![Kishan Kiss Bhumi In Bigg boss - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/19/BIG-BOSS.jpg.webp?itok=byIKy1L7)
బెంగళూరు: ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాల్సిన బిగ్‌బాస్ గేమ్ షో.. రొమాన్స్‌కు వేదికగా మారుతోంది. కర్ణాటకలో ఓ టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ కార్యక్రమంలో కిశన్ కొద్దిరోజుల క్రితం చందనకు కౌగిలించుకోని ముద్దు ఇచ్చాడు. ఇప్పుడు మరో అమ్మాయికి ముద్దు ఇవ్వటం వివాదంగా మారింది. బిగ్‌బాస్ షోలో ఉన్న భూమిశెట్టి, కిశన్, జై జగదీశ్, ప్రియాంక, పథ్వి, రాజు తాళికోటి, కురి ప్రతాప్, హరిశ్ రాజ్, చందన్ ఆచార్‌లు గార్డన్ ఏరియాలో కూర్చోని మాట్లాడుతుండగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు వస్తారనే చర్చ వచ్చింది. వైల్డ్‌కార్డ్ ద్వారా యువతి వస్తే కిశన్ ముద్దు ఇవ్వాలని ప్రియాంక చెప్పింది. ఆ సమయంలో కిశన్ మాట్లాడుతూ భూమికి ముద్దుపెట్టాడు. అయితే ఈ వీడియో టీవీలో ప్రచారం కాకూండా కట్ చేశారు. అతని దూకుడుపై షో ప్రేక్షకులు అసహనం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment