారు దేవేందర్‌రెడ్డి తహశీల్దార్ వీరన్నకు దరఖాస్తు చేసుకోగా ఆయన అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి 2014 ఫిబ్రవరి వరకు 2.94 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించేందుకు ఉంది. వీరు ఇలా ఇసుకను పట్టణంలోని ఒకచోట డంప్ చేసుకునేందుకు అనుమతి పొందారు. ఇందుకు సంబంధించి వేబిల్లులూ తీసుకున్నారు. ఇక్కడి నుంచి పట్టణ ప్రాంతాలకు ఇసుక తరలించేందుకు భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. కానీ.. ఏపీ మైనింగ్ నుంచి అనుమతి పొందకుండా డంప్ యార్డ్ వరకు ఉన్న అనుమతి పత్రాలతో పట్టణ ప్రాంతాలకు ఇసుక తరలించి అందినంతా దండుకుంటున్నారు. -
ఎన్నికల విధుల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి
= క్షేత్రస్థాయి అధికారుల శిక్షణలో కలెక్టర్ కిషన్ = డూప్లికేట్ ఓటర్ల తొలగింపునకు ఇంటింటా తనిఖీకి ఆదేశం సుబేదారి, న్యూస్‌లైన్ : ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాల్లో క్షేత్రస్థాయి అధికారులు నైపుణ్యం, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ జి.కిషన్ సూచించారు. ఎన్నికలు, ఓటర్ల జాబితా అంశాలపై క్షేత్ర స్థాయి అధికారులకు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి అదనపు జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య అధ్యక్షత వహించగా, జిల్లా రెవెన్యూ అధికారి వీఎల్.సురేంద్ర కరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులందరూ ఓటర్లుగా నమోదయ్యేలా అధికారులు కృషి చేయాలని సూచిం చారు. అలాగే, జిల్లాలో 3.91లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు తేలిందని, ఈ మేరకు ఓటరు జాబితాతో ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేయాలన్నారు. అలాగే, రెండు చోట్ల ఓటర్లుగా నమోదైన వారికి నోటీసులు ఇచ్చి ఎక్కడో ఒక చోటే ఉండేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో తిరస్కరణ ఓటు ఉండే అవకాశమున్నందున సిబ్బంది దీన్ని గుర్తించాలన్నారు. అలాగే, ఇంటింటా ఓటర్ల తనిఖీలో భాగంగా బూత్ లెవల్ అధికారితో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్ ఉండేలా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు వ్యవహరించాలని సూచించారు. కాగా, నవంబర్ 4న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని కలెక్టర్ కిషన్ వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా... మాస్టర్ ట్రైనర్స్ అయిన ములుగు ఆర్డీఓ మోతీలాల్, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఆర్డీఓ కె.శ్రీనివాస్‌లు ఎన్నికల అధికారులకు పలు అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్-1960కు అనుగుణంగా ఓటర్ల నమోదుకు వయస్సు, నివాసం, రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉంటే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రెండు చోట్ల ఓటు ఉన్నట్లయితే లిఖితపూర్వకంగా నోటీసు ఇచ్చి ఏ ఓటు తీసివేయదల్చుకున్నారో తెలుసుకోవాలన్నారు. అలాగే, ఓటర్ల జాబితాలో ఐదు రకాల సవరణలు ఉంటాయని చెబుతూ ఇంటెన్సివ్ రివిజన్, సమ్మరీ రివిజన్, పార్టీల సమ్మరీ రివిజన్,ప్రత్యేక సమ్మరీ, నిరంతర అప్డేట్స్ తీరుతెన్నులు, నామినేషన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిస్టమేటిక్ ఓటర్ల ఎడ్యుకే షన్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్, పద్ధతి ప్రకారం ఓటర్ల అవగాహన, ఓటర్ల భాగస్వామ్యాన్ని వివరించారు. ఇంకా 18ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు ఓటు వేసేలా అవగాహన పెంచాలని సూచించారు. అలాగే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల్లో పోలీసు అధికారుల పాత్రను కూడా వివరించారు. కాగా, ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం ఓ శకటం తిరుగుతోందని సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో వరంగల్, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట ఆర్డీఓలు ఓ.జే.మధు, వెంకట్‌రెడ్డి, మధుసూదన్‌నాయక్, అరుణకుమారితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఆదాయ పన్ను, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.