- పరీక్షకు హాజరుకానున్న 52,688 మంది అభ్యర్థులు
- 160 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
- 2,200 మంది ఇన్విజిలేటర్ల నియూమకం
- కలెక్టర్ కిషన్ వెల్లడి
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : పంచాయతీరాజ్ శాఖలో ని పంచాయతీ సెక్రటరీ(గ్రూప్-4) పోస్టుల భర్తీ కో సం ఏపీపీఎస్సీ ఆదివారం నిర్వహిస్తున్న రాత పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. పరీక్ష నిర్వహణలో పాల్గొ నే అధికారులకు ఒక రోజు శిక్షణ కా ర్యక్రమం జిల్లా పరిషత్ కార్యాలయం లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీ సెక్రటరీ పోస్టుల కోసం 52,688 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని, ఇందు కోసం జిల్లా కేంద్రంలో 160 పరీక్షా కేంద్రాల ను ఏర్పాటు చేశామన్నారు.
32 రూ ట్లుగా విభజించి ప్రతి రూట్‌కు ఒక లైజన్ ఆఫీసర్‌ను నియమించామని, ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక సూపరిం టెండెంట్, ఒక లైజన్ ఆఫీసర్ ఉంటారని వివరిం చారు. 2200 మంది ఇన్విజిలేటర్లను, 20 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. పరీక్ష కేం ద్రాలతో పాటు ప్ర శ్నాపత్రాల రవాణాకు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు, పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ కోత లేకుం డా చూడాలని ఎన్‌పీడీసీఎల్ అధికారులకు, కేంద్రాలకు బస్ సర్వీసుల సౌకర్యం కల్పిం చాలని ఆర్టీసీ అధికారులకు సూచించి నట్లు తెలిపారు.
అవగాహన కల్పించాలి
పరీక్ష రాసే అభ్యర్థులకు ఓఎంఆర్ షీ టలో హాల్‌టికెట్లు నింపడంపై అభ్య ర్థులకు ఇన్విజిలేటర్లు అవగాహన కల్పించాలని పరీక్షల సమన్వయ అధికారి, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు సూచించారు. ఓఎంఆర్ షీట్లు నింపిన తర్వాత డూప్లికేట్ తీసుకెళ్లేలా పరిశీ లన చేయాలన్నారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో 10శాతం మంది బార్ కోడిం గ్ తప్పుగా నింపడం వల్ల అభ్యర్థుల జవాబు పత్రాలు వాల్యుయేషన్ జరగలేదని ఏపీపీఎస్సీ గుర్తించిందన్నా రు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్ష కేంద్రాల్లో నమూ నా ఓఎంఆర్ షీట్లను అతికిస్తున్నామన్నారు.