Shivaraj
-
ఆ మాజీ సీఎంల పని ఏమిటి? జేపీ నడ్డా ఏమన్నారు?
భారతీయ జనతాపార్టీ(బీజేపీ) కొత్తగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో నాయకత్వాన్ని మార్చి, నూతన నేతలకు బీజేపీ అధికారాన్ని అప్పగించింది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం నేపధ్యంలో పార్టీలోని సీనియర్ నేతలు వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌ల భవిష్యత్ ఏమిటనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. దీనికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ మీడియా కార్యక్రమంలో సమాధానమిచ్చారు. ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు బీజేపీ సీనియర్ నేతలని, వారి స్థాయికి అనుగుణంగా భవిష్యత్తులో పార్టీ వారికి తగిన హోదా కల్పిస్తుందని అన్నారు. తమ పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని, ప్రతిచిన్న కార్యకర్తకు కూడా పార్టీ తగిన స్థానం ఇస్తుందని అన్నారు. దీనిపై పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఆ సీనియర్లకు మరో పనిని అప్పగిస్తామన్నారు. వారి సేవలను పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రశ్నకు సమాధానం కొన్ని పదాలలో వివరించడం కష్టమని, ఇటువంటి పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు అని మాత్రమే కాకుండా ప్రతి కార్యకర్త గురించి కూడా పార్టీ ఆలోచిస్తుందని నడ్డా తెలిపారు. వారు చేపట్టిన కార్యక్రమాలు, వారి చరిత్రకు సంబంధించిన డేటా బ్యాంక్ తమ వద్ద ఉందని, వాటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటామన్నారు. ఎన్నికలు ప్రకటించగానే మన నాయకుడెవరు? ప్రతిపక్షంలో కూర్చోగల తగిన నాయకుడు ఎవరు? అనే అంశంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని, ఈ ఎంపిక చాలా జాగ్రత్తగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మాస్క్ మళ్లొచ్చింది.. సింగపూర్‌లో షురూ! -
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ
కేజీ, అతుల్య జంటగా శివరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాదల్ కన్ కట్టుదే’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాని ‘ప్రేమ పావురాలు’ పేరుతో నిర్మాత శ్రీరామ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘మా శ్రీరామ్ సినిమా బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం ‘వాసుకి’. ఆ సినిమా తర్వాత వస్తోన్న రెండో చిత్రం ‘ప్రేమ పావురాలు’. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగులో ఈ సినిమా రీమేక్ చేయాలనుకున్నాం. ఒరిజినల్ అంత ఫ్రెష్‌గా ఔట్పుట్ రాదని డబ్ చేస్తున్నాం. శివరాజ్ కథ, కథనాలతో పాటు లీడ్ యాక్టర్స్ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పవన్ సంగీతం, ఆర్.ఆర్. సినిమాకి హైలెట్. స్ట్రయిట్ తెలుగు సినిమా తరహాలో క్వాలిటీగా డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాని వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు. -
రేపటి నుంచి ఓయూ సెట్
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓయూ సెట్-2014 పరీక్షలు ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను హైదరాబాద్ నగరంలోనే 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్ల్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ శివరాజ్, జాయింట్ డెరైక్టర్ కిషన్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అదనంగా ఒక పాస్ ఫొటోను హాల్‌టిక్కెట్‌పై అంటించి ఫొటోపై సంతకం చేసి ఇవ్వాలని సూచించారు. ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు ప్రతి రోజు మూడు చొప్పున ఉదయం 9.30 నుంచి 11 గంటలు, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 15 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తామని తెలిపారు.