సాక్షి, నెట్‌వర్క్: ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఆరుగురు రైతులు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులోని కుమ్మరిబొగుడ కాలనీకి చెందిన రైతు తోట కిషన్(43) పంట దిగు బడి రాక రూ. 6 లక్షలు అప్పు అయింది. అది తీర్చే మార్గం కనిపించక ఇంట్లో ఉరివేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తికి చెం దిన కొండోజు నర్సింహ(45) నాలుగు ఎకరాల్లో పత్తి వేశాడు.
రూ. 2 లక్షల వరకు అప్పు చేశాడు. సంఘ బంధంలో తీసుకున్న రూ.10 వేలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో మానసిక వేదనకు గురై శనివారం గుండెపోటుతో చనిపోయాడు. ఇదే జిల్లా కోదాడ మండల పరిధిలోని మొగలాయికోటకు చెందిన పెద్దపంగు అబ్రహం(68) రెండు లక్షల అప్పు తీరే మార్గం కనిపించక శనివారం ఉరి వేసుకున్నాడు. అనుముల మండలం వీర్లగడ్డతండా చెందిన దేపావత్ పాండు(32) రూ. 1.50 లక్షలు అప్పు చేశాడు.
శుక్రవారం ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం తింసాన్‌పల్లికి చెందిన బుద్దారం రాములు(36) పెట్టుబడుల కోసం 5 లక్షలు అప్పు చేయగా దిగుబడి రాక శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. నవాబుపేట మండలం ఎక్‌మామిడి గ్రామానికి చెందిన కుమ్మరి నర్సయ్య(65) 2.30లక్షలు అప్పు చేశాడు. దిగుబడి రాక మనస్తాపం చెందిన ఆయన శని వారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పుల బాధతో ఆరుగురు రైతులు మృతి
Published Sun, Nov 16 2014 12:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement