రేపటి నుంచి ఓయూ సెట్ | OU CET-2014 Entrance exam to be held from Tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఓయూ సెట్

Published Thu, Jun 5 2014 1:31 AM | Last Updated on Tue, Jul 31 2018 4:48 PM

OU CET-2014 Entrance exam to be held from Tomorrow

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓయూ సెట్-2014 పరీక్షలు ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను హైదరాబాద్ నగరంలోనే 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్ల్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ శివరాజ్, జాయింట్ డెరైక్టర్ కిషన్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అదనంగా ఒక పాస్ ఫొటోను హాల్‌టిక్కెట్‌పై అంటించి ఫొటోపై సంతకం చేసి ఇవ్వాలని సూచించారు. ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు ప్రతి రోజు మూడు చొప్పున ఉదయం 9.30 నుంచి 11 గంటలు, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 15 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement